శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
తామ్రపర్ణి నదీజలముతో ఆళ్వార్ కు నిత్యము తిరుమంజనం జరుగుతుంది. సంవత్సరం పొడవునా పెరుమాళ్, తాయార్లు, ఆళ్వార్లు, ఆచార్యులు ఎన్నో ఉత్సవాలను ఆస్వాదిస్తారు. మనంకూడా వాటిని ఇక్కడ ఆస్వాదిస్తాము:
ప్రతిమాసం జరిగే తిరువీధిఉత్సవములు
- అమావాస్యకు – పెరుమాళ్
- ఏకాదశికి – తాయర్లతో కూడి పెరుమాళ్ కు
- ద్వాదశికి – ఆళ్వార్ కు
- పౌర్ణమికి – ఆళ్వార్ కు
- శుక్రవారం- పెరుమాళ్ తాయార్లకు
- రోహిణి నక్షత్రమున – కృష్ణుడికి
- పునర్వసు నక్షత్రమున – శ్రీ రాముడు
- ఉత్తరా నక్షత్రమున – పెరుమాళ్, ఆళ్వార్లకు
- తిరువిశాఖం కి – పెరుమాళ్, ఆళ్వార్లకు
- తిరువోణం (శ్రవణా నక్షత్రమున) – పెరుమాళ్ కు
నాలాయిర దివ్యప్రబంధం సేవించే క్రమం :
ఆయా ఆళ్వార్ల తిరునక్షత్రం రోజున ఆయా ప్రబంధముల పాశురాలు శాత్తుముర అయ్యే విధంగా ఏర్పాటు చేయబడింది.
- రోహిణి నక్షత్రం రోజున – అమలనాది పిరాన్
- మృగశీర్షం నక్షత్రం రోజున – ప్రత్యేక సేవాకాలం ఉండదు
- ఆరుద్రా నక్షత్రం రోజున – ఇరామానుజ నూత్తందాది
- పునర్వసు నక్షత్రం రోజున – పెరుమాళ్ తిరుమొళి, తిరువాయ్ మొళి 1వ శతకం
- పుష్యమి నక్షత్రం రోజున – తిరువాయ్ మొళి 2వ శతకం
- ఆశ్లేష నక్షత్రం రోజున – నాన్ముగన్ తిరువందాది, తిరువాయ్ మొళి 3వ శతకం
- మఖ నక్షత్రం రోజున – తిరుచ్చంద విరుత్తం, తిరువాయ్ మొళి 4వ శతకం
- పూర్వఫల్గుణి నక్షత్రం రోజున – నాచ్చియార్ తిరుమొళి, తిరువాయ్ మొళి 5 శతకం
- ఉత్తర ఫల్గుణి నక్షత్రం రోజున – తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుమొళి 1వ శతాబ్దం, తిరువాయ్ మొళి 6వ శతకం
- హస్త నక్షత్రం రోజున – పెరియాళ్వార్ తిరుమొళి 2వ శతకం, తిరువాయ్ మొళి 7వ శతకం
- చిత్త నక్షత్రం రోజున – పెరియాళ్వార్ తిరుమొళి 3వ శతకం, తిరువాయ్ మొళి 8వ శతకం
- నక్షత్రం రోజున – పెరియాళ్వార్ తిరుమొళి 4, 5 వ శతకం, తిరువాయ్ మొళి 9వ శతకం
- విశాఖ నక్షత్రం రోజున – తిరువిరుత్తం, తిరువాశిరియం, పెరియ తిరువందాది 10వ శతకం
- అనురాధ నక్షత్రం రోజున – ప్రత్యేక సేవాకాలం ఉండదు
- జేష్ఠ నక్షత్రం రోజున – తిరుమాలై, తిరుప్పళ్ళియెళుచ్చి
- మూలా నక్షత్రం రోజున – ఉపదేశ రత్నమాల, తిరువాయ్ మొళి నూత్తందాది
- పూర్వాషాడ నక్షత్రం రోజున – పెరియ తిరుమొళి 1వ శతకం
- ఉత్తరాషాడ నక్షత్రం రోజున – పెరియ తిరుమొళి 2వ శతకం
- శ్రవణం/తిరువోణం నక్షత్రం రోజున – పెరియ తిరుమొళి 3వ శతకం, మొదటి తిరువందాది
- ధనిష్టం నక్షత్రం రోజున – పెరియ తిరుమొళి 4వ శతకం, ఇరండాం తిరువందాది
- శతభిషం నక్షత్రం రోజున – పెరియ తిరుమొళి 5వ శతకం, మున్ఱామ్ తిరువందాది
- పూర్వాభాద్ర నక్షత్రం రోజున – పెరియ తిరుమొళి 6వ శతకం
- ఉత్తరాభాద్ర నక్షత్రం రోజున -పెరియ తిరుమొళి 7వ శతకం
- రేవతి నక్షత్రం రోజున – పెరియ తిరుమొళి 8వ శతకం
- అశ్విని నక్షత్రం రోజున – పెరియ తిరుమొళి 9వ శతకం, తిరువెళుకూట్టిరుక్కై, శిరియ తిరుమడల్
- భరణి నక్షత్రం రోజున – పెరియ తిరుమొళి 10వ శతకం, పెరియ తిరుమడల్
- కృత్తిక నక్షత్రం రోజున – పెరియ తిరుమొళి 11వ శతకం, తిరుక్కుఱుందాండగం, తిరునెడుందాండగం
నిత్య సేవకాలం
- పెరుమాళ్ళ సన్నిధిలో – ప్రతి రాత్రి – తిరుప్పల్లాండు, శెన్నియొంగు (పెరియాళ్వార్ తిరుమొళి 5-4)
- ఆళ్వార్ సన్నిధిలో -ప్రతి ఉదయం – కణ్ణినుణ్ శిఱుత్తాంబు, తిరుప్పావై సేవించబడుతుంది. తరువాత, తిరునక్షత్రం ఆధారంగా పాశురాలు సేవించబడతాయి.
- ఆళ్వార్ సన్నిధిలో – ప్రతి రాత్రి – కణ్ణినుణ్ శిఱుత్తాంబు, ఏళై ఏదలన్ (పెరియ తిరుమొళి 5.8), ఆళియెళి (తిరువాయ్ మొళి 7.4).
అనధ్యయన కాలం – నిత్య సేవ
- పెరుమాళ్ సన్నిధిన – నాలాయిర తనియన్లు
- ఆళ్వార్ సన్నిధిన – ఉదయం – ఉపదేశ రత్నమాల, రాత్రి – ఇరామానుజ నూత్తందాది
ధనుర్మాసం – ఆళ్వార్ పెరుమాళ్ళ సన్నిధులలో తిరుప్పళ్ళియెళుచ్చి, తిరుప్పావై.
ఉత్సవాలు (మాసాల ప్రకారం)
చైత్రమాసం
- పెరుమాళ్ళ బ్రహ్మోత్సవాలు – 10 రోజులు – చైత్ర (చిత్తిరై) మాస ఆర్ద్రా నక్షత్రం రోజున, రాత్రి ఊరేగింపు సమయంలో పెరుమాళ్ళ వద్దకు ఆళ్వార్ వెళ్తారు. చైత్ర మాసం పునర్వసు నక్షత్రం రోజున రాత్రి శ్రీరాములవారు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్తారు. 9వ రోజున – చైత్ర మాసంలో రథోత్సవం జరుగుతుంది. 10వ రోజున – చైత్ర మాసం ఉత్తర ఫల్గుని నక్షత్రం రోజున – మిక్క ఆదిప్పిరాన్ పెరుమాళ్ కి తీర్థవారి (తామ్రపర్ణి నదిలో తిరుమంజనం).
- మధురకవి ఆళ్వార్ దివ్యనక్షత్రం – చైత్ర మాస చిత్తానక్షత్రం
- ఎంబెరుమానార్ల తిరుఅవతార ఉత్సవం – 11 రోజులు. 10వ రోజు తిరువాదిరై(ఆర్ద్ర) నక్షత్రం (భవిష్యదాచార్య సన్నిధి), ఉడయవర్లు, ఆదినాథ ఆళ్వార్ సన్నిధికి వెళ్ళి మంగళాశాసనం చేస్తారు.
- చిత్రాపౌర్ణమి – 2 రోజులు – పౌర్ణమి రోజున – పెరుమాళ్ళ ఊరేగింపు. పాడ్యమి రోజు ఆళ్వార్ సరిహద్దు శిల వద్దకు ఊరేగింపుగా వెళతారు.
- శ్రీవైకుంఠ పెరుమాళ్ళ బ్రహ్మోత్సవం 5వ రోజు – పొలిందు నిన్ఱ పిరాన్, ఆళ్వార్ శ్రీవైకుంఠ దివ్యదేశానికి ఊరేగింపుగా వెళతారు (ఆళ్వార్ తిరునగరి సమీపంలో ఉంది).
వైశాఖమాసము
- నమ్మాళ్వార్ తిరు అవతార ఉత్సవం – 10 రోజులు; 5వ రోజున నవ తిరుపతుల పెరుమాళ్ళకు గరుడ సేవ; నమ్మాళ్వార్లకు హంస వాహనం; చెక్క ఆసనంపైన మధురకవి ఆళ్వార్లు. 7వ రోజు – ఆళ్వారు, ఎంబెరుమానార్లు ఇద్దరూ ఒకే ఆసనంలో ఆసీనులై ఉంటారు. ఇరువురికి శేర్తితిరుమంజనం (భవిష్యదాచార్య సన్నిధిలో); 8వ రోజు – అప్పన్ కోయిళ్ లో(ఆళ్వార్ అవతరించిన స్థలం) – ఆళ్వార్ కి దోగాడే కృష్ణుడి రూపంలో దివ్యాలంకరణ; 9వ రోజు – వైశాఖమాస తిరురథోత్సవం.
- వైశాఖమాస ఉత్తరాభద్ర నక్షత్రమున – వర్షాభిషేకం (సంవత్సరానికి ఒకసారి సంప్రోక్షణం జరిగుతుంది).
జేష్ఠమాసం
జేష్ఠమాస మొదటి రోజు – ముప్పళం (వేసవికాలం ముగింపును సూచిస్తూ మూడు రకాల పండ్లను నివేదన చేస్తారు)
- వసంతోత్సవం – 10 రోజులు, జేష్ఠమాస ఉత్తరఫాల్గుణికి శాత్తుముర.
- జేష్ఠమాస అనురాధ – శ్రీమన్నాథమునుల తిరునక్షత్ర ఉత్సవం.
- జేష్ఠమాస – జేష్ఠానక్షత్రం – జ్యేష్ఠాభిషేకం – ఏడు తెరలతో చేయబడుతుంది.
- జేష్ఠమాస – తిరుమూలం – తిరుప్పులి ఆళ్వార్ తిరునక్షత్రం (దివ్య చింతచెట్టు)
ఆషాఢమాసం
- తిరు ఆడిప్పూరం – కురుగుర్ నాచ్చియార్, ఉడయవర్ల సన్నిధికి ఊరేగింపుగా వెళతారు.
- పక్షిరాజు/గరుడన్ ఉత్సవం – 10 రోజులు – ఆషాఢస్వాతి సందర్భంగా శాత్తుముర
- ఆషాఢ ఉత్తరాభాద్ర నక్షత్రం – అళగర్ ఉత్సవం
శ్రావణమాసం
- పవిత్రోత్సవాలు – 9 రోజులు – శ్రావణమాస శుక్లపక్ష ఏకాదశి రోజున ప్రారంభమవును. 9వ రోజు – మిక్కఆదిప్పిరాన్ కు తీర్థవారి.
- శ్రీపాంచరాత్ర శ్రీజయంతి – పురాణ పారాయణం, ఆలయం లోపల కృష్ణుడి ఊరేగింపు, మరుసటి రోజు – ఉరయాడి (ఉట్టి కొట్టుట) – వీధుల్లో పెరుమాళ్, తాయార్, ఆళ్వార్, కృష్ణుడి ఊరేగింపు.
- తిరుక్కోళూర్ వైత్తమానిధి పెరుమాళ్ బ్రహ్మోత్సవం – 9వ రోజు – తిరుక్కోళూర్ కి ఆళ్వార్ ఊరేగింపు – రథంపై దివ్యదర్శనం
భాద్రపదమాసం
- నవరాత్రి ఉత్సవాలు – 9 రోజులు
- విజయదశిమి – పార్వేట ఉత్సవం
- భాద్రపద శ్రవణానక్షత్రం – జ్ఞానప్పిరాన్ (వరాహస్వామి), తిరువేంగడముడయాన్ లకు ఉత్సవం. వేదాంతదేశికులు – ఆదినాథ పెరుమాళ్ – ఆళ్వార్ సన్నిధులకు ఊరేగింపుగా వెళ్ళి మంగళాశాసనం చేయడం.
ఆశ్వీయుజమాసం
- ఆశ్వీయుజ మొదటి రోజు – వెన్నీర్కాప్పు (వేడి నీళ్లతో రక్షణ) ప్రారంభం
- ఊంజల్ సేవ – 10 రోజులు – ఆశ్వీయుజ ఉత్తరాషాఢనక్షత్రం సందర్భంగా శాత్తుముర. మణవాళ మాముని ఉత్సవం – 12 రోజులు – తిరు మూలానక్షత్రం రోజున, ఆళ్వార్ పల్లకిలో మామునులు వేంచేసి ఆదినాథ పెరుమాళ్ – ఆళ్వార్ సన్నిధులకు ఊరేగింపుగా వెళ్ళి మంగళాశాసనం చేస్తారు.
- పూర్వాషాడ నక్షత్రం – విశ్వష్సేనుల అవతార దినోత్సవం.
- శ్రవణానక్షత్రం – పొయిఘై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం, పిళ్ళై లోకాచార్యుల – 11 రోజుల తిరునక్షత్ర ఉత్సవం – ఆదినాథ పెరుమాళ్ – ఆళ్వార్ సన్నిధులకు ఊరేగింపుగా వెళ్ళి మంగళాశాసనం చేస్తారు.
- ధనిష్టానక్షత్రం – పూదత్తాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
- శతభిషా నక్షత్రం – పేయాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
- దీపావళి – ఆళ్వారాచార్యులు, ఆదినాథ పెరుమాళ్ – ఆళ్వార్ సన్నిధులకు ఊరేగింపుగా వెళ్ళి మంగళాశాసనం చేస్తారు.
కార్తీకమాసం
- కృత్తికా నక్షత్రం – తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
- రోహిణి నక్షత్రం – తిరుప్పాణాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
- శ్రీపాంచరాత్ర కృత్తికాదీపోత్సవం – శొక్కప్పానై – అనగా పెరుమళ్ శేషంగా సువాసన తైలమును ఆళ్వారాచార్యుల కంఠమునకు పూసెదెరు. ఇక మరుసటి రోజు నుండి అనధ్యయన కాలం ప్రారంభమవుతుంది.
- శుక్లపక్ష ఏకాదశి – కైశిక ఏకాదశి – ఆదినాథ పెరుమాళ్ – ఆళ్వార్ సన్నిధులకు ఊరేగింపుగా వెళ్ళి మంగళాశాసనం చేస్తారు.
- కైశిక ద్వాదశి – కైశిక పురాణ పఠనం, అణ్ణావియర్ వంశస్థులకు బ్రహ్మరథం (మధురకవి ఆళ్వార్ల వంశస్థులను పల్లకిపై తీసుకెళ్ళడం), పెరుమాళ్ కు గరుడసేవ, ఆళ్వార్ కు హంసవాహనం.
మార్గశిరమాసం
- మార్గశిర మొదటి రోజు – తిరుప్పల్లియెళుచ్చి ప్రారంభం, ధనుర్మాస క్రమం.
- అమావాస్య తర్వాత మొదటి రోజున ఆరంభించి 21 రోజుల అధ్యయన ఉత్సవం ప్రారంభమవుతుంది. – పగల్ పత్తు (పగటి పూట 10 రోజుల ఉత్సవం) పగల్ పత్తు సమయంలో ప్రతిరోజు, ఆళ్వార్ కు రెండు దివ్య అలంకారములు . దశమి రోజున – ఆళ్వార్ శయనం, పెరుమాళ్ కు నాచ్చియార్ అలంకారము.
- శుక్లపక్ష ఏకాదశి – వైకుంఠ ఏకాదశి. పొలిందు నిన్ఱ పిరాన్ – శయనం. తిరువాయ్ మొళి పారాయణ ఏర్పాట్ల గురించి పెరుమాళ్ళు వింటారు.
- రాప్పత్తు (రాత్రి పది రోజుల ఉత్సవం) – ప్రతి రోజు తిరుముడి సేవ (పెరుమాళ్ కృపతో తమ తిరువడిని ఆళ్వార్ కు ప్రసాదిస్తారు). ఆరుద్ర రోజున, ఆళ్వార్-ఎంబెరుమానార్లకు శేర్తి (కలిపి) తిరుమంజనం. 8వ రోజు – వేడుపఱి (తిరుమంగై ఆళ్వార్ గుర్రంపైన వేంచేసి పెరుమాళ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు). 10వ రోజు – నమ్మాళ్వార్ల మోక్షం. 11వ రోజు – వీడు విడై తిరుమంజనం (మోక్షం నుండి తిరిగి వచ్చిన తరువాత స్నానం)
- తరువాత వచ్చే విశాఖానక్షత్రము నాటికి అనధ్యయన కాలం ముగిస్తుంది.
- జ్యేష్టా నక్షత్రం – తొండరడిప్పొడి ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
పుష్యమాసం
- సంక్రాంతి – వంగక్కడల్ (తిరుప్పావై చివరి పాశురం);
- తిరుప్పళ్ళియెళుచ్చి శాత్తుముర
- కనుము – తాయార్లకు తీర్థవారి
- మఖానక్షత్రం – తిరుమళిశై ఆళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
- హస్తానక్షత్రం – కురత్తాళ్వాన్ తిరునక్షత్ర ఉత్సవం. ఆళ్వాన్ – ఆదినాథ పెరుమాళ్ – ఆళ్వార్ సన్నిధులకు ఊరేగింపుగా వెళ్ళి మంగళాశాసనం చేస్తారు.
మాఘమాసం
- మాఘ ఉత్సవం మొదటి రోజు – వెన్నీర్కాప్పు (వేడి నీటితో రక్షణ) ముగింపు.
- తెప్పోత్సవం – ఆళ్వార్ దివ్య స్వరూప ప్రతిష్ఠోత్సవం – 13 రోజులు. 7వ రోజు – ఆళ్వార్ ఎంబెరుమానార్లకు శేర్తితిరుమంజనం (భవిష్యదాచార్య సన్నిధిలో), 9వ రోజు – తిరుత్తేరు ఉత్సవం. 10వ రోజు – పెరుమాళ్ళకు తెప్పోత్సవం. 11వ రోజు – ఆళ్వార్, ఆచార్యులకు తెప్పోత్సవం. 12వ రోజు – విశాఖ – ఆళ్వార్ తీర్థవారి తన దివ్యరూపంలో. 13వ రోజు – ఆళ్వార్ తొలైవిల్లిమంగళ దివ్యదేశానికి ఊరేగింపుగా వెళతారు. అక్కడ శాత్తుముర.
- పునర్వసు – కులశేఖరాళ్వార్ తిరునక్షత్ర ఉత్సవం
- మృగశిర – తిరుక్కచ్చి నంబి తిరునక్షత్ర ఉత్సవం. నంబి (భవిష్యదాచార్య సన్నిధి నుండి) మంగళాశాసనం కోసం ఆదినాథ- ఆళ్వార్ సన్నిధులకు ఊరేగింపుగా వెళతారు.
ఫాల్గుణమాసం
- పెరుమాళ్ళకు ఫంగుణి బ్రహ్మోత్సవాలు – 10 రోజులు. 9వ రోజు – రథోత్సవం. 10వ రోజు – ఫాల్గుణ మాస ఉత్తర ఫల్గుణి నక్షత్రమున- మిక్క ఆదిప్పిరాన్ కు తీర్థవారి.
- ఉత్తరఫల్గుణి నక్షత్రమున—ఆదినాయకి తాయార్ – ఉడైయవర్ల సన్నిధికి ఊరేగింపుగా వెళతారు.
- ఉగాది – ఆళ్వారాచార్యులు – ఆదినాథ పెరుమాళ్ – ఆళ్వార్ సన్నిధులకు ఊరేగింపుగా వెళ్లి మంగళాశాసనం చేస్తారు.
- పంచాంగశ్రవణం జరుగుతుంది.
మరికొన్ని ముఖ్య విషయాలు
- సాధారణంగా ఇక్కడ ఉత్సవాల 5వ రోజున, పెరుమాళ్ళు గరుడ వాహనంపైన, ఆళ్వారు హంస వాహనంపైన ఊరేగింపుగా వెళ్తారు.
- ఈ నాలుగు ఉత్సవాలలో పెరుమాళ్ సన్నిధిన గరుడ ధ్వజారోహణం, ఆళ్వార్ సన్నిధిన హంస ధ్వజారోహణం జరుగుతుంది.
- ఈ నాలుగు ఉత్సవాలలో పెరుమాళ్-ఆళ్వార్లకు రథోత్సవం ఉంటుంది.
- ఆదినాథపెరుమాళ్ – ఆళ్వార్ల సన్నిధులలో తీర్థవారి జరిగినప్పుడల్లా, భవిష్యదాచార్య సన్నిధిలో తిరుమణ్ కాప్పు (నుదుటిపై దివ్య తిలకధారణ) ఉంటుంది.
వ్యాసానికి ఆధారం – కారిమాఱన్ కలైక్కాప్పగం – నాట్కుఱిప్పు
మూలం: https://granthams.koyil.org/2022/12/07/azhwarthirunagari-vaibhavam-6-english/
archived in https://srivaishnavagranthams.wordpress.com/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org