శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 16
అంతులేని వాత్సల్యం
భగవద్రామానుజులు తమ శరణాగతి గద్యంలో ‘ అఖిలహేయ ప్రత్యనీక ‘ అని మొదలుపెట్టి పరమాత్మ దివ్యనామాలనేకం అని చెప్పారు. ఇందులో వీరు నామాలన్నింటిని సంబోధనాత్మకంగానే ప్రయోగించారు.
భగవద్రామానుజులు, ‘మహావిభూతే! శ్రీమన్నారాయణా! శ్రీవైకుంఠనాథా! అని సంభోదించిన తరవాత స్వామి దివ్యగుముణములను పేర్కొంటూ ‘అపారకారుణ్య సౌశీల్య వాత్సలౌధార్య సౌందర్య మహోధదే! ‘అని వర్ణించారు. పరమాత్మా లోతైన, అందమైన, కళ్యాణగుణ మహాసముద్రుడు. వీరి కళ్యాణ గుణాలు అంతులేనివి, అనుభవానికి అంతులేనివి, అపార మైనవి. ఈ లోకంలోని జీవాత్మలను తరింప చేసే ఆయన స్వరూపము దయ, సౌలభ్యము, స్వామిత్వం, సౌదర్యం, వాత్చల్యం అంతులేనివి. వీటిలో వాత్సల్యం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాము .
వాత్సల్యం :
చేతనుల దోషాలకు దండించకుండా ఆ దోషాలను కూడా అనుభవించే స్వభావము. కొందరు జ్ఞానులు ఆయన దోషాలను భిన్నం అంటారు. ఇక్కడ ఆ వివాదం మనకు అప్రస్తుతం . ఈ గుణము తల్లిప్రేమలో చూడవచ్చు. తల్లి తన బిడ్డలో దోషాలున్నా వాటితో సహా ప్రేమిస్తుంది. ఆ ప్రేమలో నిబంధనలు ఏవి ఉండవు. ‘ ‘వత్చ’ అంటే ఆవు దూడ. అప్పుడే పుట్టిన దూడ శరీరానికి అంటుకొని వున్న మాలిన్యాన్ని ప్రేమతో తన నాలుకతో నోటిలోకి తీసుకుంటుంది, ఆ ప్రేమయే వాత్సల్యం. అలాగే జీవాత్మ విషయంలో పరమాత్మా చూపేది ఎల్లలు లేని వాత్సల్యం.
భగవద్రామానుజులు శరణాగతి గద్యంలో ‘ ఆశ్రిత వాత్సల్య జలధే ‘ అంటారు. అంటే పరమాత్మా ఒక్క వాత్సల్యం గుణంలోనే సముద్రమంతటి వాడు! భగవద్రామానుజులు ఈ వాత్సల్య గుణాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెపుతున్నారు? అని చూస్తే పరమాత్మ గుణాలన్నింటిలో ఈ గుణమే చేతనుల మనసును కరిగించే శక్తి గలది అమితాశ్చర్యకరమైనది. రామానుజుల వంటి పరమ భక్తి గలవారికి ఈ గుణానికి కరిగి పోతారు. తమ దైవీకమైన అనుభవంలో దానినే మళ్ళీ మళ్ళీ చెపుతుంటారు.
ఆళ్వార్లు తమ ప్రబంధాలలో కూడా పరమాత్మ వాశ్చల్య గుణాన్ని ఎంతగానో కీర్తించడం కనపడుతుంది.
శ్రీనివాసుడిని నమ్మాళ్వార్లు ‘అగల కిల్లెన్ ఇఱైయుం ఎన్రు అలర్మేల్ మంగై ఉరై మార్బా‘ అని కీర్తించారు. పరమాత్మ శ్రీహృదయాన్ని అమ్మవారు క్షణ కాలమైనా విడవకుండా ఉంటుంది. దాసులు ఆయనను ఆశ్రయించేసమయంలో ఆమె ఆయనలోని గుణాలను ప్రేరేపిస్తుంది. అలా ప్రేరేపింపబడిన గుణాలలో ఈ వాత్సశ్చల్య గుణమే ముందు నిలుస్తుంది. ఇందులో ఆశ్చర్య పడవలసిన విషయం ఏది లేదు ఆమె సహజంగానే వాత్సల్య గుణోజ్వల, అందువలన అయనలోను ఆ గుణాన్నే ప్రేరేపిస్తుంది .
వాత్సల్య గుణము లాగా మరొక గుణము లేదు అని తెలిసే భగవద్రామానుజులు ఇతర గుణాలకన్నా ఈవాత్సల్య గుణాన్నే ప్రత్యేకంగా చెప్పారు. మన పూర్వాచార్యులు అనవసరముగా ఒక్క మాటను వాడటం గాని, చెప్పటం గాని జరగదు. రామానుజులు, ‘అపార కారుణ్య సౌశీల్య వాత్సలౌధార్య సౌందర్య మహోధదే!’ అని ముందు పరమాత్మ అపూర్వ గుణాలను చూపి, తరువాత వాటితో కూడి వున్న వాటికన్నా ప్రత్యేకమైన గుణమైన వాత్సల్యమనే గుణాన్ని ప్రయోగించారు. ‘ఆశ్రిత వాశ్చల్య జలధే!’ అని అన్నారు. ఈ వాత్సల్య గుణం పరమాత్మా గుణ సముద్రంలోనిదే అయినా ఇది ప్రత్యేకమైనది గొప్పది అసామాన్యమైనది అనితెలుస్తున్నది.
అడియెన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/15/dramidopanishat-prabhava-sarvasvam-17-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org