శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
<< ఆళ్వార్ తిరునగరి వైభవము – చరిత్ర
నమ్మాళ్వార్లు అవరించిన తరువాత ఆదిక్షేత్రం అని పిలువబడే ఈ తిరుక్కురుగూర్ క్షేత్రం ఆళ్వార్తిరునగరిగా ప్రసిద్ధిచెందింది. ఇప్పుడు మనం నమ్మాళ్వార్ల చరిత్రను వైభవాన్ని అనుభవిద్దాము.
ఈ సంసారంలో బాధలను అనుభవిస్తున్న ఆత్మలను నిత్య విభూతి శ్రీ వైకుంఠానికి చేర్చడానికి పెరుమాళ్ళు ఎన్నో లీలలాడుతుంటాడు. ప్రళయకాలంలో అన్ని లోకాలను నశింపజేసి, మరలా సృష్టించి, ఆత్మలకు దేహాన్ని, ఇంద్రియాలను ప్రసాదించి, వారికి శాస్త్రాల నిచ్చి, ఋషుల ద్వారా ఆ శాస్త్రార్థాలను విశదపరచి, స్వయంగా తాను అనేక అవతారాలను ఎత్తి, ఎన్నో లీ
ఆదిక్షేత్రం అని పిలువబడే ఈ తిరుక్కురుగూర్ నమ్మాళ్వార్లు అవతరించిన తరువాత ‘ఆళ్వార్ తిరునగరి’ గా ప్రసిద్ధిచెందినది. ఇప్పుడు మనం నమ్మాళ్వార్ల వైభవాన్ని అనుభవిద్దాము.
ఈ సంసారబాధలను అనుభవిస్తున్న ఆత్మలను, నిత్యవిభూతియైన శ్రీవైకుంఠానికి చేర్చడానికి భవవానుడు ఎన్నో లీలలను ప్రదర్శిస్తుంటాడు. భగవానుడు ప్రళయకాలంలో లోకాలన్నింటిని నశింపజేసి, మరలా సృష్ఠించి, ఆత్మలకు దేహాన్ని, ఇంద్రియాలను ప్రసాదించి, వారికి శాస్త్రాలనిచ్చి, ఋషుల ద్వారా ఆ శాస్త్రార్థాలను విశదపరచి, స్వయంగా తాను అనేక అవతారాలను ఎత్తి, ఎన్నో లీలలను చూపి, జీవాత్మలను ఈ సంసారబంధం నుండి విముక్తులను చేయాలని ప్రయత్నిస్తుంటాడు. ఇంత ప్రతయ్నం చేసినా జీవులు ఆత్మోజ్జీవనం పొందలేకపోతే, మరలా వారిని ఉద్దరింపచేయుటకు, వేటగాడు జింకను పట్టుకోవడానికి మరొక జింకను ఎరవేసినట్లు, భగవానుడు ఈ జీవాత్మలను ఉద్ధరించడానికి ఇక్కడి ఆత్మలనే(జీవాత్మ) ప్రయోగించాలని నిర్ణయించుకొని, కొన్ని ప్రత్యేక ఆత్మలను ఎంచుకొని, శుద్ధజ్ఞానాన్ని వారికి ప్రసాదించి, వారినే ఆళ్వార్లుగా అవతరింప చేశాడు. ఆ విధంగా అజ్ఞానశూన్యులైన ఆళ్వార్లకు, భగవానుడు కృపతో శుద్దభక్తిజ్ఞానాలను అనుగ్రహించి, వారిచే దివ్యపాశురాలను రచింపజేసి, వీరి ద్వారా ఈ లోకంలోని సమస్త ఆత్మలకు జ్ఞానోదయం కలిగించి, తద్వారా వారు మోక్షం (శ్రీవైకుంఠం) పొందాలని భగవానుడు సంకల్పింస్తాడు. అటువంటి ఆళ్వార్లలో నమ్మాళ్వార్లను ప్రధానులుగా భావిస్తారు మన పెద్దలు.
నమ్మాళ్వార్లకు మాఱన్, మగిళ్ మాఱన్, శఠకోపులు, నావీఱులు, పరాంకుశులు, వకుళాభరణులు, శఠజిత్, మరియు కురుగూర్ నంబి అనే తిరునామాలున్నవి.
కలియుగం ప్రారంభమున ఆళ్వార్ తిరునగరి సమీపములోని ‘అప్పన్ కోయిల్’ అనే క్షేత్రమున కారియార్ ఉడైయనంగై అనే దివ్యదంపతులకు వైశాఖ(వైగాశి)మాస విశాఖానక్షత్రంలో అవతరించారు నమ్మాళ్వార్. ఉడైయనంగైకారియార్ల ఇరువురి కుటుంబం వారు పరంపరగా భగవత్కైకర్యమున తమ జీవితాలను కృతార్థం చేసుకున్నారు. ఈ దంపతులిద్దరు సంతానార్థం తిరుక్కురుంగుడినంబిపెరుమాళ్ళను ప్రార్థించారు. పెరుమాళ్ తానే వారికి సంతానంగా పుడతానని వరమిస్తాడు. మనం గురుపరంపర గ్రంథంలో ఈ విషయం గురించి చర్చించుకున్నాము (ఆళ్వారాచార్యుల చరిత్రలు). నమ్మాళ్వార్ల మహిమను గ్రహించిన మన పూర్వాచార్యులు, భగవానుడే స్వయంగా అవతారించారా లేక నిత్యసూర్యులలోని వారా అని ఆశ్చర్యపోయేవారు.
తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు అజ్ఞానాన్నికలిగించే ‘శఠం’ అనే వాయువు / ఉమ్మనీరు ఆ శిశువును ఆవహించి జ్ఞానభ్రాంతి కలిగించును. అలాంటి ‘శఠం’ శిశువుగా ఉన్న నమ్మాళ్వార్లను ఆవహించబోగా వారు శఠాన్ని ధిక్కరించారు. అందువల్ల వీరికి ‘శఠకోపన్’ (శఠమును కోపించిన వారు)అనే తిరునామం కలిగినది. నమ్మాళ్వార్లు అందరి పిల్లల వలె పుట్టగానే ఏడవలేదు, పాలు తాగేవారు కాదు. వీరి తల్లిదండ్రులు నమ్మాళ్వార్లను తిరుక్కురుగూర్ ఆదినాథుడికి సమర్పించి ‘తిరుప్పుళి ఆళ్వార్’ అనే చింతచెట్టు క్రింద వదిలేస్తారు. చింతచెట్టు తొర్రలో నమ్మాళ్వార్లు నిద్రాహారాలు లేకుండ దివ్యతేజంతో 16 సంవత్సరాల కాలం పాటు పద్మాసీనులై భగవత్ ధ్యానంలో ఉండిపోతారు.
ఇది ఇలా ఉండగ, నమ్మాళ్వార్ల అవతారానికి ముందు ఆళ్వార్ తిరునగరికి సమీపములో ఉన్న తిరుక్కోళూర్ అనే దివ్యదేశములో మధురకవి ఆళ్వార్ అనే బ్రాహ్మణోత్తముడు జన్మిస్తాడు. వీరు ఉత్తరభారతదేశ యాత్ర చేస్తుండగా దక్షిణదిశ నుండి ఒక దివ్యమైన తేజస్సుని చూస్తారు. ఆ జ్యోతిని అనుసరిస్తూ వారు ‘తిరుప్పుళి ఆళ్వార్’ అనే చింత చెట్టు క్రింద పద్మాసీనులైఉన్న నమ్మాళ్వార్ల వద్దకు చేరుకుంటారు.
నమ్మాళ్వార్లు ప్రబంధాలను అనుగ్రహించగా మధురకవి ఆళ్వార్లు వాటిని తాళపత్రాలపై వ్రాసినారు. నమ్మాళ్వార్ల అనుగ్రహించిన నాలుగు ప్రబంధాలు.
- తిరువిరుత్తం (ఋగ్వేద సారం)
- తిరువాశిరియం (యజుర్వేద సారం)
- పెరియ తిరువందాది (అధర్వవేద సారం)
- తిరువాయ్ మొళి (సామవేద సారం)
నమ్మాళ్వార్ల ఈ నాలుగు ప్రబంధాలు నాలుగు వేదాలకు సమానమైనవి. అందుకనే వీరికి ‘వేదం తమిళ్ శెయ్ ద మాఱన్’ అనే తిరునామం కలిగినది. అంటే వేదాలను తమిళంలో వ్రాసిన మాఱన్ అని అర్థం. సంస్కృత వేదార్థాలను అందరికి అర్థమైయ్యేలా సులువుగా తమిళభాషలో వెలికి తెచ్చారు. ఇతర ఆళ్వార్ల ప్రబంధాలు వేదాలకు ఉపాంగాలుగా పరిగణించారు మన పూర్వాచార్యులు. పన్నిద్దరాళ్వార్లు కృపచేసిన నాలుగువేల పాశురాల (నాలాయిర దివ్యప్రబంధం) సారమంతా తిరువాయ్ మొళిలో ఇమిడి ఉందని పూర్వాచార్యులు కీర్తిస్తారు. మన పూర్వాచార్యులు తమతమ వ్యాఖ్యానాలను, రహస్యగ్రంథాలన్నీ తిరువాయ్ మొళిని ఆధారంగానే అనుగ్రహించారని పూర్వుల నిర్వాహకం. భగవానుని అనుగ్రహంతో పూర్వాచార్యులు తిరువాయ్ మొళి శ్రీసూక్తులకు ఐదువ్యాఖ్యానాలు కృపచేశారు. ప్రస్తుతం ఇవి లభ్యం.
ఆళ్వార్ [ఈ పదం కేవలం నమ్మాళ్వార్లను మాత్రమే సూచిస్తుంది] ఈ లీలావిభూతిలో ముప్పైరెండు సంవత్సరాలు జీవించారు. ఆళ్వార్ సాంసారిక బంధాలతో ఎటువంటి అనుబంధం లేకుండా నిరంతరం భగవధ్యానంలో ఉండేవారు. ఆ చింతచెట్టు క్రింద పద్మాసీనులై ఆయా దివ్యదేశాల పెరుమాళ్ళను స్తుతిగా పాశురాల ద్వారా మంగళాశాసనం కృపచేశారు. దివ్యదేశాల నుండి పెరుమాళ్ళు తామే స్వయంగా ‘తిరుప్పుళియాళ్వార్’ వద్దకు వచ్చి వీరి పాశురాల ద్వారా మంగళాశాసనాలు అందుకునేవారు. పెరుమాళ్ళ దివ్యానుగ్రహంతో శాస్ర్తార్థాలను ఆళ్వార్ తమ ప్రబంధాలలో స్పష్టంగా కృపచేశారు. ఇంతటి విశేష వైభవం కలిగిన తిరువాయ్ మొళి సేవిస్తున్నప్పుడు, ఫలశృతి పాశురాలలో ‘కురుగూర్’ అన్న నామాన్ని ఉచ్ఛరించినప్పుడల్లా మనం దక్షిణదిక్కుకి తిరిగి ఆళ్వార్ తిరునగరికి చేతులెత్తి నమస్కరించాలని మన పూర్వాచార్యులు నియమనం చేశారు .
ఆళ్వారు ముప్పైరెండు సంవత్సరాల కాలంపాటు ఈ లీలావిభూతిలో ఉన్న తర్వాత, ఇక పరమపదానికి వెళ్ళాలని నిశ్చయించుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న మధురకవిఆళ్వార్లు తమ ఆచార్యులు ఈ లీలావిభూతిని వదలి వెళ్ళుతున్నారని తెలిసి కలతచెంది తమ నిత్యతిరువాధన కోసం ఒక అర్చామూర్తిని ప్రసాదించమని ప్రార్థించారు. మధురకవిఆళ్వార్లకు తామ్రపర్ణి నదీజలాన్ని కాచితే తమ అర్చామూర్తి లభిస్తుందని ఆళ్వార్ అనుగ్రహిస్తారు. మధురకవి ఆళ్వార్లు తమ ఆచార్యుల ఆదేశంమేరకు తామ్రపర్ణి నదీజలాన్ని కాచి ఒక అర్చామూర్తిని పొందుతారు. అంజలి ముద్రలో ఉన్న ఆ అర్చామూర్తిని సేవించిన మధురకవి ఆళ్వార్లు , “మీరు దాసునికి ఆచార్యులు కాబట్టి, ఉపదేశముద్రతో ఉన్న అర్చామూర్తిని ఆరాధించాలని ఆశించాను, కాని ఈ అంజలిముద్రకు కారణం ఏమిటి స్వామి?” అని అడిగారు. దానికి నమ్మాళ్వార్లు బదులిస్తూ “ఆ అర్చామూర్తిని (భవిష్యదాచార్య రామానుజులును) చూపిస్తు, వీరు నాలుగువేలసంవత్సరాల తర్వాత అవతరించబోయే ఒక గొప్ప మహానుభావుడు” అని సూచిస్తారు.
ప్రస్తుతం మనం ఆళ్వార్ తిరునగరిలో ప్రధానసన్నిధికి పడమరవైపు ఉన్న ‘రామానుజ చతుర్వేదిమంగళం’అనే వీధిలో భవిష్యదాచార్యుని (రామానుజుల) దివ్య అర్చామూర్తిని సేవించుకోవచ్చు. మధురకవిఆళ్వార్లను మళ్ళీ తామ్రపర్ణి నదీజలాన్ని కాయమని నమ్మాళ్వార్లు ఆదేశిస్తారు. ఈసారి వీరు నమ్మాళ్వార్ల వంటి అర్చామూర్తిని పొందుతారు. మధురకవి ఆళ్వార్లు పరమానందంతో స్వీకరించి ఆ అర్చామూర్తిని ఆరాధిస్తారు. ఆళ్వార్ తిరునగరిలో. ప్రస్తుతం మనం సేవిస్తున్న మూర్తి ఈ అర్చామూర్తియే.
కాలానంతరం, భగవానుడు స్వయంగా వచ్చి నమ్మాళ్వార్లను పరమపదానికి తీసుకువెళతారు. అనంతరం మధురకవిఆళ్వార్లు, ఆదినాథ పెరుమాళ్ళ ఆలయంలోపల నమ్మాళ్వార్ల అర్చామూర్తిని ప్రతిష్ఠించి, దివ్య గోపురప్రాకారమండపాదులను నిర్మింపజేశారు. నిత్యం వివిధరకపు పూలమాలతో నమ్మాళ్వార్ల అర్చామూర్తిని అలంకరించి ఆనందాన్ని పొందేవారు. నమ్మాళ్వార్ల పాశురాలను నలుమూలలా వ్యాపించే విధంగా పాడుతూ ఉండేవారు. వీరు భక్తి పారవశ్యంతో నమ్మాళ్వార్లను స్తుతిస్తూ పదకొండు పాశురాల ‘కణ్ణినుణ్ శిఱుత్తాంబు’ అనే ప్రబంధాన్ని అనుగ్రహిస్తారు. ఇప్పటికిని ఆళ్వార్ తిరునగరిలో “అణ్ణావియర్” అనే తిరునామంతో మధురకవిఆళ్వార్ల వంశస్థులు నిత్యకైంకర్యం చేస్తున్నారు.
కొంత వరకు మనము ఆళ్వార్ల వైభవాన్ని అనుభవించాము.
నమ్మాళ్వా ర్ల తనియన్:
మాతాపితా యువతయ స్తనయా విభూతిః
సర్వం య దేవ నియమేన మదన్వయానామ్|
ఆద్యస్య నః కులపతేర్వకుళాభిరామమ్
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా||
నమ్మాళ్వా ర్ల వాళి తిరునామాలు
తిరుక్కురుగై ప్పెరుమాళ్ తన్ తిరుత్తాళ్గళ్ వాళియే
తిరువాన తిరుముగత్తు చ్చెవ్వి ఎన్ఱుం వాళియే
ఇరుక్కుమొళి ఎన్ నెంజిల్ తేక్కినాన్ వాళియే
ఎందై ఎదిరాశర్కు ఇఱైవనార్ వాళియే
కరుక్కుళియిల్ పుగావణ్ణం కాత్తు అరుళ్వోన్ వాళియే
కాశినియిల్ ఆరియనాయ్ క్కాట్టినాన్ వాళియే
వరుత్తం అఱ వందు ఎన్నై వాళ్విత్తాన్ వాళియే
మధురకవి తంబిరాన్ వాళి వాళి వాళియే
ఆన తిరువైరుత్తం నూఱుం అరుళినాన్ వాళియే
ఆశిరియం ఏళు పాట్టు అళిత్త పిరాన్ వాళియే
ఇనం అఱ అందాది ఎణ్బత్తు ఏళు ఇందాన్ వాళియే
ఇలగు తిరువాయ్మొళి ఆయిరత్తు నూఱ్ఱు ఇరండు ఉరైత్తాన్ వాళియే
వాన్ అణియుం మామాడక్కురుగై మన్నన్ వాళియే
వైగాశి విశాగత్తిల్ వందు ఉదిత్తాన్ వాళియే
సేనైయర్కోన్ అవదారం శెయ్ద వళ్ళల్ వాళియే
తిరుక్కురుగై చ్చటకోపన్ తిరువడిగల్ వాళియే
మేదినియిల్ వైగాశి విశాగత్తోన్ వాళియే
వేదత్తై చ్చెందమిళాల్ విరిత్తు ఉరైత్తాన్ వాళియే
ఆది గురువాయ్ అంబువియిల్ అవదరిత్తోన్ వాళియే
అనవరదం సేనైయర్ కోన్ అది తొళువోన్ వాళియే
నాదనుక్కు నాలాయిరం ఉరైత్తాన్ వాళియే
నన్ మధురకవి వణంగుమ్ నావీఱన్ వాళియే
మాధవన్ పోఱ్పాదుగైయార్ వళర్ న్దరుళ్వోన్ వాళియే
మాగిళ్ మాఱన్ శడగోపన్ వైయగత్తిల్ వాళియే
మూలము: https://granthams.koyil.org/2022/12/03/azhwarthirunagari-vaibhavam-2-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org