శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 6
పూర్వాచార్య గ్రంధాలలొ భగవంతుడిని సకలకల్యాణగుణ పరిపూర్ణుడుగా వర్ణించారు. అవి ఎంత అంటే సముద్ర మంత అనిచేప్పుకోవాల్సిందే .
స్వామి రామానుజులు పలుసందర్భాలలో పరమాత్మా గురించి చెప్పేటప్పుడు అసంఖ్యాక కళ్యాణగుణ ములు అని వర్ణించడం తెలిసిన విషయమే .
శ్రీభాష్యంలో ‘అనంత గుణసాగరం’ అని ‘అపరిమితోధార గుణసాగరం’ అని ప్రయోగించారు. ఉదాహరణకు శ్రీభాష్యం రెండవ అధ్యాయం అవతారికలో
‘ప్రధమే అధ్యాయే ప్రత్యక్షాది ప్రమాణ గోచరాత చేతనాత్ తత్సంసృష్టాత్ వియుక్తాచ్చ చేతనాత్ అర్థాంతరభూతం నిరస్త నిఖిల అవిధ్యాది అపురుషార్థగంధం అనంత జ్ఞానందైకతానం అపరి మితోధార గుణసాగరం నిఖిల జగత్కారణం సర్వాంతరాత్మభూతం పరం బ్రహ్మం వేదాంతం ఇత్యుక్తం .’
దీని భావము: …..వేదాంత సూత్రములోని మొదటి అధ్యాయంలో పరబ్రహ్మ ఇంద్రియములకు అందక భౌతిక రూపంతో ఉండే జీవాత్మల నుండి వేరుగా, ఈ వస్తువుల నుండి విడివడి, అజ్ఞానము వంటి సకల దోషములకు అతీతముగా, అంతులేని జ్ఞానానందములకు మూలస్థానమై గుణరత్నాకరమై సమస్త చరాచరములకు తాను ఒక్కడే కారణమై సకల పదార్థాలకు అంతర్యామియై ఉన్నాడని వేదాంతములు తెలియచేస్తున్నది .
ఈ వాక్యంలో పరబ్రహ్మ అని ప్రధామావిభక్తిలో ఉంది కానీ ద్వితీయా విభక్తిలో లేదు. ఈ దృష్టితోనే ఈ పంక్తినిలోని పాదాలకు అర్థాలను చూడవలసి ఉంది. ‘ అపరిమిత ఉదార గుణ సాగరం’ అన్న పదం తత్పురుష సమాసములో చూడకూడదు. ఎందుకంటే ‘గుణ సాగరః’ అన్న పదములో ‘సాగరం‘ అన్నది పుంలింగ ప్రయోగము. కావున ‘అపరిమిత ఉదార గుణ సాగరః’ అని వుండాలి. కానీ ఇక్కడ ‘గుణ సాగరం‘ అని నపుంసక లింగలో వుంది. అందువలన దీనిని తగిన బహువ్రీహి సమాసం ’ ‘అపరిమిత గుణ సాగరః యస్య తత్’ అని కానీ ‘అనంత గుణ సాగరః యస్య తత్’ అని వుండాలి. శ్రుత ప్రకాశికాచార్యులు కూడా దీనిని బహువ్రిహిగానే స్వీకరించారు.
ఈ రెండు విగ్రహవాఖ్యాలకు అర్థము మారుతుంది. భగవంతుడే సముద్రము, నీటి సముద్రము కాదు. దివ్యగుణ సాగరము అని తత్పురుష సమాసార్థము. బహువ్రీహి సమాసార్థములో గుణములే సాగరము, ఆ సముద్ర మంత గుణములు కలవాడు భగవంతుడు. రెండవ అర్థమే ఇక్కడ సరిపోతుంది.
పలు సందర్భాలలో భగవంతుడు గుణసాగరంగా వర్ణించబడటం జరిగింది. కానీ అయన గుణములను సముద్రంగా కొన్ని సందర్భాలలోనే చెప్పబడింది. ఆచార్యుల వ్యాఖ్యానాలలోను. రామానుజులవారి రచనలలోను మాత్రమే ఇలా వర్ణించబడింది. ఎవరైనా ఆచార్యులు భగవంతుడి గుణములను సముద్రంతో పోల్చివర్ణించారంటే వారు శ్రీవైష్ణవ ఆచార్య పరంపరకు చెందిన వారు అని బోధపడుతుంది.
రామానుజులవారు దీనిని ఒక ఉదాహరణగా ఉపయోగించలేదు. వారు ఆళ్వార్ల శ్రీసూక్తులను లోతుగా మదించినవారు. కావున వారు ఇలా రాయలేరు. పెరియ తిరువందాదిలో నమ్మాళ్వార్లు ‘మికుం తిరుమాల్ సీర్కడలై యుళ్ పోదిమ్డ సింద నైయేన్’ (69 ) అని అన్నారు. ఇందులో పరమాత్మ దివ్యగుణాలను సముద్ర ముతో పోలుస్తున్నారు. అగస్త్యులు ఉప్పు సముద్రాన్ని తాగారు. మేగాలు సముద్రపు నిరు తాగినట్లు ఆళ్వార్లు ఆచార్యులు భగవంతుడి గుణముల సముద్రాన్ని తాగారు. ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే స్వామి బహువ్రీహిని ప్రయోగించారు.
నాథముని ఆలవందార్లు నమ్మాల్వార్లు తిరుమంగై ఆళ్వారు
ఇక్కడ ఇలాంటిదే మరొక వివరణ కూడా చూడదగినది. స్తోత్రరత్నంలో ఆళవందార్లు నాధమునులను ‘అగాధ భగవద్భక్తి’ నాధమునుల భక్తి అగాధమైనదని చెప్పారు. ఇక్కడ నాధమునులే ‘భక్తిసముద్రమా?’ (తత్పు రుష) లేక భక్తి అనే సముద్రము కలవాడా? (బహువ్రీహి) అన్న ప్రశ్న ఉదయిస్తుంది. వ్యాఖ్యాన చక్రవర్తి పెరియ వాచ్చాన్ పిళ్ళై ఆళ్వార్ల మనసెరిగి బహువ్రీహిగానే నిర్వహించారు. దానికి వారు నమ్మాళ్వార్ల ‘కాదల్ కడలిన్ మిహ పెరిదు (ప్రేమ సముద్రము చాలా పెద్దది) ‘(తిరువాయిమోళి 7 -3 -6) అన్న పాశురంలో తిరుమంగై ఆళ్వార్ల ‘ఆసై ఎన్నుం కడలిల్’ (ప్రేమ అనే సముద్రము) (పెరియ తిరుమొళి 4-9-3) అన్న పాశురాన్ని ఉదాహరణగా చూపించారు. ఇది శ్రీవేదాంత దేశికులచే ఆదరించబడినది. వారు తమ వ్యాఖ్యానంలో ముందు తత్పురుష అర్థాన్ని తరువాత బహువ్రీహిని చెప్పారు. ‘భక్తింవా సిందుత్వేన రూపయిత్వాబహువ్రీహి’ భక్తిని ఒక సముద్రంలా వివరించారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-7-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org