శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
మన శ్రీ వైష్ణవ సత్సంప్రదాయమున “శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము” అనునది ఎంతో ముఖ్యమైన మరియు పరమ ప్రామాణికమైన గ్రంధము. మణవాళ మహామునులు తమ “ఉపదేశ రత్తినమాలై” అను ప్రబంధము పిళ్ళై లోకాచార్యులచే సాయించబడిన ఈ శ్రీ వచన భూషణమును కొనియాడుటకై ముఖ్యముగా రచించితిరి.
- మామునులు తమ ప్రబంధమును ఆళ్వార్ల మరియు ఎమ్పెరుమాన్ల తిరునక్షత్ర మరియు తిరు అవతార స్థలములను ప్రస్తుతిస్తూ మొదలు పెడితిరి.

- ఆ తరువాత ఎమ్పెరుమానార్లు(శ్రీ రామానుజులు) మన సంప్రదాయమును సుస్థిర పరుచుటకు మరియు విశిష్ఠాద్వైతమును స్థాపించుటకు చేసిన గొప్ప కైంకర్యమును మరియు సంప్రదాయమున వారికి గల విలక్షణమైన స్థానమును కీర్తించితిరి.

- అటు పిమ్మట, మామునులు తిరువాయిమొళికి గల అన్ని వ్యాఖ్యానములూ మరియు అట్టి గొప్ప వ్యాఖ్యానములను అనుగ్రహించిన ఆచార్యులను కీర్తించ సాగితిరి.
- ఆ తరువాత నమ్పిళ్ళైల ఈడు వ్యాఖ్యానమును భద్ర పరిచిన విధానమును మరియు ఆచార్య పరంపర ద్వారా దానిని కాలక్షేపము చేసిన తీరును కీర్తించితిరి.

- అటు పిమ్మట శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము యొక్క సారమును అందమైన రీతిలో ప్రస్తుతిస్తూ ఆచార్యునికి పారతంత్య్రముగా ఉండడము అను ముఖ్యమైన అంశమును కీర్తించితిరి.

- ఇక చివరిగా పూర్వాచార్యుల వచనములను మనస్ఫూర్తిగా స్వీకరించి, ఎట్టి మార్పులు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా బోధించి మరియు ఆచరించడము యొక్క గొప్పతనమును మామునులు చెప్పితిరి.
- ఎమ్పెరుమానార్ల కృపకు పాత్రులమై ఆ సంసారమున ఉజ్జీవించుటయే అట్టి పూర్వాచార్యుల శ్రీ వచనముల అవలోకనమునకు గల ఫలము(విషయము).
- ఉపదేశ రత్తినమాలై అను ప్రబంధమున ఎరుమ్బి అప్పా చివరిన ఒక అందమైన పాశురమును అనుగ్రహించియున్నారు. అది ఏమి అనగా “ఎవ్వరికైతే మనవాళ మహామునుల శ్రీ చరణ సంబంధము కలదో అట్టి వారు ఖఛ్చితముగా అమానవుని స్పర్శకు పాత్రులై విరజా నదిని దాటి సౌఖ్యముగా పరమపదమును చేరుకోగలరు”.

దీని వలన ఉపదేశ రత్తినమాలై అను ప్రబంధమునకు శ్రీ వచన భూషణములో కృప చేయబడిన సూత్రముల యొక్క వైలక్షణ్యమును మరియు గొప్పతనమును తెలియజెప్పుటయే ప్రధాన లక్ష్యము అని మనకు బోధపడుచున్నది.
ఇప్పుడు అట్టి ఉపదేశ రత్తినమాలై లోని కొన్ని దివ్యమైన పాశురములను సంక్షిప్తముగా అనుభవిద్దాము.

పాశురము – 53
అన్న పుకళ్ ముడుమ్బై అణ్ణలులకాశిరియన్
ఇన్నరుళాల్ శెయ్ ద కలై యావైయిలుమ్ ఉన్నిల్
తికళ్ వశన పూడణత్తిన్ శీరమై యొన్ఴు క్కెల్లై
పుకళల్ల వివ్వార్ త్తై మెయ్యిప్పోదు
సంక్షిప్త వ్యాఖ్యానము
ముడుమ్బై అను తిరువంశములో అవతరించిన ప్రముఖులైన శ్రీ పిళ్ళై లోకాచార్యులు తమ యొక్క గొప్ప వాత్సల్యముతో సంసారులకు అనేక గ్రంధములను కృప చేసినారు. ఆ గ్రంధములన్నింటిలో శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము యొక్క గొప్పతనము అనిర్వచనీయము మరియు విలక్షణమైనది. ఇది కేవలము స్తుతి కాక యధార్ధము (వాస్తవము).
పాశురము – 54
మున్నఙ్కరవోర్ మొళిన్ద వశనఙ్గళ్
తన్నై మికకొణ్డు కత్తోర్ తమ్ ఉయిర్కు
మిన్నణియాచ్ చేరచ్ చమైత్తరవే
శ్రీ వశన బూడణమ్ ఎన్నుమ్ పేర్ ఇక్కలైక్కు ఇట్టార్ పిన్
సంక్షిప్త వ్యాఖ్యానము
పిళ్ళై లోకాచార్యులు ఈ గొప్ప సాహిత్యమును పూర్వాచార్యుల దివ్య వచనములతోనే కూర్చితిరి. గొప్ప నేర్పును కలిగిన పండితులకు ఈ శ్రీ వచన భూషణము అనునది వారి ఆత్మను అలంకరించు ఆభరణము వంటిది మరియు వారికి ఎంతో ఆదరపూర్వకమైనదిగా ఉండునది. పిళ్ళై లోకాచార్యుల వారే స్వయముగా ఈ గ్రంధమునకు “శ్రీ వచన భూషణము” అని పేరు పెట్టితిరి, అనగా పూర్వచారుల దివ్య వచనములు కలిగిన గొప్ప ఆభరణము అని అర్ధము.
పాశురము – 55
ఆర్ వశన బూడణత్తిన్ ఆళ్ పొరుళ్ ఎల్లామ్ అఴివార్
ఆరదు సొల్ నేరిల్ అనుట్ఠిసార్
ఓర్ ఒరువర్ ఉణ్డాగిల్ అత్తనై కాణ్ ఉళ్ళామే
ఎల్లారుక్కుమ్ అణ్డాదదన్ఴో అదు
సంక్షిప్త వ్యాఖ్యానము
శ్రీ వచన భూషణములో ఉన్న నిగూడార్ధములను ఎవరు తెలుసుకొనగలరు? ఎవరు అట్టి అర్ధములను ఆచరణలో పెట్టగలరు? అలా చేయగలిగిన వారు ఒక్కరు అయినా ఉన్నా – అట్టి వారిని గొప్పగా కొనియాడవలెను ఎందుచేత అంటే ఈ అర్ధములను తెలిసి ఆచరించుట అనునది అందరికీ సాధ్య పడు విషయము కాదు. పిళ్ళై లోకం జీయరు వారి వ్యాఖ్యానములో ఇలా చెప్పితిరి – “మణవాళ మహామునులు ఆ శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము యొక్క సారమును గ్రహించి అలానే జీవించితిరి”.
పాశురము – 61
జ్ఞానమ్ అనుట్టానమ్ ఇవై నన్ఴాగవే ఉడైయనాన
గురువై అడైనన్దక్కాల్
మానిలత్తీర్ తేనార్ కమలత్ తిరుమామగళ్ కొళునన్
తానే వైగుందం తరుమ్
సంక్షిప్త వ్యాఖ్యానము
సంప్రదాయ రహస్యములలో నిష్ణాతులై అట్టి సూత్రములను ఆచరణలో పెట్టు గొప్ప జ్ఞానమును కలిగిన ఆచార్యులని ఎవరైతే ఒక్కసారి కనుక ఆశ్రయిస్తారో, ఓ లోకములోని జనులారా! అందమైన తామర పువ్వు పైన ఆసీనురాలైన శ్రీ మహా లక్ష్మికిభర్త అయిన ఆ శ్రీమన్నారాయణుడు తనకి పరమపదంలో నిత్య కైంకర్యములను చేయుటకై గొప్ప అవకాశమును తనకు తానుగా కృప చేస్తాడు.
దీనితో ఈ విలక్షణమైన శ్రీ వచన భూషణము అను గ్రంధము యొక్క గొప్పతనము మనకి అర్థము అవుతున్నది. మణవాళ మహామునులు ఈ గ్రంధమునకు వ్యాఖ్యానమును కృప చేసియున్నారు. విద్వాన్ శ్రీ బి. ఆర్. పురుషోత్తమ నాయుడు అను వారి వ్యాఖ్యానమును మణవాళ మహామునులు వ్యాఖ్యనమునకు వివరణగా ఉట్టంకించెదము.
- తనియన్లు
- అవతారిక – భగాము 1
- అవతారిక – భగాము 2
- అవతారిక – భగాము 3
- సూత్రం 1
అడియేన్ పవన్ రమనుజ డసన్
మూలము : https://granthams.koyil.org/srivachana-bhushanam-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org