విరోధి పరిహారాలు – 26

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

శ్రీ వైష్ణవుల రోజువారీ జీవితంలో వివిధ రూపాలలో ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి ఎమ్పెరుమానారు, వంగి పురత్తు నంబికి వివరిస్తారు. వంగి పురత్తు నంబి ఈ విశేషాలను ఒక అద్భుతమైన గ్రంథ రూపంగా  “విరోధి పారిహారంగళ్ (విరోధి పరిహారాలు) అనే గ్రంథంలో గ్రంథస్తపరిచారు.

ఈ సంచికలోని శీర్షికలు శ్రేణిగా ఆంగ్లములో ఈ పుస్తకము –  https://granthams.koyil.org/virodhi-pariharangal-telugu/ లో చూడవచ్చు.

దయచేసి మునుపటి శీర్షికను ఇక్కడ చుడండి – https://granthams.koyil.org/2020/02/03/virodhi-pariharangal-25-telugu/ .

    మాముణులు  – తిరువహింద్రపురం – మాముణులను విసతవాక్షికామణి (సూత్రాల వివరించడంలో ఎంత అవసరమో అంత నాత్రమే వివరించి / వ్రాసేవారు) గా  కీర్తించబడ్డారు.

58. ఉక్తి విరోధి  – మన వాక్కు / భాషలో అవరోధాలు.

ఉక్తి  అంటే పదాలు, భాష, మాట్లాడే విధానం మొదలైనవి. ఈ విభాగంలో శ్రీవైష్ణవుల గౌరవప్రదమైన శ్రీవైష్ణవ పరిభాషకి (పదాల ఎంపిక మొదలైనవి) ప్రాధాన్య మివ్వబడింది – వివరాలను, దయచేసి ఇక్కడ చూడండి   https://granthams.koyil.org/readers-guide/), సాధారణ లౌకిక వ్యక్తుల మాదిరిగా కాకుండా దయచేసి ఈ భాషలో  మాట్లాడటానికి ప్రయత్నించండి. ఇది అతివిస్తారమైన భాగం. అయినప్పటికీ, ఇది చాలా అవసరం మరియు రోజువారీ జీవితంలో కూడా ఆచరణాత్మకంగా అనుసరించాలి. అనువాదకుల గమనిక: సాధారణ పదాలకై శ్రీవైష్ణవులు అద్భుతమైన సాంప్రదాయ పదాలను ఉపయోగించారు. ఈ విభాగంలో ఎక్కువ భాగం తమిళ్ పదాలతో వ్యవహరిస్తున్నాము, అయితే ఇదే సూత్రం ఇతర భాషలలో కూడా వర్తిస్తుంది. ఏ భాషలోనైనా, ఒకే చర్యను ఎన్నో పదాలతో వివరించవచ్చు. శ్రీవైష్ణవులు కావడంతో, మనం గౌరవప్రదమైన పదాలను ఉపయోగించాలని ఇక్కడ వివరించబడింది. ఇప్పుడు ఈ విభాగాన్ని చూద్దాం.

  • మనల్ని శ్రీవైష్ణవులు పిలిచినప్పుడు, మనం “అడియేన్” (“దాసన్” అని వినయంతో స్పందించాలి), లౌకిక వ్యక్తులు పిలిచినప్పుడు, మనం “ఏంటి” (ఏంటి, ఎందుకు పిలిచారు) అని స్పందించవచ్చు. అలా కాకుండా మార్చి చేయడం ఒక అడ్డంకి. అలాగే, మనం పొరపాటున లేదా అజాగ్రత్త కారణంగా తప్పుగా స్పందిస్తే, పశ్చాతాప్పడి దానిని వెంటనే సరిదిద్దుకోవాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఏదైనా తప్పు జరిగినపుడు గమనించవలసిన ముఖ్యమైన అంశం. ఒక పొరపాటుకి మనం ప్రాయశ్చిత్తం చేసినప్పుడు – మనం ఆ తప్పుని తెలుసుకొని, అదే తప్పును మరలా చేయకూడదు.
  •  శ్రీవైష్ణవులుతో మాట్లాడేటప్పుడు, గౌరవప్రదమైన భాషను ఉపయోగించకపోవడం ఒక అడ్డంకి. “విన్నప్పం అరుళిచ్చెయ్తరుళ” (దయచేసి పఠించండి), “తిరుక్కై విళక్కియరుళ (దయచేసి మీ చేతులు కడుక్కోండి), “చురుళముతు అముదుచెయ్తరుళ” (దయచేసి ఆకూవక్క స్వీకరించండి), “కణ్వళర్న్తరుళ” (దయచేసి నిద్రపోండి) వంటి పదాలు. శ్రీవైష్ణవుల పరిభాషలో “అరుళ” (మమ్మల్ని ఆశీర్వదించండి), “అముదు” ( ప్రసాదం) మరియు “తిరు” (పూజ్యనీయమైన) మొదలైన పదాలను సాధారణంగా ఎదుటి వ్యక్తి పట్ల గౌరవం మరియు భక్తిని వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తారు. వీటిని “పూజ్యోక్తి” అని పిలుస్తారు – కీర్తించే పదాలు. వీటిని ప్రపన్నోక్తి (ప్రపన్నుల భాష) అని కూడా అంటారు. తరువాత వివరణలో, భౌతిక వ్యక్తులు సాధారణంగా ఉపయోగించే పదాల గురించి మరియు ప్రపన్నులు అలాంటి పదాలను ఉపయోగించరాదని వివరించబడింది. మొదట ఈ భాగంలో, సరైన పరిభాష వివరించబడింది ఆ తరువాత భాగంలో, మనకు సరికాని పరిభాష వివరించబడింది. మనం శ్రీవైష్ణవులకు “విన్నప్పం అరుళిచ్చెయ్తరుళ” అని చెప్పినప్పుడు, దీని అర్థం, పఠనం ప్రారంభించమని ప్రముఖ అధ్యాపక స్వామిని అభ్యర్థించడం. ఆలయ సన్నిధుల్లో, దివ్య ప్రబంద గోష్టి సమయంలో, ప్రముఖ అధ్యాపకులు తమతో పాటు పఠనం చేయమంటూ “సాదిత్తరుళ” అని చెప్పి తనియన్లు పఠించడం ప్రారంభిస్తారు. అక్కడున్న అందరూ అనుసరిస్తూ పారాయణం చేస్తారు. ప్రత్యేక సందర్భాలలో (కొన్ని సన్నిధులలో ఎప్పుడూ), అర్చకులు లేదా మణియకారర్ (కార్యనిర్వహణాధికారి) ఇలా అంటారు – “అరుళప్పాడు సాధు శ్రీవైష్ణవర్గళ్”, లేదా “అరుళప్పాడు రామానుసనడియార్గళ్” లేదా “అరుళప్పాడు తిరువాయ్మొళి విణ్ణాప్పం చెయ్వార్”. ఆ గోష్టికి నాయకుడు (మరియు ఇతరులు కూడా) “నాయన్ఱే  నాయన్ఱే” (నీ సేవకై ఈ శునకము ఇక్కడ ఉంది) అని అంటారు – ఆళ్వారులే తమను తాము శునకాలుగా పిలుస్తూ, వారి యజమాని భగవానుడి విశ్వాస సేవకులమని సూచిస్తున్నారు) ఆపై పఠనం ప్రారంభిస్తారు . ఇది సాధారణంగా చాలా చోట్ల కనిపిస్తుంది. అదేవిధంగా, శ్రీవైష్ణవులతో వ్యవహరించేటప్పుడు ఇలాంటి గౌరవప్రదమైన పదాలను చాలా వినయంతో వాడాలి.
  • భౌతిక వ్యక్తులతో మాట్లాడేటప్పుడు  “వర్తై చొల్లు” (చెప్పు), “ఇరు” (వేచి ఉండు / కూర్చో), “ఎణ్ణెయిడు”(నూనె ఇవ్వు), “ఉఱంగు” (నిద్రపో ) బదులుగా గౌరవప్రదమైన పదాలను వాడటం మొదలైనవి ఒక అడ్డంకి. భౌతిక వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మనం శ్రీవైష్ణవ పరిభాషను వాడే అవసరం లేదు, ఏమైనప్పటికీ అలాంటి పదాలను వారు అర్థం చేసుకోలేరు.
  • ఈ కింది పదాల అర్థాలను సరిగ్గా తెలుసుకోకపోవడం, వాటి విలువను తెలియకుండా వాటిని ఉపయోగించడం అవరోధాలు – పదాలు: తీర్థమాడ (స్నానం చేయుట), ప్రసాదప్పడ (ప్రసాదం స్వీకరించడం – తినడం), అముదుపడి (అన్నం), కఱియముతు (కూరగాయలు), అడిసిల్/తిరుక్కణ్ణముతు (పాయసం) , ప్రసాదం (భగవాన్ / భాగవతుల అవశేషాలు), తీర్థం (పరిశుద్ధపరచబడిన నీరు), తిరుమంజనం (పెరుమాళ్ తిరువారాదనం కోసం ఉపయోగించే నీరు, ఈ పదాన్ని భగవానుడి స్నానానికి కూడా వాడతారు), ఇలైప్రసాదం/ ఇలైఅముదు (అరటి ఆకులో వడ్డించిన ప్రసాదం), మూన్రావతు (ఆకువక్కలో కలిపే సున్నం).
  • సాధారణ పదాలు  కుళిక్క (స్నానం చేయడం), ఉణ్ణ/తిన్న(తినడానికి), అరిసి (బియ్యం), చోఱు (అన్నం), కఱి (కూర), తణ్ణీర్ (నీళ్ళు),వెత్తిలై (తమలపాకులు), సుణ్ణాంబు (సున్నం) మొదలైనవి వాడటం ఒక అడ్డంకి.
  • తిరువిల్లత్ తేవర్ (తిరు  – శ్రీ మహాలక్ష్మి సంబంధం లేని అన్య దేవతలు) అని పిలువబడే దేవతాంతరముల కోసం ఈ క్రింది గౌరవప్రదమైన పదాలను ఉపయోగించడం ఒక అడ్డంకి. ఆ పదాలు: తిరుపతి (తిరుమల తిరుపతి  – ఇక్కడ భగవానుడు తమ సంకల్పముతో ప్రసన్నంగా  ఉంటున్నదివ్య దేశం), తిరుచ్చోలై (తిరుమాలిరుంచోలై, దివ్య తోట), తిరుప్ పొయ్గై (దివ్య పుష్కరిణి). తిరుక్కోపురం (దివ్య గోపురం), తిరుమదిళ్ (దివ్య ప్రాకారం), తిరువీధి (తిరుమాడవీధులు), తిరుమాలిగ (ఆచార్యుల/శ్రీవైష్ణవుల గృహాలు), తిరువాసల్ (దివ్య ప్రధాన ద్వారం), తిరుమండపం (దివ్య మండపం), తిరుచుఱ్ఱు (సన్నీధి చుట్టూ ప్రదక్షణ చేసేదారి), తిరువోలక్కం (దివ్య గోష్ఠి), తిరుప్పళ్ళియఱై (భగవానుడి దివ్య సన్నిధి), తిరుప్పళ్ళిక్ కట్టిల్ (దివ్య సింహాసనం/పడక), తిరుమేర్కట్టు (విధానం – వస్త్రంతో అలంకరించిన పై కప్పు), తిరుత్తిరై (దివ్య తెర), తిరుక్కొత్తొలియల్ (ప్రసాదాన్ని కప్పడానికి ఉపయోగించే దివ్య వస్త్రం), తిరువెణ్ చామర (దివ్య వింజామర), తిరువాలవట్టం (దివ్య విసనకర్ర), తిరువడి నిలై (చరణాలు/పాదుకలు), తిరుప్పడికం (తిరువారాదన తీర్థం సేకరించే పాత్ర), తిరుమంజనక్కుడం (తిరుమంజనం/తిరువారాదనం చేయడానికి నీళ్ళు తెచ్చే బింద), తిరుప్పరికరం (అవసరమైన సామగ్రి), తిరువందిక్ కాప్పు (ఊరేగింపు తరువాత చివర్న ఇచ్చే హారతి), తిరువిళక్కు (దివ్య దీపాలు), తిరుమాలై (దివ్య మాలలు), తిరువాబరణం (దివ్య ఆభరణాలు), తిరుప్పళ్ళిత్ తామం (తుళసి పూసలతో చేసిన మాల), తిరుమేని (తల నుండి పాదాలవరకు – దివ్య శరీరం), తిరునాళ్ (ఉత్సవాలు) మొదలైనవి. అనువాదకుల గమనిక:  భగవాన్, ఆళ్వారులు, ఆచార్యలు మరియు శ్రీవైష్ణవుల కోసం ఏ పదాన్నైనా ఉపయోగించినప్పుడు, మనం ఎప్పుడూ “తిరు” ని ఉపసర్గగా ఉపయోగించాలి. అలా చేయడం ద్వారా మనతో వ్యవహరించే వ్యక్తి పట్ల మనకున్న భక్తిని  చూపించినట్లవుతుంది. కానీ శ్రీ మహాలక్ష్మి యొక్క ప్రత్యక్ష అనుబంధం లేని ఇతర దేవతలకు వర్తించదు. తిరుమళిసై ఆళ్వార్ నాన్ముగన్ తిరువంతాదిలో  “తిరువిల్లాత్ తేవరై తేఱేన్మిన్ దేవు” –  మహాలక్ష్మితో సంబంధం లేని దేవతలను నేను పరిగణలోకి తీసుకోను అని అన్నారు.
  • శ్రీవైష్ణవులు “కోయిల్” కు బదులుగా “శ్రీరంగం” అని అనడం, తుమ్మిన తరువాత “తిరువరంగం” అని పలుకక పోవడం. ఇతర దివ్య దేశ పేర్లును పలుకడం – తిరుమలైని  “తిరువేంకటం” అని అనడానికి బదులుగా “వేంకటం” అని అనడం, “పెరుమాళ్ కోయిల్” కి బదులుగా “కాంచీపురం” అని అనడం, “తిరువనంతపురం” కు బదులుగా “అనంత సయనం” అని అనడం అడ్డంకులు. ఇక్కడ, దివ్య దేశాలకు అనువైన పరిభాష నొక్కి చెప్పబడింది. శ్రీవైష్ణవ సాంప్రదాయంలో “కోయిల్ ” (ఆలయం) అంటే ఇది సహజంగా శ్రీరంగాన్ని సూచిస్తుంది. అదేవిధంగా “తిరుమలై” అంటే తిరువెంకటం మరియు “పెరుమాళ్ కోయిల్” అంటే “కాంచిపురం”. ఆపై తిరునారాయణపురం (మేల్కోటె) – ఈ నాలుగు శ్రీవైష్ణవులకు గొప్ప ప్రాముఖ్యత గల క్షేత్రాలు. శ్రీవైష్ణవులు సాధారణ పదాలకు బదులుగా సంప్రాదాయం పదాలను ఉపయోగించాలి. అలాంటి పరిభాషల గురించి తెలుసుకొని వాటిని సరిగ్గా వాడాలి. అలాగే, మనం తుమ్మినప్పుడు శుభప్రదమైన పేర్లను పలకడం ఆనవాయితి. ఈ సందర్భంలో, మనం “తిరువరంగం” అని మాత్రమే పలకాలని అంటారు. అనువాదకుల గమనిక: ఒకసారి భట్టార్ ఉపన్యాసం ఇస్తున్నప్పుడు, గోష్టిలోని ఒక శ్రీవైష్ణవుడు తుమ్ముతూ “వేంకటం” అని అంటాడు. భట్టార్ చాలా కోపంగా “తిరువరంగం అని మాత్రమే అనాలి” అని కోపగించుకుంటారు. ఆ శ్రీవైష్ణవుడు నిశ్శబ్దంగా అంగీకరిస్తాడు. కానీ అతను తిరుమల తిరుపతికి చెందినవాడు – కాబట్టి అతను తిరిగి వెళ్లి తిరుమలలోని అనంతాళ్వాన్తో ఈ విషయం చర్చిస్తాడు. అనంతాళ్వాన్ అతనికి ఒక విషయం చెప్పి తిరిగి భట్టార్‌ వద్దకు పంపుతాడు. అతను మళ్ళీ ఉపన్యాసం వింటూ మళ్ళీ తుమ్ముతాడు. అతను మళ్ళీ “వేంకటం” అని అంటాడు – భట్టర్ గమనించి, “తిరువరంగం అని అనాలని నేను ఇప్పటికే చెప్పాను – ఈ తప్పును మళ్ళీ ఎందుకు చేస్తున్నావు?” అని ప్రశ్నిస్తారు. ఆ శ్రీవైష్ణవుడు జవాబిస్తూ “తిరుమంగై ఆళ్వారులు స్వయంగా వెఱువాతాళ్ పాసురం (పెరియ తిరుమొళి 5.5.1) లో ‘వేంకటమే’ అని అన్నారు, ఇది శ్రీరంగనాథుని నుండి వచ్చింది కదా? ” అని సమాధానం ఇస్తారు. భట్టర్, అతనికి చాలా తెలివిగా సమాధానమిస్తూ “అది ఆళ్వార్ చెప్పింది కాదు, పరకాల నాయకి మాతృభావంతో ఆళ్వారులు పాడారు. ఒకవేల పరకాల నాయకియే అయ్యుంటే, ఆమె అక్కడ కూడా తిరువరంగం అని మాత్రమే అనుండేది” అని వివరిస్తారు. భట్టార్ యొక్క వివరణతో ఆ శ్రీవైష్ణవుడు ఆమోదిస్తాడు.

ఇక్కడి నుండి శ్రీ రామాయణం మరియు ఇతర పురాణ పురుషుల పేర్లును సాంప్రదాయ దృష్ఠి నుండి వివరించబడ్డాయి. ప్రతి వ్యక్తిత్వానికి నిర్దిష్ట పేర్లు ఉన్నాయి, అవి వారిలో ఉన్న గుణాలను వివరిస్తాయి. అలాంటి వారికై సాధారణ పేర్లకు బదులుగా మన సాంప్రదాయ పరిభాషను ఉపయోగించాలని సిఫార్సు చేయబడింది. సాధారణంగా శ్రీ రామాయణం దివ్య శాస్త్రం అని ప్రశంసించబడింది, ఇది భక్తి మార్గాన్ని వివిధ రూపాల్లో చూపిస్తుంది.

  • “పెరుమాళ్” కు బదులుగా “శ్రీ రామ” అని అనడం, నాచియార్ (లేదా పిరాట్టి) కి బదులుగా “సీతా” అని అనడం, “ఇళయ పెరుమాళ్” కు బదులుగా “లక్ష్మణ” అని అనడం, “కృష్ణ” కి బదులుగా “శ్రీ కృష్ణ” అని అనడం (కృష్ణుడు ఆవులమంద కాపరిగా అందరి స్నేహితుడిలా ఉండటానికి ఇష్టపడతాడు, భక్తితో వ్యవహరించడం ఇష్టపడడు), “అళగియ సింగర్” (అందమైన సింహం ముఖం) కు బదులుగా “శ్రీ నృసింహ” అని అనడం – తిరుమళిసై ఆళ్వార్ నాన్ముగన్ తిరువంతాదిలో ఇలా అన్నారు – “అళగియాన్ తానే అరియురువన్ తానే” – సింహం ముఖం ఉన్న భగవానుడు అత్యంత సుందరుడు.  అనువాదకుల గమనిక: విష్ణు సహస్రనామంలో కూడా చెప్పబడింది “నారసింహా వపు శ్రీమాన్” – అతి సుందరుడైన సింహ ముఖ భగవానుడు), ” శ్రీ గుహన్ పెరుమాళ్” కు బదులుగా “గుహన్ ” అని అనడం (శ్రీ రాముడు గుహుడ్ని తన సొంత సోదరుడిగా స్వీకరించినందున, వారిని గుహ పెరుమాళ్ అని పిలుస్తారు), “తిరువడి” కి బదులుగా “హనుమాన్” అని అనడం, “మహారాజ” కు బదులుగా “సుగ్రీవ” అని అనడం, “పెరియ ఉడైయార్” కు బదులుగా “జాటాయు” అని అనడం, “తిరు తుళాయ్” కి బదులుగా “తుళసి” అని అనడం (ఆళ్వారులు చాలా చోట్ల “తుళాయ్” అనే పదాన్ని ఉపయోగించారు) అడ్డంకులు.
  • భగవానుని యొక్క గొప్ప భక్తుల పేర్లకు ముందు ఆళ్వాన్  / ఆళ్వార్  పదాన్ని జోడిస్తారు.  శ్రీ విభీషణాళ్వాన్, శ్రీ గజేంద్రాళ్వాన్, తిరువాళియాళ్వాన్ (సుదర్శన చక్రం), శ్రీ పాంచజన్యాళ్వాన్ (శంఖం), శ్రీ భరతాళ్వాన్, శ్రీ శతృఘ్నాళ్వాన్, కోయిల్ ఆళ్వాన్  (భగవానుని సన్నిధి), నమ్మాళ్వార్ (శ్రీ శఠకోపుడు). అలా చేయకపోవడం ఒక అడ్డంకి. పెరియవాచాన్ పిళ్ళై  కృష్ణుడి పట్ల అంతులేని భక్తి ఉన్న శవాల్ని తినే గంటా కర్ణను “శ్రీ గంటాకర్ణాళ్వాన్” అని పిలిచేవారని మనం గమనించవచ్చు. అనువాదకుల గమనిక: సాధారణంగా ఆళ్వాన్ / ఆళ్వార్ అంటే భగవత్ అనుభవంలో (దివ్యానుభవాలు) మునిగిపోయిన వ్యక్తి అని అర్థం. భగవాన్ పట్ల తమకున్న అనుబంధాన్ని కీర్తింపచేయడానికి అలా కొంతమంది వ్యక్తిత్వాలకు ఉపయోగించబడుతుంది. ఎంతో మంది ఆచార్యలను ఆళ్వాన్  – కూరతాళ్వాన్, ఎంగళాళ్వాన్, నడాతూరాళ్వాన్, మిళగాళ్వాన్ అలా భగవానుడితో వారికున్న మహత్తైన అనుబంధానికై  కీర్తింపబడ్డారు.
  • “తీర్థ నాయనార్” కు బదులుగా “సాలగ్రామం” అని అనడం ఒక అడ్డంకి. గంటకీ నది సమీపంలో సాలగ్రామం అని పిలువబడే దివ్య దేశంలో భగవాన్ శిలా రూపంలో (రాతి రూపంలో) దర్శనమిస్తారు. ఇటువంటి శిలలను సాధారణంగా “సాలగ్రామం” అని పిలుస్తారు. కానీ ఇది సరైనది పదం కాదు (శ్రీవైష్ణవ పరంగా). తీర్థ నాయనార్ అని పిలవాలి (తీర్థం – నీళ్ళ నుండి వస్తారు కాబట్టి). అతన్ని “శ్రీ మూర్తి” అని కూడా పిలుస్తారు. అనువాదకుల గమనిక: సాలగ్రామ శిలలు చాలా పవిత్రమైనవి. ఎమ్పెరుమాన్  గొప్ప కరుణతో శిల రూపంలో దర్శనమిస్తారు. ఎవరైనా ఇంట్లో పెట్టుకొని, కనీస అవసరాలతో వారిని ఆరాధించవచ్చు. తీర్థ అంటే స్వచ్ఛమైన / పవిత్రమైన – ఎమ్పెరుమాన్  యొక్క “శ్రీ మూర్తి” యొక్క దివ్య రూపం అత్యంత పవిత్రమైనది – అందువల్ల కూడా అతన్ని తీర్థ నాయనార్ అని పిలుస్తారు. నాయనార్ అంటే “ప్రభువు” లేదా “అత్యంత గౌరవనీయుడు” అని అర్థం.
  • ప్రత్యేక మహిమ గల పదాలు తెలియకపోవడం ( మరియు ఉపయోగించడం ) ఒక అడ్డంకి.  అవి –
    • శ్రీమత్ ద్వారపతి నాయనార్ – భగవాన్ ఆలయ ప్రధాన ద్వార పాలకుల పేర్లు మొదలైనవి.
    • తిరువాసల్ కాక్కుం ముదలిగళ్ – వీరు ఆలయం లోపల (లోని సన్నీధి) ద్వార పాలకులుగా ఉండేవారు. తిరుప్పావై 16వ పాసురంలో – “నాయగనాయ్ నిన్ర నందగోపనుడైయ కోయిల్ కాపానే! తోరణ వాయిళ్ కాప్పానే!”అని అన్నారు. గుడిలో అనేక ప్రాంగణాలను (సింహ ద్వారం, లోని సన్నిధి ద్వారం మొదలైనవి) రక్షించే భగవాన్ యొక్క సేవకులు.
    • సేనై ముదలియార్ – విశ్వక్సేనుడు, భగవాన్ సేవకులకి సేనాధిపతి.
    • నంబి మూత్త పిరాన్ – కృష్ణుని అన్నగా ఎప్పుడూ అతని జాగ్రత్తలు చూసుకునే వ్యక్తిగా కీర్తింపబడిన బలరాముడు.
    • శ్రీ మాలాకారర్ – శ్రీ విష్ణు పురాణంలో “మాల్యోపజీవనః”గా పేర్కొనబడిన పూలదండలమ్మే పూలవాడు అతను. అనువాదకుల గమనిక: అతను తన పవిత్రభావంతో అందమైన దండలను (ప్రతిఫలం ఆశించకుండా) సమర్పించి కృష్ణుడిని ఎంతో సంతృప్తి పరచారు.
    • శ్రీ విదురుడు – విదురుడు (దృతరాష్ట్రుని మరియు పాండు సోదరుడు) కృష్ణుడి గొప్ప భక్తుడు, వీరిని విదురాళ్వాన్ అని కూడా పిలుస్తారు. అనువాదకుల గమనిక: అతను పరమానందంలో మునిగిపోయి అరటి పండును పడేసి తొక్కను మాత్రమే కృష్ణుడిని సమర్పించి “మహా మతిః” (గొప్ప తెలివితేటలు ఉన్నవాడు) గా కీర్తింపబడ్డాడు. నిజమైన తెలివంటే భగవాన్ పట్ల గొప్ప భక్తి కలిగి ఉండటమే.
    • శ్రీ నందగోపుడు – కృష్ణుడిని పెంచి పెద్ద చేసిన నంద మహరాజు. అనువాదకుల గమనిక: కృష్ణుడి పట్ల ఆయనకున్న గొప్ప ప్రేమానుబంధం వల్ల వీరు కూడా వ్యాఖ్యానాలలో గొప్పగా కీర్తింపబడ్డాడు.
  • మన ఆచార్యులు ఉపయోగించని భగవాన్నామాలను  పఠించడం / ఉపయోగించడం ఒక అడ్డంకి.  హరీష్, సురేష్, నరేష్, మొదలైన భగవాన్ పేర్లు ఈ మధ్య కాలంలో ఎక్కువ వింటున్నాము – కాని అలాంటి పేర్లను మన ఆచార్యులు ఉపయోగించలేదు కాబట్టి మనం కూడా వాటిని వాడకూడదు.
  • మన పెద్దలు ఎంతో ఆనందంతో ఉపయోగించిన ఆచార్యల పేర్లను పఠించడం / ఉపయోగించకపోవడం ఒక అడ్డంకి. “పిళ్ళై”, “ఆళ్వాన్”, “ఆండాన్”, “నంబి” వంటి అనేక అద్భుతమైన పేర్లను ఉపయోగించి మన పుర్వాచార్యులు నిజమైన ఆచార్యలను కీర్తింపజేశారు. ఇటువంటి  పేర్లును మనం గుర్తుచేసుకొని ఆదరించాలి.
  • జన్మ స్థలం, వారి తాతముత్తాతలు  మరియు పుట్టుక ఆధారంగా ఏకాంతులను (భగవానే ఉపాయం ఉపేయంగా భావించిన ఉన్నతమైన శ్రీవైష్ణవులు) పరిశీలించడం ఒక అడ్డంకి.  శ్రీవైష్ణవులను వారి జన్మ ఆధారంగా నిర్ణయించకూడదు (ఇంకా అనేక ఇతర అంశాలు). ఇది మహా పాపం. వారి స్వస్థలం లేదా వంశం ఆధారంగా వివక్షత చూపడం కూడా మహా పాపం. శ్రీవచన భూషణం సూత్రం 79 మరియు 194 నుండి 200 వరకు, ఈ సూత్రాన్ని వివరించారు. దయచేసి చదివి స్పష్టం చేసుకోండి. అనువాదకుల గమనిక: పిళ్ళై లోకాచార్యులు శ్రీవచన భూషణ దివ్యశాస్త్రంలో శ్రీవైష్ణవుల మహిమలను గొప్పగా కీర్తించారు. అతను శాస్త్రాల నుండి అనేక సాక్ష్యాలను ముందుపెట్టడం ద్వారా వారి పుట్టుకతో సంబంధం లేకుండా శ్రీవైష్ణవుల స్థానం/స్థాయి గురించి అనేక అపార్థాలను మరియు అపోహలను త్రోసిపుచ్చాడు. మాముణులు, తమ విస్తృతమైన వ్యాఖ్యానంలో, అనేక ప్రామాణాలను మహిమపరుస్తూ వాటిని వివరించారు, కాబట్టి ఈ సూత్రాలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, సుత్రం 79లో “ఏకాంతి వ్యాపదేష్టవ్యః” – ఇది విశ్వాక్సేన సంహితా లోని శ్లోకం. ఈ వ్యాఖ్యానంలో, మాముణులు పూర్తి శ్లోకాన్ని అందంగా వివరించారు – “భగవానుడికి పూర్తిగా శరణాగతి చేసిన వ్యక్తిని తన గ్రామంలో, వంశంలో మొదలైనవారిచే మహిమపరచబడడు, కానీ భగవాన్‌తో అతని అద్భుత శాశ్వతమైన సంబంధం ఆధారంగా కీర్తింపబడతాడు”. అటువంటి భాగవతులకు – ప్రతిదీ (గ్రామం, వంశం, గోత్రం, మొదలైనవి) భగవానుడు మాత్రమే అని వారు వివరిస్తున్నారు. 194 నుండి 200 వరకు సూత్రాలలో (ఆ తరువాత మరికొన్ని సుత్రాలు) –  ఈ అంశం https://granthams.koyil.org/2012/08/srivaishnava-lakshanam-7/ లో భాగవత అపచారం వివరంగా చర్చించబడింది.
  • క్కడి నుంచి ఒక శ్రీవైష్ణవులు తన శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు (చనిపోయేటప్పుడు) ఉపయోగించాల్సిన పదాల  వివరణ గురించి చర్చించడం ప్రారంభిద్దాము. మరణం అనే ఈ అంశాన్ని వేరే రకాలుగా వివరించబడింది. ఆళ్వారులు “పణికండాయ్ చామాఱే” అని అన్నారు – చామాఱే అంటే “మరణించడం” అని అర్థం. “మరణమానాల్ వైకుంఠం” – శ్రీవైష్ణవుడు మరణించిన తరువాత శ్రీవైకుంఠం (పరమపదం) చేరుకుంటాడు. శ్రీవైష్ణవ పరంగా ఈ రోజుల్లో ఎవరైనా మరణిస్తే, “ఆచార్య తిరువడి అడైన్తార్” అని తెలియచేస్తారు . “తిరువడిచ్ చార్ంతార్ ” (తిరువడి అంటే ఆచార్యుల/భగవానుడి చరణ కమలాలు,  తిరువడి చార్ంతార్ అంటే ఆచార్యుల పాద పద్మాలను చేరుకున్నారు లేదా “పరమపదం ఎయ్తినార్” – పరమపదం చేరుకున్నారు) వంటి పుర్వచార్యుల సాహిత్యంలో మరణానికి భిన్నమైన శ్రీవైష్ణవ పదాలు ఉన్నాయి. ఇంకా “తిరునాడు అలంకరిత్తార్” – ఆ వ్యక్తి చేరుకుని ఆ దివ్య ప్రదేశాన్ని అలంకరిస్తునాడు, “అవతారం తీర్థం ప్రసాదిత్తాయిత్తు” – అవతారం/జీవితం ముగిసినది. 
  • ఇక్కడి నుండి శ్రీవైష్ణవుల రకం ఆధారంగా, తగిన పదబంధాన్ని ఉపయోగించాలి – అలా చేయకపోవడం ఒక అడ్డంకి. పరమపదం మరియు తిరునాడు రెండూ ఒకటే – కేవలం భాష వేరు అంతే – పరమపదం  సంస్కృత పదం మరియు తిరునాడు తమిళ్ పదం. అయినప్పటికీ, పరమపదం ఒక సాధారణ పదం మరియు తిరునాడు ఒక ప్రత్యేక పదం. ఆచార్య శ్రేష్ఠులు తమ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే “తిరునాడు అలంకరిత్తార్” అని కీర్తిస్తారు. వేర్వేరు వ్యక్తిత్వాలకు వేర్వేరు పదాలు ఎలా ఉపయోగించబడతాయో స్థాపించడం చాలా కష్టం – ఆ అంశాన్ని మన పెద్దల నుండి అవసరమైన విధంగా నేర్చుకోవచ్చు.  అనువాదకుల గమనిక: అంతిమోపాయ నిష్ఠలో, క్రింది చరిత్రం వివరించబడింది. పరవస్తు పట్టర్పిరాన్ జీయర్ అన్నారు –  ఉడయవర్ పరమపదం అధిరోహించిన తరువాత వడుగ నంబి కొంతకాలం జీవించి ఉన్నారు. కానీ, చివరికి వారు కూడా పరమపదాన్ని అధిరోహిస్తారు. ఒక శ్రీవైష్ణవుడు భట్టార్ వద్దకు వెళ్లి “వడుగ నంబి పరమపదానికి అధిరోహించారు” అని చెబుతారు. భట్టార్ దానికి స్పందిస్తూ “వడుగ నంబిని మీరు అలా అనకూడదు”. ఆ శ్రీవైష్ణవుడు “ఎందుకు కాదు?  అతను పరమపాదానికి అధిరోహించాడని మనం అనకూడదా?” అని అడుగుతాడు. ప్రపన్నులకు మరియు ఉపాసకులకు (భక్తి యోగులుగా వారి స్వయం ప్రయత్నంతో పరమపదాన్ని సాధించేవారు) పరమపదం అన్న పదం ఉపయోగించవచ్చు. కానీ వడుగ నంబి విషయం వేరు. భట్టార్ వివరిస్తూ “వడుగ నంబి ఎంపెరుమానార్ యొక్క పాద పద్మాలను చేరుకున్నారని అనాలి” అని అందంగా వివరిస్తారు  – ఈ విషయాన్ని తమ ఆచార్యులు (మాముణులు) తనుకు వివరించారని చెబుతారు. ఇలాంటి సంఘటన పెరియాళ్వార్ తిరుమొళి 4.4.7 పాసుర వ్యాఖ్యానంలో కూడా వివరించబడింది. ఇక్కడ, సాధారణ శ్రీవైష్ణవులు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టినపుడు “తిరువడిచ్ చారంతార్” అన్న పదం సూచించబడింది. భాగవత కైంకర్యంతో సంబంధం ఉన్న ప్రత్యేక శ్రీవైష్ణవుడు దేహం విడిచి పెడితే వారిని “తిరునాడు అలంకరిత్తార్” అని అనాలి. ఆచార్య కైంకర్యంతో సంబంధం ఉన్న ప్రత్యేక శ్రీవైష్ణవుడు దేహం విడిచి పెడితే వారిని “ఆచార్య తిరువడి అడైంతార్” అని అనాలి.
  • శ్రీవైష్ణవులను గాయపరిచే రీతిలో మాట్లాడటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: ఎప్పుడూ మంచిగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. “సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయాత్” సత్యాన్ని మాట్లాడేటప్పుడు కూడా, ఎదుటి వ్యక్తిని గాయపరచకుండా మాట్లాడాలి అని శాస్త్రంలో చెప్పబడింది.
  • వింటున్న వ్యక్తి యొక్క హృదయాన్ని కదిలించే రీతిలో మాట్లాడటం ఒక అడ్డంకి. అనువాదకుల గమనిక: శ్రీ రాముడు “మృదు పూర్వంచ భాషతే” (పూర్వా భాషి) అని పిలుస్తారు.  ఇతరులను కలిసినపుడు మొదట దయగల మాటలతో విచారణ చేయుట. మన ఆచార్యలు కూడా ఇతరులను బాధించకుండా చాలా మృదువుగా మాట్లాడతారు. కాబట్టి ఈ విషయంలో మన ఆచార్యులను మనం అనుసరించే ప్రయత్నించవచ్చు.
  •  మన స్వంత లోపాల గురించి మాట్లాడక పోవడం, భౌతిక వ్యక్తుల తప్పుల గురించి మాట్లాడటం, తమ మంచి లక్షణాలను (సొంత మహిమలు) గురించి చెప్పడం అవరోధాలు. “అహామాస్మి అపరాదానాం ఆలయః” లో చెప్పినట్లుగా – అన్ని లోపాలకు నివాసం నేను , మనల్ని మనం చాలా తక్కువ స్థాయిలో ఎంచుకోవాలి. నమ్మాళ్వార్ “తీవినైయో పెరితాల్” – నా తప్పులు/ దోషాలు చాలా ఉన్నాయి అని అన్నారు. ఎదో కొన్ని మంచి లక్షణాలు ఉంటే, అవి గమనించి స్వీకరించడం ఎమ్పెరుమాన్ యొక్క పని. మన స్వంత కీర్తిని మనం ప్రచారం చేయనవసరం లేదు.
  • భగవాన్ మరియు భాగవతుల  మహిమల గురించి మాట్లాడకపోవడం ఒక అడ్డంకి. భగవాన్లో లోపాలు లేవు. వారిని అమలన్ (మచ్చలేని – లోపం లేని) గా కీర్తిస్తారు. భాగవతులు కూడా పవిత్రమైనవారు – అయినప్పటికీ ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న కారణంగా, వాళ్ళు చిన చిన్న లోపాల వల్ల ప్రభావితమవుతారు. అయినప్పటికీ మనం ఆ చిన్న లోపాలను పట్టించుకోకుండా వారి శుభ లక్షణాలను కీర్తించాలి. భగవతులలో లోపాలు ఎంచడం ఒక పెద్ద తప్పు.
  • భగవాన్ మహిమలపై మాత్రమే దృష్టి పెట్టి, ఆచార్యుల మహిమలను విస్మరించడం ఒక అడ్డంకి. మనం ఇంతకుముందు చర్చించినట్లుగా, భగవాన్ మచ్చలేని స్వచ్ఛమైనవాడు. భాగవతులు కూడా వేదకప్ పొన్ (ఒరగల్లు) అని పిలుస్తారు. వారి దృష్టి, స్పర్శతో, వారు ఇతరులను శుద్ధి చేస్తారు. దీనికి సంబంధించిన సంఘటన ఒకటుంది (ఇంతకు ముందే మనం చూశాము). ఒక శ్రీవైష్ణవ కుమారుడు దుస్నేహితుల కారణంగా దారితప్పాడు. ఆ తండ్రి తన కొడుకు పరిస్థితి చూసి బాధపడతాడు. కానీ ఒక రోజు, అకస్మాత్తుగా, శ్రీవైష్ణవ బాలుడు మారిపోయి శిఖ, యగ్యోపవీతం, తిలకం మొదలైనవాటితో వచ్చి తన తండ్రికి నమస్కారాలు అర్పిస్తాడు. ఆ శ్రీవైష్ణవుడు పరమానందంతో ” కూరత్తాళ్వాన్ నెన్నేమైనా చూశాడా? తన దివ్య దృష్టితో నిన్నాశీర్వదించి శుద్ధి చేశాడా? అని అడుగుతారు. భాగవత దయ వల్ల మాత్రమే తన కుమారుడు సంస్కరించబడ్డాడని అతను గట్టి నమ్మకంతో ఉన్నాడని దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. భగవాన్ మహిమల కంటే భాగవతుల కీర్తి గొప్పది. భాగవతులలో అచార్యుడు నాయకుడు – తమ ఆచార్యుని గురించి పొగిడి మాట్లాడాలి.
  • ఆధ్యాత్మిక విషయాల అవగాహన ఉన్న వ్యక్తి, ఆళ్వారుల/ ఆచార్య పాసురాలు / స్థోత్రాలను నిరంతరం పఠించాలి. అలా చేయకపోవడం ఒక అడ్డంకి. పాసురములను పఠించేటప్పుడు వాటి దివ్య అర్థాలను కూడా ధ్యానించాలి. అచార్యులచే వ్రాయబడిన అనేక గ్రంథాలను కూడా సరిగ్గా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు గుర్తుంచుకోవాలి.
  • ఆచార్యులు సూచించిన గురుపరంపరా మంత్రం మరియు ద్వయ మహామంత్రం మినహా ఇతర మంత్రాలను పఠించడం,  గురుపరంపరా మంత్రం మరియు ద్వయ మహామంత్ర నిత్యజపం మానుకోవడం అవరోధాలు. ద్వయ మహామంత్రం రహస్య త్రయం (తిరుమంత్రం, ద్వయం మరియు చరమ స్లోకం)ను సూచిస్తుంది. అనువాదకుల గమనిక: మన పూర్వాచార్యులు ద్వయ మహామంత్రాన్ని నిరంతరం ధ్యానించే వారని మనం అర్థం చేసుకోవాలి, ద్వయ మహామంత్రాన్ని మొదట గురు పరంపరను పఠించకుండా స్వతంత్రంగా పఠించలేమని కూడా మనం అర్థం చేసుకోవాలి, అనగా నేరుగా పిరట్టిని పెరుమాళ్ని ఆశ్రయించకుండా గురుపరంపర సహాయంతో ఆశ్రయిస్తాము. ఈ కారణంగానే మన ఆచార్యులు ద్వయ మహామంత్రాన్ని పఠించే ముందు గురు పరంపరా మంత్రాన్ని ఎప్పుడూ పఠించేవారు.

ద్వయ మహామంత్రానికి ముందు పఠించాల్సిన గురు పరంపరా మంత్రం ఇక్కడ ఉంది:

అస్మద్ గురుభ్యో నమః (తమ సొంత ఆచర్య)

అస్మద్  పరమగురుభ్యో నమః (తమ ఆచార్యులకు ఆచర్య)

అస్మద్  సర్వగురుభ్యో  నమః (ఆచార్యులందరు)

శ్రీమతే రామానుజాయ నమః (ఎమ్పెరుమానార్)

శ్రీ పరాంకుశ దాసాయ నమః (పెరియ నంబి)

శ్రీమద్ యామున మునయే నమః (ఆళవందార్)   

శ్రీ రామ మిశ్రాయ నమః (మణక్కాల్ నంబి)

శ్రీ పుణ్డరికాక్షాయ నమః (ఉయ్యక్కొణ్డార్)

శ్రీమన్ నాథమునయే నమః (నాథముని)

శ్రీమతే శఠగోపాయ నమః (నమ్మాళ్వార్)

శ్రీమతే విశ్వక్సేనాయ నమః (సేనై ముదలియార్)

శ్రీయై నమః (పెరియ పిరాట్టి)

శ్రీధరాయ నమః (పెరియ పెరుమాళ్)

పిళ్ళై  లోకాచార్యులు తమ శ్రీవాచన భుషణ సూత్రం 274లో – “జప్తవ్యం గురు పరంపరైయుం ద్వయముం”  – గురు పరంపరను మరియు ద్వయ మహామంత్రాన్ని నిరంతరం పఠించాలని వివరించారు.

తరువాతి భాగం మనం వచ్చే సంచికలో కొనసాగిద్దాము.

అడియేన్ శ్రీదేవి రామానుజ దాసి

హిందీలో – https://granthams.koyil.org/2014/06/virodhi-pariharangal-26/

మూలము : https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment