శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః
తత్త్వములు ప్రథానంగా మూడుగా విభజించబడ్డాయి అవి చిత్తు , అచిత్తు మరియు ఈశ్వరుడు.
నిత్య విభూతి (పరమపదం) మరియు లీలా విభూతి (సంసారికలోకం) లో అసంఖ్యాకమైన జీవాత్మల సమూహములే చిత్తు. సహజముగానే జీవాత్మలు ఙ్ఞానముతో నిర్మితమై ఙ్ఞాన పరిపూర్ణతను కలిగి ఉంటాయి.
ఈ సహజ ఙ్ఞానం నిత్యానందమైనది. ఎప్పుడైతే జీవాత్మ సహజ ఙ్ఞానమును పొందునో అప్పుడు అది నిత్యానందమును పొందును. ఈ జీవాత్మ మూడుగా విభజించబడింది – నిత్యసూరులు (పరమపదమున అనాదిగా ఉండేవారు), ముక్తాత్మ (ఒకానొకప్పుడు సంసార బంధమును ఉండి ముక్తిని పొందినవారు) మరియు బద్ధాత్మలు (ఈ సంసారిక లోకమున సంసార బంధం కలిగినవారు). మరలా ఈ బద్ధాత్మలు రెండుగా విభజించ బడ్డారు – మొదటి వారు భుభుక్షువులు (సంసారానుభవమును కోరుకొనేవారు) రెండవవారు ముముక్షువులు (ఈ సంసార బాధల నుండి ముక్తిని కోరుకొనేవారు). తిరిగి ఈ ముముక్షువులు రెండు రకములు – కైవల్యార్థులు (స్వీయ ఆత్మ సాక్షాత్కారం / స్వీయానందమును కోరుకొనేవారు) మరియు భగవత్కైంకర్యార్థులు (పరమపదమున భగవానునికి కైంకర్యము చేయాలని కోరుకొనేవారు ).
లోతైన విశ్లేషణకై https://granthams.koyil.org/2013/03/06/thathva-thrayam-chith-who-am-i/ దర్శించండి.
అచిత్తు అనగా ఈ స్థూల ఇంద్రియాలకు గోచరించు వైవిధ్యములు కలిగిన జడవస్తువులు. ప్రళయ కాలమున అవ్యక్తముగా (అదృశ్యముగా) ఉండి సృష్ఠి సమయమున వ్యక్తమవుతాయి (దృశ్యముగా). అచిత్తు లీలా మరియు నిత్య విభూతులలో ఉండును. సాధారణముగా ఈ భౌతిక జగత్తులో అచిత్తు స్వరూప ఙ్ఞానమును కప్పి వేస్తుంది అదే అలౌకిక జగత్తులో స్వరూప ఙ్ఞానమును ఉత్తేజపరుస్తుంది. మరలా ఈ అచిత్తు మూడు విధములు ఒకటి శుద్ధసత్వం (పరమ సాత్వికమైనది – కేవలం పరమపదముననే అగుపించును) రెండవది మిశ్రసత్వం (తమోరజోగుణమేళనం – ఈ సంసారమున అగుపించును) మరియు సత్త్వశూన్యం (గుణవిహీనమైనది – అదే కాలం (సమయం)).
లోతైన విశ్లేషణకై https://granthams.koyil.org/2013/03/thathva-thrayam-achith-what-is-matter/ దర్శించండి.
ఈశ్వరుడు: శ్రీమహాలక్ష్మితో కూడి సర్వ శక్తిమంతుడు, పరమ పురుషుడైన శ్రీమన్నారాయణుడు. భగవానుడు అనగా ఆరు కళ్యాణ గుణములు పరిపూర్ణముగా కలిగిన వాడు. అవి ఙ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి మరియు తేజస్సు. ఈ ఆరు కళ్యాణ గుణములు తిరిగి అనేక కళ్యాణ గుణములుగా విస్తరిస్తాయి. భగవానుడు అన్ని కళ్యాణ గుణములకు ఆశ్రయణీయుడు మరియు హేయ గుణములకు వ్యతిరిక్తుడు. చిత్తు మరియు అచిత్తులు భగవానుని యందు లీనమై ఉంటాయి మరియు వాటికి అతనే ఆధారం – కావున అన్నింటికి ఆధారం మరియు భరించేవాడు అతనే. అన్నింటికి సర్వాధికారి. చిత్తు అచిత్తులన్ని అతని దివ్య ఆనందమునకై ఉద్భవిస్తున్నాయి.
లోతైన విశ్లేషణకై https://granthams.koyil.org/2013/03/thathva-thrayam-iswara-who-is-god/ . దర్శించండి.
తత్త్వముల మధ్య సారూప్యతలు:
- ఈశ్వరుడు మరియు చిత్తు (జీవాత్మ) ఇద్దరు ఙ్ఞానం కలిగిన వారే.
- చిదచిత్తులు ఈశ్వరుని సొత్తు.
- ఈశ్వరుడు మరియు అచిత్తులు తమ లక్షణాలను బట్టి చిత్తును పరివర్తనం చెందించే సామర్థ్యం కలవారు. ఉదాహరణకు జీవాత్మ అతిగా భౌతిక కార్య కలాపాల యందే నిమగ్నమైనప్పుడు అతను పదార్థముగా రూపాంతరం చెందుతాడు. ఒకవేళ జీవాత్మ భగవద్విషయము లందు నిమగ్నుడైతే అతను ఈ సంసారము నుండి విముక్తిని పొంది భగవానుని వలె ఆనందరూపాన్ని పొందుతాడు.
తత్త్వముల మధ్య భేధములు:
- అన్నింటికన్న ఈశ్వరునికి భేధము / ఏకైక లక్షణం సర్వేశ్వరత్వం. అనగా సర్వఙ్ఞుడు, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు.
- ఈశ్వరుని యందు దాసత్వం అనే విశిష్ఠ లక్షణం చిత్తు కలిగి ఉండును.
- అచిత్తు ఙ్ఞాన శూన్యమైనది. ఇతరులకై మాత్రమే దీని ఉనికి.
పిళ్ళై లోకాచార్యుల తత్త్వత్రయం అను రహస్య గ్రంథమును ఇక్కడ పరిశీలించవచ్చు. https://granthams.koyil.org/2013/10/aippasi-anubhavam-pillai-lokacharyar-tattva-trayam/ .
ఆళ్వార్ తిరువడిగళే శరణం ఎంపెరుమానార్ తిరువడిగళే శరణం పిళ్ళైలోకాచార్యర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాస
మూలము : https://granthams.koyil.org/2015/12/thathva-thrayam-in-short/
పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org
0 thoughts on “తత్త్వత్రయం – త్రివిధతత్త్వములు – క్లుప్త సారాంశము”