శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
<< మణవాళ మామునుల చరిత్ర, వైభవము
ప్రదక్షిణ మార్గంగా వెలుతూ ఆదినాథ- ఆళ్వార్ల ఆలయ ప్రాంగణం ఉన్న సన్నిధులు,ఉపసన్నిధులు, మఠాలు, తిరుమాళిగల గురించి మనం ఇక్కడ తెలుసుకొందాం.
ఆదినాథ – ఆళ్వార్ల దేవాలయం లోపలి సన్నిధిలు
ప్రదక్షిణ మార్గంగా వెలుతూ ఆదినాథ- ఆళ్వార్ల ఆలయ ప్రాంగణం ఉన్న సన్నిధులు,ఉపసన్నిధులు, మఠాలు, తిరుమాళిగల గురించి మనం ఇక్కడ తెలుసుకొందాం.
ఆదినాథ-ఆళ్వార్ల దేవాలయం లోపలి సన్నిధులు:
- ప్రధాన పెరుమాళ్ళ సన్నిధి గర్భగుడిలో – శ్రీదేవి భూదేవి సమేత ఆదినాథ పెరుమాళ్ళు. ముఖమండపమున ఆదినాయకి, శ్రీదేవి, పొలిందు నిన్ఱపిరాన్, భూదేవి, నీళాదేవి, కురుగూర్ నాయకి(ఉత్సవర్లు)- నవబేరాలు (శయన, స్నానాది బేరములు).
- ద్వారపాలకులు, అనంత – గరుడ విశ్వష్సేన సన్నిధులు.
- పొన్ నిన్ఱపిరాన్ సన్నిధి.
- శ్రీరాములవారి, శ్రీకృష్ణుడి సన్నిధులు
- సన్నిధి గరుడన్.
- రుక్మిణిసత్యభామ సమేత శ్రీవేణుగోపాల సన్నిధి.
- రెండవప్రాకారములో – జ్ఞానప్పిరాన్ సన్నిధి – భూమి పిరాట్టి సమేత వరహ పెరుమాళ్ (వీరికి ప్రత్యేకముగా గరుడసన్నిధి కలదు)
- రెండవప్రాకారములో అనగా పెరుమాళ్ సన్నిధికి సరిగ్గా వెనుకన ఆదినాయకి (మూలవర్లు).
- పరమపదనాథుడి సన్నిధి
- చక్రత్తాళ్వార్ల సన్నిధి
- దశావతార సన్నిధి
- కురుగూర్ నాయికి సన్నిధి(మూలవర్లు).
- తిరుప్పుళి ఆళ్వార్ సన్నిధి (ఆళ్వార్ జీవితకాలమున వేంచేసి ఉన్న దివ్యచింతచెట్టు)
- శ్రీమన్నాథమునుల సన్నిధి
- పన్నెండుగురు ఆళ్వార్ల సన్నిధి
- నరసింహపెరుమాళ్ సన్నిధి
- తిరువేంగడముడయాన్ సన్నిధి
- నమ్మాళ్వార్ల సన్నిధి (ప్రత్యేక ధ్వజస్తంభం కలదు)
- తిరువడి (ఆంజనేయుని) సన్నిధి
- కృష్ణ సన్నిధి (యానైచ్చాలై)
- పక్షిరాజు (గరుడన్) సన్నిధి
ఇతర సన్నిధులు (ఆలయం వెలుపల)
- తెఱ్కు తిరువేంగడముడయాన్ సన్నిధి (దక్షిణ మాడవీధి)
- శ్రీరంగనాథుని సన్నిధి (దక్షిణ మాడవీధి)
- పిళ్ళైలోకాచార్యుల సన్నిధి (ఉత్తర మాడవీధి)
- అళగర్ – శ్రీరాములవారి సన్నిధి (ఉత్తర మాడవీధి)
- వేదాంతదేశికుల సన్నిధి (ఉత్తర మాడవీధి)
- ఆండాళ్ సన్నిధి (ఉత్తర మాడవీధి)
- మణవాళ మామునుల సన్నిధి (ఉత్తర మాడవీధి)
- కూరత్తాళ్వాన్-భట్టర్ సన్నిధి (రామానుజ చతుర్వేదిమంగళం)
- తిరుక్కచ్చినంబి సన్నిధి (రామానుజ చతుర్వేదిమంగళం)
- ఉయ్యక్కొండార్-తిరువాయ్ మొళిపిళ్ళై సన్నిధి (రామానుజ చతుర్వేదిమంగళం)
- పెరియనంబి సన్నిధి (రామానుజ చతుర్వేది మంగళం)
- ఎంబెరుమానార్(భవిష్యదాచార్యులు)సన్నిధి(రామానుజ చతుర్వేదిమంగళం)
- కృష్ణుడి సన్నిధి (రామానుజ చతుర్వేదిమంగళం)
- శింగపెరుమాళ్ సన్నిధి (తిరుచ్చంగణిత్తుఱై – తీర్థవారి మండపం – వడక్కు రథతిరువీధి)
- నంపిళ్ళై సన్నిధి (వడక్కు రథవీధి)
- వడక్కు తిరువేంగడముడయాన్ సన్నిధి (వడక్కు రథవీధి)
- శ్రీరాములవారి సన్నిధి (పరాంకుశ – నాయకర్ మండపం)
- అప్పన్ కోయిల్ (తిరువేంగడముడయాన్ సన్నిధి – ఆళ్వార్ అవతార స్థలం)
శ్రీ మఠాలు (జీయర్లు ఉండే చోటు):
- శ్రీ ఎంబెరుమానార్ జీయర్ మఠం- ప్రస్తుతం వేంచేసి ఉన్నారు (రామానుజ చతుర్వేది మంగళం)
- శ్రీ వానమామలై మఠం (వడక్కు రథవీధి)
- శ్రీ తిరుక్కుఱుంగుడి మఠం (వడక్కు రథవీధి)
- శ్రీ అహోబిల మఠం (రామానుజ చతుర్వేది మంగళం)
ఆశ్రమాలు / శ్రీ వైష్ణవ స్థాపనాలు (శ్రీ వైష్ణవులచే స్థాపించబడినవి):
- శ్రీరంగం శ్రీమద్ ఆండవన్ ఆశ్రమం (వడక్కు రథవీధి)
- ఉత్తరాది మఠం (తెఱ్కు రథవీధి)
తిరుమాళిగలు / ఆచార్య పురుషుల నివాసాలు:
- అరైయర్ తిరుమాళిగ (శ్రీమన్నాథమునుల వంశం- కిళక్కు మాడవీధి)
- అణ్ణావియర్ తిరుమాళిగ (మధురకవి ఆళ్వార్ వంశం- తెఱ్కు మాడవీధి)
- తిరువాయ్ మొళిపిళ్ళై తిరుమాళిగ (రామానుజ చతుర్వేది మంగళం)
- ఆత్తాన్ తిరుమాళిగ (ముడుంబైనంబి వంశం- వడక్కు రథవీధి)
- కఱ్కుళం తిరుమాళిగ (కొమాండూర్ ఇళయవిల్లి ఆచ్చాన్ వంశం-వడక్కు రథవీధి)
అనేకమంది ఆచార్య పురుషులు (శ్రీరామానుజులచే నియమించబడిన సంప్రదాయ ప్రవర్తకులు) ఇక్కడే ఉండి కైంకర్యాలు చేస్తున్నారు. అంతేకాకుండా అనేక మంది తీర్థకారులు (సంప్రదాయపరంగా భగవత్ ప్రసాదాలను పప్రధమంగా స్వీకరించేవారు), స్థలత్తార్లు (తరతరాలుగా ఇక్కడ ఉంటున్నవారు, తీర్థకారుల తరువాత ఆలయ మర్యాదలను స్వీకరించేవారు) కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆలయ ఉత్సవాల సమయంలో అనేక జీయర్లు ఇక్కడకు వేంచేసి మంగళాశాసనలు చేస్తుంటారు.
తరువాతి ఉపన్యాసములో మనం ఉత్సవాల గురించి చూద్దాం.
మూలం: https://granthams.koyil.org/2022/12/06/azhwarthirunagari-vaibhavam-5-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org