శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 12
గజేంద్రమోక్షం
కిందటి భాగంలో భగవద్రామానుజాచార్యులు అనుగ్రహించిన వివరణ ఈ పాశురములో కనపడుతుంది.
“మళుంగాద వైనుదియ శక్కరనల్ వలత్తైయాయ్
తొళుంగాదల్ కళిరళిప్పాన్ పుళ్ళూర్దు తోడ్రినైయే
మళుంగాద జ్ఞానమే పడైయాగ మలరులగిల్
తొళుంపాయార్కు అళిత్తాల్ ఉన్ సుడర్ శోది మరైయాదే “
సాధు పరిత్రాణం చేయటానికి పరమాత్మా తనే వస్తాడని చెప్పడానికి గజేంద్ర మోక్షమును ఆళ్వార్లు ఉదహరిస్తారు. గజేంద్ర మోక్షము గురించి సామాన్యులకు కూడా తెలిసే ఉంటుంది. ఈ కథ పురాణాలలో కూడా విపులంగా చర్చించబడింది. పలు దివ్యదేశాలలో కూడా ఈ కథను మహా వైభవంగా చిత్ర రూపంలోనూ శిల్ప రూపంలోనూ ప్రదర్సించబడటం కనపడుతుంది .
భగవంతుడి మీద భక్తితో, ఆయనకు తామర పూవును సమర్పించటానికి తామర పూవులు పుష్కలంగా ఉన్న తటాకంలోకి ఒక ఏనుగు దిగింది. అక్కడ ఉన్న ఒక మొసలి ఆ ఏనుగు కాలును నోటితో కొరికి పట్టుకుంది. ఆ ఏనుగు తనకు తానే మొసలి పట్టును విడిపించుకోవాలని ప్రయత్నం చేసింది. తన ప్రయత్నం ఫలించక పోవటంతో తానుగా మొసలి పట్టును విడిపించుకోలేనని గ్రహించి, సర్వ కారణుడు, సర్వ నియంత, సర్వ శక్తి వంతుడు అయిన పరమాత్మను, ఆదిమూలమును పిలిచింది. పరమాత్మా దాని పిలిపు విని గరుడ వాహనాన్ని అధిరోహించి వచ్చాడు. అక్కడికి చేరుకోగానే తన చక్రాయుధాన్ని మొసలి మీదికి ప్రయోగించాడు. ఏనుగు గాయాన్ని తన శ్రీహస్తాలతో తడిమి ఆశ్వాస పరచి, అది తొండంతో పట్టుకొని ఉన్న తామర పూవును స్వీకరించాడు.
పరమాత్మ తానుగా అక్కడికి రావలసిన అవసరం ఉందా! ఉన్నచోటు నుండే మొసలిని సంహరించ లేడా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఆయన అక్కడికి రాకుండానే ఆ మొసలిని ఏ విధంగా సంహరించ వచ్చో ఒకసారి చూద్దాం .
-
కూరత్తాళ్వార్లు, శ్రీ వైకుంఠస్తవంలో పరమాత్మ లోకాలను తన సంకల్ప మాత్రం చేత సృష్టించి, రక్షించి, సంహరించగల సమర్దుడు అని చెప్పారు కదా! “విశ్వం దియైవ విరచయ నిచాయ భూయః సంజాహృష్టి” అన్నారు. అయినప్పుడు గజేంద్రుడిని సంకల్ప మాత్రంలో ఉన్న చోటు నుండే రక్షించి ఉండవచ్చు.
-
ఆళ్వార్లు చెప్పినట్లుగా గజేంద్రుడిని మరొక విధంగా కూడా రక్షింవచ్చు. “కరుతమిడం పోరుదుకై నిన్ర శక్కరత్తన్”. తన సుదర్శన చక్రాన్ని ఆదేశిస్తే చాలు అది మొసలిని సంహరించి ఏనుగును రక్షించి ఉండేది. ఇక్కడ పెరియాళ్వార్లు “కీళులగిల్ అసురర్ గళై కిళంగిరుందు కిళరామే ఆళి విడుత్తు అవరుడయ కరువళిత్తళిప్పాన్” అని చెప్పారు. పరమాత్మ తన చక్రాయుధాన్ని ఆదేశించి, కింద పాతాళ లోకంలో అసంఖ్యాకమైన రాక్షసులను కూకటి వేళ్ళతో తొలగించాడు. ఇక్కడ కూడా ఆయన, తటాకం దగ్గరకు రాగానే తన చక్రాయుధాన్ని ప్రయోగించి మొసలిని సంహరించాడు. ఈ పని పరమపదంలో ఉండే చేయవచ్చు కదా!
పై ఉదాహరణలను చూడగా సుదర్శన చక్రం పరమాత్మ రక్షకత్వ శక్తి అని తెలుస్తున్నది.
‘”వాణీ పౌరాహిణీ యం కతయతి మహితం ప్రేక్షణం కైటభారే (సుదర్శనుడి రక్షకత్వ శక్తిని సంకల్పం అని పురాణాలు గొషిస్తున్నాయి) అని సుదర్శన శతకం చెపుతున్నది.
అర్థాత్ గజేంద్ర రక్షణం, మకర సంహరణం రెండూ ఆయన ప్రత్యక్షంగా రాకుండానే చేయగల శక్తిమంతుడు స్వామి అని తెలుస్తున్నది.
ఆళ్వార్లు ఈ విషయాన్నే చెపుతున్నారు. “మళుంగాద వైనుదియ శక్కరనల్ వలత్తైయాయ్” అంటే పరమాత్మ పరమపదంలో ఉండి సుదర్శన చక్రాన్ని ఆదేశించి ఉండవచ్చు. “మళుంగాద జ్ఞానమే పడైయాగ మలరులగిల్” అంటే గజేంద్ర రక్షణకు అయన సంకల్పం మాత్రమే చాలు అని చెపుతున్నారు. అయిన పరమాత్మా తనే స్వయంగా దిగి వచ్చాడు. దీనికి కారణం “తొళుంగాదల్ కళిరళిప్పాన్ పుళ్ళూ,ర్దు తోడ్రినైయే” అపారమైన ప్రేమ చేత ఆగలేక వచ్చావే ! అని ఆళ్వార్లు అంటున్నారు.
మొసలి బారి నుండి ఒక ఏనుగును కాపాడటం కోసం మాత్రమే అయన రాలేదు. గజేంద్రుడే ఇలా చెప్పుకున్నాడు. “నాహం కలేవరస్యాస్య త్రాణార్థం మధుసూదనా! కరస్త కమలాన్వేయ పాదయోర్ అర్పితం తవ” (మధుసూదనా! నా శరీరాన్ని కాపాడు కోవటానికి నేను నిన్ను పిలవలేదు. నా తొండంతో పట్టుకున్న ఈ తామరపూవును నీకు సమర్పించటానికే నేను నిన్ను పిలిచాను.) గజేంద్రుడి మనో వాంఛ తెలిసిన వాడు కాబట్టే పరమాత్మా తన ధామం నుండి పరుగున వచ్చాడు.
‘కళిరుం’ అన్న మాట కంటే ముందు ఉన్న ‘తొళుంగాదల్’ (అసమానమైన ప్రేమ)అన్న ప్రయోగం గజేంద్రుడి భక్తి పారవస్యాన్ని తెలియజేస్తుంది. దీనినే గీతలో ‘సాధు’ అని కృష్ణ పరమాత్మా చెప్పారు. సాధు పరిత్రాణం అంటే శ్లిష్టరక్షణ దుష్టశిక్షణ మాత్రమే కాదు. దానిని దాటి పరమాత్మా తన భక్తులతో కలసి ఉండాలని, ప్రేమను పంచుకోవాలని కోరుకుంటాడు. ఆయనకు దాసుల మీద ఉండే ప్రేమ, ఆయన మీద వారికుండే ప్రేమ ఆయనను కనులారా చూడాలన్న కోరిక ఆయనను ప్రత్యక్షంగా రప్పిస్తున్నాయి. ఉన్నతమైన భక్తి గలవారికి తమ దేహాన్ని కాపాడు కోవాలన్న కోరిక ఉండదు. స్వస్వరూపం, పరస్వరూపం తెలిసిన వారు కావున వారు ఆయన అనుభవంలో మునిగి ఉంటారు. ఈ ఆత్మానుభవమే సాధుపరిత్రాణం యొక్క అంతరార్థము. ఇది అయన ప్రత్యక్షంగా రావటం వలన మాత్రమే లభిస్తుంది. అందుకే ‘సాధూనాం పరిత్రాణాయ యుగే యుగే సంభవామి’ అని చెప్పుకున్నాడు.
ఆళ్వార్ల హృదయం తెలుసుకోకుండా ఈ విధంగా ‘సాధుపరిత్రాణం’ గురించి తెలుసు కోవటం సాధ్యం కాదు. అందువలననే ఈ అర్థాలు శ్రీభాష్యంలో మాత్రమే కనపడతాయి. వేదాలను తుదముట్ట అధ్యయనం చేసిన వారికి ఈ అర్థాలు బోధపడవు. ఆళ్వార్ల ద్రవిడవేదసారం తెలిసిన వారికే ఈ రహస్యాలు బోధపడతాయి.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/11/dramidopanishat-prabhava-sarvasvam-13-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org