శ్రీః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః
మునుపటి వ్యాసములో, (https://granthams.koyil.org/2022/07/12/anthimopaya-nishtai-12-telugu/), మనము ఆచార్యుడు సాక్షాత్ భగవానుని అవతారమని మరియు వారిని ఆ ప్రకారముగానే భావించవలెనని గమనించితిమి. ఈ భాగములో, మనము ఆచార్యుని ఒక సామాన్య జీవిగా తలంచిన కలుగు దుష్పరిణామముల గురించి తెలుసుకొందాము.
ఎంపెరుమానార్ – ఆళ్వాన్, కూరమ్ (ఆళ్వాన్ అవతార స్థలము) – ఆదర్శవంతమైన ఆచార్య శిష్యులు
పరాశర మహర్షి ఈ క్రింది పలుకులతో మనకు అనుగ్రహించిరి:
అర్ధ పంచక తత్త్వజ్ఞాః పంచసంస్కార సంస్కృతాః
ఆకారత్రయ సంపన్నాః మహాభాగవతాః స్మృతాః
మహాభాగవతా యత్రావసంతి విమలాస్శుభాః
తద్దేశం మంగళం ప్రోక్తం తత్తీర్థం తత్తు పావనం
యథా విష్ణుపాదం శుభం
సాధారణ అనువాదము: ఆచార్యుని యందు పంచ సంస్కారమును పొంది, అర్ధ పంచకమును అభ్యసించవలెను. మనము ఆచార్యుని 3 విశేష గుణములను (అనన్యార్హత్వము, అనన్య శేషత్వము, అనన్య భోగ్యత్వము) గుర్తించి, నిర్మలుడైన భాగవతుని సేవించవలెను. సంపూర్ణ శుద్ధి పొందుటకై, మహా భాగవతునికి దగ్గరలో నివసించవలెను. ఆ చోటు మిక్కిలి పవిత్రమైనదని, ఆ సమీపములోని జలము అతి స్వచ్ఛమైనది (మనను శుద్ధి చేయుటకు), అది శ్రీమన్నారాయణుని మంగళప్రదమైన స్థానమని చెప్పబడింది.
ఈ సూత్రమును అత్యంత స్పష్టముగా పిళ్ళై లోకాచార్యులు తమ శ్రీ వచన భూషణము సూత్రము 450 లో వివరించిరి:
పాట్టుక్కేట్కుమిడముమ్, కూప్పీడు కేట్కుమిడముమ్, గుతిత్త విడముమ్, వళైత్తవిడముమ్,
ఊట్టుమిడముమ్ ఎల్లామ్ వకుత్తవిడమే యెన్ఱిరుక్కక్కడవన్
సాధారణ అనువాదము: ఎంపెరుమానుని 5 విభిన్న స్వరూపాలను ఆచార్యునిగా (సరియైన రక్షకునిగా) శిష్యుడు భావించవలెను. ఆ ఐదు స్వరూప స్వభావమును వరుస క్రమములో వివరించుచు,
- ఆతడు దివ్య సంగీతమును (సామగానము) పరవశముతో శ్రవణము చేయు చోటు – పరమపదము
- దేవతల ఫిర్యాదులను విను చోటు – వ్యూహము
- లోక రక్షణ కోసమై ఈ సంసారములోకి దూకుట – విభవము
- తమ ఉనికితో అందరిని ఆకర్షించు చోటు – అర్చావతారము
- ప్రతి ఒక్కరి అంతరాత్మగా ఉండి పాలించు వాడు – అంతర్యామి
ఈ విధముగా, ఆచార్యుని పరమపదమునకు మరియు సంసారమునకు పరమాత్మగా శిష్యుడు గుర్తించి, ఆచార్యుడే ఈ రెండు జగత్తులలో పొందగల గొప్ప సంపదగా భావింపవలెను.
ఆచార్య నిష్ఠాపరులు (అముదనార్ వంటి వారు) ఆచార్యుని సదా ఈ క్రింది విధముగా భావించెదరు :
- రామానుజ నూఱ్ఱందాది 20 – ఇరామానుశన్ ఎందన్ మానిదియే – శ్రీ రామానుజులే నా తరగని సంపద.
- రామానుజ నూఱ్ఱందాది 22 – ఇరామానుశ నెందన్ శేమవైప్పే – శ్రీ రామానుజులు అను నా సంపద, నన్ను విపత్తుల నుండి కాపాడును.
- రామానుజ నూఱ్ఱందాది 5 – ఎనక్కుఱ్ఱ శెల్వం ఇరామానుశన్ – నా నిజ స్వభావమునకు శ్రీ రామానుజలే తగిన చక్కని సంపద.
“సాక్షాత్ నారాయణో దేవః కృత్వా మర్త్య మాయిమ్ తనుమ్” – తమను ఉద్ధరించుటకై భగవానుడే స్వయముగా మానవ రూపమును ధరించుటను అర్ధము చేసుకోలేక, వారు కూడ మనవలే భుజించుచు, నిదురించుచు ఉండుటను గమనించుట, ఆచార్యులు కూడ మన వంటి మానవ మాత్రులే అని భావిస్తూ, “మానిడవనెన్నుమ్ గురువై” (జ్ఞాన సారం – 32) లో తెలిపిన విధముగా “జ్ఞానదీపప్రదే గురౌ మర్త్య బుద్ధి శృతమ్ తస్య“, “యో గురౌ మానుషమ్ భవామ్“, “గురుషు నరమతిః” మొ || నవి తీవ్రముగా ఖండించిరి.
తదుపరి భాగములలో, ఆచార్యుని మానవమాత్రునిగా భావించిన కలుగు దుష్పరిణామములను చూచెదము.
విష్ణోరర్చావతారేషు లోహభావం కరోతియః
యో గురౌ మానుషం భావమ్ ఉభౌ నరకపాతినౌ
సాధారణ అనువాదము: దివ్య అర్చా రూపముగా ఒక లోహము (ముడి పదార్ధము) తో తయారు చేసిన విష్ణువును విగ్రహముగా, తమ ఆచార్యుని ఒక మానవమాత్రునిగా మాత్రమే భావించుట, ఈ రెండును కూడ మనను నరక లోకమునకు నడిపించగలవు.
నారాయణోపి వికృతిమ్ యాతి గురోః ప్రచ్యుతస్య దుర్భుదేః
జలాత భేదమ్ కమలం సోషయతి రవిర్ణ పోషయతి
సాధారణ అనువాదము : ఏ విధముగానైతే, సూర్య కిరణాలు కమల పుష్పమును వికసింపజేయునో, నీటి నుంచి బయటకు తీసిన ఆ కమల పుష్పము అదే సూర్య కిరణాల వేడికి కమిలిపోవును. అదే విధముగా, ఎవరైతే తమ గురువు నుంచి విడిపోయెదరో, వారిని శ్రీమన్నారాయణుడే (సర్వరక్షకుడు) కష్టములపాలు చేయును.
ఏకాక్షర ప్రధారమ్ ఆచార్యమ్ యోవమన్యతే
స్వానయో నిశతమ్ ప్రాప్య చణ్డాలేష్వపి జాయతే
సాధారణ అనువాదము: జ్ఞానమును ప్రసాదించు మన ఆచార్యుని విస్మరించిన వారు, 100 మార్లు చండాలునిగా (కుక్క మాంస భక్షకుడు) జన్మించెదరు.
గురుత్యాగీ భవేన్ మృత్యుః మంత్రత్యాగీ దరిద్రదా
గురుమంత్ర పరిత్యాగీ రౌరవం నరకం వ్రజేత్
సాధారణ అనువాదము : గురువును త్యజించిన వారు శవముతో సమానము; మంత్రమును (గురువు నుంచి పొందిన) త్యజించిన వాడు అష్టదరిద్రుడు. గురువును, మంత్రమును రెంటిని త్యజించిన వాడు, రౌరవాది నరకమును తప్పక పొందును.
జ్ఞాన సారము 30
మాడుం మనైయుం మఱై మునివర్
తేడుం ఉయర్వీడుం సెన్నెఱియుం – పీడుడైయ
ఎట్టెళుత్తుం తంద వనే ఎన్ఱు ఇరాదార్ ఉఱవై
విట్టిడుగై కండీర్ విధి
(దీనికి సరియగు సంస్కృత ప్రమాణమును మాముణులు నిరూపించిరి)
ఐహికం ఆముష్మికం సర్వం గురు అష్టాక్షర ప్రదః
ఇత్యేవం యేన మన్యన్తే త్యక్తవ్యస్తే మనీషిపిః
సాధారణ అనువాదము : ఎవరైతే తమ సంపదను, భూములను, మోక్షమును మరియు ధర్మమును, మొ || వానిని, తమకు అష్టాక్షర మహామంత్రమును ఉపదేశించిన ఆచార్యునిగా భావించరో, వారితో గల సంబంధమును / బాంధవ్యమును త్యజించవలెను.
జ్ఞాన సారం – 32
మానిడవన్ ఎన్ఱుం గురువై మలర్మగళ్కోన్
తానుగందకోలం ఉలోగం ఎన్ఱుం – ఈనమదా
ఎణ్ణుగిన్ఱ నీసర్ ఇరువరుమే ఎక్కాలుం
నణ్ణిడు వర్కీళాంనరగు
సాధారణ అనువాదము : ఎవరైతే ఆచార్యుని సాధారణ మానవమాత్రునిగానే భావించెదరో, ఆ శ్రీయఃపతి అర్చామూర్తిని సాధారణ లోహపు (ముడి సరుకు) విగ్రహముగానే భావించెదరో – ఆ ఇరువురు తప్పక అత్యల్ప నరకము లోకమును పొందగలరు.
ఏక గ్రామనివాసస్సన్ యశ్శిష్యో నానర్చయేత్ గురుం
తత్ ప్రసాదం వినా కుర్యాత్ సవై విద్సూకరో భవేత్
సాధారణ అనువాదము : తన గ్రామములో నివసించు శిష్యుడు ఆచార్యుని ఆరాధన చేయకుండా, ఇతర కార్యములలో నిమగ్నుడై ఆచార్యుని ప్రసాదమును గ్రహించకున్నచో అతను జంతువుతో సమానుడు.
జ్ఞాన సారము 33
ఎట్ట ఇరుంద గురువై ఇవై అన్ఱు ఎన్ఱు
విట్టోర్ పరనై నై విరుప్పుఱుదల్ – పొట్టనెత్తన్
కణ్సెంబళి తిరుందు కైత్తురుత్తి నీర్తూవి
అంబుదత్తై పార్తిరుప్పాన్ అఱ్ఱు
సాధారణ అనువాదము : సులభముగా లభ్యమగు ఆచార్యుని విస్మరించి, ఎవరైతే భగవానుని సమీపించెదరో, అది దాహార్తితో నున్న వారు చేతిలో నున్న జలమును జారవిడచి, వర్షముకై ఆకాశము వంక చూచుటకు సమానము.
జ్ఞాన సారము 34
పఱ్ఱుగురువై పరన్ అన్ఱు ఎన్ఱు ఇగళందు
మాఱ్ఱోర్పరనై వళిప్పడుదల్ – ఎఱ్ఱేతన్
కైప్పొరుళ్ విట్టారేనుం ఆసినియిల్తాంపుదైత్త
అప్పొరుళ్ తేడితిరివానఱ్ఱు
సాధారణ అనువాదము : భగవదవతారముగా ఆచార్యుని (మనకు సులభముగా అందుబాటులో నున్న వారు) అంగీకరించుటకు బదులుగా భగవానుని నేరుగా ఆరాధించుట, మన అధీనములో నున్న సంపదను వీడి, ఇతరులు గుప్తముగా భూమిలో దాచిన సంపద కొరకై అన్వేషణ గావించిన విధముగా నుండును.
జ్ఞాన సారము 35
ఎన్ఱుమ్ అనైత్తు యిఱ్కుమ్ ఈరం సెయ్ నారణనుం
అన్ఱుమ్ తన్ ఆరి యన్పాల్ అంబు ఒళి యిల్నిన్ఱ
పునల్పిరింద పంగయతై పొంగుసుడర్ వెయ్యోన్
అనల్ ఉమిళ్ందు తాన్ ఉలర్తియఱ్ఱు
సాధారణ అనువాదము : భగవంతుడు అపార కరుణామయుడు, అందరీ మిక్కిలి అనుకూలుడు, కాని జీవాత్మ ఆచార్యునిపై ప్రేమను / బాంధవ్యమును విస్మరించినచో, ఆ జీవాత్మను పరమాత్మ కూడ విస్మరించును. ఈ చర్య, ఒక తామర పుష్పము వికసించుటకు దోహదపడిన సూర్యుడే, అదే తామర పుష్పము నీటి నుంచి విడి పోయినచో అదే సూర్యుడి వలన ఎండి పోవుటకు సమానము వంటిది.
ప్రమేయ సారము 9
తత్తం ఇఱైయిన్ వడివు ఎన్ఱు తాళిణైయై
వైత్త అవరై వణంగియిరాప్ పిత్తరాయ్
నిందిప్పార్కు ఉణ్దు ఏఱానీణిరరయం నీదియాల్
వందిప్పార్కు ఉణ్డిళియావాన్
సాధారణ అనువాదము : ఆచార్యులే మనకు భగవంతుని పాదపద్మములతో ఆశీర్వదింతురు. అట్టి ఆచార్యుని స్వయముగా భగవానుడని ఆరాధించిన వారు నిశ్చయముగా పరమపదములోని దివ్య జీవులగుదురు. ఆచార్యుని అంగీకరించక, ఆరాధించని ఇతరులు ఈ లోకములోనే శాశ్వతముగా కష్టముల పాలగుదురు.
ఉపదేశ రత్తిన మాలై 60
తన్ గురువిన్ తాళిణైగళ్ తన్నిల్ అన్బొన్ఱిల్లాదార్
అన్బుతన్పాల్ శెయ్ దాలుమ్ అంబుయైకోన్
ఇన్బ మిగు విణ్ణాడు తానళిక్క వేణ్డియిరాన్
ఆదలాల్ నణ్ణాఱ్ అవర్ గళ్ తిరునాడు
సాధారణ అనువాదము : తమ ఆచార్యుని పాదపద్మములను సేవించని వారు, తాము ఎంపెరుమాన్ పై ఎంత గొప్ప ప్రేమ చూపినను, శ్రీమన్నారాయణుడు వారికి పరమపదములోని ఆనందమయమైన జీవితమునొసంగరు, కావున వారు పరమపదమును జేరలేరు.
ప్రతిహంతా గురోరపస్మారి వాక్యేన వాక్యస్య
ప్రతిఘాతం ఆచార్యస్య వర్జయేత్
సాధారణ అనువాదము : ఆచార్యునికి దూరముగా నున్నచో, వారు త్యజించబడుటకు అర్హులు.
బ్రహ్మాండ పురాణము
అర్చావిష్ణౌl శిలాధీర్ గురుషూ నరమతిర్ వైష్ణవే జాతి బుద్దిర్
విష్ణోవా వైష్ణవానామ్ కలిమలమతనే పాద తీర్ధే అంబు బుద్దిః
సిద్దే తన్నామ మందిరే సకల కలుషహే సప్త సామాన్య బుద్దిః
శ్రీసే సర్వేశ్వరే చేత్ తతితర (సురజన) సమతీర్ యస్యవా నరకి సః
సాధారణ అనువాదము : అర్చామూర్తి రూపములో నున్న విష్ణువును ఒక విగ్రహముగా భావించుట, గురువును మానవమాత్రునిగా భావించుట, వైష్ణవ జన్మమును విశ్లేషించుట, కలిలో నున్న అన్ని దోషములను తొలగించు విష్ణువు, వైష్ణవుల శ్రీపాద తీర్థమును సాధారణ జలముగా భావించుట, వారి నామములను, కోవెలలను (విష్ణు మరియు వైష్ణవుల) కీర్తించు పదములను, సాధారణ వానిగా భావించుట, శ్రీమన్నారాయణుని అన్య దేవతలతో సమానముగా భావించువారు నిశ్చయముగా నరక లోకమును జేరెదరు.
గురువును అవమానించుట యందు ఈ క్రింది అంశములు ఉండును :
- గురువు ఆదేశములను అనుసరించక పోవుట
- అనర్హులకు గురువు ఆదేశములను బోధించుట
- ఆచార్యునితో సంబంధమును వదులు కొనుట – శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము 439 వ సూత్రంలో తెలిపిన విధముగా “తామరైయై అలర్ త్తక్కడవ ఆదిత్యన్ తానే నీరైప్ పిరిన్తాల్ అత్తై ఉలర్ త్తుమాపోలే, స్వరూప వికాసత్తై ప్పణ్ణుమ్ ఈశ్వరన్ తానే ఆచార్య సంబంధం కులైంతాల్ అత్తై వాడ ప్పణ్ణుమ్” – ఒక తామర పుష్పము వికసించుటకు దోహదపడిన సూర్యుడు, ఆ తామర పుష్పము నీటి నుంచి బయట పడినచో ఎటుల దానిని అదే సూర్యుడు కాల్చి వేయునో, అదే విధముగా, జీవాత్మకు జ్ఞానము నిచ్చి పోషించు భగవానుడు, ఆచార్య సాంగత్యమును వీడిన జీవాత్మ జ్ఞానమును క్షీణింప జేయును.
- ‘గురోరపహ్నుతాత్ త్యాగాత్ అస్మరణాదాపి; లోభా మోహాదిపిశ్చాన్యైర్ అపచారైర్ వినశ్యతి’ – గురువును త్యజించిన వాడు, అతనికి దూరముగా నున్న వాడు, అతని గురించి ఆలోచించని వాడు, తన దురాశ మరియు మోసము వల్ల ఆర్జించిన పాపముతో నాశనము అగును.
- గురోరన్ఱుతాబిశంసనం పాదకసమానమ్ కలు గుర్వర్ త్తే సప్తపురుషాన్ ఇతశ్చ పరతశ్చ హంతి; మనసాపి గురోర్నాన్ఱుతమ్ వదేత్; అల్పేష్వప్యర్ త్తేషు – అసత్య వచనములతో ఆచార్యుని చేరుట, వారిని గాయపరచుటతో సమానము. ఆచార్యుని సంపదను తస్కరించినచో, ముందు ఏడు తరాలు, తరువాతి ఏడు తరాలు నాశనమగును. కావున, ఆచార్యుని మదిలో కూడ మోసము చేయు తలంపుతో నుండరాదు. వారి సంపదలో ఒక అణువు కూడ తస్కరించరాదు.
- వారితో అబద్దపు మాటలాడుట, వాదించుట, వారు బోధించని వాని గురించి మాటలాడుట, వారు దయతో ఆదేశములను కృప చేయునప్పుడు వారిపై పిర్యాదు చేయుట, వారిని కీర్తించునప్పుడు దూరముగా ఉండుట, వారిపై కఠిన పదజాలమును ఉపయోగించుట, వారిపై బిగ్గరగా అరచుట, వారి ఆదేశములను విస్మరించుట, వారి ఎదురుగా మేను వాల్చుట, వారి కన్నా వేదికపై ఎత్తులో ఉండుట, వారి ఎదురుగా పాదములను జాచుట / చూపుట, వారి చర్యలకు అడ్డు తగులుట, అంజలి ఘటించి వారిని ఆరాధించుటకు సిగ్గు పడుట, వారు నడుచునప్పుడు మార్గములోనున్న అడ్డంకులను తొలగించక పోవుట, వారి మనో భావములను అర్ధము చేసుకొనక మాటలాడుట, ‘కాయిలే వాయక్కిడుతాల్ ‘ – అన్యుల ద్వారా వారితో పరోక్షముగా వ్యవహరించుట, వారి ముందు కంపించుట, వారి నీడపై పాదమునిడుట, ఇతరుల నీడ ఆచార్యునిపై పడుటను అనుమతించుట – ఈ చర్యలను ఆచార్యుని ముందు వదులు కొనవలెను.
యస్య సాక్షాత్ భగవతి జ్ఞానాదీపప్రదే గురౌ
మర్త్య బుద్ది శృతం తస్య సర్వమ్ కున్జరసౌచవత్
సాధారణ అనువాదము: ఆచార్యులు జ్ఞాన జ్యోతితో శిష్యునికి జ్ఞానోదయము చేయుటచే, వారిని భగవానునితో సమానునిగా భావించవలెను. ఎవరైతే గురువును సాధారణ మానవ మాత్రునిగా భావించెదరో, వారు పొందిన శాస్త్ర జ్ఞానము గజము స్నానము (మట్టిని శిరస్సుపై చల్లుకునే విధముగా) చేసిన దానితో సమానము.
సులభమ్ స్వగురుమ్ త్యక్త్వా దుర్లభమ్ య ఉపాసతే
లబ్ధమ్ త్యక్త్వా ధనమ్ మూడో గుప్తమన్వేషతి క్శితౌ
సాధారణ అనువాదము : సులభముగా పొందగలిగిన ఆచార్యుని వీడి, క్లిష్టతరమైన ఉపాసనలను అవలంబించుట అనునది మన వద్దనున్న సొమ్మును పారవైచి, నిధికై భూమిని తవ్వుటతో సమానము.
చక్షుర్ గమ్యమ్ గురుమ్ త్యక్త్వా శాస్త్ర గమ్యమ్ తు యస్స్మరేత్
హస్తస్తమ్ ఉదగమ్ త్యక్త్వా గనస్తమభి వాన్చతి
సాధారణ అనువాదము : సమీపమున నున్న గురువును వదలివేసి, భగవానునికై ప్రయత్నించుట అనునది దాహర్తితో నున్న వ్యక్తి చేతిలోని నీటిని జార విడచి, ఆకాశములోని వర్షమునకై ఎదురుచూచినట్లు ఉండును.
గురుమ్ త్వంగ్కృత్య హూంగ్కృత్య విప్రమ్ నిర్జిత్య వాదతః
అరణ్యే నిర్జలే దేశే భవంతి బ్రహ్మరాక్షసాః
సాధారణ అనువాదము : తమ ఆచార్యునితో అనుచితముగా భాషించి అణచుటకు పర్యత్నించువారు, నీరు దొరకని అరణ్యములో బ్రహ్మరాక్షసులగుదురు.
ఈ విధముగా, పైన పేర్కొన్న ప్రమాణముల ద్వారా, ఆచార్య అపచారములు వివరించిరి.
అనువాదకుని సూచన : ఈ విధముగా, ఆచార్య అపచారము చేసిన, జరుగు దుష్పలితములను గమనించితిమి. తరువాతి భాగములో మనము భాగవత అపచారము గురించిన ప్రమాణములను తెలుసుకొందాము.
సంస్కృత ప్రమాణములను అనువదించుటకు సహకారము నిచ్చిన శ్రీ రంగనాథన్ స్వామి గారికి ధన్యవాదములు.
సశేషం….
అడియేన్ బొమ్మకంటి గోపిక్రిష్ణమాచార్యులు రామానుజ దాసన్.
మూలము: https://granthams.koyil.org/2013/07/anthimopaya-nishtai-13/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org