ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 28

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః   శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 27

  వేదాంతగురు

(ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం యొక్క ముగింపు శీర్షిక)

              సంస్కృత వేదాలను అభ్యసించాడనికి ముందు ద్రావిడవేదం తప్పక నేర్చకోవాలని వేదాంతదేశికులు స్పష్టంగా తెలియజేశారు. వేదాలను అభ్యసించే వారికి ఆళ్వార్ల దివ్యప్రబంధం నేర్చకోవడం మరొక అవకాశం కాదు, వేదాలను సుస్పష్టంగా నేర్వడానికి ఇది అత్యంత అవసరం. దివ్యప్రబంధం నేర్చకోని వారికి సంస్కృత వేదం నేర్చకోవడం సులభసాధ్యం కాదు అని వారు అభిప్రాయపడ్డారు.

వేదాంతదేశికులు సంస్కృతంలో మహా పండితులన్నవిషయంజగద్విదితం, దానికి వారనుగ్రహించిన గ్రంధాలే ఉదాహరణగా నిలుస్తాయి . అయినా తనకు  సంస్కృతంలోఉన్న పాండిత్యమో అపారమైన వేదాంత జ్ఞానమో,  ద్రావిడవేదాన్ని వ్యాఖ్యానించటానికి సరిపొతుందని వారు భావించలేదు.

అధికార సంగ్రహంలో వారు, “శేయ్య తమిళ్ మరైగళై నామ్ తెళియఓది తెళియాద మరైనిలంగళ్ తెళిహిన్రోమే!” అని స్పష్టంగా చెప్పారు. వేదాంత దేశికులు సంస్కృత వేదాన్ని “తెళియాద మరైనిలంగళ్” (గుహ్యమైన వేదాలు) అంటున్నారు. “తమిళ్ మాలైగళై తెళియ ఓది” అని తమిళ వేదాన్ని ఉపదేశించాల్సిన ఆవశ్యకతను తెలియ జేస్తున్నారు. ఇది వారు ఇతరుల కోరకు చెప్పింది మాత్రమే కాదు, తాను కూడా అనుష్టించారన్నదానికి సంకేతంగా “నామ్ తెళియఓది” (మనం ఉపదేశించి) అంటున్నారు.

ఈ విషయాన్నీ వారు ద్రమిడోపనిషత్ తాత్పర్యసారావళిలోని నాలుగవ శ్లోకంలో, “యత్ తత్ కృత్యం శృతీనాం మునిగణ విహితై సేతిహాసైః పురాణైః తత్ రసా సత్వ సీమ్నాః శఠమతా నామునే సంహితా సార్వభౌమి” అని స్పష్ఠీకరించారు.

మునులను గ్రహించిన ఇతిహాస పురాణాల వలన వేదాలను అవగాహనా చేసుకోవటానికి మార్గం సుగమమవుతుంది. అయినా కొన్ని సందర్భాలలో రజోగుణం, తమోగుణం కలగలిసి కనపడుతుంది. ఆళ్వార్ల శ్రీసూక్తులు అలా కాక శుద్ద సత్వంగా రూపుదాల్చి ఉన్నది. దీనినే “సత్వ సిమ్నాః” అని చెప్పారు. కావున శఠకోప సంహిత ఉన్నతమైనదని నిరూపించబడింది.

ఆళవందార్ల స్తోత్రరత్నంలోని నాలుగవ శ్లోకానికి అర్థం చెప్పినప్పుడు ‘మతాపితా’ అన్న ప్రయోగానికి చెప్పిన అర్థాన్ని ఒక్కసారి చూద్దాం.

“అథ పరాశర ప్రబంధాదిభి వేదాంత రహస్య వైశాధ్యాదితిశయ హేతుభూతైః సాధ్య పరమాత్మని సిద్ధ రంజక తమైః సర్వోప్యజీవ్యైః మధురకవి ప్రభ్రుతి సంప్రదాయ పరంపరయా నాధమునేరభి ఉపకర్తారం కాలవిప్రకర్షేభి పరమపురుష సజ్ఞల్పాత్ కదాచిత్ ప్రాదుర్భూయ సాక్షాదపి సార్వోపనిషత్  సారోపదేశతరం పరాంజ్ఞుశ మునిం  ‘ ‘” మాతాపితాబ్రాతేత్యాది ఉపనిషత్ ప్రసిద్ధ భగవత్ స్వభావదృష్ట్యా ప్రణమతి మాతేతి ‘.

వేదాంత దేశికులు వేదములను పరాశరాది ఋషుల కంటే ఆళ్వార్లే చక్కగా సులభంగా వర్ణించారని నిరూపిస్తున్నారు. ఆళ్వార్ల శ్రీసూక్తులు అందరికి అందుబాటులో ఉండటమే కాక రసవత్తరంగా కూడా ఉన్నాయని, అందువలన పరమాత్మలాగానే నమ్మాళ్వార్లు కూడా మనతో మాతపితల స్థానమే కాక సకల సంబంధాలు  కలిగివుంటారు అని అంటున్నారు.

యతిరాజ సప్తతిలో వేదాంత దేశికులు, “యస్య సారస్యవతంస్రోతో వకుళామోదవాసితం శృతీనాం విస్రయామాసం శఠారిం తం ఉపాస్మహే” అన్నారు. కాల ప్రవాహంలో సంభవించిన మార్పుల వలన వేదాల ప్రాభావం కొంత సన్నగిల్లినప్పుడు ఆళ్వార్ల శ్రీసూక్తులు ఆలోటును పూడ్చి వేదాలను పరిపుష్టంచేసి మళ్ళీ తమ పూర్వ ప్రాభవాన్ని పొందడానికి సహకరించాయని అర్థం.

పాదుకాసహస్రంలో ఆళ్వార్ల గురించి వారి శ్రీసూక్తుల గురించి దేశికులు ఎంతో ఉన్నతంగా చెప్పారు. ఉజ్జీవించడానికి ఆళ్వార్ల శ్రీసూక్తులను నేర్చుకోవటం, పరమాత్మ శ్రీపాదాలను శిరసున ధరించడం తప్ప మరోదారి లేదు అని 22వ శ్లోకంలో అంటారు.

అమృతవాదిని అనే ప్రబందంలోని 28వ పాటలో నమ్మాళ్వార్లే ఉన్నతమైన ఆచార్యులని, భక్తులను దరి చేర్చే శక్తి గలవారని చెప్పారు.

వేదాంతదేశికులు ఆళ్వార్లను, మన ఆచార్యులను, ఆళ్వార్ల శ్రీసూక్తులు ఎంతో ఉన్నతమైనవని ఈ గ్రంధంలో నిరూపించారు. ఆచార్యులను, ఆళ్వార్లపై 29 శ్లోకాలలో ఒక ఆర్తితో అనుభవించాము. దీని వలన పిళ్ళాన్, నంజీయర్, పెరియవచ్చాన్ పిళ్ళై, అళగియ మణవాళ జీయర్, పిళ్ళై లోకాచార్యులు, అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, వేదాంతదేశికులు, మణవాళ మాముణులు మున్నగువారి వ్యాఖ్యానాలు ఆసక్తితో, ఆర్తితో చదవడానికి ఊనిక ఏర్పడుతుంది. అదే ప్రధాన ప్రయోజన మవుతుంది. ఆళ్వార్ల శ్రీసూక్తులు వేదాలను అర్థం చేసుకోవటానికి మార్గ నిర్దేశం చేస్తాయని మనకు తెలిపిన కాంచి శ్రీప్రతివాది భయంకరం స్వామికి దాసోహాలు సమర్పించడం, వారు చూపిన మార్గంలో నడవడానికి ప్రయత్నించడం తప్ప మనం చేయదగిన ప్రత్యుపకారం ఏమి ఉంటుంది?

“ఆళ్వార్ గళ్ వాళి అరుళిచెయ్యల్  వాళి

తళ్వాదుమిల్ కురవార్ తాం వాళి

ఏళ్ పారుం ఉయ్య అవర్గళ్ ఉరైత్తవైగళ్ తాం వాళి

శెయ్య మరై తన్నుడనే శేర్దు”

మనం సుఖ, దుఃఖాలనే మేఘాలచే ఆవరించబడినప్పుడు ఆళ్వార్ల శ్రీసూక్తులు మన హృదయంలో ప్రకాశించి మనకు దిశా నిర్దేశము చేయుగాక. రామానుజా మాకు దీనిని ప్రసాదించి అనుగ్రహింతురుగాక

 

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://granthams.koyil.org/2018/02/26/dramidopanishat-prabhava-sarvasvam-28-english/

archived in https://granthams.koyil.org/

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org

Leave a Comment