శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 8
ఈ భాగంలో భగవద్రామానుజుల ‘ కప్యాసం పుండరీకాక్ష ‘ అనే శృతి వాఖ్యానికి ఆళ్వార్ల మనోభావాలను చూడబోతున్నాము.
గంభీరాంబస్సముద్భూత పుండరీక—-తామర , జలజము , అంబుజము లేక నీరజము . అది నీటిలో పుట్టటము వలన దానికి పై పేర్లన్నీ అమరినవి. తామర నీటిలోనే పుడుతుంది, నేలపై పుట్టదు. కాబట్టి ఈ పేర్లన్నీ తామరకు మాత్రమే చెందుతాయి. అమ్బస్సముద్భూత అంటే నీటిలో పుట్టినవి.
శ్రీవచన భూషణంలో స్వామి పిళ్ళై లోకాచార్యులు ‘ తామరను వికసిమ్పచేసే సూర్యుడు అది నీటిని విడిచి బయటకు వస్తే తన వేడితో వదలగొట్టినట్టుగా ‘ అని అన్నారు. దీనిని బట్టి తామరకు నీరు ఎంత అవసరమో తెలుస్తున్నది.
పరమాత్మ కళ్ళు పుండరీకాక్షము. వాటిని తామరతో పోల్చి చూడబడుతున్నది . నీటిలో నివసించే తామర గుణాలు ఆళ్వార్ల పాశురాలలో వివరించబడ్డాయి. సిరియ తిరుమడల్ లో తిరుమంగై ఆళ్వార్లు, ‘నీరార్ కమలం పోల్ సేమ్క్ ణ్ మాల్ ఎన్రోరువన్’ అన్నారు. పరమాత్మ ఎర్రని కళ్ళను ఎర్ర తామర లాగా భావించారు వారు. ఇంకా తిరువిరుత్తంలో నమ్మాళ్వార్లు ఇదే అర్థంలో ‘ అళలర్ తామరై కణ్ణన్ ‘ అన్నారు. ఈ పాశుర వ్యాఖ్యానంలో స్వామి నమ్బిళ్ళై కప్యాస శృతిని ఉదాహరణగా చూపించారు. వదికేసరి జీయర్ స్వాపదేశము కూడా ఇలాగే కనపడుతుంది.
స్వామి నంపిళ్ళై వడికేసరి జీయర్
ఇక్కడ ‘గంభీర ‘ అన్న ప్రయోగం నీటి సమ్రుద్దిని సూచిస్తున్నది. ‘ తిరువాయిమోళి ‘ లో ఆళ్వారు ‘ తణ్ పెరునీర్ తడంతామరై మలర్దాల్ ఒక్కుం కణ్ పెరుంకణ్ణన్ ‘ అని వర్ణించారు. తామర పెద్ద , చల్లని తటాకంలో వికసించింది . పరమాత్మ కళ్ళు కూడా అలాంటివే అన్న అర్థంలో చెప్పారు.
‘సంరుష్ట నాళ పుండరీక “ – తామరపువ్వు ఎలాగైతే నీళ్ళ మీద ఆధారపడి ఉంటుందో అలాగే తన ఎర్రని కాడ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆళ్వార్ల పాశురాలలో దీనికి సంబంధించిన ఆధారాలు కనపడతాయి.
తిరువురుత్తంలో ఆళ్వార్లు “ఎమ్పిరాన్ తడంకణ్ గళ్ మెన్ కాల్ కమల తడం పోల్ పొలిందన” (పరమాత్మా ఎర్రని కన్నులు తామర పువ్వు లాగా విచ్చుకున్నాయి) అన్నారు.
“ రవికర వికసిత “ నీటిలో ఉన్న తామర సూర్యరశ్మి వలన వికసించింది . రమ్యమైన సుందరమైన పరమాత్మ కన్నులకు దగ్గర పోలికలు గలవి తామరలు మాత్రమే. సూర్యకిరణాలు ఆయనకు చేతులు. “సెమ్జుడర్ తామరై “ అని ఆళ్వార్ల పాశురాలలో ఉదాహరించారు.
పరమాత్మా కళ్ళకు, తామరకు ఉన్న సంబంధమును కులశేఖర ఆళ్వార్లు తమ పెరుమాళ్ తిరుమోళిలో “సెంకమలమ్ అందరమ్ సీర్ వేమ్కదిరోర్ కల్లాల్ అలరావల్ “ అని అనుగ్రహించారు.
“పుండరీక దళామలాయతేక్షణ “ – మూలములో ‘పుండరీకమేవ మక్షిణి’ ఉంది. దీనిని బట్టి తామర వంటి కన్నులు గలవాడు అనో, పుండరీకాక్షుడు అనో చెప్పవచ్చు. కానీ రామానుజులు దళ, ఆమల, ఆయత అనే మూడు పదాలను పుండరీక, ఈక్షణ అనే రెండు పదాల మధ్య చేర్చి చెప్పారు. ఇది ఆళ్వార్ల పాశురాలను వలననే సాధ్యం అవుతుంది.
ఆళ్వార్లు “తామరై తడం కణ్ణన్”, “ కమల త్తడం పెరుం కణ్ణన్” వంటి పదాలను ప్రయోగించారు. తమిళంలో ‘తడ’, సంస్కృతంలో ‘తళ’ సమానార్థకాలు. సంస్కృతంలోని ‘ళ కారము’ తమిళంలో ‘డ కారముగా మారుతుంది. ఈ మార్పిడిని తమిళ భాషా శాస్త్రజ్ఞులు ‘ఎళుత్తుపోలి’ (అక్షరంలో పోలిక ) అంటారు. పూర్వాచార్యులు తమ వ్యాఖ్యానాలలో ‘తడం’ అంటే పెద్ద, కొలను, ఆకు అని వివరించారు. ఇక్కడ ఆకు అన్న అర్థం సరిపోతుంది.
ఆళ్వార్ల “ కమల కణ్ణన్ …..అమలంగళాగా విళిక్కుం” (కమలముల వంటి నేత్రాలవాడు అమలములను పోగొడతాడు) పరమాత్మ కరుణా కటాక్షము సకల పాపాలను పోగొడతాయి. అయన దృష్టి ‘ అమల’ అనటం వలన ఈ విషయమ బోధపడుతుంది. కీట్స్ ఆంగ్ల కవి చెప్పిన మాట ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఆనంద అంటే ఒక అందమైన వస్తువు ఆనందాన్ని ఇచ్చి అది నిరంతరం ప్రవర్తమానమవటం అన్నారు. లోకంలో ఎంత ఆనందకరముగా ఉండే అందమైన వస్తువైనా కొంతకాలానికి విసుగు కలిగిస్తుంది. నిత్య జీవన ప్రవాహంలో ఎంతో అందమైన వస్తువైనా కొంతకాలానికి విసుగు పుట్టిస్తాయి, అసలు ఆ అందాన్ని అనుభవించే ఓపిక కూడా ఉండదు. దానికి విరుద్ధంగా ఎప్పటికి నవనవోన్మేషంగా ఉండేది పరమాత్మ రూపం ఒక్కటే. భక్తి పెరిగిన కొద్దీ ఆయన అందం ఇనుమడిస్తుంది. ఆయన అందమైన నేత్రాలు ప్రేమతో కారుణ్యంతో నిండి వుంటాయి. ఇది నిజమైన, పవిత్రమైన విషయం మాత్రమే కాదు చేతనులను ఉద్దరించే దృఢ సంకల్పం గోచరమవుతుంది. ఆయన అందమైన నేత్రాలు మన పాపాలను పోగోట్టడమే కాక చేతనులను ఉన్నతగతికి చేరుస్తాయి .
శ్రీ వైష్ణవులకు ‘ఆయత’ అనే పదం ఎక్కడ నుంచి వచ్చింది అని చూడడం సులభం. రుప్పాణ్ణాళ్వార్ల
‘కరియవాగి పుడైపరందు మిళిర్దు సెవ్వరియోడి నీండవప్పెరియ వాయకంణ్ గళ్’ అన్న మాటలు మన హృదయంలో రూపుకడతాయి.
స్వామి రామానుజుల మాటలకు, ఉదాహరణలకు ఆళ్వార్ల పాశురాల నుండి కాక బయట అర్థాలను వెతికితే ప్రయోజనం ఉండదు. శ్రీ రామాయణంలో ‘రామ కమల పత్రాక్ష’ , ‘పుండరీక విశాలాక్ష’ అన్న ప్రయోగాలు తప్ప వేరేగా ఎక్కడ కనపడవు . ఆళ్వార్ల పాశురాల ఆధారంగానే ఈ ప్రయోగాలను వివరించారు.
స్వామి ఆళ్వార్ల పాశురాలపై తమకు గల అధికారంతో చేసిన ఈ వ్యాఖ్య పరమాత్మ నేత్రాల సౌందర్యాన్ని, దాని నుండి మనపై ప్రవహించే కరుణను మనము అనుభవించగలుగుతున్నాము.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/05/dramidopanishat-prabhava-sarvasvam-9/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org