ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం 12

శ్రీ:  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్వరవరమునయే నమః

ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం

 << ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 11

                                                           అవతార ప్రయోజనము

   భగవద్గితలో శ్రీకృష్ణ పరమాత్మ ” పరిత్రాణాయ సాధూనాం వినాసాయచ దుష్కృతాం ధర్మ సంస్థాప నార్థాయ సంభవామి యుగే యుగే” అని అన్నాడు. మంచి వారిని రక్షించటం, దుష్టులను శిషించటం, ధర్మమును స్థాపించటం కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని అన్నాడు .

వీటి కోసం పరమాత్మ తానే ఎందుకు అవతరించాలని ప్రశ్న ఉదయిస్తుంది. ఆయన సర్వజ్ఞుడు, సర్వ వ్యాపి, సర్వ శక్తుడు. ఆయన ఒడిపోవడం అంటూ లేదు. తన సంకల్ప మాత్రంచేత తన అభీష్టాలను నేరవేర్చుకో గలడు . అలాంటి వాడు ఇక్కడ ఎందుకు అవతారించాలి? సర్వశక్తుడైన పరమాత్మ విభవావతారాలు  ధరించడానికి కారణం ఏమిటి ?

 

ఆది శంకరాచార్య
మాధవాచార్య

ఆది శంకరులు ఈ ప్రశ్నను గణనలోకే తీసుకోలేదు. పరమాత్మా వాస్తవంగా అవతరించాల్సిన  అవసరము లేదు, అయినా ‘లోకవత్తు లీలా కైవల్యం’ అనే బ్రహ్మ సూత్రం చెప్పినట్లుగా ఆయన తన లీలను చూపడానికే అవతరిస్తున్నారు అన్నారు మధ్వాచార్యులు. కృష్ణ పరమాత్మ సాదు సమ్రక్షణం అని స్పష్టంగా చెప్పినప్పటికీ వారు ఈ కారణాన్ని వ్యతిరేకించినట్లు, లీల మాత్రమే కారణమని వేరొక అభిప్రాయాన్ని చెప్పారు. పరమాత్మ లీల కోసం మాత్రమే అవతారాలు చేయటం లేదు అని చెప్పటానికి, పై గీతా శ్లోకం ఒక్కటే చాలు . ఇంకా    లోకాలను సృష్టించటానికి , అవతారాలు చేయడానికి కారణాలను, పైన  ఉదహరింపబడిన బ్రహ్మసూత్రం చక్కగా తెలియజేస్తున్నది. కావున ఈ శ్లోకాన్ని అవతార కారణాన్ని మార్చి చెప్పడానికి వినియోగించకూడదు .

 

బ్రహ్మ సూత్రంలోని  అంతరధికరణంలో ‘అంతసత్త ధర్మోపదేశాత్ “ (1-1-21) అన్న సూత్రాన్ని వివరించేటప్పుడు భగవద్రామానుజులు ఈగీతా శ్లోకాన్ని ఉదాహరించారు. తరువాత వారు “సాదవోహి ఉపాసకాః, తత్ పరిత్రాణమేవోద్దేశ్యం, ఆనుషంగికస్తు దుష్క్రుతం వినాస, సంకల్ప మాత్రేణాపి తదుపపత్తే” అని చెప్పారు.

అవతార ప్రధానోద్దేశ్యం ఉపాసకుని, భక్తితో నమస్కరించేవాడిని రక్షించటం మాత్రమే, దుష్ట శిక్షణ అనుషంగికం అవుతుంది. పరమాత్మ అవతరించకుండానే సంకల్ప మాత్రంచేత దుష్టశిక్షణం చేయగలడు .

అర్థాత్, పరమాత్మ అవతరించటం కేవలం దుష్టులను శిక్షించటంకోసం కాదు, అది సంకల్ప మాత్రంలో చేయగలడు. కానీ, భక్తరక్షణం కోసమే అవతరిస్తారు అని గ్రహించాలి. సాధు పరిత్రాణమే ఆయన లక్ష్యము.

 భగవద్రామానుజుల ఈ వివరణ విన్న తరువాత కొందరు దుష్టశిక్షణం లాగా సాధు పరిత్రాణం కూడా సంకల్పమాత్రంతో చేయలేరా! అని ప్రశ్నించవచ్చు . తిరువాయిమోళి తెలియనివారు ఈ వ్యాఖ్యను ఎంత సాధన చేసినా అర్థం కాదు. శ్రీభాష్యం శబ్దాలకు మాత్రం అర్థం చెప్పేవారు ఇలా అంతరార్దాలలోనికి వెళ్ళరు . ఒకవేళ శిష్యుడు ఇలా ప్రశ్నించినా “స్వామియే చెప్పారు కదా! అయన వాక్కును ప్రశ్నించడానికి నువ్వు ఎవ్వరు? అని చెప్పేయవచ్చు . ఈ ఖండనంతో  కూడా శ్రీ భాష్యం స్పష్టంగా, చక్కగా చెప్పినట్లే కనపడవచ్చు . తిరువాయిమోళి నేర్చి , ఆళ్వార్లు, ఎమ్బెరుమానర్లు, జీయరు మనోగతాన్ని తెలుసుకొన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రశ్నకు జవాబు తెలుసుకోగలరు. ఆళ్వార్లు, ఏమ్బెరుమాన్లు, జీయరు ప్రభృతుల మనోగతాన్నివారి కృప చేత పొందాను అని చెప్పే కంచి ప్రతివాదిభయంకరం అణ్ణంగరాచార్యస్వామి కృపవలన మనము ఈ విషయాన్ని తెలుసుకుందాము. వీరందరి శ్రీచరణాలకు ప్రణమిల్లి ఈ విషయాలను తెలుసుకుందాము. తిరువాయిమోళి 3-1-9 పాశురంలో

“  మళుంగాద వైన్నుతియ శక్కరనల్ వలతైయాయ్

తొళుంగాదల్ కళిరళిప్పాన్ పుళ్ళూర్దు తోన్రినయే

మళుంగాద జ్ఞానమే పడైయాగ మలరులకిల్

తొళుమ్పాయార్కు అళిత్తాల్ ఉన్ సుడర్ చోది మరియాదే”

          ఈ పాశురములోని మూడవ పాదములో వచ్చే ‘మళుంగాద జ్ఞానం’  అంటే ఓటమి ఎరగని పరమాత్మ సంకల్ప జ్ఞానము, అర్థాత్ పరమాత్మ హృదయము. సాధు పరిత్రాణానికి పరమాత్మ అవతరించాల్సిన ఆవశ్యకత గురించి ఆళ్వార్లు ఇక్కడ వివరించారు. ‘తొళుంపాయార్కు అళిత్తాల్ ఉన్ సుడర్ శోది మరియాదే’ నువ్వు ప్రత్యక్షంగారాక, అవతారం చేసి  దాసులను రక్షించితే నీతేజస్సుకు, శక్తికి, కీర్తికి మచ్చ ఏర్పడుతుంది. నువ్వు  ప్రత్యక్షంగా వచ్చినప్పుడే నీ కీర్తి ప్రకాశిస్తుం ది అంటున్నారు.

ఆయన తన ఆదిశేషపర్యంకం మీద పవళించి ఉండి కేవల సంకల్ప మాత్రం చేత దాసులను కాపాడితే అయన కీర్తికి మచ్చ ఏర్పడుతుంది. తన దాసులను కాపాడడానికి అయన ప్రేమతో దిగిరావటం అయన దివ్య గుణములలో ఒకటి. అందువలన సాధుపరిత్రాణం సంకల్ప మాత్రంలో జరిగితే అది అయన కీర్తికి మచ్చ అవుతుంది. కానీ అయన  మచ్చలేనివాడు . అందువలన అయన సాధుపరిత్రాణం కోసం అవతరిస్తాడు. ఇది ద్రుఢము.

పై వివరణలు చాలా బాగున్నా పరమాత్మా ఈ ప్రకారంగానే సాధు సమ్రక్షణం చేస్తున్నాడని చెప్పడానికి ప్రమాణాలు ఉన్నాయా? అన్న ప్రశ్న మిగిలి ఉన్నది. దీనికి మన  అళ్వార్లమాటలే పరమ ప్రమాణం.  ఎందుకంటే మన ఆళ్వార్లు ప్రమాణం లేనిదే ఒక్కమాట కూడా చేప్పే వారు కారు. ఈ పాశురములో మొదటి భాగము ఈ ప్రమాణమును సూచిస్తున్నది. ‘తొళుంగాదల్ కళిరళిప్పాన్ పుళ్ళూర్దు తోన్రినయే’ అన్నదే ప్రమాణము. గజేంద్రుడిని  కాపాడడానికి పరమాత్మ గరుడారోహుడై తన నిత్యవిభూతి నుండి దిగి వచ్చాడు. ఒక మొసలిని తానున్నచోటు నుండే సునాయాసంగా సంహరించ గలడు, కానీ భక్త సమ్రక్షణ గుణానికి అది సరిపోదు.. అందువలన అక్కడి నుండి దిగివచ్చి రక్షించాడు .

గజేంద్ర మోక్షంలోని సూక్ష్మమైన  వివరాలను తరువాత చూద్దాము.

అడియేన్ చూడామణి రామానుజ దాసి

మూలము : https://granthams.koyil.org/2018/02/10/dramidopanishat-prabhava-sarvasvam-12-english/

archived in https://granthams.koyil.org/

pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org

Leave a Comment