శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 1
స్వామి నమ్మళ్వార్లే వేదాంతానికి, మన సంప్రదాయానికి ఉన్నతమైన ఆచార్యులని , స్వామి రామానుజులుకు ద్రావిడ వేదం మీద ఉన్న ప్రీతిని ఇంతకు ముందు చూసాము. ఇక మన పూర్వాచార్యులైన ఆళవందార్లు, కూరత్తళ్వాన్లు, భట్టరు,వేదాంత దేశికులు ,వారు అనుగ్రహించిన గ్రంధాలు, ఉపబ్రహ్మణముల సహాయంతో మన ఆళ్వార్ల ఔన్నత్యాన్ని, దివ్యప్రబంధ ఔన్నత్యాన్ని అనుభావిద్దాము.
వేదములో ద్రమిడొపనిషత్-నమ్మాళ్వార్లు అనే సూర్యుడు
స్వామి మధురకవి ఆల్వార్లు ఉత్తరాది యాత్ర చెస్తూ వుండగా దక్షిణం నుండి అధ్బుతమైన జ్యోతి ఒకటి కనపడింది. ఆ జ్యోతి గురించి తెలుసుకోవాలన్న ఆతృతతో వారు ఆ వెలుగు వెంట దక్షిణ దిక్కుగా నడవగా ఆఖరికి అది తిరుక్కురుగూరులోని నమ్మాళ్వార్ల నుండి వస్తుండటం చూసి ఆశ్చర్యపోయారు.
ఈ సందర్భంగా స్వామి అళగియ మణవాళ పెరుమాళ్ నయనార్లు అనుగ్రహించిన ఆచార్యహృదయంలోని చూర్ణిక చూడతగినది.
” ఆత్తియ రామ దివాకర అచ్త్యుతభానుక్కళుక్కు పోగాద వుళ్ళిరుళ్ నీంగ సోషియాత పిఱవి క్కడల్ వఱ్ఱి విహసియాద పోదిఱ్ కమలమలర్దదు వకుళభూషణ భాస్కరత్తిలే. “
తూర్పున ఉదయించే సూర్యుడి వెలుగు వలన తొలగని మన అజ్ఞానం అనే చీకటి తొలగిపోయింది. రాముడి ప్రకాశవంతమైన వేడివలన ఎండిపోని ఈ దరిలేని సంసార సాగరం ఇప్పుడు ఎండిపోయింది. కృష్ణుడి ప్రకాశము వలన వికసించని జీవాత్మల హృదయాలు ఇప్పుడు పూర్తిగా వికసించినవి. వీటన్నిటికి కారణం మన లోకంలో అవతరించిన భాస్కరుడు, వకుళ పుష్పాలను అలంకరించుకున్న నమ్మాళ్వార్లు అంటే అది అతిశయోక్తి కాదు.
శ్రీమన్నాధమునులు నమ్మళ్వార్ల గురించి ఈ క్రింది శ్లోకాన్ని చెప్పారు.
” యద్గోసహహస్రమపహంతి తమాంసి పుంస్వాం, నారాయణో వసతి యత్ర సశంకచక్ర !
యన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాః తస్మై నమో వకుళభూషణ భాస్కరాయ!! “
ఏ వేయి కిరణాలు (వెయ్యి తిరువాయిమొళి పాశురాలు) జీవాత్మల అజ్ఞానాన్ని పోగొడుతున్నవో, ఎవరి తిరుమేనిలో నారాయణుడు తన శంఖచక్రాలతో ప్రవర్దిల్లుతున్నారో, ఎవరి నివాసస్థానమును శాస్త్రాలు పొగుడుతున్నాయో, వేదాంతులచే నమస్కరింప బడుతున్నదో , ఆ వకుళ మాలాంకృత సూర్యుడిని దాసుడు నమస్కరిస్తున్నాడు.
నాధమునుల ఈ శ్లోకానికి మూలమైన శ్లోకాన్ని చూద్దాము.
‘ ద్యేయసదా సవితృమండల మధ్యవర్తీ
నారాయణ సరసిజాసన, సన్నివిష్టః !
కేయూరవాన్ మఖరకుండలవాన్ ,కిరీటీ
హరి హిర్ణ్యనయ వపుః ధృతశంఖచక్రః ” !!
ఈ శ్లోకంలో అందంగా అలంకరింపబడిన నారాయణుడు శంఖచక్రములను ధరించి సవితృ మండలంలో వేంచేసివున్నాడు. ఆయన ఎల్ల వేళల ధ్యానింప తగినవాడు. నాధమునులు ఇక్కడ నమ్మాళ్వార్లను ఆనందంగా వేంచేసివున్న సవితృ మండల సూర్యునిగా చెపుతున్నారు. వారి వేయి పాశురాలను వేయి కిరణాలుగా వర్ణిస్తున్నారు. ఆళ్వార్లు తమ కాంతితో మధురకవులను ఉత్తరం నుండి దక్షిణానికి ఆకర్షించారు. సవితృ మండలము నుండి ప్రకాశించే కిరణాలను సావిత్రం అని అంటారు. అందువలన తిరువాయిమొళికి ఇక్కడ సావిత్రం అన్న పేరు ఏర్పడింది. ఇంద్రుడు భరద్వాజుడిని సావిత్రిని నేర్చుకోమని ఆదేశించారు.
భరద్వాజుడి కోరిక ఇంద్రుడి తీర్చటం …
యజుర్ బ్రాహ్మణంలో, గాటకం మొదటి ప్రశ్నలో , ఇంద్ర-భరద్వాజ సంవాదం ఉంది.
భరద్వాజుడు త్రయీ అని పొగడబడే వేదాధ్యయనం చేయాలనీ సంకల్పించాడు. ఇంద్రుడి దగ్గర వందల సంవత్సరాల ప్రమాణం ఉన్న మూడు పురుషకాలాలు వరంగా పుచ్చుకొని ప్రయత్నించి ఆఖరికి తన శక్తినంతా కోల్పోయాడు. అప్పుడు ఇంద్రుడు భరద్వాజుడి దగ్గరకు వెళ్ళి మరొక పురుషకాలం ఇస్తే ఏమి చేస్తారని ప్రశ్నించాడు. దానికి ఆయన మళ్ళి వేదాధ్యయనం చేస్తానని చెప్పాడు. ఇంద్రుడు భరద్వాజుడి వేదాధ్యయనం చేయాలన్న కోరికను అర్థం చేసుకొని తన యోగవిద్య వలన మూడు వేదాలను మూడు పర్వతాలుగా చేసి భరద్వాజుడి ముందు నిలిపాడు . ఒకొక్క పర్వతం నుండి ఒకొక్క గుప్పెడు మట్టిని తీసుకు రామన్నాడు. అలా తెచ్చిన మట్టిని చూపించి “ వేదాలు అనంతాలు, ఇప్పటి దాకా మీరు నేర్చినది ఈ గుప్పెడు” అని చెప్పాడు. అది విన్న భరద్వాజుడు వేదాలను ఆసాంతం అధ్యయనం చేయటం సాధ్యం కాదు కదా అని చింతించారు . ఇంద్రుడు భ్రరద్వాజుడికి సకల వేద సారమైన సావిత్రి విద్యను ఉపదేశించాడు. ‘ సావిత్రి ‘ అంటే తిరువాయిమొళి .
భట్ట భాస్కరుడు ,తన వ్యాఖ్యానంలో ఈ క్రింది విధంగా చెప్పారు.
“ఇదం సావిత్రం విద్ది, అయం హి సావిత్రః సర్వ విద్యా సర్వవేద విధ్యాధ్యయనపుణ్య ఫలావాత్పిహేతు: తస్మాత్తక్తిహేతు: తస్మాత్తక్తిం వ్రుతాశ్రమేణ? ఇదామేవ వెడితవ్యమిత్యుక్త్వా తస్మై భారద్వాజాయ సావిత్రమువాచ”.
‘సావిత్రి ఆధారంగా వేదాలలోని సకల అర్థాలను తెలుసుకోవచ్చు. సావిత్రి ఉండగా మనం ఎందుకు చితించాలి ? సావిత్రిని తెలుసుకుంటే చాలు’ అని ఆ సావిత్రిని ఇంద్రుడు భ్రరద్వాజుడికి ఉపదేశించాడు.
వేదాలు అనంతం. మన ప్రయత్నంతో అధ్యయనం చేయటం సాధ్యం కాదు. వేదాధ్యయనం చేయాలంటే సావిత్రిని తెలుసుకోవాలి. అనంత సాగరాన్ని చూసి అప్రతిభుడై నిలిచినప్పుడు ఆ అర్థాలను సులువుగా తెలుసుకునే మార్గం చూపించటం అవసరమే కదా! మన ఆచార్యులు సూర్యుడి వేయి కిరణాలను వకుళ భూషణ భాస్కరుని వేయి పాశురాలుగాలుగా పేర్కొన్నారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/01/31/dramidopanishat-prabhava-sarvasvam-2-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org