శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 18
దివ్య ప్రబంధ(అరుళిచ్చెయల్) అనుసంధానం
దివ్య ప్రబంధము (అరుళిచ్చెయల్) మీద మన ఆళ్వార్లకు ఆచార్యులకు అసమాన్యమైన అభిమానం ఉన్నదన్న విషయం విదితమే. పండితులు, పామరులు అన్న భేదం లేకుండా కోవెలలో స్వామి సన్నిధిలో, వీధిలో జరిగే శోభాయాత్రలో పెరుమాళ్లకు ముందు నడిచే గోష్టి దివ్య ప్రబంధాన్ని సేవించడం మనకు తెలిసిన విషయమే . దివ్య ప్రబంధాన్ని నేర్చుకున్న పెద్దలు అలా వీధిలో పరమాత్మా ముందు సేవిస్తూ గోష్టిగా నడుస్తుంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు, చూసిన కళ్ళదే భాగ్యం కదా! దివ్యప్రబంధ పారాయణమే ఆ స్వామి వీనులకు విందైనదని మన పూర్వాచార్యులు తెలుసుకొని ఈ ఏర్పాటును చేశారు. ఈ ఏర్పాటుకు ఎప్పుడైనా విధి వశాత్తు భంగం వాటిల్లినా అతి త్వరలో మళ్ళీ జరిపించెందుకు తగిన ఎర్పాట్లు చేశారు. శ్రీవైష్ణవులైన వారందరు ఈ కైంకర్యాన్ని కోరుకుంటారు.
కోవెలలలో నిర్వహించే అన్ని కైంకర్యాలలో ఆళ్వార్లు అనుగ్రహించిన ప్రబంధాల ప్రాముఖ్యతను గురించి మన ఆచార్యులు ఎంతగానో కీర్తించారు. అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ తమ ఆచార్య హృదయంలో ఈ పద్దతుల గురించి చక్కగా వివరించారు. శ్రీ వేదాంత దేశికులు కూడా ఇలాంటి ప్రబంధ గోష్టులను ఆదరించి తాము కూడా అందులో పాల్గొన్నట్లు తెలుసున్నది. మన ఆచార్యులు దివ్య ప్రబంధానికి చేసిన విపులమైన వ్యాఖ్యానాల ద్వారా వారికి ఆళ్వార్ల మీద, వారు పాడిన పాశురాల మీద ఎంత భక్తి, ఆదరాలు ఉన్నాయో, అలాగే ఆళ్వార్ల, వారి పాశురాల ప్రభావం ఆచార్యుల మీద ఎంత ఉందో తెలుస్తుంది. దివ్య ప్రబంధానికి శ్రీవైష్ణవం, విశిష్టాద్వైతం అంటే అతిశయోక్తి కాదు. ఆచార్యుల గ్రంధాలను చూస్తేనే ఈ విషయం బోధపడుతుంది.
దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలు, గురుపరంపరా ప్రభావం మొదలైన గ్రంధాలలో చూపిన ఐతిహ్యాల నుండి భగవద్రమానుజుల వంటి ఆచార్యులు, సంస్కృతంలో వేదాంత గ్రందాల రచనలు చేసిన ఆచార్యులకు వీటి మీద ఎంత గొప్ప ఆసక్తి ఉందో తెలుసుకోవచ్చు. భగవద్రమానుజుల సమకాలీనులు, కూరత్తాళ్వాన్ల శిష్యుడు అయిన శ్రీ తిరువరంగత్తముదనార్లు భగవద్రమానుజుల గురించి రాసిన ‘రామానుజ నూత్తందాది’ భగవద్రమానుజులకు దివ్య ప్రబంధం మీద వున్న అపారమైన పట్టును, ప్రేమను తెలియజేస్తుంది. ఈ పాశురాలను తప్పక నేర్చుకోవాలా! అన్న ప్రశ్నకు తావే లేదు. వాటిని అర్థంతో నేర్చి, ఇతరులకు చెప్పి అనుభవించినప్పుడే జీవితానికి అర్థం పరమార్థం దక్కుతుంది అనడంలో సందేహం లేదు.
ప్రతి పనిని విమర్శించేవారు కూడా ఉంటారు కదా! కొందరు వ్యక్తులు, కొన్ని సమూహాలు, అసత్య వాదాలు, అర్థ రహిత వాదాలు చేయటం లోకంలో కనపడుతుంది. సాంప్రదాయ పద్ధతులను వివరించేటప్పుడు వీటికి వేద ప్రమాణాలు లేవని వాదిస్తారు. ఇలాంటి శుష్క వాదాలు చేసేవారు వేదంలోని అంతరార్థాలను ఎరుగరు. కానీ వారి వాదనలను వాక్చాతుర్యంతోను, తప్పుడు వాదాలతోనూ నోరు మూయించాలని ప్రయత్నిస్తారు. వేదాలపై అధిపత్యం లేను వారిని బెదిరించి అదలించి గందరగోళ పరచి నోరుమూయిస్తారు.
ఆగమాలు, వేదాలు నేర్వకుండానే కొందరు కోవేలలో విగ్రహా ప్రతిష్టకు ఆదారాలే లేవంటారు. ఎంతో కొంత నేర్చినవారు తాము ఏది మాట్లాడిన చెల్లుతుందని తమకు ఆ అధికారం ఉందని భ్రమ పడతారు. మన ఆచార్యులు ఎందుకు చెపారు? ఏమి చేశారు, అని లోతుగా తెలుసుకోకుండా నోటికి వచ్చింది చెప్పటం, చేతికి వచ్చింది రాయటం మంచిది కాదు, అది వినాశ హేతువవుతుంది.
ఒక వైపు దివ్యప్రబంధము మీద మన ఆచార్యుల వ్యాఖ్యానాలు మేరుసమానంగా ఉండగా ‘దివ్యప్రబందానికి ఏ మహిమ లేదు’ అని చెప్పేవారి గోష్టి కూడా ఉంది. కోవెలలో దివ్య ప్రబంధము సేవించటం అనూచానంగా వస్తున్నఆచారమని తెలిసినా, దానికి చారిత్రక ఆధారాలు ఉన్నా, వాటికి సంబంధించిన వివరాలు రామానుజుల వారి గ్రంధాలలో ఉన్నా, అలాగా ఎక్కడ ఎవరు చెప్పలేదని వితండ వాదం చేసేవారున్నారు.
ఇది ఒక గుడ్డి వాదన. రామానుజులు రాసిన తొమ్మిది గ్రంధాలలో ఏది వారు ప్రత్యక్షంగా శిష్యులకు బోధించ లేదు, కానీ అందులో చెప్పిన విషయాలు వారి శిష్యప్రశిష్యులు ఆచరించారు, ఇప్పటికి అవి కొనసాగుతూ వస్తున్నాయి. నిత్య గ్రంధం ఒక్కదానిలోనే స్వామి ఆజ్ఞాలను మనం చూడగలుగుతున్నాము. ఇది వారి చివరి గ్రంధము. ఇందులో కోవెలలో నిర్వహించవలసిన కైంకర్య విధానాలను వివరించారు.
స్వామికి దివ్యప్రబంధం మీద అపారమైన భక్తి , ప్రేమ ఉండటం వలన వారు తమ గ్రంధాలలో దివ్య ప్రబందానికి సముచిత స్థానాన్ని ఇచ్చారు. దివ్యప్రబంధం వీనుల విందైనది (సేవిక్కినియ సెంజొల్) అని ప్రసిద్ది గాంచినది. నమ్మాళ్వార్ల తిరువాయిమోళి 10 -6-11 లో ‘కేట్పార్ వానవర్ గళ్ సేవిక్కినియ సెంజొలే’ అని అన్నారు.
నమ్మాళ్వార్ల తిరువాయిమోళి తోనే నిరంతరం మునిగి వుండే స్వామి, ‘శ్రీ సూక్తైః స్తోత్రైః అభిస్తూయ’ అని అన్నారు. అది ఒక శబ్ద ప్రవాహము అది స్తోత్రం, ఎదో ఒక స్తోత్రం కాదు శ్రీ సూక్తి స్తోత్రం …….చేవులకింపైనది.
భగవద్రామానుజులు తమకు ఆళ్వార్ల శ్రీసూక్తులపై ఉన్న అధికారం, మమకారం ప్రకటితమయ్యేట్టుగా వీటిని ఆళ్వార్ల పాశురాలు అనకుండా ఆళ్వార్లె పేర్కోన్నట్టుగా ‘చెవికింపైన మంచి మాటలు’ అనేవారు.
అడియెన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/17/dramidopanishat-prabhava-sarvasvam-19-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org