ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 3

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ఫ్రభావ సర్వస్వం

<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 2

 

ఈ క్రింద చూపిన తైత్తరీయోపనిషత్తులోఉన్న ద్రమిడోపనిషత్తు అనే దివ్యప్రబందానికి స్తోత్రంగా అమరివున్నది.  

సహస్రపరమా దేవి శతమూలా శతాంఙుంకరా !

సర్వం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని !!

              పైన చూసిన ‘ దేవి ‘ అన్న ప్రయోగం ప్రకారం ‘ దివు ‘ అన్న ధాతువు నుండి వచ్చింది . ఈ ధాతువులో

అనేక అర్థాలు పేర్కొనబడినవి. 

‘ దివు ‘ క్రీడా విజిగీషా వ్యవహార ద్యుతి స్తుతి మోద మద స్వప్న కాంతి గతిషు !

                  పైన చూసిన  వివరణలో ‘ స్తుతి ‘ పదమే ఇక్కడ సరిపోతుంది. ‘ స్తుతి ‘ అంటే స్తోత్రం, కీర్తన అనే అర్థం వస్తుంది.  దివ్యప్రబందంలో పరమాత్మ కళ్యాణ గుణాలను కీర్తించడమే కావున ‘స్తుతి ‘ అనటమే తగివుంటుందని పూర్వాచార్య మతము.

              ‘ దుర్వా ’ అన్న పదానికి విశేషణంగా ‘ దేవి ‘ అన్న పదం అమరి వుంది , అనగా పసుపు వర్ణమని అర్థం వస్తుంది. ఇలాగే ఆళ్వార్ల పాశురాలకు ‘ పసుంతమిళ్ ‘ అని పిలవబడుతుంది . పరమాత్మను కీర్తించు ‘ పసుంతమిళ్ ‘ అన్న అర్థం రావటం వలన సంస్కృతంలో చెప్పే ఉష్ణం అన్న అర్థం ఇక్కడ వర్తించదు.

తైత్తరీయంలో ఉన్న ‘ సహస్ర పరమా ‘ వేయి పాశురాలతో  కూడినది అని గ్రహించాల్సి వుంది.

        నాయనార్ల ఆచార్య హృదయం సూత్రంలో “ వేదంగళిల్ పౌరుష మానవ గీతా వైష్ణవంగళ్  ప్పోలే , అరుళి చేయల్ సారం “ అని అన్నారు. (ఆళ్వార్ల పాశురాలు వేదాలలో పౌరుష మనవ గీతా వైష్ణముల వంటివి)

         వేదాలలో పురుషసూక్తం , ధర్మ శాస్త్రాలలో మనుధర్మము , భారతంలో భగవద్గీత, పురాణాలలో విష్ణు పురాణం, ఎంత ముఖ్యమైనవో ద్రావిడ వేదంలో తిరువాయిమొళి అంత  ముఖ్యమైనది అని ఆచార్యు పురుషుల అభిప్రాయం .

శతమూలా – నూరు పాశురాలతో కూడినది … తిరువాయిమొళిలోని వెయ్యి పాశురాలు  తిరువిరుత్తం లోని  నూరు పాశురాలతో సంబంధం గలవి.

         నాయనార్ల ఆచార్య హృదయంలో “ఋక్ సామత్తాలే సరసమాయ్  స్తోపత్తాలే పరంబుమా పోలే సోల్లార్ తొడైయల్ ఇసై కూట్ట అమర్ సువై ఆయిరమాయిట్ట్రు .” 

         ఋగ్వేదంలో మధ్య మధ్య సంగీత  స్వరముల వలన అందము ఎలా చేకూరుతుందో ,అలాగే నూరు పాటలు పాడినా అదే అందం   చేకూరుతుంది.  అలాగే  తిరువిరుత్తంలోని  నూరు పాశురాలు, తిరువాయిమొళిలోని వెయ్యి పాశురాలుగా విస్తరించబడింది అనటం అతిశయోక్తి కాదు .  

ముదల్ ఆళ్వారులు

 

శతాంఙుంకరా నూరు పాశురాలు అనే విత్తనం నుండి మొలిచినవి. నాలాయిర దివ్య ప్రబంధము మొదటి ఆళ్వార్ల ముదల్ తిరువందాది , ఇరండాం తిరువందాది , మూండ్రాం తిరువందాది లోని నూరు నూరు , పాశురాల నుండి  మొలిచాయి అనటంలో అతిశయోక్తి ఏమి లేదు .

          

 

తరువాత పదమైన – దుస్వప్ననాశిని. .. దివ్యప్రబంధము మన చెడు స్వప్నాలను పోగొడతాయి. ఈ సందర్భంగా తిరుమంగై ఆళ్వార్లు చెప్పిన పాశురాన్ని చూడాల్సి వుంది .

తిరుమంగై ఆళ్వార్లు

‘ ఊమనార్ కండ కనవిలుం   పళుదాయొళిందన”

      మూగవాడు స్వప్నముతో వృధా చేసే కాలం కన్నా పరమాత్మను తెలుసుకోని కాలమే వృధా అయిన కాలము.  అలాగే పరమాత్మను తెలుసుకోని కాలమే చెడు స్వప్నము వంటి కాలము . చెడు స్వప్నము అని ఎందుకు అన్నారంటే పరమాత్మను తెలుసుకోని వారు ఈ పెద్ద సంసార సాగరంలో పడి దుఃఖిస్తారు. ద్రావిడ వేదము  జీవులకు పరమాత్మను గురించి తెలియ జేసి ఈ పెద్ద సంసార సాగరం నుండి దరి చేరుస్తుంది .

“ ఇప్పత్తినాల్ సన్మం ముడి వెయిది

    నాసం కండీర్ గళేజ్ఞనాలే   “

 ‘  ( ఈ పది పాశురాల వలన ఎడారిలో ఎండమావి  వంటి ఈ జన్మ ముగిసి దుఃఖ సాగరం తొలగి పోతుంది   )

సర్వం హరతు మే పాపం …. మే సర్వం పాపం హరతు…..మన పురాకృత పాపం తత్వ హిత పురుషార్థాలను తెలుసుకోవటానికి ఆటంకంగా ఉన్నవి. ఈ స్తోత్రము అటువంటి పురాకృత పాప రాసిని తొలగ దోస్తుంది .

               ఈ శ్లోకము ఋక్, ద్రావిడ వేదమును పటించేవారి పాపాలను పోగొట్ట మని ప్రార్థిస్తుంది. పరమాత్మ మృదువైన పచ్చదనాన్ని గురించి మాట్లాడే వేయి పాసురాల తిరువాయి మొళిని ప్రధాన అంశంగా కలిగి ఉన్నది. ఇది మొదటి ఆళ్వార్ల తిరువందాడి నుండి విస్తరించబడినది . మన సంసారమనే దుస్వప్నాన్ని పోగొట్టగల శక్తి గలది. 

             ఇంక,  ఏడవ కాండంలో ఐదవ ప్రశ్నలో  వేదేబ్యాస్స్వాహా అని తరువాత గాథాబ్యాస్స్వాహా అని సంస్కృత వేదాన్ని , దివ్యప్రబంధమనే ద్రావిడ వేదాన్ని-‘ వేద , గాథా ‘అన్న ప్రయోగంతో పేర్కొన్నది. స్వామి దేశికులు ‘ గాథా ‘ అన్న ప్రయోగం ద్రమిడోపనిషత్ తాత్పర్య రత్నావళిలో పలు చోట్ల ద్రావిడ వేదమనే అర్థంలో ప్రయోగించారని తెలుస్తున్నది  . ఉదాహరణకు తాత్పర్య రత్నావళి నుండి రెండవ శ్లోకం చూద్దాం .

ప్రజ్ఞాఖ్యే మంథశైలే ప్రథితగుణరుచిం నేత్రయన్ సంప్రదాయం

తత్తల్లబ్ది-ప్రసక్తౌః అనుపధీ –విభుదౌః   అథ్రీతో వెంకటేశః !

తల్పం కల్పామ్తయూనః సత శఠజిదుపనిషత్ -దుగ్ధ –సింధుం విమత్నన్

గ్రథ్నాని స్వాదు-గాథా-లహరి-దశ-శతి –నిర్గతం రత్నజాతం !!   

భావము: నిత్య యవ్వనుడైన శ్రీమన్నారాయణుని కల్యాణగుణాలనే రత్నాలను కలిగివున్న, ఆయన పవళించె పాలకడలి లాంటి, వేయి అలల లాగా వేయి పాశురాలు కలిగివున్న శఠకోపుల దివ్య ముఖము నుండి వెలువడిన భావసముద్రము, దీనిలో నిండి వున్న అమృతోపమానమైన విషయాలను అనుభవించాలని ఆశపడిన ఆస్థీకుల కోరిక మేరకు పూర్వాచార్యులనే కవ్వంతో ఈ అమృత మధనం చేస్తున్నాడు.

ఇక్కడితో ద్రావిడ వేదం యొక్క గొప్పదన్నాన్ని సంస్కృత వేదంతో పోల్చు చర్చ ముగుస్తున్నది.  

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము :  https://granthams.koyil.org/2018/02/01/dramidopanishat-prabhava-sarvasvam-3-english/

archived in https://granthams.koyil.org/

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org

Leave a Comment