శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
(శ్రీపెరుమాళ్ కోయిల్(కంచి) మహామహిమోపాధ్యాయ, జగదాచార్య, సింహాసనాధిపతి శ్రీ.ఊ.వె. ఫ్రతివాది భయంకరం ఆణ్ణంగరాచార్యర్ స్వామివారి గ్రంధము అధారంగా ఈ రచన చేయబడింది.)
గ్రంధావతారిక :
లక్ష్మీకాంత-పదారవిందయుగళైకాంతాప్రమేయాద్భుత-
ప్రేమాణం శఠకోపసూరిమత తత్సూక్త్యబ్ధిమగ్నాశయం |
శ్రీమద్భాష్యకృతం యతీంద్రమత తద్భూయోవతారాయితం
శ్రీమద్-రమ్యవరోపయంత్రయమినం సంచింతయే సంతతం ||
భావము: భగవద్రామానుజులు అపారమైన ప్రేమతో లక్ష్మీకాంతుడి పదారవిందాలను ఆశ్రయించినవారు , శ్రీభాష్య గ్రంధ రచన చేసే కాలంలో నమ్మాళ్వార్ల తిరువాయిమొళి అనే అమృత సాగరంలో ఓలలాడినవారు . దాసుడు భగవద్రామానుజుల భక్తిలోను , వారి పునరవతారమైన మణవాళ మామునులలోను ప్రితిఫలిస్తుంటాడు .
శ్రీమధ్వరవరయమినః కృపయా పరయా ప్రభోదితానర్థాన్!
సంద్రక్షయన్ లిఖామి ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం!!
భావము: స్వామి వరవరమునులు అపారమైన కృపతో తిరువయిమోళికి అనుగ్రహించిన ఉన్నతమైన అర్థాలను తెలియజేయడమే దాసుడు ‘ ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం ‘ రచించడానికి ప్రధాన కారణం.
ప్రాధాన్యేన ప్రపంధే ద్విహయతిపతినా ద్రవిడామ్నాయవాచామ్
సాహాయ్యేనైవ భాష్యాధ్యనఘ కృతితతిర్నిమితేతి ప్రసిధ్ధా!
వార్తా యుక్త్యా ప్రమాణైరపి చ సువిశదం సంప్రదిష్టాప్యతే భోః
మాత్సర్యం దూరతో స్యన్ విభుదజన ఇదం వీక్ష్య మోమోత్తుం ధన్యః! !
భావము: భగవద్రామానుజులు శ్రీభాష్యాది గ్రంధ రచనలకు ద్రావిడ వేదమును ప్రమాణంగా తీసుకున్నారన్న విషయం లోకవిదితమే. ఆ విషయాన్ని సలక్షణంగా నిరూపించడానికే దాసుడు ఈ రచనకు పూనుకున్నాడు అని సవినయంగా మనవి చేస్తున్నాడు.
దివ్యప్రబందేషు న వేదతౌల్యం న చాపి వేదాదదికత్వమస్తి!
రామానుజార్యో పి న తత్ర రాగీత్యేవం లిఖంతః కుద్రసో నమంతు!!
భావము: ఎవరికైతే దివ్యప్రబందము మీద సదభిప్రాయం లేదో , సంసృత వేదంతో సమానంగా గౌరవించరో , ‘ శ్రీరామా నుజాచార్యులు ద్రావిడ వేదాన్ని ఆదరించలేదు ‘ అని భావిస్తున్నారో వారు ఈ గ్రంధాన్ని క్షుణ్ణంగా చదవాలి.
వేదాంతాచార్య పురుషులలో నాచార్యులుగా నమ్మాళ్వార్లు:
సుమారు నాలుగు వేల పాశురాలు గల దివ్య ప్రబంధము పన్నిద్దరాళ్వార్ల రచనల సమాహారం. ఆళ్వార్ల కాలం తరువాత కారణాంతరాల వలన అవి లుప్తమైపోయాయి. చాలా కాలం తరువాత శ్రీనాధమునులు వాటిని నమ్మాళ్వార్ల నుండే తిరిగి పొందటం వలన, వారిని నమ్మాళ్వార్ల తరువాతి ఆచార్యులుగా సంభావించే ఆచారం శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఉంది అని “గురుపరంపరా ప్రభావము” అనే గ్రంధంలో చెప్పబడింది. స్తోత్ర గ్రంధాలలో నమ్మాళ్వార్ల కంటే ముందు గాని తరువాత గాని నాధమునులను ప్రస్తుతించటం ఆనవాయితిగా కనపడుతుంది . స్వామి వేదాంత దేశికులు నమ్మళ్వార్లను కలియుగంలో సంప్రదాయ పరిశుద్ధి చేయటం కోసం అవతరించిన వేదాంతాచార్యులుగా సంభావించారు .
“వేదాంత సంప్రదాయత్తుక్కు ఇంద యుగారంబత్తిలే బ్రహ్మానంత్యాదిగళుక్కు పిన్బు నమ్మాళ్వార్ ప్రవర్తకరానార్ “
ఇంకా …….
” ప్రాప్యం జ్ఞానం బాహ్మణాత్ క్షత్రియాద్వా వైశ్యాశ్చూద్రాద్వా పి నిషాదభీషణం “
ఆద్యాత్మిక విద్య కులబేధము పాటించకుండా ఎవరి వద్ద నుండైనా నేర్వవచ్చు. బ్రాహ్మనుడై పుట్టినప్పటికీ సత్యాన్వేషణ చేయని వాడి వద్ద విద్యనభ్యసించనవసరము లేదు. అందువలన వేదాంత మార్గములో ప్రయాణించిన నమ్మాళ్వార్లు వేదాంతాచార్యులు కావటంలో అవధ్యమేమి లేదు. స్వామి మధురకవి ఆళ్వార్లు ఈ క్రింది పాశుర భాగములో సులభశైలిలో నమ్మాళ్వార్లు తమ పాశురాల ద్వారా వేదాంత రహస్యాలను పాడారని కీర్తించారు.
” మిక్క వేదియర్ వేదత్తినుట్ పొరుళ్ నిఱ్కప్పాడియెన్ నెంజుళ్ నిఱుత్తినాన్ “
దివ్య ప్రబంధము ద్రావిడ భాషలో ఉన్నందున తక్కువగా చూడనవసరము లేదని వేదాంత రహస్యాలన్ని క్షుణ్ణంగా నిబిడీకృతమై వున్నవని వేదాంత దేశికుల అభిప్రాయమును ఈ క్రింది మాటలలో చూడవచ్చు.
” వేదాంతార్థమై సత్యహేతువాగైయాలే భాషార్థం ఉపజీవ్యం . ”
సంస్కృతములో ఉన్నందున అన్నింటినీ అంగికరించనవసరము లేదు. సంస్కృతములో ఉన్న అనేక గ్రంధాలు వేదాంతాన్ని వ్యతిరేకించేవిగా వున్నాయి. ద్రావిడములో ఉన్నదివ్య ప్రబంధము వేదాంతార్థాలను చక్కగా సామాన్యులకు కూడా అర్థమయ్యేలాగా వివరించింది. శాస్త్ర సహాయము లేకుండా స్వప్రయత్నముతో ఎవరూ పరమాత్మ తత్వాన్ని తెలుసుకోలేరు.
‘नायमात्मा प्रवचनेन लभ्य:’……….
పరమాత్మ కృపతో ఆయన తత్వాన్ని తెలుసుకోవచ్చు. నమ్మాళ్వార్ల విషయంలో అదే జరిగింది.
” మయర్వర మదినలం అరుళినన్ “
ఆచార్య హృదయంలో అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ చెప్పిన చూర్ణిక ఇక్కడ చక్కగా అమరుతుంది . “ అవన్ వళంగుం దివ్య చష్షుసాలే ……” ( వాడు కృప చేసిన దివ్య చష్షువులచే ….)
బ్రహ్మజ్ఞానం అంటే పరమాత్మ విషయం తప్ప మిగిలిన విషయాలలో వైరాగ్యం కలిగి వుండటం,పరమాత్మ మీద భక్తి కలిగి వుండటం. దీనిని ఋషుల నుండో, అన్య దేవతల నుండో పొందటం వలన పరిపూర్ణత ఏర్పడదు . పరమాత్మ కృప వలన కలిగిన జ్ఞాన భక్తి ,వైరాగ్యాలే ఫలితాన్నిస్తాయి అనటానికి నమ్మాళ్వార్ల చరితమే ఉదాహరణ. అందువలననే నమ్మాళ్వార్లు ఉన్నతమైన వేదాంతాచార్యులు అనటంలో సందేహం లేదని మన పెద్దల అభిప్రాయం. ఆళవందార్లు నమ్మాళ్వార్లను ‘ అధః ‘आध:అని ‘ నః కులపతిః ‘न: कुलपति:. అని అన్నారు. నమ్మాళ్వార్లు వేదాంతుల కులానికి ఆధ్యులు, నాయకులు.
( ఈ అవతారిక శ్రీ.ఉ.వే ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్య స్వామి వారిచే అనుగ్రహించిచబడింది)
- భాగం 1
- భాగం 2
- భాగం 3
- భాగం 4
- భాగం 5
- భాగం 6
- భాగం 7
- భాగం 8
- భాగం 9
- భాగం 10
- భాగం 11
- భాగం 12
- భాగం 13
- భాగం 14
- భాగం 15
- భాగం 16
- భాగం 17
- భాగం 18
- భాగం 19
- భాగం 20
- భాగం 21
- భాగం 22
- భాగం 23
- భాగం 24
- భాగం 25
- భాగం 26
- భాగం 27
- భాగం 28
మూలము : https://granthams.koyil.org/vedartha-sangraham-english/
పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org