శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 14
శ్రీ భట్టనాధ ముఖాబ్జ మిత్రం
భగవద్గీతలో కొన్ని ఉదాహరణలను చూస్తే, భగవద్రామానుజులకు దివ్యప్రబంధలో ఉన్న ప్రావీణ్యం మనకు బోదపడుతుంది. దివ్యప్రబంధలోని మధురిమను జోడించటం వలన వీరి వ్యాఖ్యాన శైలి ప్రత్యేకంగా ఉంటుంది.
“ చతుర్విధా భజంతే మాం “ (భగవద్గీగీత 7-16) అనే శ్లోకమలో నలుగురిని పేర్కొన్నారు. 1. ఆర్తా
2. జిజ్ఞాసు
3.అర్థార్తి
4.జ్ఞాని
ఈ నలుగురి గురించి చెప్పేటప్పుడు వ్యాఖ్యాతలలో అభిప్రాయ బేధాలు కనపడుతున్నాయి. 7వ అధ్యాయంలో శ్రీ కృష్ణుడు తనను శరణాగతి చేయడం వలన మాత్రమే (యే మామేవ ప్రపద్యంతే ) చేతనులు మాయమయమైన ఈలోకంలోని క్లేశాల నుండి బయట పడగలరని (తే మమా మాయాం తరంతి) తన ఉన్నతమైన మాహాత్మ్యాన్ని (దైవిమాయ) ఉపదేశించారు.
ఈ శ్లోకంలో పరమాత్మ తనను శరణాగతి చేసేవారు నాలుగు రకాల వారు అని అన్నారు. శరణాగతి చేసినప్పుడు ‘ప్రపద్యంతే ‘ అన్నవాడు, ఇప్పుడు ‘భజంతే‘ అంటున్నాడు. ‘భజంతే‘ అన్న ప్రయోగానికి శ్రీ శంకరులు, ‘సేవంతే‘ అన్నారు. భక్తీ, శరణాగతి రెంటి అర్థము కైంకర్యము చేయటమే అవుతుంది. పైన చెప్పిన నాలుగు రకాల వారు శ్రీ కృష్ణుని దాసులే.
దీనికి వివరణగా శ్రీ శంకరులు ‘ఆర్తాః‘ = తస్కర వ్యాగ్రా రోగాదినా అబిభూతాః ఆపన్నః
జిజ్ఞాసు = భగవత్ తత్త్వం జ్ఞాతుమిచ్చతి యః
ఆర్తార్థి =ధనకామః
జ్ఞానీ = విష్ణోః తత్వవిత్ ‘ అని వివరించారు .
పై నలుగురు తమకు కావలసినది కోరటంలో వైవిధ్యం కనపడుతుంది. మొదటి వర్గం వారు దొంగల నుండి, క్రూర జంతువుల నుండి, భయంకర వ్యాధుల నుండి తమను కాపాడమని ప్రార్థించేవారు, రెండవ వర్గం వారు భగవత్తత్వాన్ని, కృష్ణతత్వాన్ని అకాంక్షించేవారు, మూడవ వర్గం వారు సంపదను కోరుకునేవారు, నాలుగవ వర్గం వారు భగవత్తత్వం తెలిసిన జ్ఞానులు.
వేదాంతంలో చిత్, అచిత్, ఈశ్వరుడు అని మూడు తత్వాలు ఉండటమే చేతనులలో నాలుగు వర్గాలవారు ఉండటానికి కారణం అని స్వామి రామానుజులు నిర్వహిస్తున్నారు. ఆత్మ, తాను స్వయంగా ఈశ్వర స్వరూపమైన అచిత్తును వెదుకుతూ వెళుతుంది. ఇక్కడే ఈశ్వరుడి భక్తులలో భేదం మొదలవుతున్నది. ఐశ్వర్యాన్ని కోరే వారిలో రెండు రకాలవారుంటారు . ఒకటి భ్రష్టైశ్వర్యం (ఒకప్పుడు సంపదలు ఉండేవి. వాటిని పోగొట్టుకున్నారు ప్రస్తుతం వాటిని పొందటం కోసం ప్రార్థింస్తున్నారు), రెండు అపూర్వఐశ్వర్యం (గతంలో సంపదలు ఏవీలేవు, ఇప్పుడు సంపదలు కోరుకుంటున్నారు). ఈ విభజన చేతనునికో ఈశ్వరుడికో తగనిది. కైవల్య ప్రాప్తి గాని, భగవత్ప్రాప్తి గాని, మోక్షప్రాప్తి గాని, నిరంతరమైనది. దానిని పోగొట్టుకోవటమో మళ్ళీపొందటమో సాద్యం కాదు. అవి కొత్తగా కోరి పోందవలసినవి మాత్రమే. కావున పై నాలుగు రకాల భక్తులు భ్రష్టైశ్వర్య కామః , అపూర్వఐశ్వర్య కామః , కైవల్య కామః , భగవత్ కామః అని అన్నారు.
భగవద్రామానుజుల ఈ వ్యాఖ్యానం ఎక్కడ లభించింది అని ప్రశ్నించుకుంటే, తిరుపల్లాండులో పెరియళ్వార్లు భక్తులను పై నాలుగు వర్గాలుగా పాడినందునే వీరికి ఈ విభజన లభిచింది అని బోధపడుతుంది. మొదటి రెండు పాశురాల తరవాత వరుసగా మూడు పాశురాలలో ఈ భావాన్నే పెరియళ్వార్లు పాడారు.
ఉదాహరణకు ‘వాళాళ్ పట్టు‘ అనే పాశురములో భగవంతుని కోరే వాళ్ళను, ‘ఏడు నిలత్తిల్‘ లో కైవల్యార్థులను, ’అండ కులత్తుక్కు‘ లో అపూర్వైశ్వర్యార్థులను, భ్రష్టైశ్వర్యార్థులను గురించి చెప్పారు. ఈ ప్రబంధంలో పెరియాళ్వార్లు భగవంతుడికి మంగళాశాసనము చేయడానికి కోరికగలవారిని రమ్మని పిలిచారు.
భక్తులకు సంభందించిన భగవద్గీతలో చెప్పిన విభజనను వివరించడానికి రామానుజులు తిరుపల్లాండులోని పెరియాళ్వార్ల శ్రీసూక్తులను ప్రకాశింపచేసారు. అలాగే శ్రీమణవాళమామునులు రామానుజులకు పెరియాళ్వార్ల మీద ఉన్న భక్తిని ప్రకాశింపచేస్తూ ‘శ్రీభట్ట నాధ ముఖాబ్జమిత్రులు‘ అని కొనియాడేవారు.
అడియేన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/13/dramidopanishat-prabhava-sarvasvam-15-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org