స్తోత్రరత్నం – తనియన్లు
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీయామునాచార్యులు , కాట్టుమన్నార్ కోయిల్
స్వాదయన్నిహ సర్వేషాం త్రయ్యంతార్థం సుదుర్గ్రహం|
స్తోత్రయామాస యోగీంద్రః తం వన్దే యామునాహ్వయం||
అవగాహనకు క్లిష్ఠతరమైన వేదాంతార్థాలను సులభముగా తమ స్తోత్రమున అదించిన, యోగులలో శ్రేష్ఠులైన శ్రీయామునాచార్యులను సదా సేవిస్తాను.
యత్ పదాం భోరుహ ధ్యాన విధ్వస్తాశేషకల్మషః |
వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం ||
ఎవరి దివ్యకృపతో నా కల్మషములన్నీ నాశనము చెందినవో మరియు ఒక వస్తువుగా గుర్తించబడ్డానో, పూర్వము అసత్ (అచేతనము)గా ఉండి యామునాచార్యుల పాదముల ధ్యానముతో ప్రస్తుతం సత్(ఆత్మ/ చేతనము) గా భావిస్తున్నానో ఆ శ్రీయామునాచార్యులకు నమస్కరిస్తున్నాను.
నమో నమో యామునాయ యామునాయ నమో నమః |
నమో నమో యామునాయ యామునాయ నమో నమః | |
మరలా మరలా శ్రీయామునాచార్యులను ఆరాధిస్తాను. నిరంతరం వారికి నమస్కరించుటను నిరోధించుకోలేను.
అడియేన్ నల్లా శశిధర్ రామానుజదాసః
ఇటు తరువాత అవతారికను తెలుసుకుందాం.
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava education/kids portal – https://pillai.koyil.org