శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 10
సామ్రాజ్య పట్టాభిషేకం
గద్యత్రయం భక్తులకు ఎంత చదివినా తనివితీరని అతృప్తామృతం. “అఖిలహేయ ప్రత్యనీక” అని ప్రారంభమయ్యే భాగంలో, భగవద్రామానుజులు పరమాత్మ దివ్య స్వరూపమును, దివ్య రూపమును, దివ్య గుణములను, దివ్య ఆభరణములను, దివ్య ఆయుధములను వివరించారు.
“స్వోచిత వివిధ విచిత్రానంత” అని ప్రారంభిచి దివ్యాభారణాలను వర్ణిస్తూ “కిరీట మకుట చూడా వతంస” అని అన్నారు. “కిరీట మకుట చూడావతంస” అనే మూడు పదాలకు అర్థం ఒక్కటే, మూడు ఆయన దివ్య అభిషేకాన్ని, దివ్య శిరస్సును పెర్కొనేవే, ఒకటే విషయాన్ని చెప్పటానికి వీరు ఎందుకు మూడు పదాలను ప్రయోగించారని సందేహం కలుగుతుంది.
ఒక్కొక్క పదము స్వామి దివ్య అభిషేకానికి ఒకొక్క విడదీసి ఒక భాగమును తెలుపుతుంది. వ్యాఖ్యాన చక్రవర్తి పెరియవాచ్చాన్ పిళ్ళై వ్యాఖ్యానంలో ఈ విషయం చక్కగా వివరించారు .
కిరీటము – తల చుట్టూ ఆవరించి వున్న ఆభరణ విశేష అడుగు భాగాన్ని సూచిస్తుంది, మకుఠము తలకు పై భాగాన్ని సూచిస్తుంది, చూడా – కిరీటం ముందు భాగంలో కిరీటం నుండి వేలాడే మణులను సూచిస్తుంది. అవతంసం – అనగా పూవులలా చెవుల దగ్గర అమరి వుండే ఆభరణము. నమ్బెరుమాళ్ళ (శ్రీరంగంలో ఉత్సవ మూర్తులు ) ఉత్సవ సమయంలో భక్తులు వీటిని దర్సించుకునే వుంటారు.
భగవద్రామనుజుల రచనలలో ఆళ్వార్ల అనుభవాన్ని చూస్తున్న ఈ సందర్భంలో ఆళ్వార్ల అనుభవం ఎలా వుందో చూద్దాం .
“పారళంద పెరరసే! ఎం విస్వంబరసే ! ఎమ్మై నీత్తు వంజిత్త ఓ రరసే! “(లోకాలను కొలిచిన రాజాది రాజా! మా విశ్వానికి రాజా! మమ్మల్ని విడి వంచించిన ఓ రాజా!) అన్నారు ఆళ్వార్లు. అరసే అంటే రాజు అని అర్థం .ఈ పదాన్ని మూడు సార్లు ప్రయోగించారు. ఈ మూడింటిలో మూడు ప్రయోగాలకు వేరు వేరు అర్థాలు వున్నాయి.
“పారళంద పెరరసే! “అనటంలో సౌలభ్యంలో రాజు. త్రివిక్రమ అవతారంలో అయన తన శ్రీపాదాలను ప్రతి ఒక్కరి తల మీద ఉంచి తన సౌలభ్యాన్ని చాటుకున్నాడు .
“ ఎం విస్వంబరసే ! “ అంటే పరత్వంలో రాజు. అయన శ్రీవైకుఠంలో నిత్యసూరి నాయకుడుగా తన పరత్వాన్ని ప్రకాశింపచేశాడు అని చెప్పారు.
“ ఎమ్మై నీత్తు వంజిత్త ఓరరసే! “ఆయన ఆళ్వార్లతో చేరటం విడిపోవటం వంటి ప్రణయిత్వం ద్యోతకమవుతుంది. పరమాత్మ మూడు స్థితులలోను రాజుగా ఉండటాన్ని అళగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయంలో ‘పారళంద ఎన్నుం మూన్రు ముడిక్కురియ ఇళ వరసుక్కు “(లోకాలను కొలిచి ఎప్పటికి మూడు రాజ్యాలకు యువరాజు) అని పేర్కొన్నారు .
భగవద్రామానుజులు కిరీట, మకుట, చూడావతంస అని పరమాత్మ పరత్వ , సౌలభ్య, ప్రణ యిత్వాలను, మూడు సామ్రాజ్యాలుగా చూపించారు.
ఇక్కడ ప్రణయిత్వము, సౌలభ్యంలో అంతర్భాగం కదా అని తోస్తుంది. కానీ, అది విడిగా భావించవలసిన ఒక గుణము. సౌలభ్యం చేతనులందరికి చెందిన సామాన్య అనుభవము. ప్రణయిత్వము ఆళ్వార్లకు పరమాత్మా ప్రత్యేకంగా ఇచ్చిన అనుభవము. “ఉండియే ఉడైయే ఉగందిరుక్కుం ఇమ్మండలత్తోర్ ‘అని అందరికి సౌలభ్యం సమానం, కానీ ‘ ఉణ్ణుం శోరుం ,పరుగుం నీరుం తిన్నుం వెత్తిలైయుం ఎల్లాం కన్నణ్ణన్’ అని భావించే ఆళ్వార్లకు మాత్రమే చెందిన అనుభవం ప్రణయిత్వం .
ఇలాంటి విశేష గుణానుభవము ఇంకా పలు సందర్భాలలో కనపడుతాయి. రామనుజులవారే శ్రీభాష్యంలో ఈ విషయాన్నీ ఒక సందర్భంలో చూపించారు.
శ్రీభాష్యం ప్రారంభంలోనే ‘అఖిల భువన జన్మ స్తేమ భంగాది లీలే అని ప్రారంభిచి పరమ పురుషుడైన శ్రీనివాసుడు సమస్త చేతనాచేతనములను సృష్టించి, రక్షించి, సంహరించటం లీల మాత్రంగా చేస్తున్నాడని చెప్పారు. మళ్ళీ ‘వివిధ వినత వ్రాత రక్షైక దీక్షా’ అని సకల భువన రక్షణత్వాన్ని స్తుతించారు. అలాగే ప్రణయిత్వం కూడా ఒక విశేష అనుభవమని చెపుతున్నారు.
పరమాత్మ దివ్య స్వరూపము, దివ్య రూపము, దివ్య గుణములు, దివ్య ఆభరణములు, దివ్య ఆయుధములు మొదలైన వాటిని వివరించాలి.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/09/dramidopanishat-prabhava-sarvasvam-11-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org