శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
వేదం “అజాయమానః బహుధా విజాయతే” (జన్మ తీసుకోనివాడు అనేక జన్మలను అంగీకరిస్తాడు) అని అంటుంది; వేదం ద్వారా తెలుపబడిన భగవంతుడు, “బహూనిమే వ్యతీతాని జన్మాని” (నాకు కూడా అనేక జన్మలు ఉన్నాయి) అని అంటారు; వైధికులలో (వేదాన్ని అనుసరించేవారు) ఉత్తముడు, వేద సారాన్ని తెలిసిన నమ్మాళ్వార్, “సన్మం పల పల శెయ్దు” (అనేక జన్మలను స్వీకరించడం) అని అంటారు; ఇలా భగవంతుడి అనేక అవతారాలను ఎత్తడం వివరించబడింది. మనము మన కర్మానుసారంగా పదేపదే జన్మ తీసుకుంటాము మరియు బాధపడతాము. అయితే భగవంతుడు తమ కరుణతో మనలను ఉద్ధరించడానికి అవతరిస్తున్నాడు కాబట్టి, ప్రతి అవతారములో అతని తేజస్సు పెరుగుతోంది. ఈ గొప్ప సూత్రాన్ని శాస్త్రం మరియు ఆళ్వార్లు చూపారు.
ఈ అవతారాలలో పది అవతారములు ప్రధానంగా కీర్తించబడ్డాయి. తిరుమంగై ఆళ్వార్ “మీనోడు ఆమై కేళల్ అరి కుఱళాయ్ మున్నుం ఇరామనాయ్ తానాయ్ ప్పిన్నుం ఇరామనాయ్ తామోదరనుమాయ్ కఱ్కియుం ఆనాన్” ( ఎమ్పెరుమాన్ చేప, తాబేలు, వరాహ, సింహం, మరగుజ్జు (వామన), పరశురాముడు (మొదటి రాముడు), స్వయంగా శ్రీ రాముడు, బలరాముడు (తరువాతి రాముడు), దామోదర మరియు కల్కిగా అవతరించారు). వీటిలో కూడా, శ్రీ రామావతారం మరియు కృష్ణవతారం మన పెద్దల చేత గొప్పగా కీర్తించబడ్డాయి. వీటి మధ్య కూడా, ద్వాపర యుగం చివరిలో సంభవించిన సామీప్యత కారణంగా ఋషులను, ఆళ్వార్లను, ఆచార్యులను కృష్ణవతారం విపరీతంగా ఆకర్షించింది. ప్రత్యేకించి, కృష్ణుని చిన్ననాటి చేష్టల పట్ల ఆకర్షితులు కాని వారు ఎవరూ ఉండరు. ఆ కృష్ణ లీలలు కఠినమైన హృదయం ఉన్న వారిని కూడా కరిగించివేస్తుంది.
కృష్ణుడు శ్రీ భగవత్గీతలో “నా జన్మ మరియు లీలలను నిజంగా అర్థం చేసుకున్నవారు ఖచ్చితంగా నన్నే చేరుకుంటారు” అని చెప్పాడు. అందువల్ల, మన పూర్వాచార్యులు చూపిన అంశాలతో వాటికి సంబంధించిన సూత్రాలతో పాటు, శ్రీ భాగవతంలోని దశమ స్కంధంలో (పదో అధ్యాయం) చూపిన క్రమంలో కృష్ణావతారాన్ని సరళంగా చూద్దాము.
అడియెన్ దాశరధి రామానుజ దాసన్
మూలము: https://granthams.koyil.org/krishna-leela-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org