శ్రీ: శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః శ్రీ వానాచల మహామునయే నమః
తిరుప్పావై ఉభయ వేదాంతముల సారము. తిరుప్పావై యొక్క అంతర్లీన అర్థాలను సరిగ్గా గ్రహించినవారికి, పరమాత్మ అయిన ఎంపెరుమానుని చేరుకునే మార్గంలో ఎదురయ్యే అన్ని అడ్డంకులు సులభంగా తొలగిపోతాయి.

పిళ్ళై లోకాచార్యులు తమ ముముక్షుప్పడి గ్రంథంలో వివరించిన ప్రకారం, ముముక్షువు (సంసార బంధనాల నుండి విముక్తి పొందాలని, పరమపదంలో నిత్యంగా ఎంపెరుమానుని సేవించాలని ఆకాంక్షించేవాడు) తప్పనిసరిగా అర్థ పంచకం ను సరిగ్గా తెలుసుకోవాలి.
అర్థపంచకం అనగా ఈ ఐదు తత్త్వాలు:
1. పరమాత్మ స్వరూపం – సర్వేశ్వరుని స్వరూపం
2. జీవాత్మ స్వరూపం – జీవుని స్వరూపం
3. ఉపాయ స్వరూపం – జీవుడు పరమాత్మను చేరే మార్గం
4. ఉపేయ స్వరూపం – పరమాత్మను చేరిన తర్వాత జీవుని లక్ష్యం / కర్తవ్యము
5. విరోధి స్వరూపం – జీవుడు పరమ లక్ష్యాన్ని చేరడాన్ని అడ్డుకునే అడ్డంకులు
తిరుప్పావై మొదటి పాశురంలోనే ఆండాళ్ ఈ అర్థ పంచకాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తుంది. ఆమె ఇలా ప్రకటిస్తుంది:
“నారాయణనే నమక్కే పఱై తరువాన్”
(నారాయణుడే మనకే పఱై ప్రసాదించువాడు)
దీని ద్వారా మనకు క్రింది విషయాలు తెలుస్తాయి:
▪ పరమాత్మ స్వరూపం – నారాయణన్
“నారాయణ” శబ్దానికి రెండు ముఖ్య అర్థాలు ఉన్నాయి:
పరత్వం – ఎంపెరుమానుడే ఆధారం; సమస్త జీవాత్మలు ఆయనపై ఆధారపడి ఉన్నాయి.
సౌలభ్యం – ఎంపెరుమానుడు ప్రతి జీవాత్మలో అంతర్యామిగా ఉన్నాడు.
▪ జీవాత్మ స్వరూపం – నమక్కు / నమక్కే
జీవాత్మలు పూర్తిగా ఎంపెరుమానునిపై ఆధారపడినవే.
“నమక్కే” లోని ఏవకారం ద్వారా ఆండాళ్ ఇలా ప్రకటిస్తుంది:
ఆకించన్యము – సమర్పిచడానికి నా దగ్గర ఏమీ లేదు
అనన్య గతిత్వము – నీవే తప్ప ఇంకొక శరణ్యం లేదు, సంపూర్ణ శరణాగతి
▪ ఉపాయ స్వరూపం – నారాయణనే తరువాన్
జీవులకు పరమ ఫలాన్ని ప్రసాదించగలవాడు నారాయణుడొక్కడే.
▪ ఉపేయ స్వరూపం – పఱై
పఱై అనగా –
ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా, ఎంపెరుమానునికి చేసే కైంకర్యము.
▪ విరోధి స్వరూపం
మన స్వాతంత్ర్య భావమే (నేనే చేయగలను అనే అహంకారం) ఎంపెరుమానుని అనుగ్రహానికి అడ్డంకి.
ఈ విషయాలన్నీ పూర్వాచార్యులు తమ వ్యాఖ్యానాలలో విపులంగా వివరించారు.
తిరుప్పావై వ్యాఖ్యానకర్తలు
![]() పెరియవాచ్చాన్ పిళ్ళై- 3000 పడి | ![]() అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ – 6000 పడి |
ఆయ్ జనన్యాచార్యర్ – 2000 పడి , 4000 పడి | ![]() పొన్నడిక్కాల్ జీయర్ – స్వాపదేశం |
పరమాత్మ స్వరూప వివరణ – తిరుప్పావైలో
పార్కడలుళ్ పయ త్తుయిన్ఱ పరమన్ – పాలసముద్రంలో శయనించిన పరమాత్మ
ఓంగి -ప్రపంచాన్ని కొలిచిన ఉత్తముడు
పద్మనాభుడు – నాభిలో పద్మం నుండి బ్రహ్మ జన్మించినవాడు
తూయ పెరునీర్ యమునై తురైవన్ -యమునా తీర నివాసి
గోవిందుడు – గోవులను, భూమాతను ఆనందింపజేసేవాడు
జీవాత్మ స్వరూపం
6వ నుండి 15వ పాశురాల వరకు జీవాత్మ స్వభావం వివరించబడింది.
జీవులు ఎల్లప్పుడూ శ్రీవైష్ణవుల సాంగత్యం కోరాలి, వారి ద్వారా ఎంపెరుమానుని చేరాలి.
16, 17 పాశురాల్లో నిత్యసూరులను స్తుతించాలి అని చెప్పబడింది.
18-20 పాశురాల్లో పిరాట్టి పురుషకారం (నప్పిన్నై నాచియార్) ద్వారా ఎంపెరుమానుని చేరాలని ఉపదేశించబడింది.
విరోధి స్వరూపం
రెండవ పాశురంలో:
“నెయ్యుణ్ణోం, పాలుణ్ణోం” – ఎంపెరుమానుని తప్ప ఇతర భోగ్యాలను స్వీకరించము.
“శెయ్యాదన శెయ్యోమ్” – పూర్వాచార్యులు చేయని పనులను మనం చేయము.
ఇవేగాక, ఉపాయ స్వరూపం, ఉపేయ స్వరూపం కూడా తెలుసుకోవలసిన విషయాలు. వీటిని ఆండాళ్ 28, 29 పాశురాలలో గోపికా భావం గురించి చెబుతూ వివరిస్తుంది. పెరియవాచ్చాన్ పిళ్ళై
మరియు నాయనార్లు ఈ పాశురాలకు ఎంతో అందమైన వ్యాఖ్యానాలు సాయించారు. నాయనార్ల వ్యాఖ్యానం విశేషమైన వివరణతో, అనేక ప్రమాణాలతో ఉంటుంది. ఇప్పుడు ఈ పాశురాల యొక్క సారాంశాన్ని చూద్దాం:
ఉపాయ స్వరూపం
ఈ పాశురంలో ఆండాళ్, శ్రీమన్నారాయణుడే సిద్ధ సాధనం (మన వ్యక్తిగత ప్రయత్నాలతో సాధించాల్సిన అవసరం లేని, స్వయంగా స్థిరంగా ఉన్న ఉపాయం) అని నిరూపణం చేస్తోంది.
ముందుగా ఆమె, తాను కర్మయోగం, జ్ఞానయోగం, భక్తియోగంలో ఏదీ ఆచరించడంలో అన్వయం (సంబంధం/పాల్గొనడం) లేదని ప్రకటిస్తుంది.
మనకు కర్మయోగం లేదు, ఎందుకంటే కర్మయోగానికి అవసరమైన నియమాలు ఏమీ మేము చేయలేదు.
. ఉదాహరణకు:
– మహానుభావుల వెంట నడవాలి; కానీ మనం మహానుభావుల వెంట కాకుండా ఆవుల వెంట నడుస్తున్నాం.
– దివ్యదేశాలకు వెళ్లాలి; కానీ మనం అడవులకు వెళ్తున్నాం. అడవులకు వెళ్లి తపస్సు చేయడం కర్మయోగంగా భావించవచ్చని అనుకున్నా, మనం వెళ్లేది తపస్సు కోసం కాదు—ఆవులకు మేత పెట్టడానికే.
– ఆవులకు మేత పెట్టడం వారి వర్ణాశ్రయ ధర్మమని అనుకున్నా , మనం అన్నీ ఆవులను కాక పాలిచ్చే ఆవులైన ( కఱవై)లను మాత్రమే మాత్రమే పోషిస్తున్నాం; మిగిలినవాటిని పట్టించుకోవడం లేదు.
– భోజనంలో కూడా అనేక నియమాలు ఉంటాయి; కాని మనం ఎలాంటి నియమాలు పాటించం—నడుస్తూ తింటాం, ఏ చేతితో పడితే ఆ చేతితో తింటాం, స్నానం కూడా చేయకుండానే తింటాం.
మనకు జ్ఞానయోగం కూడా లేదు, ఎందుకంటే మేము ( అఱివొన్ఱు మిల్లాద వాయ్ క్కులత్తు)(అసలు జ్ఞానం లేని ఆయర్ కులం)కి చెందినవాళ్లం. అంటే, మాకు నిజమైన జ్ఞానం లేదు.
భక్తి అనేది జ్ఞాన విశేషం (జ్ఞానానికి పరిపక్వ రూపం) కావడంతో, జ్ఞానం లేని మనకు భక్తియోగం చేసే ప్రశ్నే లేదు.
కానీ మనకు ఒక పుణ్యం (శుభఫలం) మాత్రం ఉంది. అదేంటంటే—సనాతన ధర్మ స్వరూపుడైన భగవంతుని (కృష్ణం ధర్మం సనాతనం) మనం పోషిస్తూ, పరిపాలిస్తూ ఉన్నాం. ఇది కూడా మన ప్రయత్నాల వల్ల కాదు; నీవే స్వచ్ఛందంగా మా మధ్యకు వచ్చి నివసించడానికి ఎంచుకున్నావు. కాబట్టి, మనకు బయటి శత్రువులు (కర్మ/జ్ఞాన/భక్తి యోగాలు అనే ఉపాయాలు) లేవు; అలాగే అంతర్గత శత్రువు కూడా లేదు, అంటే స్వగత స్వీకారం (మనమే ఎమ్పెరుమాన్ వద్దకు చేరుటం మరియు మన ప్రయత్నమే ఉపాయంగా భావించడం) కూడా లేదు.
మాకు జ్ఞానం లేనట్టే, నీకు మాత్రం ఎలాంటి దోషాలూ లేవు. నీవు సంపూర్ణంగా కల్యాణ గుణాలతో నిండినవాడవు. ముఖ్యంగా, గోవుల మధ్య గోవిందుని రూపంలో ఉన్నప్పుడు నీ కల్యాణ గుణాలు పూర్తిగా ప్రకాశిస్తాయి. నిత్యసూరుల మధ్య ఉన్నప్పుడు నీ పరత్వం (సర్వోన్నతత్వం) పూర్తిగా వ్యక్తమవుతుంది; కానీ గోపబాలకులు, గోపికల మధ్య ఉన్నప్పుడు నీ సౌలభ్యం (సులభంగా అందుబాటులో ఉండడం) పూర్తిగా వ్యక్తమవుతుంది.
నీవు కేవలం కల్యాణ గుణ సంపన్నుడవే కాకుండా, సిద్ధ సాధనం కూడా. అంతేకాదు,ప్రతీ జీవాత్మలో పరమత్మ అంతర్యామి ఉంటాడు, మరియు పరమాత్మ లేకుండా ఏ జీవి తన స్థితిని నిలబెట్టుకోలేడు. నీవే ఉపదేశించిన తిరుమంత్రంలో, పరమాత్మ-జీవాత్మల మధ్య ఉన్న తొమ్మిది విధాల సంబంధాలను తెలియజేస్తుంది:
– పితా-పుత్ర (తండ్రి-కొడుకు),
– రక్షక-రక్ష్య (రక్షించేవాడు-రక్షింపబడేవాడు),
– శేషి-శేష (స్వామి-దాసుడు),
– భర్తృ-భార్య (భర్త-భార్య),
– జ్ఞేయ-జ్ఞాత (తెలియబడేది-తెలుసుకొనేవాడు),
– స్వామి-సొత్తు (యజమాని-ఆస్తి),
– ఆధార-ఆధేయ (ఆధారం-ఆధారితము),
– ఆత్మ-శరీర (పరమాత్మ-జీవాత్మ),
– భోక్తా-భోగ్య (అనుభవించేవాడు-అనుభవించబడేది).
అందువల్ల, నిన్ను శరణు పొందిన మమ్మల్ని రక్షించే బాధ్యత నీదే.
అజ్ఞానంతో, ప్రేమతో, మేము కొన్నిసార్లు నిన్ను నారాయణా అని పిలిచాం. నీవు ఇక్కడ గోవిందునిగా నీ సౌలభ్యాన్ని స్థాపించడానికి వచ్చినవాడవు; అయినా మేము అలా పిలిచిన విషయాన్ని మరిచిపోయాం. దయచేసి దానికి మమ్మల్ని క్షమించు. (నాయనార్ వ్యాఖ్యానం ప్రకారం, శరణాగతి చేసేటప్పుడు మన తప్పులకు ఎప్పుడూ క్షమాపణ కోరాలి అన్న భావాన్ని ఆండాళ్ ఇక్కడ చూపిస్తోంది.)
నీవే పరమోపాయం. మన చేతుల్లో ఏమీ లేని ఆకించన్యం, ఇతర ఆశ్రయం లేని అనన్యగతిత్వం, మరియు నీవు మమ్మల్ని రక్షించకుండా అడ్డుకోని విలక్కామై మనలో ఉన్నందున, మాకు పరమమైన కైంకర్యాన్ని ప్రసాదించు.
ఈ విధంగా, ఈ పాశురంలో ఆండాళ్ భగవంతుని నిరపేక్ష ఉపాయత్వాన్ని (ఏ ఆశ లేకుండా మమ్మల్ని రక్షించే స్వభావాన్ని) స్థాపిస్తుంది. ఇక్కడ ఆకించన్యత, అనన్యగతిత్వం, విలక్కామై లు ఉపాయంలో భాగాలు కావని, అవి కేవలం అధికారి విశేషణాలు (ముముక్షుడి లక్షణాలు) మాత్రమే అని గ్రహించాలి. ఇవే, భగవంతునికి శరణు కోరే జీవాత్మలను, శరణు కోరని జీవాత్మల నుండి వేరు చేస్తాయి.
ఉపేయ స్వరూపం
ఈ పాశురంలో, ఎంపెరుమాన్కు మాత్రమే ఆనందాన్ని కలిగించే కైంకర్యమే పరమ లక్ష్యం అని ఆండాళ్ నిరూపణం చేస్తోంది.
మేము ఉదయాన్నే నీ వద్దకు వచ్చి శరణాగతి చేస్తున్నాం. ఈ ఉదయకాలాన్ని నాయనార్, ముముక్షువు ఆరంభ దశతో పోల్చారు. అంటే, అజ్ఞానం తొలగిపోయి, కానీ ఇంకా సంపూర్ణంగా ఎంపెరుమాన్పై ఆసక్తి (అనురాగం) పరిపక్వం కాని స్థితి. ఉదయం అనగా పూర్తిగా మేల్కొన్న, తెలిసిన స్థితి అని భావం.
నీవే మమ్మల్ని రక్షించడానికి రావాలి (ఎందుకంటే నీవు స్వామి, మేము నీ సొత్తు); కానీ మేమే నీ వద్దకు వచ్చాము. దండకారణ్య ఋషులు శ్రీరాముణ్ని దర్శించడానికి వచ్చేటప్పుడు, “నేనే ముందుగా వారిని వెతికి వెళ్లాల్సింది; వారు వచ్చి తమ కష్టాలు చెప్పేలా చేయకూడదు” అని శ్రీరాముడు విచారపడినట్లే, ఇక్కడ స్వగత స్వీకారం (మనమే వెళ్లి శరణు పొందడం) ఎంపెరుమాన్ హృదయంలో విషాదాన్ని కలిగించేదిగా చెప్పబడింది; ఎందుకంటే అది సహజం కాదు.
మేము వచ్చాము కాదు; ఇప్పుడు నీకు ప్రణామాలు కూడా అర్పించాము. ఇతర దేవతలు తమ భక్తులు నిరంతరం పూజించాలనే ఆశిస్తారు. కానీ స్వారాధ్యుడు అయిన ఎంపెరుమాన్, సులభంగా ఆరాధింపబడే వాడు. తన భక్తులు ప్రణామాలు చేయాలని కూడా ఆశించడు; వారు తన వైపు వచ్చారని చూడడమే అతనికి అపార ఆనందం. ఇదే ఎంపెరుమానుని గొప్పదనం. కుమారులను చూసినంత మాత్రాన సంతోషించే తండ్రిలాంటివాడు ఎంపెరుమాన్.
వైదికులందరికీ ప్రియమైన నీ సువర్ణ కమల పాదాలను మేము కీర్తించాము. దీనివల్ల ఇంకేదైనా ఫలితం పొందాలనే ఉద్దేశం మాకు లేదు. వాటిని స్తుతించడమే మన పద్ధతి, అదే మన లక్ష్యం.
ఇప్పుడు మా మాట వినండి – పఱై అంటే ఏమిటోె చెప్పబోతున్నాం. నీవు బృందావనంలో అవతరించడం సరిపోదు; మా కోరికలను నెరవేర్చాలి. నీవు స్వచ్ఛందంగా ఈ గోప బాలబాలికల కులంలో జన్మించావు. నీకు తగిన, రహస్యమైన కైంకర్యంలో మమ్మల్ని నియమించాలి. ఇది నీకు విధించబడిన కర్తవ్యమే, ఎందుకంటే నీవే మమ్మల్ని సంస్కరించి, నీపై అత్యున్నత అనురాగాన్ని మాలో పెంచావు; కాబట్టి కైంకర్యంలో కూడా మమ్మల్ని నిమగ్నం చేయాలి.
ఎంపెరుమాన్ “నోంబు (వ్రతం) ఫలాన్ని ఇస్తాను” అన్నప్పుడు, ఆండాళ్ ఇలా వివరిస్తుంది: నోంబు అనేది నిన్ను పూర్తిగా ఆశ్రయించడానికి ఒక కారణం మాత్రమే. కైంకర్యం తప్ప మరే ఫలాన్నీ మేము కోరుకోలేదు.
నీవు ఎక్కడ ఉన్నా, పరమపదంలో అయినా, సంసారంలో అయినా, నీతోనే ఉండాలని ఆమె కోరుతుంది. ఇళయ పెరుమాళ్ (లక్ష్మణుడు) పెరుమాళ్ శ్రీరాముడితో అడవికి వెళ్లి ఎప్పుడూ వేరుకాలేనట్లే, ఆండాళ్ కూడా కన్నన్ ఎంపెరుమాన్తో ఎల్లప్పుడూ ఉండాలని కోరుతుంది. నీవు స్వామి, నేను నీ సొత్తు; ఈ సంబంధం శాశ్వతమైనది కాబట్టి, అది ఎల్లప్పుడూ ప్రత్యక్షంగా వ్యక్తమవ్వాలని ఆమె ఆశిస్తుంది.
చివరికి, ఆమె పరమ లక్ష్యా న్ని ( పరమ పురుషార్ధాన్పి) స్పష్టంగా స్థాపిస్తుంది: ఎంపెరుమాన్కే సేవ చేయాలి; అది కూడా ఆయన ఆనందం కోసమే. భరతాళ్వాన్ కొంతకాలం వేరుగా ఉన్నట్లుగా కాక, ఎల్లప్పుడూ సేవ చేసిన లక్ష్మణుడిలా సేవ చేయాలని ఆమె ఆకాంక్ష.
“మత్రైనం కామంగళ్ మాత్తు”, అంటే మాలో ఉన్న అన్ని ఇతర కోరికలను తొలగించు అని చెప్పడం ద్వారా, ఇతర కోరికలు ఏదీ వద్దని, అలాగే తనకు ఇతర కోర్కెలు ఏమైనా ఉన్నాయని ఎంపెరుమాన్ అనుకోకూడదని ఆమె పక్రటిస్తుంది
ఇదే భావాన్ని నమ్మాళ్వార్ కూడా తిరువాయ్మొళి – ఎమ్మా వీడు (2.9) పాశురంలో
“తనక్కేయాగ ఎనైక్కొళ్ళుమీదే” అని వివరించారు. అంటే, ఎంపెరుమాన్ తన సేవలో తనను పూర్తిగా, కేవలం తన ఆనందం కోసమే నియమించాలి అని అర్థం.
ఈ విధంగా, ఆండాళ్ యొక్క దివ్య వాక్యాల ద్వారా అర్థ పంచకం సంపూర్ణంగా మనకు అవగతమవుతుంది. అంతేగాక, ఎందరో ఆచార్యులు అనుగ్రహించిన అద్భుతమైన వ్యాఖ్యానాలు కూడా మనం తెలుసుకున్నాం.
అడియేన్ ఉషా రామానుజ దాసి
అడియేన్ శ్రీకాంత్ రామానుజదాసన్
ఆంగ్లం లో: https://granthams.koyil.org/2013/01/12/thiruppavai-artha-panchakam/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org


