శ్రీవైష్ణవ తిరువారాధనం – ప్రమాణం

శ్రీః
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్ వరవరమునయే నమః
శ్రీ వానాచల మహామునయే నమః

క్రితం సంచికలో మనం శ్రీ వైష్ణవ తిరువారాధనం యొక్క కీర్తి,ప్రఖ్యాతీ మరియు చేయు విధానమును చూ శాము.

ఆ సంచికలో చాలా శ్లోకములు మరియు పాశురములు  ఉదాహరించినను పూర్తి పట్టిక/అనుక్రమణిక లేకుండెను.ఇక్కడ తిరువారాధనము నందు పఠించే అన్ని శ్లోకములను/ పాశురములను  సంగ్రహించే ప్రయత్నం చేశాము.

శ్రీమన్ నారాయణ – పరమపదం

 

తిరువారాధనం (కోయిల్ ఆళ్వార్ – సన్నిధి)

 

నమ్మాళ్వార్, ఎమ్పెరుమానార్, మామునిగళ్

 

గమనిక:

రహస్య త్రయం మొదలుగు వాటిని పంచ సంస్కారం చేసుకున్నవారు మాత్రమే పఠించ వలెను.

వేద మంత్రములు బ్రహ్మొపదేశము (ఉపనయనము లోని ఒక సంస్కారము) చేసుకున్నవారు మాత్రమే పఠించ వలెను.

ఊర్ద్వ పుణ్డ్ర ధారణం

స్నానం చేసిన తరువాత శుభ్రమైన స్థలమున కూర్చొోని ఊర్ద్వ పుణ్డ్రమును ధరించ వలెను. మొదట 12 ముఖ్యమైన స్థానములలో పుణ్డ్రమును ధరించి తరువాత శ్రీచూర్ణమును ధరించ వలెను. ధరించు సమయమున క్రింది మంత్రములను పఠించ వలెను.

సంఖ్యా- స్థానము-  శ్రీ విష్ణు మంత్రము (తిరుమణ్ ధరించుటకు)  – శ్రీ మహలక్ష్మి మంత్రము (శ్రీచూర్ణము ధరించుటకు)

  1. నుదుట – ఓం కేశవాయ నమః – ఓం శ్రియై నమ:
  2. ఉదరం (మధ్య) – ఓం నారాయణాయ నమః  –  ఓం అమృతోద్భవాయై నమః
  3. వక్షము(మధ్య)  – ఓం మాధవాయ నమః  –  ఓం కమలాయై నమః
  4. మెడ (మధ్య)  – ఓం గోవిందాయ నమః – ఓం చంద్రశోభిన్యై నమః
  5. ఉదరం (కుడి) – ఓం విష్ణవే నమః  –  ఓం విష్ణుపత్న్యై నమః
  6. భుజం (కుడి) – ఓం మధుసూదనాయ నమః  –  ఓం వైష్ణవ్యై నమః
  7. మెడ (కుడి) – ఓం త్రివిక్రమాయ నమః  –  ఓం వరారోహాయై నమః
  8. ఉదరం (ఎడమ) – ఓం వామనాయ నమః  –  ఓం హరివల్లభాయై నమః
  9. భుజం (ఎడమ) – ఓం శ్రీధరాయ నమః  –   ఓం శార్న్గిణ్యై నమః
  10. మెడ (ఎడమ) – ఓం హృషీకేశాయ నమః   –   ఓం దేవ దేవ్యై నమః
  11. వెనుక పై భాగం – ఓం పద్మనాభాయ నమః  –  ఓం మహాలక్ష్మ్యై నమః
  12. వెనుక కింది భాగం – ఓం దామోదరాయ నమః  – ఓం లోకసుందర్యై నమః

గమనిక :

  • ఊర్ద్వ పుణ్డ్రమును నేలపై సుఖముగ కూర్చోని ధరించ వలెను.
  • మిగిలిన తిరుమణ్ మరియు శ్రీచూర్ణమును కడగ రాదు, వాటిని తల మీద తుడువ వలెను.
  • తిరుమణ్ ను చూపుడు వేలు తోనే ధరించ వలెను (ఏ సాధనమును ఉపయొగించ రాదు).
  • అశౌచ కాలమునందు తిరుమణ్ ధరించ వచ్చు, కాని శ్రీచూర్ణమును ధరించ రాదు. వారివారి ఆచారమును గూర్చి పెద్దల వద్ద విచారించి పాటించండి.

గురు పరంపరా ధ్యానం

ఊర్ద్వ పుణ్డ్రమును ధరించిన తరువాత గురు పరంపరను మంత్ర రూపమున (సులభముగా గుర్తించుట కొరకు) మరియు శ్లోక రూపమున ధ్యానించ వలెను. ఆ   రెండు రూపములు కింద ఇవ్వబడినవి.

వాఖ్య గురు పరంపరా (గురు పరంపర మంత్రం)

అస్మద్ గురుభ్యో నమః
అస్మద్ పరమ గురుభ్యో నమః
అస్మద్ సర్వ గురుభ్యో నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీ పరాంకుశ దాసాయ నమః
శ్రీమద్ యామునమునయే నమః
శ్రీ రామమిశ్రాయ నమః
శ్రీ పుండరీకాక్షాయ నమః
శ్రీమన్ నాథమునయే నమః
శ్రీమతే శఠగోపాయ నమః
శ్రీమతే విశ్వక్సేనాయ నమః
శ్రియై నమః
శ్రీధరాయ నమః

శ్లోక గురుపరంపర (శ్లోకం)

అస్మద్ దేశికం  అస్మదీయ పరమాచార్యాన్ శేషాన్ గురూన్
శ్రీమలక్ష్మణ యోగి పుంగవ మహపూర్ణౌ మునిమ్యామునం
రామం పద్మవిలోచనం మునివరం నాథం సతద్వేషిణం
సేనేశం శ్రియం ఇందిరా సహచరం నారాయణం సమాశ్రయే

రహస్య త్రయ అనుసందానం ( మూడు రహస్య మైన మంత్రములను ధ్యానించడం )

గురు పరంపరను ధ్యానించిన తరువాత రహస్య త్రయమును ధ్యానించ వలెను – మూడు రహస్య మంత్రములు

తిరుమంత్రం  – ఓం నమో నారాయణాయ

ద్వయం
శ్రీమన్ నారాయణాయ చరణౌ శరణం ప్రపధ్యై|
శ్రీమతే నారాయణాయ నమః ||

చరమ శ్లోకం (కృష్ణ చరమ శ్లోకం)

సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ|
అహం   త్వా సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి మాశుచః||

వరాహ చరమ శ్లోకం

స్తితే మనసి సుస్వస్తే శరీరే సతియో నరః
దాతాసమ్యే స్తితే స్మర్త్తా విశ్వరూపంచ మామజం
తతస్తం మ్రియమాణంతు కాష్టపాషాణ సన్నిబం
అహం స్మరామి మద్ భక్తం నయామి పరమాం గతిం

శ్రీ రామ చరమ శ్లోకం

సకృదేవ ప్రపన్నాయ త్వాస్మితి చ యాచతే|
అభయం సర్వ భూతేబ్యో దదామి యేతత్ వ్రతం మమ||

ఓరాణ్ వழி   ఆచార్య తనియన్

రహస్య త్రయం తరువాత, పూర్వాచర్యుల తనియన్ లు , పెరియ పెరుమాళ్ నుండి మణవాళ మామును ల వరకు ధ్యానించ వలెను.

శ్రీ స్తనాభరణమ్ తేజః శ్రీరంగేశయమాశ్రయే
చింతామణి మివోద్వాన్తం ఉత్సంగే అనంతభోగినః

నమః శ్రీరంగ నాయక్యై యద్బ్రో విభ్రమ భేదతః
ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నత మిదమ్ జగత్

రంగచంద్రమసం ఇందిరయా విహర్త్తుం
విన్యస్య విశ్వచిద చిన్నయనాధికారం |
యో నిర్వహత్య నిశమఙ్కుళి ముద్రయైవ 
సేనాన్యం అన్య విముఖా  స్తమిహాశ్రయామ: ||

మాతా పితా యువతయ: తనయా విభూతి:
సర్వం యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య : కులపతే: వకుళాభిరామం
శ్రీమత్ తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ||

నమో అచింత్యాద్బుత అక్లిష్ట ఙ్ఞానవైరాగ్య రాశయే !
నాథాయ మునయే అగాధ భగవద్భక్తి సింధవే !!

నమ: పంకజ నేత్రాయ నాథ: శ్రీ పాద పంకజే !
న్యస్త సర్వ భరాయ అస్మత్ కుల నాథయ ధీమతే !!

అయత్నతో యామున మాత్మదాసం అలర్క పత్రార్పణ నిష్క్రయేణ
యఃక్రీతవా నాస్ధితయౌవరాజ్యం నమామి తమ్ రామమేయసత్త్వమ్

యత్ పదామ్భోరుహ ద్యాన విద్వస్తా శేశ కల్మశ:|
వస్తుతాముపయా దోహమ్ యామునేయమ్ నమామితమ్||

కమలాపతి కల్యాణ గుణామ్రుత నిషేవయా 

పూర్ణ కామాయ సతతం పూర్ణయ మహతే నమః

యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మ రుక్మ
వ్యామోహతస్ తదితరాణి తృణాయ మేనే
అస్మద్గురోర్ భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే

రామానుజ పద చాయా గోవిందాహ్వ అనపాయినీ !
తదా యత్త స్వరూపా సా జీయాన్ మద్ విస్రమస్తలీ !!

శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత:
శ్రీవత్సాంక సుత: శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే

  • నంజీయర్ (ఫాల్గుణ మాసము, ఉత్తరా నక్షత్రము )

నమో వేదాన్త వేద్యాయ జగన్ మన్గళ హేతవే

యస్య వాగామృతాసార భూరితం భువన త్రయం

వేదాన్త వేద్య అమ్రుత వారివారిరాశే
వేదార్త సార అమ్రుత పూరమగ్ర్యమ్
ఆదాయ వర్శన్తమ్ అహమ్ ప్రపద్యే
కారుణ్య పూర్ణమ్ కలివైరిదాసమ్

శ్రీ కృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా !
యత్ ప్రసాద ప్రభావేన సర్వ సిద్దిరభూన్మమ !!

లోకాచార్య గురవే క్రిష్ణ పాదస్య సూనవే!
సంసార భోగి సంతష్ట జీవ జీవాతవే నమ: !!

నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే !
ప్రసాదలబ్ద పరమ ప్రాప్య కైంకర్యశాలినే !!

శ్రీశైలేశ దయా పాత్రమ్ ధీభక్త్యాది గుణార్ణవమ్
యతీన్ద్ర ప్రవణమ్ వన్దే రమ్య జామాతరమ్ మునిమ్

రమ్య జామాత్రు యోగీంద్ర పాదరేఖా మయమ్ సదా
తతా యత్తాత్మ సత్తాదిమ్ రామానుజ మునిమ్ భజే

వీటి తరువాత , వారి వారి ఆచార్యుల మఠం / తిరుమాలిగై  పరంపర తనియన్ లను అనుసందింప వలెను.

తరువాత సంధ్యా వందనం మరియు మధ్యాహ్నికం (మధ్యాహ్నం చేయవలసిన తిరువారాధనం) చేయ వలెను.

మంత్ర శ్లోకం (శుద్ధి)

గమనిక : ఉదయ అనుష్ఠాంనమునకు, తిరువారాధనమునకు మధ్య సమయమున మనకు అంటుపట్టుండొచ్చు, కావున శుద్ధి చేయడనికి ఈ మంత్రం

భువి మూర్ధని తదాకాశే తదా భువి|
ఆకాశే భువి మూర్ధ్నిస్యాత్ ఆపోహిష్టేతి మంత్రత: ||

ఆపో హిష్టా మయోభువ: |
తా న ఊర్జే దదాతన: |
మహే రణాయ చక్షశే|
యోవచ్ చివతమో రశ: |
తస్య భాజయతే న: |
ఉసతీరివ మాతర: |
తస్మా అరంగమామ వ: |
యస్య క్ష్యయాయ జిన్వత |
ఆపో జనయతా చ |

తుళసి దళములను సేకరించునప్పుడు నమస్కరిస్తూ కింది శ్లోకమును పఠించ వలెను

తుళస్యమృత జణ్మాసి సదా త్వం కేశవప్రియే|
కేశవార్త్తం లుణామి త్వం వరదా భవ శోభనే||

( గమనిక : తుళసి దళములను అన్ని దినములలోను కోయరాదు)

పొదు తనియన్ లు

(కోయిల్ ఆళ్వార్ సన్నిది ముందు పంచ పాత్రములు మొదలుగునవి అమర్చు సమయమున పఠించ వచ్చు )

మణవాళ మామునుల తనియన్ – నమ్పెరుమాళ్ రచించినది

శ్రీశైలేశ దయా పాత్రమ్ ధీభక్త్యాది గుణార్ణవమ్
యతీన్ద్ర ప్రవణమ్ వన్దే రమ్య జామాతరమ్ మునిమ్

పొన్నడిక్కల్ జీయర్ ల తనియన్ – దొడ్డైయంగార్ (పొన్నడికల్ జీయర్ ల అష్ఠ దిగ్గజులలో  ఒకరు ) రచించినది

రమ్య జామాత్ర యోగీంద్ర పాదరేఖా మయమ్ సదా
తతా యత్తాత్మ సత్తాదిమ్ రామానుజ మునిమ్ భజే

గురుపరంపర తనియన్ – కూరత్తాళ్వాన్ రచించినది

లక్ష్మీనాథ సమారంభం నాథయామున మధ్యమాం|
అస్మద్ ఆచార్య పర్యంతాం వందే గురుపరంపరాం ||

ఎమ్పెరుమానార్ తనియన్ – కూరత్తాళ్వాన్ రచించినది

యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మ రుక్మ
వ్యామోహతస్ తదితరాణి తృణాయ మేనే
అస్మద్గురోర్ భగవతోస్య దయైకసింధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే

నమ్మాళ్వార్ తనియన్ – ఆళవందార్ రచించినది

మాతా పితా యువతయ: తనయా విభూతి:
సర్వం యదేవ నియమేన మదన్వయానాం |
ఆద్యస్య న: కులపతే: వకుళాభిరామం
శ్రీమత్ తదంఘ్రి యుగళం ప్రణమామి మూర్ధ్నా ||

అళ్వార్ లు మరియు ఎమ్పెరుమానార్ తనియన్  – పరాశర భట్టర్ రచించినది

భూతం సరశ్చ మహధావయ భట్టనాథా
శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్
భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్
శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం

గమనిక :ఇక్కడ నుండి దివ్య ప్రబంధ పాశురాలను అనుసంధించ వచ్చును. అనధ్యాయన కాలమునందు దివ్య ప్రబంధ పాశురలకు బదులుగా ఉపదేశ రత్నమాల మరియు తిరువాయ్ మోళి నూఱ్ఱందాది పాశురాలను ధ్యానించ వలెను.

దీపం వెలిగించునప్పుడు చదవ వలసిన శ్లోకం / పాశురం

వైయం తగళియా వార్కడలే నెయ్యాగ
వెయ్య కదిరోన్ విళక్కాగ
శెయ్య సుడర్ ఆళియాన్ అడిక్కే శూట్టినేన్ సొల్ మాలై
ఇడరాళి నిన్ గుగవే ఎన్ఱు  (ముదల్ తిరువందాది ౧)

అన్బే తగళియా ఆర్వమే నెయ్యాగ
ఇంబురుగు చింతై ఇదు తిరియా
నన్బురుగి జ్ఞానచ్ చుడర్ విళక్కు ఏఱ్ఱినేన్ నారణర్కు
జ్ఞానత్ తమిళ్ పురింద నాన్ (ఇరండాం తిరువందాది ౧)

తిరుక్కన్డేన్ పొన్ మేని కండేన్
తిగళుం అరుక్కన్ అణి నిఱముం కండేన్
శెరుక్ కిళరుం పొన్ ఆళి కండేన్ పురి శంగం కైక్కండేన్
ఎన్ ఆళి వణ్ణన్ పాల్ ఇన్ఱు (మూన్ఱాం తిరువందాది 1)

నన్నిధి తలుపులు తెరుచు సమయమున పఠించ వలసిన శ్లోకం

సాష్టాంగ దండం సమర్పించి క్రింది శ్లోకంను  పఠించుము
అపరాధ సహస్ర భాజనం పతితం భీమ భవర్ణవో ధరే|
అగతిం శరణాగతం హరే కృపయా కేవలమాత్మసాత్ కురు||(స్తోత్ర రత్నం 48)

న ధర్మ నిష్ఠోస్మి మి న చాత్మావేది న భక్తిమాన్ త్వచ్చరణారవిందే|
అకించనోనన్యగతిచ్ చరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపద్యే|| (స్తోత్ర రత్నం 22)

జితంతే పుండరీకక్ష నమస్తే విశ్వభావన |
నమస్తేస్తు హృషీకేశ మహాపురుష పూర్వజ|| (జితంతే స్తోత్రం 1)

దేవానాం దానవానాం చ సామాన్యం అదిదైవతం|
సర్వదా చరణద్వంద్వం వ్రజామి శరణం తవ || (జితంతే స్తోత్రం 2)

కౌసల్యా సుప్రజా రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ట కర్తవ్యం దైవమాహ్నికం || ( శ్రీ రామాయణం, శ్రీ వేంకటేశ సుప్రభాతం)

ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద! ఉత్తిష్ఠ గరుడధ్వజ !
ఉత్తిష్ఠ కమలాకంత! త్రైలోక్యం మంగళం కురు || ( శ్రీ రామాయణం, శ్రీ వేంకటేశ సుప్రభాతం)

నాయకనాయ్ నిన్ఱ  నందగోపనుడైయ
కోయిల్ కాప్పానే! కొడిత్ తోన్ఱుం తోరణ
వాయిల్ కాప్పానెేేే! మణిక్కదవం తాళ్ తిఱవాయ్
ఆయర్ శిఱుమియరోముక్కు
అఱైపఱై మాయన్ మణివణ్ణన్ నెన్నలె వాయ్ నేర్న్ దాన్
తూయోమాయ్ వందోం తుయిలెళ్ప్ పాడువాన్
వాయల్ మున్నం మున్నం మాఱ్ఱాదే అమ్మా
నీ నేయ నిలైక్ కదవన్ నీక్కెలొర్ ఎంపావాయ్  (తిరుప్పావై 16 )

మారి మలై ముళంజిల్ మన్నిక్ కిడంతుఱంగుం
శీరియ శింగం అరివుఱ్ఱు తీ విళిత్తు
వేరి మయిర్ పొంగ ఎప్పాడుం పేర్న్దుదఱి
మూరి నిమిర్న్దు ముళంగిప్ పురప్పట్టు
పోదరుమా పొలే నీ పూవైప్ పూవణ్ణా!
ఉన్ కోయిల్ నిన్ఱు ఇంగనే పోందరుళి
కోప్పుడైయ శీరియ సింగాసనత్తిరుందు
యాం వంద కారియం ఆరయ్న్దరుళేలోర్ ఎమ్పావాయ్ (తిరుప్పావై 23)

అన్ఱు ఇవ్వులగం అళందాయ్! అడి పోఱ్ఱి
శెన్ఱు  తెన్నిలంగై శెత్తాయ్! తిఱల్ పోఱ్ఱి
పొన్ఱచ్ చగడముదైత్తాయ్! పుగళ్ పోఱ్ఱి
కన్ఱు కుణిలా ఎఱిందాయ్! కళల్ పోఱ్ఱి
కున్ఱు కుడైయా ఎడుత్తాయ్! గుణం పోఱ్ఱి
వెన్ఱు పగై కెడుక్కుం నిన్ కైయిల్ వేల్ పోఱ్ఱి
ఎన్ఱెన్ఱె ఉన్ శేవకమే ఏత్తి పఱై కొళ్వాన్
ఇన్ఱు యాం వందోం ఇరంగేలోర్ ఎమ్పావాయ్ (తిరుప్పావై 24 )

కూర్మాదీన్ దివ్యలోకాణ్ తదను మణిమయం మండపం తత్ర శేషం
తస్మిం ధర్మాధిపీఠం తదుపరి కమలం చామరగ్రాహిణీశ చ|
విష్ణుం దేవీర్ విభూషాయుదగణం ఉరకం పాదుకే వైనతేయం
సేనేసం ద్వారపాలాన్ కుముదముకగణాన్ విష్ణుభక్తాన్ ప్రపద్యే|| (పురాణ శ్లోకం)

తలుపులు తెరిచిన తరువాత మూడు సార్లు చేతులు తట్ట వలెను

అంగణ్మ జ్ఞాలత్ అరశర్
అభిమాన భంగమాయ్ వందు నిన్ పళ్ళిక్కట్టీల్ కీళే
శంగమిరుప్పార్ పోల్ వందు తలైప్పెయ్దోం
కింగిణీ వాయ్ చెయ్ద తామరై పూప్ పోలే
చెంగణ్ చిఱుచ్ చిఱిదే ఎమ్మేల్ విళియావో
తింగళుం ఆదిత్తియనుం ఎళుందాల్ పోల్
అంగన్ ఇరండుం కొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్
ఎంగళ్ మేల్ శాబం ఇళిందేలోర్ ఎమ్పావాయ్ (తిరుప్పావై 22 )

సవ్యం పాదం ప్రసార్య శ్రితదురితహరం దక్షిణం కుంజయిత్వా
జానున్యాధాయ సవ్యేతరం ఇతరభుజం నాగభోగే నిధాయ|
పశ్చాత్ భాహుద్వయేన ప్రతిపటచమనే ధారయన్ శంఖచక్రే
దేవిభూషాది జుష్ఠో వితరతు భగవాన్ శర్మ వైకుంఠనాథ: || (పురాణ శ్లోకం)

ముందు రోజు పూలను తీయునప్పుడు క్రింది పాశురమును పఠించ వచ్చును

ఉడుత్తుక్ కళైంద నిన్ పీదక వాడై ఉడుత్తుక్ కలత్తతుండు
తొడుత్త తుళాయ్ మలర్ శూడిక్కళైంతన శూడుం ఇత్తొండర్గళోం
విడుత్త తిశై కరుమం తిరుత్తిత్ తిరువోణత్ తిరువిళవిల్
పడుత్త పైన్నాగణైప్ పళ్ళి కొండానుక్కుప్ పల్లాణ్డు కూఱుతుమే (తిరుప్పల్లణ్డు 9)

మంత్రస్నానం చేయుట

స్నానాసనం చేయునప్పుడు పురుష సూక్తం, నారాయణ సూక్తం, విష్ణు సూక్తం, శ్రీ సూక్తం,
భూ సూక్తం, నీళా సూక్తం, పెరియాళ్వార్ తిరుమొళి వెణ్ణెయళైంద కుణుంగు పదిగమును
సమయానుసారం పఠించ వచ్చును.

అలంకారం

మొదట క్రింది శ్లోకం / పాశురమును పఠించ వలెను
గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం|
ఈశరీగుం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం || (శ్రీ సూక్తం )

పూేశుం శాణ్దు ఎన్నెంజమే పునైయుం కణ్ణి ఎనతుడైయ
వాశగం చెయ్మాలైయే వాన్పట్టాడైయుం అ:తే
తేశమాన అణికలనుం ఎన్కైకూప్పిచ్ చెయ్గైయే
ఈశన్ ఞాలముండుమిళ్న్త ఎణ్తై ఏకమూర్త్తిక్కే (తిరువాయ్ మొళి 4.3.2)

ధూపం సమర్పించునప్పుడు చెప్పవలసిన శ్లోకం / పాశురం

ఓం దూరసి దూర్వ దూర్వంతం దూర్వతం యోస్మాన్
దూర్వతి తం దూర్వయం వయం దూర్వామస్ త్వం దేవాణాం అసి
ధుపం ఆక్రాపయామి (ఋగ్ వేదం)
పరివతిల్ ఈశనైప్పాడి విరివతు మేవలుఱువీర్
పిరివగై ఇన్ఱి నన్నీర్ తూయ్ పురివదువుం పుగై పూవే (తిరువాయ్ మొళి 1.6.1)

అనధ్యాయన కాలములో క్రింది పాశురమును అనుసందింపుము

పరివతిల్ ఈశన్పడియై పణ్బుడనే పేశి
అరియనలన్ ఆరాధనైక్కెన్ఱు
ఉరిమైయుడన్ ఓతియరుళ్ మాఱన్ ఒళివిత్తాన్ ఇవ్వులగిల్
పేతైయర్గళ్ తంగళ్ పిఱప్పు (తిరువాయ్ మొళి నూఱ్ఱందాది 6)

దీపం సమర్పించునప్పుడు అనుసందిచవలసిన శ్లోకం / పాశురం

ఉద్దీప్యస్వ జాతవేదోపగ్నన్ నిర్రుతిం మమ|
పసూగుంశ్చ మహ్యమావహ జీవనంచ దిచో దిచ (మహా నారాయణ ఉపనిషద్)

వైయం తగళియ, అన్భే తగళియా, తిరుక్కణ్డేన్ పాశురాలు (ముందే చెప్పినవి )

మంగుల్ తోయ్ సెన్ని వడవేంగడత్తానై
కంగుల్ పుగుందార్గళ్ కాప్పనివాన్
తింగళ్ సదైయేఱ వైత్తనుం తామరై మేలానుం
కుడైయేఱత్ తాం కువిత్తుక్ కొండు (నాన్ ముగన్ తిరువందాది 43)

మంత్ర పుష్పం / వేదారంభం మొదలుగునవి

హరి: ఓం అగ్నిమీళే పురోహితం యగ్యస్య దేవం రుత్విజం| హోతారం రత్ణదాతమం|| హరి: ఓం (రృగ్ వేదం )

హరి: ఓం ఇషే త్వోర్జే త్వా వాయవస్ స్తోపాయవస్ స్త దేవో వస్సవితా ప్రార్ప్పయతు శ్రేష్టతమాయ కర్మణో|| హరి: ఓం (యజుర్ వేదం)

హరి: ఓం  అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే| ని హోతా సత్సి బర్హిషి || హరి: ఓం (సామ వేదం)

హరి: ఓం  సం నో తేవీరబిష్టయ ఆపో భవంతు పితయే| సం యో రబిశ్రవంతు న: || హరి: ఓం (అధర్వన వేదం)

ఓమిత్యగ్రే వ్యాహరేత్|
నమ ఇతి పశ్చాత్|
నారాయణాయేతి ఉపరిష్టాత్|
ఓమిత్యేకాక్షరం|
నమ ఇతి ద్వే అక్షరే|
నారాయణాయేతి పంచాక్షరాణి|
ఏతద్ వై నారాయణస్యాస్టాక్షరం పదం|
యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమిత్యేతి|
అనపబ్రువ సర్వమాయురేతి|
విన్దతే ప్రాజాపత్యం రాయస్పోషం గౌపత్యం|
తతో అమృతత్వ  అస్నుతే తతో అమృతత్వ అస్నుతే ఇతి|
య యేవం వేద|
ఇత్యుపనిషత్|   (ఉపనిషత్)

అత కర్మాణ్యాచారాద్యాని గృఉహ్యన్తే ఉదగయన పూర్వపక్షరహ~: పుణ్యాహేషు కార్యాణి యగ్యోపవీతినా ప్రదక్షిణం |

ఇచ్చామో హి మహాభుం రఘువీరమ్ మహాబలం |
గజేన మహతా యాంతం రామం చట్రావృతాననం || (శ్రీ రామాయణం)

తం దృశ్ట్వా సత్రుహంతారం మహర్షిణాం శ్ఖావహమ్|
బభూవ హృష్టా వైదేహీ భర్తారం పరిషస్వజే||  (శ్రీ రామాయణం)

తాసామావిరభూచ్చౌరి~: స్మయమాన ముఖామ్బుజః|
పీతామ్బరధర~: స్రగ్వీ సాక్షాన్ మన్మత మన్మతః || (శ్రీ భగవతం)

ఏష నారాయణ శ్రీమాన్ క్ష్రీరార్ణవ నికేతనః |
నాగ పర్యంకం ఉత్స్రుజ్య హ్యాగతో మతురం పురీం ||  (శ్రీ విష్ణు పురాణం)

వైకుణ్టేతు పరే లోకే స్రియా సార్ధ్దం జగత్పతిః |
ఆస్తే విష్ణుర్ అచిన్త్యాత్మా భక్తైర్ భాగవ్తైస్ సహ || (లింగ పురాణం)

చెన్ఱాల్ కుడైయాం ఇరుందాల్ సింగాసనమాం
నిన్ఱాల్ మరవడియాం నీళ్ కడలుళ్ ఎన్ఱుం పుణైయం
అణివిళక్కాం పుంపట్టామ్ పుల్కుం అణైయాం
తిరుమాఱ్కు అఱావు  (ముదల్ తిరువందాది  53)

అనద్యయన కాలమున, పై పాశురమునకు బదులుగా క్రింది పాశురాని చదవ వచ్చును
ఎమ్పెరుమానార్ దరిశనం ఎన్ఱే ఇతఱ్కు
నమ్పెరుమాళ్ పెయరిట్టు నాట్టి వైత్తార్
అంబువియోర్ ఇన్దత్ తరిశనత్తై ఎమ్పెరుమానార్ వళర్త్త
అన్తచ్ చెయల్ అఱిగైక్క  (ఉపదేశ రత్తిన మాలై  38)

కదా పునస్ సంక రతాంగ కల్పక ద్వజ అరవింద అన్కుశ వజ్ర లాంచనం|
త్రివిక్రమ త్వత్ చరణాంభుజ ద్వయం మదీయ మూర్దానం అలంకరిశ్యతి ||  (స్తోత్ర రత్న 31)

శ్రీ మాదవాన్గ్రి జలజద్వయ నిత్య సేవా
ప్రేమా విలాసయ పరాంకుశ పాద భక్తాం |
కామాది దోష హరం ఆత్మ పదాస్రితానాం
రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ద్నా ||  (యతిరాజ వింశతి 1)

అర్చనా ( తుళసి లేద పువ్వులను ఉపయోగించవచ్చు)

ఓం కేశవాయ నమః
ఓం నారాయణాయ నమః
ఓం మాధవాయ నమః
ఓం గోవిందాయ నమః
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః
ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః
ఓం శ్రీధరాయ నమః
ఓం హృషీకేశాయ నమః
ఓం పద్మనాభాయ నమః
ఓం దామోదరాయ నమః

ఓం శ్రియై నమ:
ఓం అమృతోద్భవాయై నమః
ఓం కమలాయై నమః
ఓం చంద్రసోదర్యై నమః
ఓం విష్ణపత్న్యై నమః
ఓం వైష్ణవ్యై నమః
ఓం వరారోహాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం శార్న్గిణ్యై నమః
ఓం దేవ దేవ్యై నమః
ఓం లోకసుందర్యై నమః
ఓం మహాలక్ష్మ్యై నమః

దీని తరువాత పొదు తనియన్ లతో మొదలు వీలైనంత పాశురాలను పఠించ వచ్చును

భోజ్యాశనం

భోగం (అన్నం) తయారు చేసి, పెరుమాళ్, తాయార్, ఆళ్వార్, ఆచార్యు లకు …

భోగం పెరుమాళ్ కు నైవేద్యము చేయునప్పుడు క్రింది పాశురాలను/ శ్లోకాలను చెప్పవచ్చును

కూడారై వెల్లుం శీర్ గోవిందా !
ఉందన్నై పాడిపఱై కొణ్డు యాం పెఱుం సన్మానం
నాడు పుగళుం పరిశినాల్ నన్ఱాగ
శూడగమే తోళ్వళైయే తోడే శెవిప్పూవే
పాడగమే యెన్ఱ అనై యప్ పల్కలనుం యాం అణివోం
ఆడై ఉడుప్పోం అదన్ పిన్నే పాల్ శొఱు
మూడ నెయ్ పెయ్దు ముళంగై వళివార
కూడియిరుందు కుళిర్న్దేలోర్ ఎమ్పావై  (తిరుప్పావై 27)

నాఱునఱుం పొళిల్ మాలిరుంచోలై నంబిక్కు
నాన్ నూఱుతడావిల్ వెణ్ణెయ్ వాయ్నేర్న్దు పరావివైత్తేన్
నూఱుతడా నిఱైంద అక్కారవడిసిల్ శొన్నేన్
ఏఱుతిరువుడైయాన్ ఇన్ఱు  వందు ఇవై కొళ్ళుంకొలో  (నాచ్చియార్ తిరుమొళి 9.6)

ఉలగం ఉండ పెరువాయా ఉలప్పిల్ కీర్త్తి అమ్మానే
నిలవుం శుడర్చూళొళి మూర్తి నెడియాయ్ అడియేన్ ఆరుయిరే
తిలదం ఉలగుక్కాయ్ నిన్ఱ తిరువేంకడత్తు ఎమ్పెరుమానే
కులతొల్ అడియేన్ ఉనపాదం కూడుమాఱు కూఱాయే (తిరువాయ్ మొళి 6.10.10)

యా ప్రీతిర్ విధురార్పితే మురరిపో: కుంత్యర్పితే యా ద్రుశి
యా గోవర్దన మూర్ద్ణి య చ ప్రుతుకే స్తన్యే యశోదార్పితే
భారద్వాజ సమర్పితే శబరికా దత్తే ఆదరే యో స్థితం
యా ప్రీతిర్ మునిపత్ని భక్తి రచితే ప్రీత్యర్పితే తాం కురు  (కృష్ణ కర్ణామృతం)

తుదకు, భోగం మును ” అడియేన్ మేవి అమర్గిన్ఱ అముతే! ఆరావముతే అముదు శెయ్తరుళ వేణ్డుం ” అని చెప్పి నైవేద్యము చేయ వలెను.

హారతీ ఇస్తూ ఈ శ్లోకం ను చెప్పవలెను

తద్ విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః| 

దివీవ చక్షురాతతం, తద్విప్రాసో విపన్యవో జాగ్రువాగుం సస్యమిందతే,
విష్ణోర్ యః పరమం పదం  (శ్రీ విష్ణు సూక్తం)
పర్యాప్త్యా అనంతరాయాయస్ సర్వ స్తోమోతి రాత్రం ఉత్తమ
మహర్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వం తేనాప్నోతి సర్వం జయతి ||

శాఱ్ఱుముఱై

  • మంగళ శ్లోకములను (పెరుమాళ్, ఆండాళ్, నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, ఎమ్పెరుమానార్, మామునిగళ్ మరియు ఆచార్యుల మంగళ శ్లోకం) పఠించవలెను
  • శాఱ్ఱుముఱై పాశురాలను పఠించ వలెను
  • శెయ్య తామరై తాళిణై వాళియే… (వాళి తిరునామమ్ – మామునిగళ్) ను పఠిం వలెను
  • తిరువిరున్త మలర్త్ తాళ్గళ్ వాళియే… (వాళి తిరునామమ్ ఒf పొన్నడిక్కాల్ జీయర్) – వానమమాలై ముఠం శిష్యులు పఠించ వలెను
  • ఓరాణ్ వళి ఆచార్య వాళి తిరునామములను మరియు ఆ రోజు యొక్క తిరునక్షత్ర అనుసారం ఆయా ఆళ్వార్/ఆచార్యుల వాళి తిరునామములను పఠించవలెను.

పర్యంకాశనం
క్రింది శ్లోకమును ధ్యానించి తరువాత సన్నిది తలుపులను మూయవలెను
పన్నగదీశ పర్యాంకే రమా హస్తోప తానకే|
సుఖం సేశ్వ గజాద్రీశ సర్వా జాగ్రత జాగ్రత||

క్షీరసాగర తరంగ శికరా, సార తారకిత చారు మూర్త్తయే|
భోగి భోగి సయనీయ సాయినే మాదవాయ మదు విద్విసఃఏ నమః|| (ముకుంద మాలా)

తదుపరి అష్టాంగ నమస్కారం చేసి క్రింది శ్లోకమును చెప్పవలెను
ఉపచారాపదేశేన కృతానహ రహర్మయా|
అపచారాన్ ఇమాన్ సర్వన్ క్షమస్వ పురుషోత్తమ||

ఉఱకల్ ఉఱకల్ ఉఱకల్ ఒణ్ శుడర్ ఆళియే శంగే
అఱవెఱి నాందక వాళే అళగియ శార్న్గమే తణ్డే
ఇఱవు పడామల్ ఇరున్ద ఎణ్మర్ ఉలోగ పాలిర్గాళ్
పఱవై అరైయా ఉఱగల్ పళ్ళి అఱై కుఱిక్ కొణ్మిన్ (పెరియాళ్వార్ తిరుమొళి 5.2.9)

పనికడలిల్ పళ్ళికోళై పళగవిట్టు
ఓడి వందు ఎన్ మనక్కడలుళ్ వాళ వల్ల మాయ మణాళ నంబీ
తనిక్ కడలే తనిచ్చుడరే తని ఉలగే ఎన్ఱెన్ఱు
ఉనక్కు ఇడమాయ్ ఇరుక్క ఎన్నై ఉనక్కు ఉరిత్తాక్కినయే (పెరియాళ్వార్ తిరుమొళి 5.4.9)

అడియేన్ వైష్ణవి రామానుజ దాసి

మూలము: https://granthams.koyil.org/2014/12/srivaishnava-thiruvaradhanam-pramanams/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

0 thoughts on “శ్రీవైష్ణవ తిరువారాధనం – ప్రమాణం”

Leave a Comment