చరమోపాయ నిర్ణయం – అనుబంధము – సింహావలోకనము

శ్రీ:
శ్రీమతే శఠకోపాయ నమః
శ్రీమతే రామానుజాయ నమః
శ్రీమద్వరవరమునయే నమః
శ్రీవానాచల మహామునయే నమః

చరమోపాయ నిర్ణయం

<< ముగింపు

చరమోపాయ నిర్ణయం అనెడి ఈ గ్రంథములో గత అధ్యాయాలలో చూచిన అనేక విషయములను సంక్షిప్తముగా సింహావలోకనము చేసుకుందాం :

  • నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తమ గురువులైన పెరియ వాచ్చాన్ పిళ్ళైని కీర్తించి వారి అనుగ్రహము చేత ఈ గ్రంథము చేయుట జరిగినది. జగదాచార్యులైన శ్రీ రామానుజుల దివ్య గుణ వైభవమును చెబుతూ వారి అనుగ్రహమే శ్రీ వైష్ణవులను తమ చరమ గమ్యమైన పరమపదమునకు కొనిపోవుటకు హేతువు అన్న సత్యమును ప్రధాన భూమికగా చేసి ఈ గ్రంథము చెప్పటం జరిగినది.
  • ఆచార్య రత్నమాలలో ఎమ్బెరుమానార్లు మధ్యలో ప్రకాశించెడి అద్వితీయమైన వజ్రముగా చెప్పబడుచున్నారు.
  • స్వాను వృత్తి మరియు కృపా మాత్ర ప్రసన్నాచార్యుల తత్వములు ఈ గ్రంథములో వివరించిరి. అందులో ఎమ్బెరుమానార్లు కృపా మాత్ర ప్రసన్నాచార్యులుగా జగదోద్ధారకులుగా చెప్పబడినారు.
  • ఎమ్బెరుమానార్ల తిరుముడి సంబంధము చెప్పబడినది.
  • “పొలిగ! పొలిగ!” అను పాశురము ద్వారా నమ్మాళ్వార్లు శ్రీ రామానుజుల భవిష్యదవతారము గూర్చి చెప్పటమే కాక నాథమునులకు స్వప్నములో భవిష్యదాచార్యుని రూపములో దర్శన మిచ్చి నిజ రూపములో భవిష్యదాచార్య విగ్రహమును చెక్కించి ఇచ్చి అనుగ్రహించారు!
  • నాథమునులు ఆ భవిష్యదాచార్య విగ్రహమును ఉయ్యక్కోండార్ కు అనుగ్రహించారు!
  • ఉయ్యక్కోండార్ల నుంచి ఆ విగ్రహము మణక్కాల్ నంబికి దక్కినది!
  • మణక్కాల్ నంబి ఆ విగ్రహమును మరియు పారంపర్యముగా భవిష్యదాచార్య అవతారము గూర్చి వచ్చెడి రహస్య విషయములను ఆళవందార్లకు అనుగ్రహించారు!
  • ఆళవందార్లు ఇళయాళ్వారును తమ తరువాత శ్రీ వైష్ణవ ధర్మ ప్రవక్తకులుగా అనుగ్రహించి ఆశీర్వదించిరి!
  • ఆళవందార్లు భవిష్యదాచార్య విగ్రహమును తత్సంబంధిత రహస్యములను తిరుక్కోష్టియూర్ నంబికి అనుగ్రహించారు!
  • తమ వంశములో ఒక శ్రీ వైష్ణవుడు జన్మించుటచే పితృ దేవతలు ఎలా సంతోషపడతారో అలాగే శ్రీ రామానుజుల మునుపు అవతరించిన ఆచార్యులందరూ శ్రీ రామానుజులు ప్రపన్న కులములో అవతరించుట చేత పరమ సంతోషపడిరి!
  • భగవానుడు, నమ్మాళ్వార్లు, ఎమ్బెరుమానార్లు ఉత్తారకాచార్యులుగా నిరూపింపబడిరి! అందులో ముఖ్యముగా ఎమ్బెరుమానార్ల యొక్క ఉత్తారకత్వము పరమ విశేషముగా వివరింపబడినది!
  • ఎమ్బెరుమానార్ల ఆచార్య పంచకమైన పెరియ నంబి, పెరియ తిరుమల నంబి, తిరుక్కోష్టియూర్ నంబి, తిరువరంగ పెరుమాళ్ అరయర్, తిరుమాలైయాణ్డాన్ తమ ఉపదేశముల ద్వారా ఇతర అనుభవముల ద్వారా ఎమ్బెరుమానారే ఉత్తారకులుగా నమ్మి తమ పిల్లలను సైతం ఎమ్బెరుమానార్లకు శిష్యులుగా చేసినారు!
  • తిరుక్కచ్చి నంబి ద్వారా వరదరాజ పెరుమాళ్ళు ఎమ్బెరుమానార్ల గొప్పతనమును లోకానికి చాటినారు! ఎలాగైతే పెరుమాళ్ళు రామ కృష్ణాది అవతారములలో విశ్వామిత్ర, సాందీపని మొదలగు మహర్షుల వద్ద విద్య నేర్చుకున్నారో ఎమ్బెరుమానార్లు కూడా తమ అవతారములో భాగంగానే ఆళవందార్ల శిష్యులను ఆచార్యులుగా స్వీకరించి వారి వద్ద విద్య నేర్చినారని వరద రాజ పెరుమాళ్ళు చెప్పినారు!
  • వేద వేదాంతములకు వక్ర భాష్యములు చెప్పి భగవత్తత్వమును పక్కదారి పట్టించిన అద్వైతమును మరియు వేదమును వ్యతిరేకించిన శూన్య మాయావాదుల సిద్ధాంతములను ఖండించి వేదాంతమునకు సరియైన భాష్యము చెప్పి పరమాత్మ అస్తిత్వాన్ని కాపాడిన ఎమ్బెరుమానార్లే నిజమైన ఉత్తారకాచార్యులు! కనుక వారిని ఆశ్రయించుటలో మనకు ఎటువంటి సందేహము అవసరం లేదు! ఎందుకంటే భగవంతునికే ఉత్తారకాచార్యుడు శ్రీ ఎమ్బెరుమానార్లు కనుక!
  • ఎమ్బెరుమానార్ల అవతార రహస్యము బహిర్గతము చేయటమైనది! వారి అసలు రూపము నిత్యసూరులకు నాయకుడైన ఆదిశేషుడని తిరుమాళిరుంశోలై అళగర్, క్షీరాబ్ది నాధుడు, సరస్వతి మరియు తామే పలు సందర్భాలలో చెప్పినట్టు ఐతిహ్యములు చెప్ప బడినవి!
  • దేవ పెరుమాళ్, నమ్మాళ్వార్, కూరత్తాళ్వాన్ మొదలగువారి మూలముగా ఉడయవర్ల గొప్పతనము చెప్పటం జరిగినది! ఎమ్బెరుమానార్ల పట్ల శిష్యులకు ఉన్న ప్రేమాతిశయము ఎటువంటిదంటే వారి పరమపద వార్త విని ఎంతో మంది శిష్యులు తత్క్షణమే ప్రాణము విడిచి వారూ పరమపదము చేరిరి!
  • శ్రీ రామానుజుల ఉత్తారకత్వము ఎవ్వరెవ్వరి చేత నిరూపింప బడినదంటే:
    • పలు సందర్భాలలో వారే చెప్పుకొనుట
    • అరుళాళ పెరుమాళ్ ఎమ్బెరుమానార్
    • తిరువేంగడముడైయాన్
    • తిరుక్కురుంగుడి నంబి
    • నడాదూర్ అమ్మాళ్
    • సోమాసియాణ్డాన్
    • కణియనూర్ సిరియాచ్చాన్
    • పొన్నాచ్చియార్  (పిళ్ళై ఉరంగా విల్లి దాసర్ గారి భార్య )
  • ఆళవందార్లకు నాథమునుల మీద మరియు ఎమ్బెరుమానార్ల మీద గల ప్రేమాతిశయము వివరించడం జరిగినది! ఆళవందార్లు ఎమ్బెరుమానార్ల ఉత్తారకత్వమును ప్రతిపాదించుట చెప్పటం జరిగినది!
  • ప్రథమపర్వ నిష్ఠ కన్నా చరమపర్వ నిష్టకున్న గొప్పతనమును వివరంచటం జరిగినది!
  • శ్రీరామానుజుల ఉత్తారకత్వమును ప్రతిపాదించిన వారు:
  • చివరిగా తిరువరంగత్తు అముదనార్లు “ఇరామానుశ నూఱ్ఱందాది” గ్రంథములో చెప్పిన చరమోపాయ నిష్ఠుడు పాటించవలసిన ధర్మ సూత్రములు:
    • ఎమ్బెరుమానార్ల యొక్క భక్తుల సన్నిధే మన పెన్నిధి!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య గుణానుభవమే మన నిత్య విధి!
    • ఎమ్బెరుమానార్ల గొప్పతనమును కీర్తించని వారి సాంగత్యమును విసర్జించ వలెను!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య నామ సంకీర్తనమే (రామానుజ! భాష్యకారా! ఎతిరాజా! ఉడయవరే! ఎమ్బెరుమానారే!) మన జిహ్వకు ఉద్యోగము!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య రూపమే మనకు ధ్యాన చిత్రము!
    • ప్రేమ భావముతో ఎమ్బెరుమానార్ల యొక్క భక్తులకు సేవ చేయాలి!
    • ఎమ్బెరుమానార్ల యొక్క దివ్య మంగళ విగ్రహముతో ఆత్మ సంబంధము కలిగి వుండాలి !
    • ఎమ్బెరుమానార్ల యొక్క శ్రీ చరణాలపై పెట్టిన నమ్మకమే వారి సన్నిధికి మనలను చేరుస్తుంది! అనుమానము శాశ్వత సంసారములోనికి పడదోస్తుంది!

నాయనార్ ఆచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
పెరియ వాచ్చాన్ పిళ్ళై తిరువడిగళే శరణం
ఆళ్వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణం
జీయర్ తిరువడిగళే శరణం
ఆచార్య తిరువడిగళే శరణం

అడియేన్ శ్రీనివాస రామానుజ దాసన్

మూలము :   https://ponnadi.blogspot.in/2012/12/charamopaya-nirnayam-summary-of-events/

పొందుపరిచిన స్థానము: https://granthams.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment