శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమద్వరవరమునయే నమః
<< ద్రమిడోపనిషత్ ప్రభావ సర్వస్వం – 20
శ్రీభాష్యం మంగళ శ్లోకము-దివ్య ప్రబంధ అనుభవం –రెండవ భాగము
వినత-వివిధ-భూత-వ్రాత-రక్షైక-దీక్షే
పై శ్లోక భాగానికి అర్థమేమిటో చూద్దాం …..
వినత = సమర్పించబడ్డ
వివిధ = వేరువేరుగా ఉన్న (పలు విధాలుగా ఉన్న)
భూత = జీవాత్మలు
వ్రాత = గుంపులు
రక్షైకదీక్షే= వీటి రక్షణ మాత్రమే లక్ష్యంగా ఉన్నవాడు.
ఇది పరమాత్మకు మాత్రమే అపాదించదగిన మాట, ( పలు విధాలుగా ఉన్న జీవాత్మలను రక్షణ మాత్రమే తమ లక్ష్యంగా కలవాడని అర్థం.
ఇది రామానుజులు చెప్పిన అర్థం కాదు . శ్రుత ప్రకాశికా భట్టరు, వేదాంత దేశికులు కూడా వేరు వేరు అర్థాలను చెప్పారు.
సంస్కృతంలో ఈపదాల అర్థం చూద్దాం . ‘ వ్రాత ‘ అన్న పదానికి సమూహ, పరిషత్ అనే పదలు సమానార్థకాలు. ఇది ఒక గుంపు లేక జాతిని తెలియజేస్తుంది. ఉదాహరణకు బ్రాహ్మాణ సమూహము…. పెద్ద బ్రాహ్మాణ సమూహాలను బ్రాహ్మాణులు గుంపుగా ఉన్నచోటును తెలియజేస్తుంది. ఈ సమాసపదము షష్టి తత్పురుషలో ఉంది. రాజపరిషత్ అనే మరొక పదము యొక్క అర్థము రాజుల సమూహము. మంత్రులు, ప్రజలు, వంటి అందరు ఉండి రాజు అధ్వర్యంలో నడుస్తున్నసభ. ఈ సమాసపదము కూడా షష్టితత్పురుషలో ఉన్నా బ్రాహ్మణ సమూహము వంటిది కాదు.
అందువలన ఇలాంటి పదాలు ఒక సమూహము, గుంపు అనే అర్థాలనే కాక రాజుకి, మంత్రికి కుడిన వేరు వేరు అర్థాలను తెలియజేస్తాయి.
‘వ్రాత’ అన్న పదము దాసుల సమూహాన్ని మాత్రమే కాకా వారితో సబంధం ఉన్న వాటిని కూడా తెలియజేస్తుంది. ‘వివిధ’ అన్న సంకేతం వీటిని చూపిస్తున్నది. అలాంటి దాసులతో సంబంధం గల వేరు వేరు గుణాలు, స్థితులు, విభజనలు కలిగి వుండవచ్చు అని తెలుస్తున్నది. అయినప్పటికీ అలాంటి భేద భావము చూపకుండా పరమాత్మ అందరిని రక్షిస్తున్నాడు .
దీనిని నిరూపించే ప్రమాణమును చూదాము.
పసుర్ మనుష్యపక్షిర్వా ఏ చ వైష్ణవ సమార్చయాః
తేనైవ తే ప్రయాస్యంతి తద్విష్ణోః పరమం పదం !
ఒక జంతువో, మనిషో, పక్షియొ ఒక వైష్ణవుడి దగ్గర ఆశ్రయం పొందితే ఆ సంబంధం చేతనే ఆ జీవి ఉన్నతమైన పరమపదమును పొందగలడు. మనిషి అన్న ప్రయోగము జంతువులు, పక్షులు మొదలైన వాటి మధ్య ఉండటమే పై శ్లోకములోని గొప్పదనము. మనిషి అన్న ప్రయోగము ప్రత్యేకముగా లేదు, కానీ సంబంధము మాత్రమే ముఖ్యము అని తెలుస్తున్నది. పరమాత్మ వీడు మనిషి తెలివి గలవాడు అనో, ఇవి జంతువులు తెలివి లెనివనో భావించక సంబంధము మాత్రమే చూసి రక్షిస్తాడు. ‘ఏవ’ అన్న పదము ఇతరములేవి ముఖ్యము కావు అని తెలియజేస్తున్నది.
ఈ అర్థము చాలా ముఖ్యము ఎందుకంటే, ఇది పరమాత్మ యొక్క ఉన్నతమైన గుణాలలో ఒకగుణ విశేషణాన్ని తెలియజేస్తుంది. తమదాసులను కూడా దాటి వారి సంబంధీకులకు కూడా తమకరుణను చూపువాడు అని అర్థము . ఈ అర్థమును గ్రహించ కుంటే ‘వివిధ వ్రాత’ అన్న పదాలు అర్థరహితమైపోతాయి .
ఈ అర్థమే రామానుజులు కోరుకున్నది, దానినే ఆళ్వార్లు కూడా మనసారా తమ పాశురాలలో పాడారు. ఉదాహరణకు ‘పిడిత్తార్ పిడిత్తార్ వీత్తిరుందు పెరియ వానుళ్ నిలావువారే’ (తిరువాయిమోళి 6-10-11 ), “ఏమర్ కీళ్ మెల్ ఎళుపిరప్పుం విడియా వెన్నరకత్తు ఎన్నుం సేర్దాల్ మారినరే” అని పలు సందర్భాలలో ఆళ్వార్లు చెప్పారు.
శ్రీనివాస…..
బ్రహ్మసూత్రాలలో ఎక్కడా లక్ష్మి సంబంధం ప్రత్యేకించి చెప్పినట్లు కనపడదు. కానీ రామానుజులు గ్రంధ సంగ్రహంగా అనుగ్రహించిన ప్రారంభ శ్లోకంలో పరమాత్మ శ్రీనివాసుడని చెప్పారు. ఇది ఆళ్వార్లందరి కంటే ఉన్నతుడైన పరమాత్మను శ్రీఃయపతిగా దర్శించి నందు వలన, ‘శ్రీ’ లేని స్వామిని దర్శించలేకపోవటం చేత చెప్పి ఉండవచ్చు.
భక్తి రూపా శేముషీ భవతు …..
జ్ఞానులకు ఇది ఒక విచిత్రమైన ప్రార్థన. శ్రీనివాసుని గురించిన జ్ఞానము వృద్ది చెందాలనో, శ్రీనివాసుని పై నేను భక్తి కలిగి వుండాలనో కాక శ్రీనివాసునిపై నామనసు భక్తిగా మారాలని కోరుకుంటున్నారు.
ఈ ఒక్క పదంతో రామనుజులు ఆళ్వార్ల నిష్టను గ్రహించి విశిష్టాద్వైత జీవగర్ర లాంటి తత్వాన్ని ప్రవచించారని బోధపడుతుంది . మనకు జ్ఞానమార్గమని భక్తిమార్గమని రెండు మార్గాలున్నాయి. చారిత్రకంగా ఈ రెండు మార్గాలకు ఉన్న భేదాల గురించి విస్త్రుతంగా చర్చించబడింది. భగవద్రామానుజుల విశిష్టాద్వైత వేదాంతాన్ని భక్తి మార్గమని తప్పుగా నిర్వచించారు. ఇందులో ఉన్న గందరగోళం ఏమిటంటే భక్తి మార్గము నిస్సారమైన, వదిలి వేయవలసిన జ్ఞాన మార్గములోని భేదము. జ్ఞాన మార్గము భక్తి అనే ఉత్త భావావేశమైనది అని చెప్పవచ్చు.
విశిష్టాద్వైతం జ్ఞానం మార్గం, భక్తి మార్గం రెండూ విభిన్నమార్గాలని చెప్పదు, రెండు ఒకటేనని చెపుతుంది. ఆత్మ విషయంలో జ్ఞానం భక్తి రూపమైనది, వేరే రూపమైనది కాదు . అందువలన జ్ఞానము నిస్సారమైన సూత్రాల సమాహారం కాదు. భక్తి ఉత్త భావావేశమైనది కాదు. నిరతిశయ, నిరవధిక కల్యాణ గుణములతో మన మనసును ఆకర్షించు స్వరూప రూపములతో అందరిని పాలించు ప్రేమ స్వరూపముగా నిర్హేతుకమైన కృపా సముద్రుడు అనే జ్ఞానమే భక్తి .
భక్తి అంటే పక్వముకాని జ్ఞానహీనుల కోసం ఏర్పాటైన మార్గమని లోకంలో ఒక అపప్రద ఉంది (తాము జ్ఞానవంతులమన్న ఊహ వలన ఇటువంటి ప్రచారము చేసారేమో). ఇది వారు తమను తాము గొప్పగా భావించి చెప్పుకున్న విశేషములు. దీనికి శాస్త్రములో ప్రమాణములు లేవు అని సప్రమాణముగా చెప్పవచ్చు. ఇదే ఆళ్వార్ల ‘మదినలం’ అన్న మాట యొక్క అర్థము .
రామానుజుల ‘శేముషీ’ ….అమరకోశములో ‘మది’, ‘శేముషీ’ రెంటికి ఒకే అర్థము చెప్పబడింది. ‘నలం’ (మంచి) అంటే భక్తి . ఆళ్వార్లు, పరామాత్మ తమకు చేసిన ఉపదేశాల వలన జ్ఞానము జనించింది, భక్తి అంటే పరామాత్మను గురించిన జ్ఞానము అని అంటున్నారు. ఆళ్వార్లు చూపిన మార్గాన్ని రామానుజులు గట్టిగా పట్టుకున్నారు, లోకానికి ప్రకాశవంతమైన మార్గాన్ని చూపించారు, ఆళ్వార్లు వారికి మర్గానిర్దేశకులుగా నిలిచారు.
అడియెన్ చూడామణి రామానుజ దాసి
మూలము : https://granthams.koyil.org/2018/02/19/dramidopanishat-prabhava-sarvasvam-21-english/
archived in https://granthams.koyil.org/
pramEyam (goal) – https://koyil.org
pramANam (scriptures) – https://granthams.koyil.org
pramAthA (preceptors) – https://acharyas.koyil.org
SrIvaishNava Education/Kids Portal – https://pillai.koyil.org