అవతారికలో చివరి భాగము అయిన మూడవ భాగమును ఇప్పుడు చూచెదము. తిరువాయిమొళిలో లాగా శ్రీ వచన భూషణము కూడా ద్వయ మహా మంత్రమును విస్తారముగా వివరిస్తోంది అని మణవాళ మహామునులు వివరించుచున్నారు.
దీర్ఘ శరణాగతిగా పిలువబడు తిరువాయిమొళి లాగానే ఈ ప్రబంధము కూడా ద్వయమునకు విషయము. తిరువాయిమొళిలో ఈ విధముగా ద్వయమును గూర్చి వివరింపబడినది :
– మొదటి మూడు పత్తులలో (1-3) ద్వయము యొక్క ఉత్తర ఖండార్ధమును గూర్చి వివరించబడినది.
– తరువాతి మూడు పత్తులలో (4-6), పూర్వ ఖండార్ధమును(ఉపాయము) గూర్చి చెప్పబడినది.
– ఆ తరువాతి నాలుగు పత్తులలో ఈ క్రింది అంశములు విస్తారముగా చెప్పబడినవి :
– అందరినీ తరింపచేయుటకు ఆ సర్వేశ్వరునిలో ఉండు కావాల్సిన కళ్యాణ గుణములు.
– తన విషయమై కాని (ఆత్మ), తనకు సంబంధించినదాని విషయమున కాని తనకి ఎటువంటి సంబంధము లేకుండుట.
– ఆ సర్వేశ్వరునితో తనకు (ఆళ్వార్లకు) గల నిరుపాధిక సంబంధము.
– తాను ప్రార్థించిన విధమునే లభించిన ఫలము
అదే విధముగా శ్రీ వచన భూషణములో కూడా అవే అర్ధములు ప్రతిపాదించబడినవి :
ఆరు ప్రకరణముల విభాగమును బట్టి:
– మొదటి మూడు ప్రకరణములలో ద్వయ మంత్రము పూర్వ ఖండార్ధము వివరించబడినది.
– మొదట శ్రీ మహా లక్ష్మి యొక్క పురుషకారము వివరించబడినది.
– ఉపాయముగా ఆ సర్వేశ్వరుని గూర్చి చెప్పబడినది.
– భగవానుని ఉపాయముగా స్వీకరించు వారి నిష్ఠ గురించి చెప్పబడినది.
– ఫల ప్రాప్తి యందు అధికారముండుటకు కావలసిన వాటిని చెప్పునట్టి ఈ సందర్భమున ఉత్తర ఖండము యొక్క అర్థమును చెప్పి,
– తక్కిన మూడు(3) ప్రకరణములలో
– ద్వయ మహా మంత్రమును ప్రసాదించు ఆచార్యుని పట్ల శిష్యునికి ఉండవలసిన ఉపకార స్మృతి మరియు దాస్య వృత్తి నాల్గవ(4) ప్రకరణమున చెప్పబడినది.
– శిష్యుని మహా విశ్వాసమునకు గల హేతువు అయిన ఆ సర్వేశ్వరుని నిర్హేతుక కృప అయిదవ(5) ప్రకరణమున చెప్పబడినది.
– ద్వయ మహా మంత్రములో రెండు ఖండములలో చెప్పబడిన ఉపాయ, ఉపేయముల తాలూకు ఉత్క్రుష్టమైన అంశములు అనగా ఆచార్యుని పైనే ఆధారపడియుండుట అనునది ఆరవ(6) ప్రకరణములో వివరించబడినది.
ఇప్పుడు తొమ్మిది(9) ప్రకరణములు విభాగమును చూద్దాము :
ద్వయము యొక్క పూర్వ వాక్యమున “ప్రపద్యే” చే తెలుపబడిన భగవత్ స్వీకారము అనునది ఇతర ఉపాయములు అయిన కర్మ, జ్ఞాన, భక్తి యోగములను (ఉపాయాంతరములను) పూర్తిగా విడువనిదే కలుగదు. ప్రపత్తి చేసిన అట్టి అధికారులకే ఈ ప్రపత్తి దినచర్య అనునది వర్తించును. సదాచార్య లక్షణమును చెప్పినప్పుడు దానిని ద్వయమును ఉపదేశించునట్టి ఆచార్యునితో పోల్చి చెప్పడము. దీనితో ఈ పైన చెప్పిన వాటి వలన తొమ్మిది(9) ప్రకరణములు విభాగములో కూడా తిరువాయిమొళి మరియు శ్రీ వచన భూషణము ఒకటే అంశములని అనగా ద్వయ మహా మంత్రమునే వివరించును అనునది స్పష్టమవుతున్నది.
ఇంకా ద్వయ మహా మంత్రమును విస్తారముగా వివరించు ఈ ప్రబంధమున తిరుమంత్రము మరియు చరమ శ్లోకములలో చెప్పిన విషయార్ధములు కూడా కలవు. అది ఏమిటో ఇప్పుడు చూద్దాము:
– డెబ్భై మూడవ సూత్రము(సూత్రము 73) “అహమర్ధత్తుక్క” మొదలుకొని డెబ్భై ఏడవ సూత్రము (సూత్రము 77) “అడియా నెన్ ఴెఴే” మరియు నూట పదకొండవ సూత్రము (సూత్రము 111) “స్వరూప ప్రయుక్తమాన దాస్యమిరే ప్రధానమ్” తో “ప్రణవము” చెప్పబడినది.
– డెబ్భై ఒకటవ సూత్రము (సూత్రము 71) “స్వయత్న నివృత్తి” మరియు నూట యనభైవ సూత్రము (సూత్రము – 180) “తన్నైత్తానే ముడిక్కైయావదు” మొదలుకొని రెండు వందల నలభై మూడవ సూత్రము (సూత్రము 243) “ఇప్పడి సర్వ ప్రకారత్తాలుమ్” వరకు “నమః” పదము చెప్పబడినది.
– డెబ్భై రెండవ సూత్రము (సూత్రము 72) “పర ప్రయోజన ప్రవృత్తి” మరియు ఎనభైయవ సూత్రము (సూత్రము 80)”ఉపేయత్తుక్కు ఇళైయ పెరుమాళాయైుమ్” మరియు రెండు వందల ఎనభైయవ సూత్రము (సూత్రము 281) “కైంకర్యన్దాన్ భక్తి మూలమ్ అల్లాద పోదు” వరకు “నారాయణాయ” పదము చెప్పబడినది.
తరువాత చరమ శ్లోకము అర్థము యొక్క వివరణము:
– నలభై మూడవ సూత్రము (సూత్రము 43) “అజ్ఞానత్తాలే” మొదలుకొని మరియు నూట పదహైదవ సూత్రము (సూత్రము 115) “ప్రాపకాన్తర పరిత్యాగత్తుక్కుమ్” వరకు ఉపాయాంతరములను విడువుట మరియు వాటిని విడువుటకు గల క్రమమును గూర్చి వివరించబడినది. ఇది “సర్వ ధర్మాన్ పరిత్యజ్య” కు వివరణము.
-యాభై అయిదవ సూత్రము (సూత్రము 55) “ఇదు తనక్కు స్వరూపం” మొదలుకొని మరియు అరవై ఆరవ సూత్రము (సూత్రము 66) “ప్రాప్తిక్కు ఉపాయం అవన్ నినైవు” అనునది ఆ సర్వేశ్వరుడే శరణము అని తెలుపబడినది. దీనితో “మామేకం శరణం” అనునది చెప్పబడినది.
– నూట ముప్పై నాల్గవ సూత్రము (సూత్రము 134) “ప్రపత్తి ఉపాయత్తుక్కు” అనునది స్వీకారం యొక్క వైలక్షణ్యమును తెలుపుతున్నది. ఇది “వ్రజ” అను పదమును వివరించింది.
– నూట నలభై మూడవ సూత్రము (సూత్రము 143) “అవనివనై” మొదలుకొని నూట నలభై ఎనిమిదవ సూత్రము (సూత్రము 148) “స్వాతంత్ర్యత్తాలే వరుమ్ పారతంత్ర్యం ప్రబలమ్” వరకు సర్వ ప్రాపములను తొలగించి చేతనులని అంగీకరించునట్టి సర్వేశ్వరుని స్వాతంత్య్రమును చెప్పబడినది. ఇది “అహంత్వా సర్వ పాపోభ్యో మోక్షయిష్యామి” అనునది తెలుపుచున్నది.
– నాలుగు వందల రెండు సూత్రము (సూత్రము 402) “కృపా పలముమ్ అనుభవిత్తే అఴవేణుమ్”అనునది ఫలము సిద్ధించు విషయమై శోకించకు అని చెప్పినందున చరమ శ్లోకము యొక్క ఉత్తరార్థము యొక్క అర్ధము కూడా చెప్పబడినది. ఇది “మాశుచః” ను వివరించుచున్నది.
ఈ విధముగా తిరువాయిమొళికి శ్రీ వచన భూషణమునకు సామ్యమును మరియు శ్రీ వచన భూషణమున ప్రకాశించు రహస్యత్రయమును ఉపోధ్ఘాతములో మణవాళ మహామునులు అనుగ్రహించిన విషయమును మనము సేవించుకున్నాము.
దీనితో పిళ్ళై లోకాచార్యుల శ్రీ వచన భూషణమునకు మణవాళ మహామునుల ఉపోధ్ఘాతము సంపూర్ణము అయినది. అదే విధముగా శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రమునకు ధీటైన గ్రంధము మరొకటి లేదు అని మణవాళ మహామునులు తమ ఉపదేశ రత్తినమాలలో ప్రకటించుయున్నారు కదా.
ఈ క్రింది పాశురములు శ్రీ వచన భూషణ దివ్య శాస్త్రము అనుసంధించుకొనిన పిదప చెప్పుకొనవలెను.
కోదిల్ ఉలగాసిరియన్ కూరకులోత్తమ తాదర్
తీదిల్ తిరుమలైయాళ్వార్ సెళుంగురువై మఴవాళర్
ఓదరియ పుగళ్త్ త్తిరునాఉడైయ పిఴాన్ తాదరుడన్
పోద మణవాళముని పొన్నడిగళ్ పోత్తువనే!
సంక్షిప్త వివరణ :
ఎంతో గొప్ప జ్ఞానులు అయిన మణవాళ మహామునులు వారితో పాటుగా ఎట్టి దోషమూ లేని వారైన పిళ్ళై లోకాచార్యులు, కూర కులోత్తమ దాసులు, తిరుమలై ఆళ్వారు, కురువై వంశమునకు చెందిన అళగియ మణవాళ ప్పెరుమాళ్ పిళ్ళై (మణవాళ మహామునుల తల్లి వైపు తాతగారు), ఎంతో గొప్పవారైన తిరునావీరుడైయ పిరాన్ తాదర్ అణ్ణర్ ల తిరువడి తామరములను ప్రకాశింపజేస్తున్నాను.
వాళి ఉలగాసిరియన్ వాళి అవన్ మన్ను కులమ్
వాళి ముడుమ్బై ఎన్నుమ్ మానగరమ్
వాళి మనమ్ సూళ్ న్దు ప్రెన్బుమ్ మిగు నల్లార్
ఇనమ్ సూళ్ న్దు ఇరుక్కుమ్ ఇరుప్పు
సంక్షిప్త వివరణ :
పిళ్ళై లోకాచార్యులను పాడు! వారి వంశమును పాడు! గొప్ప నగరము అయిన ముడుమ్బై ను పాడు! గొప్ప భాగవతులతో కూడియున్న అట్టి పిళ్ళై లోకాచార్యుల గోష్ఠిని పాడు!
ఓదుమ్ ముడుమ్బై ఉలగాసిరియన్ అరుళ్
ఏదుమ్ మఴవాద ఎమ్పెరుమాన్ నీది
వళువాచ్ చిరునల్లూర్ మామరయోన్ పాదమ్
తోళ్ వార్కు వారా తుయర్
సంక్షిప్త వివరణ :
పిళ్ళై లోకాచార్యుల కృపను ఎప్పుడు స్మరించు వారు, శాస్త్రమును ఎంతో శ్రద్ధగా అవలంబించు వారు వేదమునందు ప్రజ్ఞ కలవారు , సీర్ నల్లూర్ నందు ఉండువారు అయిన కూర కులోత్తమ దాసుల వారి శ్రీ చరణములను అర్చించు వారికి ఎట్టి దుఃఖములు ఉండవు.
అడియేన్ పవన్ రమనుజ డసన్
మూలము : https://granthams.koyil.org/2020/12/04/srivachana-bhushanam-avatharikai-3-english/
పొందుపరిచిన స్థానము – https://granthams.koyil.org
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org