శ్రీ: శ్రీమతే శఠగకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆళ్వార్ల పాశురములు మరియు ఆచార్యుల శ్రీ సూక్తుల కు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన పెద్దలు ఎల్లప్పుడూ ఆళ్వార్లు, ఆచార్యుల దివ్య వాక్యాలలో తాము నిమగ్నమై ఉండేవారు. మనకు కూడా మన పెద్దల మార్గమే ఆచరణీయం. కావున, ఆళ్వార్లు మరియు ఆచార్యుల దివ్య వాక్యాలను యథాశక్తి పారాయణ చేయడం, వాటిని అనుసరించి జీవించడం మనకు శ్రేయస్కరం.
సర్వేశ్వరుని కృపవల్ల జ్ఞానం మరియు భక్తితో పరిపూర్ణులైన ఆళ్వార్లు దయతో రచించిన దివ్యప్రబంధాలను అభ్యసించడం ప్రారంభించాలని ఆశించే వారికి ఉపయోగపడేలా “దివ్య ప్రబంధ పరిచయం” ను మేము సమర్పిస్తున్నాము. ఇందులో సాధారణంగా పారాయణ చేసే తనియన్లు, తిరుప్పల్లాండు, కన్నినుణ్ చిరుత్తాంబు, తిరుప్పావై మరియు శాత్తుమురై సులభమైన అర్థాలతో కలిసి చేర్చాము. అందరూ దీనిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని మనవి.
అలాగే, దివ్యప్రబంధాల వివరాలు, 108 దివ్యదేశాలు, ఆళ్వార్లు/ఆచార్యుల తిరునక్షత్రాలు, అనధ్యయన కాలం విధానం వంటి ప్రాథమిక సమాచారాన్ని కూడా అందించాము. ఇవన్నీ అందరికీ అర్థం చేసుకోవడానికి, ఆచరించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
- నాలాయిర దివ్యప్రబంధం
- 108 దివ్యదేశములు
- ఆళ్వార్/ఆచార్యుల తిరునక్షత్రాలు
- అనధ్యయన కాలం
- తనియన్లు
- తిరుపల్లాండు
- కణ్ణినుణ్ శిఱుత్తాంబు
- తిరుప్పళ్ళి యెళుచ్చి
- తిరుప్పావై
- శాట్రుమురై (శాత్తుమురై)
అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్
ఆంగ్లం లో: https://granthams.koyil.org/dhivyaprabandham-for-beginners-english/
పొందుపరిచిన స్థానం: https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org