శ్రీః శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః

ఈ-బుక్ : https://1drv.ms/b/s!AiNzc-LF3uwyhinurDQFlPch4dWN
శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రమాణం, ప్రమేయం మరియు ప్రమాత అనే మూడు అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీటిలో, ‘ప్రమాణం’ మనకు యథార్థ జ్ఞానాన్ని అందిస్తుంది. ఆ జ్ఞానం ద్వారా తెలుసుకోబడే విషయమే ‘ప్రమేయం’. ప్రమాణాన్ని ఉపయోగించి ప్రమేయాన్ని మనకు తెలియజేసేవారే ‘ప్రమాత’.
ప్రమాణాలు సాధారణంగా ప్రత్యక్షం (ఇంద్రియాల ద్వారా గ్రహించేవి), అనుమానం (ఇప్పటికే తెలిసిన విషయాల ఆధారంగా విశ్లేషించి తెలుసుకోవడం) మరియు శబ్దం (శాస్త్రం లేదా వేద ప్రమాణం) అని మూడు రకాలుగా విభజించబడినప్పటికీ, వేదానుయాయులు ‘శబ్దం’ (వేద ప్రమాణం)నే ప్రధాన ప్రమాణంగా భావిస్తారు. భగవంతునికి చేసే కైంకర్యమే (సేవయే) ‘ప్రమేయం’ అని శాస్త్రం వివరిస్తుంది. మనకు ఆళ్వారులు మరియు ఆచార్యులే విశ్వసనీయమైన ప్రమాతలు.
శ్రీ మహాలక్ష్మీ పతి అయిన ఎంపెరుమాన్, జీవాత్మల ఉద్ధరణ కోసం, ప్రతి సృష్టి కాలంలోనూ ప్రమాణాలలోకెల్లా శ్రేష్ఠమైన వేదాన్ని బ్రహ్మదేవునికి ఉపదేశిస్తాడు. బ్రహ్మదేవుడు అనేకమంది ఋషుల సహాయంతో వేదాన్ని, అలాగే వేదార్థాన్ని వివరించే స్మృతులు, ఇతిహాసాలు మరియు పురాణాలను విస్తరింపజేస్తాడు. అయినప్పటికీ, వేదాలు అత్యంత విస్తృతమైనవి కావడం మరియు వాటిలో పరమ సత్యం (సారం) సముద్రంలోని అమూల్యమైన రత్నాల వలె లోతుగా దాగి ఉండటం వల్ల, సామాన్యులకు వాటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది.

దీనిని పరిగణనలోకి తీసుకుని, ఎంపెరుమాన్ సంసార బంధనంలో చిక్కుకున్న కొందరు జీవాత్మలను ఎంపిక చేసుకుని, వారికి నిర్మలమైన జ్ఞానాన్ని మరియు భక్తిని ప్రసాదించి, వారిని ‘ఆళ్వారులు’గా తీర్చిదిద్దాడు; అలాగే వేద సారాన్ని ఇమిడ్చిన ‘అరుళిచ్చెయల్’ (దివ్య ప్రబంధం)ను సరళమైన తమిళ భాషలో మనకు అనుగ్రహించేలా చేశాడు.
ఆళ్వారుల కాలం తర్వాత, నాథమునుల నుండి మొదలుకొని పూర్వాచార్యులు దివ్య ప్రబంధంలోని దివ్యార్థాలను మౌఖికంగా బోధించేవారు. ఎంపెరుమానార్ తమ అపార కరుణతో దివ్య ప్రబంధం వంటి వాటికి వ్యాఖ్యానాలు వ్రాసే సంప్రదాయాన్ని ప్రారంభించారు. ఎంపెరుమానార్ కాలం తర్వాత, నంపిళ్ళై కాలంలో ఈ వ్యాఖ్యాన సాహిత్యం గణనీయంగా విస్తరించింది.

వేదం, వేదాంతం మరియు దివ్య ప్రబంధంలో, రహస్య త్రయానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. రహస్య త్రయం అంటే తిరుమంత్రం, ద్వయం, చరమ శ్లోకం; పంచ సంస్కారం పొందినప్పుడు ఆచార్యుల నుండి నేర్చుకుంటారు. ఆచార్యుల నుండి సమాశ్రయణం పొందిన తరువాత, రహస్య త్రయమునుకు అర్థములను నేర్చుకొని దాని ప్రకారం జీవించడం శిష్యుని విధి. శాస్త్రము “జ్ఞాన మోక్షం” అని ప్రకటించినందున, మోక్షం పొందాలనుకునే ముముక్షులకు రహస్య త్రయం గురించిన జ్ఞానం చాలా అవసరం.
పెరియవాచ్చాన్ పిళ్లై, పిళ్ళైలోకాచార్యులు, అళగీయ మానవాళ పెరుమాళ్ నాయనార్, వేదాంతాచార్యలు వంటి గొప్ప ఆచార్యులు మనకు రహస్య గ్రంథములను అనుగ్రహించారు.ఆ గ్రంథాలలో, అత్యంత దయామయులైన పిళ్ళైలోకాచార్యులు మరియు నాయనార్లు అనుగ్రహించిన అత్యంత ముఖ్యమైన రహస్య గ్రంథాలను, ‘విశదవాక్ శిఖామణి’గా ప్రసిద్ధి చెందిన మణవాళ మామునులు ఎంతో దయతో విస్తృతంగా వివరించారు.మన పెద్దలు వీటిని నిరంతరం ‘కాలక్షేప గ్రంథాలు’గా వింటూ, ఆచరిస్తూ ఉండేవారు.

పిళ్ళైలోకాచార్యులు – మణవాళ మామునులు
ముముక్షుప్పడి, తత్త్వత్రయం, శ్రీవచనభూషణం మరియు ఆచార్య హృదయం అనే ఈ రహస్య గ్రంథాల వివరాలను, మామునిగళ్ ఆయా గ్రంథాలకు అందించిన వ్యాఖ్యానాల పరిచయాల ద్వారా మనం తెలుసుకోవచ్చు.
అంతేకాకుండా, పిళ్ళైలోకాచార్యులు అనుగ్రహించిన ముఖ్యప్రబంధమైన ‘అర్థ పంచకం’ గురించి కూడా సరళమైన భాషలో తెలుసుకుని ఆనందించవచ్చు.
- పిళ్ళైలోకాచార్యులు – ముముక్షుప్పడి అనుభవం – https://granthams.koyil.org/2026/07/15/aippasi-anubhavam-pillai-lokacharyar-mumukshuppadi-telugu/
- పిళ్ళైలోకాచార్యులు – తత్త్వత్రయం అనుభవం –
- పిళ్ళైలోకాచార్యులు – శ్రీవచన భూషణం అనుభవం –
- తనియన్లు –
- పరిచయం భాగం 1 –
- పరిచయం భాగం 2 –
- పరిచయం భాగం 3 –
- నాయనార్లు – ఆచార్య హృదయం –
- పిళ్ళైలోకాచార్యులు – అర్థ పంచకం –
వీటన్నింటినీ ఆచార్యులు లేదా పెద్దలు నుండి సముచితంగా వినాలి. ఈ ప్రయత్నం కేవలం వీటి గురించి ఒక పరిచయాన్ని అందించడానికే.
ఆంగ్లంలో: https://granthams.koyil.org/introduction-to-rahasya-granthams-english/
అడియేన్ దాసరి కేశవ కృష్ణ రామానుజ దాసన్
ప్రూఫ్ రీడింగ్ చేసినవారు –
https://granthams.koyil.org లో ఆర్కైవ్ ఉంచబడినది.
ప్రమేయం (లక్ష్యం) – https://koyil.org
ప్రమాణం (గ్రంధాలు) – https://granthams.koyil.org
ప్రమాతా(ఉపదేశకులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్యా/పిల్లల పోర్టల్ – https://pillai.koyil.org