శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 5
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం ……
భగవద్గీత నాలుగవ అధ్యాయంలో ‘ పరిత్రాణాయ సాధూనాం..’ అన్న శ్లోకం ఉంది. దీని అర్థము సామాన్యులకు కూడా సులభంగా అర్థమవుతుంది. మంచిని రక్షించి చెడును తోగించి ధర్మమును స్థాపించటానికి ప్రతి యుగంలోను అవతరిస్తాను అని పరమాత్మ చేతనులకు దృడంగా చెపుతున్నాడు.’ మంచి, రక్షణ ,నాశము , చెడు,ధర్మము అన్న పదాలను ఇందులో అర్థం చేసుకోవలసిఉంది. వీటి అర్థాలను ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు చెప్పుకోవచ్చు. కాని భగవద్గీతలో ఏ అర్థంతో చెప్పారో తెలుసుకోవలసి వుంది. స్వామి
రామానుజులు భగవద్గీత మొత్తం దృష్టిలో వుంచుకొని ఈ శ్లోకానికి అర్థం చెప్పారు.
‘సాధు జనులు ఎవరు?’
కృష్ణుడిచే రక్షింపబడు సాధు జనులు ఎవరు? అని తెలుసుకోవటం చాలా రసవత్తరమైన
విషయము. స్వామి రామానుజులు ఈ విషయాన్ని వివరించేటప్పుడు అళ్వార్లను స్మరించారనడమే న్యాయంగా ఉంటుంది. వారు సాధు జనుల గురించి చెప్పేటప్పుడు అళ్వార్లకు సంబంధించిన పలు సుగుణాలను చెప్పారు.అవి , శ్రీవైష్ణవులకే కాక సామాన్యులకు కూడా తెలియజేయాలని భావించి చెప్పినవి.
గీతా భాష్యంలో స్వామి ఈరకంగా వివరించారు.
సాధువు: ఉక్తలక్షణము – ధర్మశీలా వైష్ణవాగ్రేసరాః మత్సమాశ్రయణే ప్రవృత్తాః మన్నామకర్మ-స్వరూపాణాం వాగ్మనసాగోచారతయా మద్దర్శనేన వినా స్వాత్మధారణపోషణాదికమలభమానాః క్షణమాత్రకాలం కల్పసహస్రం మన్వానాః ప్రశిథిల-సర్వ-గాత్రా భవేయురితి మత్స్వరూప చేష్టితావలోకనాలాపాదిదానేన తేషాం పరిత్రాణాయ!’
ధర్మశీలా—వారు నియమింపబడిన ధర్మాన్ని తమ అర్హతగా కలిగిఉన్నవారు. ” ధర్మ ” అనే ప్రయోగంలో సాధారణ ధర్మాన్ని స్వీకరించవచ్చు. లేక విశేష వైష్ణవ ధర్మాన్ని తెలియ జేసేదిగాను స్వీకరించవచ్చు’ అని ఉండటం వలన ముందు చెప్పిన అర్థము , తరవాత ‘ వైష్ణవాగ్రేసరాః ‘ అని ఉండటము వలన తరువాత చెప్పిన అర్థము కూడ అన్వయిస్తుంది.
వైష్ణవాగ్రేసరాః — వీరు వైష్ణవులలో ప్రధములు. ఇదే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడిన విషయము. రామానుజ సంప్రదాయంలో ఆళ్వార్లే ఉన్నతమైన శ్రీవైష్ణవులుగా చెప్పబడ్డారు. వైష్ణవాగ్రేసరాః అన్న ప్రయోగం వారి ఉన్నతమైన స్థానాన్ని చూపిస్తుంది.
మత్సమాస్రయేణ పవిత్రాః —నన్నే ఆశ్రయించాలని తలచినవారు. ఇది ‘ తుయరఱు సుడరడి తొళుదెళు’, (దుఃఖాన్ని తొలగదోసే ప్రకాశమానమైన శ్రీపాదాలు) ‘ ఆళివణ్ణ నిన్ అడియిణైయై అడైందేన్ ‘ (మెఘవర్ణా నీ శ్రీపాదాలను చేరాను) వంటి ఆళ్వార్ల శ్రీసూక్తిగా చెప్పబడినవి.
మన్నామక్రమ స్వరూపాణాం వాగ్మనసాగోచరతయా —— ‘ఎన్ సొల్లిసొల్లుహేన్? ‘ (ఏమని చెప్పను) ‘ నెంజాల్ నినైప్పరిదాల్ వెణ్ణెయై ఊణ్ ఎన్నుం ఈనచొల్లే’ (మనసులో స్మరించ లేనందున వెన్నను కూడా ఆహారం అని హీనమైన మాట) అని ఆళ్వార్లు పరమాత్మ దివ్య నామాలు, దివ్య చేష్టితాలు మనసును, మాటను చిలికినవని గ్రహించినవారు.
మద్దర్శనేన వినా స్వాత్మధారణపోష్ణాదికమలభమానాః —–ఆళ్వార్లు పరమాత్మను స్మరించకుండా, చూడకుండా తరింపలేరు. ‘ తొల్లై మాలై కణ్ణార కండు కళివదోర్ కాదలుఱ్ఱార్క్కుం ఉండో కణ్గళ్ తుంజుదలే ‘(పొద్దు మాపు కనులార కాంచి కరగిపోయాక ప్రేమించినవారికి కనులు వాలుతాయా!), ‘ కాణవారాయ్ ఎన్నెండ్రు కణ్ణుం వాయుం తువర్దు ‘ (కానరావా అని కళ్ళు నోరు తెరుచుకొని) అన్న పాశుర భాగాలలో ఈ విషయం స్పష్టమవుతుంది.
క్షణమాత్రకాలంకల్పసహస్రం మన్వానాః—ప్రమాత్మను క్షణకాలమైనా వీడి వుండటాన్ని ఆళ్వార్లు ఒక యుగకాలంగా భావిస్తారు. వారి మాటలలో ‘ ఒరు పగల్ ఆయిరం ఊళియాలో ‘(ఒక పగలు వేయి యుగాలు కావా) ‘ ఊళియిల్ పెరిదాయ్ నాళికై ఎన్న్మ్’ (యుగమంత దీర్గమైన రోజు), ‘ఊయుం పొళిదిన్ఱి ఊళియాయ్ నీండదాల్ ‘ (వాలే పొద్దు యుగంలాగా దీర్గంగా) అన్న పాశురభాగాలను చూడవచ్చు.
ప్రశితిల సర్వగాత్రాః—-పరమాత్మతో చెరినప్పుడు ఆళ్వార్ల తిరుమేని అలసి సొలసి పోయిందట. కలసినప్పుడు ఆనందం వలన అలసట, దూరమైనప్పుడు దుఃఖంతో సొలసి పోవటం. ‘కాలాళుం, నెంజళీయుం, కణ్ సుళలుం’ , ‘కాలుం ఎళా కణ్ణ నీరుం నిల్లా ఉడల్ సోర్దు నడుంగి కురల్ మేలుం ఎళా మయిర్కూచ్చమఱా ‘ , ‘ ఉళ్ళెళ్ళాం ఉరుక్కి కురల్తళుత్తుళిందేన్ ‘ , ‘ ఉరోమ కూపంగళాయ్కణ్ణ్నీర్గళ్ తుళ్ళ శోరత్తుయిలణై కొళ్ళేణ్ అని అన్నారు.
సంగ్రహంగా ‘ఒక సాధు వైష్ణవ గొష్టిలో నాయకులుగా ఉంటారు, ధర్మ పరిపాలనలో ప్రధములుగా, కృష్ణుడిగా నన్నే శరణమని తలచేవారు, నా నామాలు చేష్టితాలను దివ్యమైనవిగా, మనసులోను, మాటలోను నిండి వున్నవిగా భావించేవారు, వీటి అనుభవము లేక పోతే తరించలేని వారు, నా స్వరూప స్వభావాన్ని తరించలేని వారు, నా వియోగాన్ని ఒక క్షణాన్ని యుగముగా భావించేవారు, సాదు వైష్ణవులు. పరమాత్మతో ఉన్న సంబంధము అంతరంగమైనదిగా భావిస్తారు.
దయామయుడైన పరమాత్మ కృప చూపి దుఃఖాన్ని పోగొట్టడం కోసం యుగయుగాలుగా ఎన్నో అవతారాలనెత్తాడు, ఆయన తనను తన భక్తులకు చూపిస్తున్నాడు. వారికి తన దివ్య దర్శనాన్ని ఇచ్చి తన దివ్య చేష్టితాలను చూపి వారితో దగ్గరి సంబంధాన్ని నేర్పి ఉజ్జీవింపచేస్తాడు. దీనినే సాధు సమ్రక్షణం అంటారు.
ఈ వ్యాఖ్యానము యొక్క ముఖ్య ఉద్దేశ్యము:
ఈ వ్యాఖ్యానము భగవద్గీతలోని అంతరార్థాన్నిపోలి ఉన్నది . అందువలన వైష్ణ వ తత్వానికి బయట ఉన్న వారికి కూడా స్వామి వ్యాఖ్యానము కృష్ణుడి తత్వము సుబోధకంగా ఉంటుంది.
సాధు భక్తితో పాటు ఆళ్వార్ల తత్వాన్ని కూడా చెప్పడం వలన సామాన్యులకు కూడా అర్థమయ్యే ఒక ఉన్నతమైన వ్యాఖ్యానంగా అమరింది .
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/04/dramidopanishat-prabhava-sarvasvam-6-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org