శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 25
ఆళ్వార్ – ఆళ్వాన్
అతిమానుష స్తవంలో మూడవశ్లోకం ఆళ్వాన్లకు ఆళ్వార్లపై గల భక్తిని ప్రకటిస్తున్నది.
శ్రీమత్పరాంజ్ఞ్కుశ మునీంద్ర మనోనివాసాత్ తజ్జానురాగరసమజ్జనమంజసా22ప్య I
అధ్యాప్యనారతతదుత్తిత రాగయోగం శ్రీరంగారాజా చరణాంబుజ మున్నయామః II
” శ్రీరంగారాజా చరణామ్బుజ మున్నయామహః” అనే శ్లోక భాగమే ఇందులో జీవగర్ర. ఇది శ్రీరంగనాధుని శ్రీపాదపద్మాలను సంకేతిస్తున్నది. సాధారణ కవులు శ్రీరంగనాధుని శ్రీపాదపద్మాలు ఎర్రబడటానికి కారణం ఆ పాదాలమృదుత్వం లేదా మృదువైన పాదాలతో నడవటం వలన అని చెప్తారు. కానీ శ్రీవైష్ణవుల శిరోమణి అయిన నమ్మాళ్వార్లు అలా అనడం లేదు. శ్రీపాదలు ఎర్ర బడటానికి ఒక అందమైన కారణం చెప్పారు.
నమ్మాళ్వార్ల లోతైన హృదయానికి చేరుకున్నపరమాత్మ శ్రీపాదలు అక్కడ భక్తిలో మునిగి, ఆ ప్రేమకు చిహ్నమైన ఎర్రని రంగులో ఉన్నవని వర్ణించారు.
పరమాత్మమీద నమ్మాళ్వార్లకున్న ప్రేమకంటే నమ్మాళ్వార్లమీద అళ్వాన్ కున్నప్రేమ పదిరెట్లు ఎక్కువ. అతిమానుషస్తవం రెండవ భాగంలో కృష్ణావతార అనుభవం వర్ణించడానికి నమ్మాళ్వార్ల దివ్యశ్రీసూక్తులే ఆధారంగా కనపడుతుంది.
సుందరబాహుస్తవంలో పన్నెండవ శ్లోకం ఈ విధంగా ఉంది.
“ వకుళధర సరస్వతీ విషక్త స్వర రస భావయుతాసు కిన్నరీషు!
ద్రవతి ద్రుషదపి ప్రసక్తగానా స్విహ వనశైల తటీషు సుందరస్య !!
కిన్నెర బాలికలు తిరుమాలిరుంశోలైలో సుందరబాహుపెరుమాళ్ళ దగ్గరకువచ్చి, తమ మధురమైన గాత్రంతో నమ్మాళ్వార్ల పాశురాలకు తగినట్లు స్వరపరచి గానం చేయగా, ఆ గానం విన్న రాళ్ళు కరిగి ప్రవహించి అది నూపుర గంగగా మారింది అంటున్నారు.
ఆళ్వార్లు “మరంగళుం ఇరంగుం వగై మణి వణ్ణా ఎన్రు కూవుమాల్” అన్న ఆళ్వార్ల పాశురాన్ని గుర్తు చేస్తున్నారు. ఆళ్వార్ల దైవిక ప్రేమలో పుట్టిన పాటలు రాయిని కూడా కరిగించగల శక్తివంతమైనవి. ఇక మామూలు మనుషుల గురించి చెప్పేదేముంటుంది. ఆ పాశురాలు మానవులందరినీ పరమాత్మ సన్నిధికి చేర్చే శక్తిగలవి.
ఆళ్వాన్, ఆళ్వార్ల పాటలను ఈ భూలోకంలోనే కాక ఇతర అన్నిలోకాలలోనూ భగవంతుడిని చేరాలనుకునే వాళ్ళు పాడతారు అని ఆళ్వార్లను తన ప్రత్యేకమైన శైలిలో కీర్తిస్తున్నారు.
వరదరాజ స్తవం (59) లో పరమాత్మ ఎక్కడెక్కడ ఆనందంగా విశ్రాంతి తీసుకుంటారో చెపుతూ “యత్స్య మూర్థా శఠారే” అని చెప్పారు. పరమాత్మకు విశ్రాంతి తీసుకోవటానికి పరమానందమైన ఆహ్లాదమైన ప్రదేశంగా ఆళ్వార్ల తిరుముడిని ఆళ్వాన్ చెపుతున్నారు.
ఆళ్వాన్ల స్తవాలన్నీ ఆళ్వార్ల పాశురార్థాలుగానే ఉన్నాయి. అయినా కంచి ప్రతివాది భయంకరం అణ్ణంగరాచార్య స్వామివారి వ్యాఖ్యానంలో పేర్కొన్నవాటిలో స్థాలిపులాక న్యాయంగా కొన్నింటిని ఇక్కడ చూద్దాం.
ఆళ్వార్ల శ్రీసూక్తికి, ఆళ్వాన్ల స్తవాలతో ఉన్నపోలిక ఈక్రింద వివరించబడింది.
ఆళ్వాన్ల గ్రంధం | ఆళ్వాన్ల వాక్కు | ఆళ్వార్ల శ్రీసూక్తి | పోలిక |
వైకుంఠ స్థవం (7) | ఊర్ధ్వ పుంసాం…మూర్థిని… చకాస్తి | 1. తిరుమురాలిన్జోలైమలైయే ఎన్ తలియే. 2. ఎన్ ఉచ్చియుళానే (నా రసుపై అధిరోహిం చినవాడా) |
ఆళ్వార్లు, పరమాత్మ దివ్యదేశాలలో వేమ్చేసినట్లు నా శిరసు మీద వేమ్చేశారని చెపుతున్నారు. |
శ్రీవైకుంఠ స్థవం (10) | ప్రేమాగ్ర విహ్వలిత గిరా: పురుషా: పురాణా: | 1. ఉళ్ళెల్లాంఉరుగి కురల్. 2.వేరారావేట్కైనోయ్ మేల్లావి ఉళ్ ఉలర్త . 3.ఆరావముదే అడియే నుడలం నిన్పాల్ అన్బాయే . |
ఆళ్వార్లు పరమాత్మమీద ప్రేమవలన తనస్వరం పరవశించి కంపిస్తున్నదని, అందువలన తన ప్రేమ గొప్పదని అంటున్నారు.
దీనినే ఆళ్వాన్ మహాత్ములకు పరమాత్మమీద భక్తివలన స్వరం కంపిస్తున్నదని, అంటున్నారు. |
శ్రీవైకుంఠ స్థవం (10) | ప్రేమాగ్ర విహ్వలిత గిర: పురుషా: పురాణా: | 1.కేట్టు ఆరార్ వానవర్గళ్ సెవికినియ 2. తొండర్కముదుండ, సోల్ మాలైగళ్ సోన్నేన్ |
ఆళ్వార్లు తన మాటలు పరమాత్మకు, నిత్యసూరులకు, భక్తులకు మధురమైనవిగా అమరినవి అని అంటున్నారు. ఆళ్వాన్ ఆళ్వార్ల వంటి మహాత్ముల వాక్కులు మధురమైనవి అని అంటున్నారు. |
సుందరబాహు స్తవము (4) | ఉదధిగ మంన్దరాద్రి మధి మన్థన లబ్ధ పయో | ఆండాళ్ మదుర రసేన్దిరాహ్వాసుధ సుందరదోఃపరిగమ్! మందిరం నాట్టియన్రు | క్షీరసాగరమధనం గురించి చెప్పబడింది . |
సుందరబాహు స్తవము (5) | శశధర రిజ్ఞ్ఖణాఢ్యశిఖ ముచ్చిఖర ప్రకరం | మదితవళ్ కుడుమి మాలిరుం సోలై | ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము |
సుందరబాహు స్తవము (5) | భిదురిత సప్తలోక సువిశృజ్ఞ్ఖల శజ్ఞ్ఖరవమ్!! | అదిర్ కురల్ శజ్ఞత్తు అళగర్ తమ్ కోయిల్ | ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము ప్రత్యక్ష అనువాదం |
సుందరబాహు స్తవము (8) | మొత్తం శ్లోకం | పెరియాళ్వార్లు – కరువారణం తన్పిడి తణ్ తిరుమాలిరుంశోలైయే | ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము ప్రత్యక్ష అనువాదం |
సుందరబాహు స్తవము (16,17) | ప్రారూఢశ్రియ మాశ్రయే వనగిరేః యం-అరుత-శ్రీ: ఆరూఢశ్రీ | ఆండాళ్ ఏరుతిరుఉడైయాన్ | ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము ప్రత్యక్ష అనువాదం |
సుందరబాహు స్తవము (40) | మొత్తం శ్లోకం | కొల్గిన్ర కోళిరుళై సుగిర్దిట్ట మాయన్ కుళల్ | ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము ప్రత్యక్ష అనువాదం |
సుందరబాహు స్తవము (49) | మొత్తం శ్లోకం | ఆండాళ్ – కళి వండెంగుం కలన్దార్పోల్ మిళిర్ నిన్రు విళైయాడ తిరుమంగై ఆళ్వార్ – మైవణ్ణ నరుం కుంజీ కుళల్ పిన్ తాళ మగరం సేర్ కుళైఇరుపాడి ఇలంగియాడ |
ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్ల అనుభవాన్ని ఆళ్వాన్ శ్లోకంలో కనపదుతుంది . |
సుందరబాహు స్తవము (55) | మొత్తం శ్లోకం | ఆండాళ్ – సేమ్కమలనాణ్ మలర్ మేల్ తేనుగరుమన్నంపోల్ | ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము |
సుందరబాహు స్తవము (62,63) | మొత్తం శ్లోకం | తణ్ తామరై సుమక్కుం పాదపెరుమానై |
ఆళ్వార్ల పాశురంలో ‘సుమక్కుం’ అన్న ప్రయోగ భావాన్ని ఆళ్వాన్ తమ శ్లోకంలో అనుభవించారు. |
సుందరబాహు స్తవము (92) | మొత్తం శ్లోకం | తిరుమంగై – నిలై యిడ మెంగుంమిన్రి | ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము. ఆళ్వాన్, ఆళ్వార్లు ఎంచుకున్న చందస్సులోనే పాడారు. భాగంలో ఆళ్వార్ల, ఆళ్వాన్ల రచనలలోని పోలికలను చూసి తరించాము. |
ద్రావిడ పాశురానికి సంస్కృత శ్లోకము. ఆళ్వాన్, ఆళ్వార్లు ఎంచుకున్న చందస్సులోనే పాడారు.
ఈ భాగంలో ఆళ్వార్ల ,ఆళ్వాన్ల రచనలలోని పోలికలను చూసి తరించాము.
అడియెన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/24/dramidopanishat-prabhava-sarvasvam-26-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org