ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 27

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 26

శ్రీపరాశర భట్టరు – ఆళ్వార్లు

శ్రీపరాశర భట్టరు శ్రీవైష్ణవ సంప్రదాయంలో అసమాన ప్రతిభ గలవారుగా ప్రసిద్ది పొందినవారు.  సంప్రదాయ విషయాలలో వీరికి ఉన్నస్పష్టత, సిద్దాంత విషయాలలో జ్ఞానము భగవద్రామానుజులతో మాత్రమే పోల్చదగినది. అందువలననే భగవద్రామానుజులు “భగవద్గుణ దర్పణము”  అనే శ్రీవిష్ణు సహస్రనామ వ్యాఖ్యానం వీరిచేత రాయించారు. ఈ వ్యాఖ్యానం ఆళ్వార్ల శ్రీసూక్తుల ఆధారంగానే రచింపబడింది. గ్రంధ విస్తృతికి భయపడి ఆ పోలికలన్నీ ఇక్కడ వివరించటం లేదు. దానికి బదులుగా శ్రీరంగరాజ స్థవం నుండి కొన్ని ఉదాహరణలను చూద్దాం.

శ్రీపరాశర భట్టర్

భట్టరు శ్రీరంగరాజ స్థవం ప్రారంభ శ్లోకాలలో ఆళ్వార్ల ఎలా స్తుతించారో చూద్దాం.

ఋషిం జుషామహే కృష్ణ తృష్ణా తత్వమివోదితం !

సహస్రశాఖాం యొద్రాక్షీ ద్రామిడీం బ్రహ్మ సంహితాం!!

భట్టరు ఆళ్వార్లను ఋషి అంటున్నారు. ఇంకా వారు కృష్ణ భక్తి రూపమని, ఆళ్వార్లు వేరు, కృష్ణ భక్తి వేరు కాదని చెపుతున్నారు. వేదశాఖ లెన్నింటినో ద్రావిడ వేదంలో చూపారని కీర్తిస్తున్నారు.

పదమూడవ శ్లోకంలో

“అమతం మతం మతమథామతం స్తుతం

పరినిందితం భవతి నిందితం స్తుతం ఇతి

ఇతి రంగరాజాముదజూఘుష త్రయీ”

ఇందులోని మొదటి భాగంలో “యస్యామతం తస్యమతం” అన్న ఉపనిషత్ వాఖ్యాన్ని అలాగే ప్రయోగించారు. ఎవరైతే బ్రహ్మను తెలుసుకున్నానను కుంటాడో వాడు బ్రహ్మను తెలియనివాడు. ఎవరైతే బ్రహ్మను తెలుసుకో లేదనుకుంటాడో వాడు బ్రహ్మను తెలిసినవాడు అని అర్థము. ఈ శ్లోకం తరువాతి భాగంలో  “స్తుతం పరినిందితం భవతి నిందితం  స్తుతం” అన్న ప్రయోగంలో బ్రహ్మను నిండా స్తుతి చేస్తున్నట్లు అమరింది. ఇది ఉపనిషత్తులో లేదు అయినా ఆళ్వార్ల శ్రీముఖం నుండి వెలువడింది. పెరియ తిరువందాదిలో నమ్మల్వార్లు ….

“పుగళ్వోం పళిప్పోం, పుగళోం పళియొం,

ఇగళ్వోం మదిప్పోం, మదియోం ఇగళోం” అని అనుగ్రహించారు.

ఇందులోని స్వారస్యం ఏమిటంటే భట్టరు ఈ రెంటిని ‘త్రయీ’ యొక్క భాగాలే అంటారు. అర్థాత్ భట్టరు వారు ఉపనిషత్తులు, ద్రావిడవేదం రెండూ వేదం యొక్క రెండు పార్శ్వాలుగానే గణించాలి అని అభిప్రాయ పడుతున్నరు. ఈ విషయం  పదహారవ శ్లోకంలో “స్వం సంస్కృత ద్రావిడ వేద సూక్తైః “ అన్న ప్రయోగంలో స్పష్టమవుతున్నది.

21 వ శ్లోకంలో,  “దుగ్దాబ్దిర్జనకో జనన్యహమియం” అన్నచోట వారు, తొండరడిప్పొడి ఆళ్వార్ల  “తెళివిలా కలంగనీర్ సూళ్ తిరువరంగం”  కల్లోలంగా ప్రవహిస్తున్న కావేరినది అనుభవించినట్లు కూర్చినట్లు అమరింది.

 “జితబాహ్యాజినదిమణిప్రతిమా

  అపి వైదికయన్నివ రంగపురే !

  మణిమండప వపగణాన్  విదధే

  పరకాలకవిః ప్రణమేమహితాన్ !!

అన్న36వ శ్లోకంలో, భట్టరు, ఆళ్వార్లు పాడిన గోపురాలు, స్తంభాలు, మంటపాలను, పరమాత్మ యొక్క  విలక్షణమైన ఊర్ధ్వపుండ్రములతోను, నిరంతరం ధరించే శంఖచక్రాలతోను పోల్చారు.

41 వ శ్లోకంలో చంద్రపుష్కరణికి దక్షిణాన ఉన్న ఆళ్వార్లను కీర్తిస్తున్నారు.

పూర్వేణ తాం తద్వదుదారనిమ్న-

ప్రసన్న శీతాశసయమగ్న నాధాః !

పరాంకుశాద్యాః  ప్రథమే పుమాంసో

నిషేదివాంసో  దశ మాం దయేరన్  !!

చంద్ర పుష్కరణి తీరంలో ఉన్న పున్నాగ చెట్టు గురించి చెపుతూ భట్టరు ఈ క్రింది విధంగా వర్ణించారు .

పున్నాగ తల్లజమజస్రసహస్రగీతి –

సేకోత్థదివ్యనిజసౌరభమామనామః !! (49)

ఈ చెట్టు క్రింద పూర్వాచార్యులు పలువురు తిరువాయిమోళి వ్యాఖ్యానాలను చర్చించటం వలన ఈ  చెట్టుకూడా  తిరువాయిమోళి వాసననుపొందింది  అంటారు.

కులశేఖర ఆళ్వార్లు, డి యరంగత్తు అరవణైయిల్ పళ్ళి కోళ్ళుమ్ మాయోనై  మణత్తూణే పత్తి నిన్రు ఎన్ వాయారవెన్ను కోలో వాళ్తునాలే” అన్నారు. రంగానాధుని దివ్య నేత్రముల నుండి పొంగే కృపామృత ప్రవాహము ఆ లోగిలో నిలవలేక పట్టుకోసం అక్కడ ఉన్న స్తంభాలను పట్టుకున్నాయంటున్నారు ఆళ్వార్లు .

ఇదే విషయాన్ని భట్టరు

శేష శయలోచనామృత – నదీరయాకులితలోల మనానాం!

ఆలమ్బమివామోద – స్తంభద్వయమంతరంగమభియామః (59)

అని ఇక్కడి మంటప స్తంభాలనే  ఆమోద స్తంభాలుగా  వర్ణించారు.

ఇంకా 78 శ్లోకంలో

“వటదలదేవకీజఠరవేదశిరః కమలాస్తన –

శఠగోపవాగ్వపుషి రంగగృహే  శయితం !”

అని శ్రీరంగనాధులు ఆళ్వార్ల శ్రీసూక్తులనే తనకు నివాసస్తానంగా చేసుకున్నారని చెపుతున్నారు.

కిరీటచూడరత్న రాజిరాధిరాజ్యజల్పికా !

ముఖేందుకాంతిరున్ముఖం తరంగితేవ రంగిణః !!

అని 91వ శ్లోకంలో “ముడిచ్చోది” అనే ఆళ్వార్ల పాశుర భావాన్ని సంస్కృతంలో  చక్కగా చెప్పారు.

అలాగే “ముదలాం తిరువురువం మూన్నెంబర్ ఒన్న్రే ముదలాగుం మున్నుక్కుం మూన్నుక్కుం  ఎన్బార్” అన్న ఆళ్వార్ల పాశుర భావాన్ని“ త్రయో దేవస్తుల్యా” అన్న 116వ శ్లోకంలో చెప్పారు.

మన పూర్వాచార్యులు భట్టర్ల శ్రీసూక్తులను ఆళ్వార్ల శ్రీసూక్తులతో ఎంత అందంగా పోలిక చేసి చూపారో ఇప్పటి దాకా చూసాము.  ఇంత చక్కని వ్యాఖ్యానాలను మనకు నిర్హేతుక కృపతో అందించిన మన పూర్వాచార్యులకు భక్తితో శిరసువంచి దాసోహాలు సమర్పించటం తప్ప మనం చేయగల ప్రత్యుపకారమేముంటుంది.

అడియేన్ చూడామణి రామానుజ దాసి.

మూలము : https://granthams.koyil.org/2018/02/25/dramidopanishat-prabhava-sarvasvam-27-english/

archived in https://granthams.koyil.org/

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org

 

Leave a Comment