అంతిమోపాయ నిష్ఠ – 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః  శ్రీ వానాచల మహామునయే నమః

అంతిమోపాయ నిష్ఠ

ఇంతకు ముందు వ్యాసములో(https://granthams.koyil.org/2020/05/25/anthimopaya-nishtai-1-telugu/), మనము ఆచార్య వైభవము మరియు శిష్య లక్షణముల గురించి అనేక ప్రమాణములు చూసాము. 

ఆచార్య వైభవము గురించి మరికొన్ని విశేషములు – నిజమైన ఆచార్యుని ఆశ్రయము లభించుట మరువలేని అనుభవము. అనంతమైన చీకటి నుంచి, సరియైన ఆచార్యుని ఆశ్రయము నిజమైన వెలుగును వంటిది.

ఈ క్రింద వాటితో అర్థము చేసుకుందాము.

  • “పుణ్యామ్బోజ వికాసాయ పాపద్వాన్త క్షయాయ చ; శ్రీమాన్ ఆవిరబూత్బూమౌ రామానుజ దివాకరః” – ఏ విధముగా తామర పువ్వు భాస్కరుని దర్శించిననే వికసించునో, అట్లే మన సర్వ పాపములు, అజ్ఞానము దివ్యులైన రామానుజుల వారి పుణ్య ప్రదమైన దర్శన భాగ్యముచే తొలగిపోవును .
  • “ఆదిత్య రామ దివాకర అచ్యుత బానుక్కళుక్కు ప్పోగాత ఉళ్ళిరుళ్ నీన్గి, సోశియాత పిఱవిక్కడల్ వఱ్ఱి, వికసియాత పోతిల్ కమల మలర్ న్తతు వకుళ బూషణ బాస్కరోదయత్తిలే” – ఈ లౌకిక జగత్తు లోని అజ్ఞానము, తెలివిలేని తనములు శ్రీరామ , శ్రీకృష్ణ అవతారములతో తొలగింపబడలేదు. కాని, అవి నమ్మాళ్వార్ (వకుళాభరణన్) రాకతో తొలగించబడినవి.

ఈ విధముగా ఆచార్యుని యొక్క రూప దర్శనము వల్ల సంసారము/లౌకిక జగత్తులోని అనంతమైన అజ్ఞానము తొలగించబడునని చెప్పవచ్చు. భాగవతుని దయార్ద దృష్టి ఎవరిపై ప్రసరిస్తుందో, వారి లక్ష్యాన్ని చేరే అన్ని అడ్డంకులు / అవరోధాలు తొలగిపోతాయి. ఎంతటి పాపాత్ములైన వారైనా ఆచార్యుని ఆశ్రయము వల్ల అన్ని కర్మల నుంచి విముక్తి పొంది, పూర్తిగా పుణ్యాత్ములై, దివ్యమైన శ్రీమన్నారాయణుని పరమపద ప్రాప్తి పొందగలరు.

దీనిపై మరింత అవగాహన కొరకు ఈ క్రింది సూచికలు :

ఆర్తి ప్రబంధము – 45

నారాయణన్ తిరుమాల్ నారమ్ నామ్ ఎన్నుమ్ ముఱై
ఆరాయిల్ నెన్జే అనాది అన్ఱో – శీరారుమ్
ఆచారియనాలే అన్ఱో నామ్ ఉయ్ న్దదు ఎన్ఱు
కూచామల్ ఎప్పొళుదుమ్ కూఱు

ఓ మనసా ! జీవాత్మలైన మనకు పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుని మధ్య ఉన్న బంధము శాశ్వతమైనది. దీనిని మన ఆచార్యుల దివ్య ఆదేశాలమేర మాత్రమే గుర్తించి జ్ఞానులమౌతాము. అందులకే మన ఆచార్యులపై భయమును వీడి సర్వదా కృతజ్ఞతా భావముతో ఉండవలెను .

శ్రీ వచన భూషణము – సూత్రము 408 మరియు 409

ఉన్ ణ్డపోతొరు వార్ త్తైయుమ్ ఉన్ ణ్నాపోతొరు వార్తైయుమ్ చొల్లువార్ పత్తుప్పేరున్ణ్ డిరే, అవర్గళ్ పాశురమ్ కొన్ ణ్డన్ఱు ఇవ్వర్ త్తమ్ అఱుతియిడువతు

భగవత్ అనుభవము పొందిన పది మంది ఆళ్వార్లు, ఆ సమయములో భాగవతులను కీర్తిస్తారు. కానీ ఆ అనుభవము లేనప్పుడు వారిని అవహేళన చేస్తారు  (ఆ అనుభవము నుంచి దూరమైనామనే అమిత విచారంతో). అట్టి ఆళ్వారుల మాటల ద్వారా  ఆచార్య వైభవమును నిరూపించలేము.

అవర్గళై చ్చిరిత్తిరుప్పార్ ఒరువరున్ ణ్డిఱే; అవర్ పాశురమ్ కొన్ ణ్డు ఇవ్వత్ త్తమ్ అఱుతియిడక్కడవోమ్

నమ్మాళ్వార్లను మాత్రమే సదా కీర్తించే మధురకవి ఆళ్వార్ ఇతర ఆళ్వార్లపై చిన్న చూపుతో వుంటారు . వారి మాటల ద్వారా  ఆచార్య వైభవమును నిరూపించవచ్చు  .

అనువాదకుని సూచన: ఎవరైతే నమ్మాళ్వార్లను భక్తితో అనుసరిస్తారో, వారికి తప్పక శ్రీవైకుంఠము (పరమపదము) ప్రాప్తమగునని మధురకవి ఆళ్వార్లు కణ్ణినుణ్ శిఱుతాంబు చివరి పాశురములో ప్రకటించారు .

నమ్మాళ్వార్ , మధురకవి ఆళ్వార్ , నాథమునిగళ్ కాంచీపురం

నమ్మాళ్వార్ , ఎమ్బెరుమానార్ – ఆళ్వార్ తిరునగరి

అనువాదకుని గమనిక: తదుపరి వివరణలో ఎమ్బెరుమానార్లపై నమ్మాళ్వార్ల పలుకులను వానికి సరియైన మధురకవి ఆళ్వార్ పలుకులతో పోల్చుతున్నారు. అట్టి పోలిక ద్వారా ఆచార్యుని ఉత్కృష్టత సాక్షాత్తు భగవానుని గొప్పదనము కన్నా అధికము అని అర్ధమగుచున్నది. ముద్రితమైన గ్రంథములో ఈ వివరణ సంపూర్ణముగా లేదని గుర్తించబడినది.

పరమాచార్యులైన నమ్మాళ్వార్ల పదాలు :

శ్రీ మధురకవి ఆళ్వార్ల పదాలు :

అప్పొళుతైక్కప్పొళుతు ఎన్ ఆరావముదమ్ – ప్రతి క్షణము  భగవానుడే నాకు దివ్య అమృత తుల్యుడు తెన్కురుకూర్ నమ్బి ఎన్ఱక్కాల్ అణ్ణిక్కుమ్ అముదూరుమ్ ఎన్నావుక్కే –  నమ్మాళ్వార్ల నామములు  నేను పలుకుటే,  నాకు అమృత తుల్యము
మలక్కు నావుడైయేన్ – ఎమ్బెరుమాన్ కీర్తిని వర్ణించి పాడుటయే నాకు అత్యంత రుచికరము. నావినాల్ నవిఱ్ఱు ఇన్బమెయ్తినేన్ – నమ్మాళ్వార్ కీర్తిని గురించి భాషించినప్పుడు, నేను చాలా ఆనంద పరవశుడనౌతాను .
అడిక్కీழ் అమర్ న్దు పుగున్తేన్ – తిరువేంకటముడయాన్ చరణ కమలముల వద్ద ఆశ్రయము పొందినాను. మేవినేన్ అవన్ పొన్నడి మెయ్ మ్మైయే – నమ్మాళ్వార్ యొక్క  సువర్ణ పాదపద్మములకు నిక్కముగా లొంగిపోయాను
కణ్ణనల్లాల్ దెయ్వమిల్లై – కణ్ణన్ ఎమ్పెరుమానార్ వంటి దైవము వేరొకరు లేరు దేవు మఱ్ఱఱియేన్ – నమ్మాళ్వార్ తప్ప వేరొక దైవమును నేను ఎరుగను 
పాడి ఇళైప్పిలమ్ – భగవంతుని దివ్య లీలా గానము నేను ఎన్నడూ వీడను పాడిత్తిరివనే – నేను సదా నమ్మాళ్వార్ కీర్తిని గానము చేస్తూ విహరిస్తూ వుండెదను
ఇన్ఙే తిరిన్తేర్క్కిళుక్కుఱ్ఱేన్ – ఈ జగత్తులో  భగవానుని ఆరాధించే ప్రజలకు ఈ జగత్తులోనే కలిగే నష్టము ఏమిటి? తిరితన్తాగిలుమ్ దేవ పిరానుడై క్కరియకోల తిరువురు కాణ్బన్ నాన్ – నిత్యసూరులకే నాయకుడైన ఆ భగవంతుని దివ్యరూపాన్ని ఈ జగత్తులో ఆరాధించుటను నేను వీక్షిస్తాను. ఆచార్యునిపై నిష్టాగరిష్ఠుడైన మధురకవి ఆళ్వార్లు కూడా ఎమ్పెరుమానార్ను ఆరాధిస్తారు, ఏలనన, వారి ఆచార్యులను ఆనందపరుచుటకై.
ఉరియ తొణ్డన్ – భగవంతుని దాసులలైన వారికి సరియైన దాసులు.  నమ్బిక్కాళురియన్ – నంబిక్కాళురియన్ – నమ్మాళ్వార్ల  యొక్క రియైన దాసులు (భగవంతుని సేవకులు).
తాయాయ్త్ తన్తైయాయ్ – భగవానుడే నా మాతా పితరులు (వారు నా యందు సంపూర్ణ వాత్సల్యము కలిగి యుండిరి.) అన్నైయాయ్ అత్తనాయ్ నమ్మాళ్వారే  నా మాతా పితరులు (వారు నా యందు సంపూర్ణ వాత్సల్యము కలిగి యుండిరి)
ఆళ్గిన్ఱాన్ ఆళియాన్ – దివ్యమైన చక్రమును ధరించిన భగవానుడే నన్ను నియంత్రించును ఎన్నైయాణ్డిడుమ్ తన్మైయాన్ – నన్ను నమ్మాళ్వార్ నియంత్రించును
కడియనాయ్ క్కంజనై క్కొన్ఱ పిరాన్ – కంసుని సంహరించి భగవానుడు నాకు చాలా సహాయము చేసెను. ఇచ్చట ఆళ్వార్ చూపించేదేమనగా, భగవానుడు ఇతర భాగవతులకు చేసిన ఉపకారములు తమకు చేసినవిగా భాగవతులు గమనించవలెను. శడగోపన్ – పుట్టుకతో మనను ఆవహించిన “శఠం ” అను అఙ్ఞానమును నమ్మాళ్వార్లు పారద్రోలినారు.
యానే ఎన్తనతే ఎన్ఱిరున్తేన్ –  నేను అహంకారము, కాముతో నిండి ఉన్నాను. నమ్బినేన్ పిఱర్ నన్ పొరుళ్ తన్నైయుమ్ నమ్బినేన్ మడవారైయుమ్ మున్బెలామ్) – ఆత్మ నాది అనే  భావనతో నేను  ఉన్నాను ( అది భగవంతుని సొత్తు అని అర్ధము చేసుకోవటానికి బదులుగా ) మరియు మగువలు నాకు ఆనందాన్ని ఇవ్వడానికే అని భావించాను .
ఎమరేళెళుపిఱప్పుమ్ మాసతిరిత్తుపెఱ్ఱు – భగవంతుని గొప్ప దీవెనలు నాకు ఆశీర్వచనముగా అనేక జన్మలుగా లభిస్తున్నాయి. ఇన్ఱు తొట్టుమ్ ఎళుమైయుమ్ ఎమ్పిరాన్ – ఇంక నా తదుపరి  జన్మలకు నమ్మాళ్వారులే నా దైవము.
ఎన్నాల్ తన్నై ఇన్తమిళ్ పాడియ ఈశన్ – నా పలుకుల ద్వారా భగవానుడు తన కీర్తిని చాటాడు. నిన్ఱు తన్ పుగళ్ ఏఱ్ఱ అరుళినాన్ – నమ్మాళ్వార్ల ఆశీర్వచనము లభించుటచే,  నేను వారి కీర్తిని చాటుతున్నాను.
ఒట్టుమో ఇని ఎన్నై నెగిక్కవే – నా నిష్ఠ నుండి వానుడు నన్ను క్రింద వేయునా (లేదు). ఎన్ఱుమెన్నై ఇగళ్ విలన్ కాణ్మినే –  నా నిష్ఠ నుంచి నమ్మాళ్వార్లు నన్ను ఎన్నడు పడవేయరు.
మయర్వఱ మదినలమ్ అరుళినన్ – భగవంతుని ఆశీర్వచనము వల్ల నాకు దోషరహితమైన దివ్య జ్ఞానము లభించినది ఎణ్డిశైయుం అఱియ ఇయమ్బుకేన్ ఒణ్తమిళ్ శఠగోపన్ అరుళైయే – నేను నమ్మాళ్వార్ యొక్క దివ్య క్షమా గుణమును అన్ని ప్రాంతాలకు ప్రచారము చేస్తాను (దోషరహితమైన జ్ఞానము వారి ఆశీర్వచనము వల్ల లభించుటచే)
అరుళుడైయవన్ – భగవానుడు దయా స్వరూపుడు అరుళ్కణ్డీర్ ఇవ్వులగినిల్ మిక్కతే – మొత్తము భౌతిక జగత్తు కంటే నమ్మాళ్వార్ యొక్క దయా గుణము గొప్పది
పేరేనెన్ఱు ఎన్ నెన్జు నిఱైయప్ పుగున్తాన్ – నా హృదయములో ప్రవేశించిన భగవానుడు నన్ను ఎన్నడూ వీడనని ప్రకటించారు నిఱ్కప్పాడి ఎన్నెన్జుళ్ నిఱుత్తినాన్ – శాస్త్ర సారాన్ని దృఢముగా విశదీకరించి నా హృదయమును సదా వారు  ఆక్రమించిరి  (భాగవత శేషత్వము- భాగవతులకు సేవనందించుట)
వళువిలా అడిమై శెయ్య వేణ్డుమ్ నామ్ – వివిధ మార్గాలద్వారా భగవంతునికి మనము లోపరహితమైన సేవలు అందించాలి ఆళ్ పుక్క కాదల్ అడిమై ప్పయనన్ఱే – సేవాపరత్వము ద్వారా ఉత్పన్నమైన ప్రేమ / బంధుత్వములు నమ్మాళ్వార్లపై శాశ్వత సేవాపరత్వమునకు దారి చూపును
పొరుళల్లాత ఎన్నై ప్పొరుళాక్కి అడిమై కొణ్డాయ్ – భగవానుడు నన్ను అజ్ఞానము నుంచి జ్ఞానము వైపు మరల్చి, తన సేవకై నియమించెను పయనన్ఱాగిలుం పాంగల్లరాగిలుం శెయల్ నన్ఱాగ త్తిరుత్తిప్పణి కొళ్వాన్ – దేనికి పనికిరాని నన్ను నమ్మాళ్వార్ శుద్ధిచేసి, ఆయన సేవకై నియమించెను
ఆరాత కాతల్ – భగవంతునిపై అంతులేని ప్రేమ కలదు ముయల్గిన్ఱేన్ ఉన్తన్ మొయ్కళ్ క్కన్బైయే – మీ పాద పద్మములపై ప్రేమ / బంధుత్వము పెంపొందించుటకే ప్రయత్నించుచున్నాను
కోలమలర్ ప్పావైక్కన్బాగియ ఎన్ అన్బేయో – నేను భగవంతునికి ప్రియతముడను. (భగవానుడు శ్రీమహాలక్ష్మికి ప్రియతముడు) తెన్కురుగూర్ నగర్ నమ్బిక్కు అన్బనాయ్ – ఆళ్వార్ తిరునగరిని నియంత్రించు నమ్మాళ్వార్లకు నేను ప్రియతముడను
ఉలగమ్ పడైత్తాన్ కవి – గొప్ప కవి మధురకవి – మధురమైన (తీయని) కవి
ఉరైక్కవల్లార్క్కు వైగున్తమాగుమ్ తమ్మూరెల్లామ్ – తిరువాయ్మొ ని ఎవరైతే పారాయణ చేస్తారో, ఆ స్థలము వైకుంఠము (పరమపదము) గా మారిపోవును. నమ్బువార్ పది వైగున్తమ్ కాణ్మినే – ఎవరైతే ఆచార్య నిష్ట కలిగి, నా మాటలను విశ్వసించి నడచుకొంటారో, వారు వైకుంఠము (పరమపదము) చేరుకుందురు.

అనువాదకుని గమనిక: ఈ క్రింది భాగములలో, ఆచార్యుని లక్షణములు, గొప్పదనము పిళ్ళై లోకాచార్యుని శ్రీ వచనభూషణము నుంచి గ్రహించి మణవాళ మాముణుల వ్యాఖ్యానము ద్వారా చక్కగా తెలియజేయబడినది.

పిళ్ళైలోకాచార్యులు, మణవాళ మామునిగళ్ – శ్రీ పెరుంబుదూరు
  • సూత్రము 308 – శిష్యుని శ్రేయస్సే దృష్టిగా ఆచార్యుని ద్వారా ఇవ్వబడిన సూచనల స్వభావమును, ఫలితమును, శిష్యులు అపార్థము చేసికొనరాదు. అట్టి అపార్ధము వల్ల ఆచార్యుని సంపూర్ణ విఫలము బహిర్గతమగును.
  • సూత్రము 309 – తనకు తాను అపార్థము చేసికొనుట అనగా ‘నేనే ఆచార్యుణ్ణి ‘ (తాను తన ఆచార్యుడి శిష్యుడు అని భావించాలి). శిష్యుణ్ణి అపార్థము చేసికొనుట అనగా ‘ఇతను నా శిష్యుడు‘ అని (ఈ శిష్యుడు తన ఆచార్యుని శిష్యుడు అని భావించాలి). ‘ఫలితమును’ అపార్థము చేసికొనుట అనగా అది భౌతికమని భావించుట, శిష్యుణ్ణి ఉద్ధరించుట, శిష్యుణ్ణి భాగవత కైంకర్యానికై వినియోగించుట, తన సంసారము సాగిస్తూనే సత్సంగము ఉండుట.
  • సూత్రము 310 – పైన తెలిపిన విధముగా ఆచార్యులు ఫలితమును పరిగణించకపోయినా సహజముగా అది జరుగును. శిష్యుని కోరికపై (ఆచార్యుని నిత్య అవసరములు తీర్చే విధముగా పని చేసేవారు). భగవంతుని ఆజ్ఞ మేరకు, శిష్యుడు ఉద్దరించ బడతాడు. ఆచార్యుని కోరికపై భగవత్ కైంకర్యము శిష్యుని ద్వారా ఈడేరును. శిష్యుని కృతజ్ఞతా భావము వల్ల సంసారములో వుంటూనే, నిత్యము అతను ఆచార్యుని తోడుగా వుండును.
  • సూత్రము 311 – నిజమైన ఫలితము (అనగా భగవానుని క్షేమము కాంక్షించుచు శిష్యుడు మంగళాశాసనము గావించుట) ఆచార్యుని నిర్హేతుక కృప వలననే సాధ్యము. ఆచార్యత్వం (ఆచార్యుని స్థితి) స్థాపింపబడుటపై దృష్టి సారించుటకై ఇతరులను మంగళ శాసనము చేయుటపై లక్ష్యమును నిలిపి,  భగవానుని కోరిక ద్వారా సాధించ వచ్చును.
  • సూత్రము 312 – ఆచార్య శిష్య సంబంధము పైన పేర్కొన్న నియమాలు పాటించకుంటే,  వారిరువురు ఆచార్య మరియు శిష్య అని పిలువబడుటకు అర్హత కోల్పోతారు.
  • సూత్రము 313 – తన శిష్యునిపై ఆచార్యునికి కరుణ ఉండాలి మరియు తన ఆచార్యునిపై పూర్తిగా ఆధారపడి ఉండాలి.
  • సూత్రము 314 – శిష్యుని నిజమైన స్వరూపము ఆచార్యుని కరుణ పొందుట ద్వారా తెలియబడును. తన యొక్క ఆచార్యునిపై పూర్తిగా ఆధారపడుటయే ఆచార్యుని నిజ స్వరూపమగును.
  • సూత్రము 315 – తిరుమంత్రమును (ద్వయము మరియు చరమ శ్లోకము) అర్ధ సహితముగా బోధించే వారే నిజమైన ఆచార్యులు.
  • సూత్రము 316 – ఇతరులు ఎవరైతే భగవానుని కీర్తించే మంత్రములను బోధిస్తూ, లౌకిక ప్రయోజనాలపై దృష్టి కేంద్రీకరిస్తారో,  వారు ఆచార్యులు కాజాలరు.
  • (అనువాదకుని సూచన: తదుపరి సూత్రముల ద్వారా తెలియజేయునది ఏమనగా, తిరుమంత్రము తప్ప ఇతర భగవత్ మంత్రములు సంపూర్ణము కావనియు మరియు భగవత్ కైంకర్యమే అంతిమ దీవెనగా దృష్టి సారించవు – ముముక్షుపడిలో ఈ విషయం స్పష్టముగా తెలియజేయబడినది కూడా)
  • సూత్రము 328 – ఆచార్యుని దృష్టి శిష్యుని ఉద్ధరించుటగా ఉండవలెను.
  • సూత్రము 333 – ఆచార్యులు శిష్యుని స్వరూపముని (ఆత్మను) పెంచుటపై శిక్షణ ఇచ్చెదరు.
  • సూత్రము 335 – శిష్యుని భౌతిక కోరికలు పెంచుట ఆచార్యుని ప్రవృత్తికి వ్యతిరేకం.
  • సూత్రము 337 – శిష్యుని భౌతిక అవసరములకు, అతని సంపదనే ఆచార్యులు వినియోగించెదరు.  (ఏలనన, శిష్యుడు తన సంపదనంతను ఆచార్యునికే చెందునని, దానిని ఆచార్యునికి  సమర్పించును)
  • సూత్రము 338 – ఆచార్యులు శిష్యుని సంపదను స్వీకరించరు (ఎప్పుడు శిష్యుడు తన సంపదను స్వయముగా / మనః స్ఫూర్తిగా ఆచార్యునికి సమర్పించరో మరియు ఆ సంపద తనదేనని భావిస్తారో, ఆచార్యులు ఆ సంపదను స్వీకరించరు)
  • సూత్రము 339 – పై సూత్రమున తెలిపినట్టు స్వీకరించినచో, అతనిని బిక్షకునిగా భావించవచ్చు.
  • సూత్రము 340 – నిజమైన ఆచార్యునికి అపారమైన ఆధ్యాత్మిక సంపద కలిగివుండుటచే, వారు ఇతర సంపదలను స్వీకరించరు.
  • సూత్రము 341 – దీని ద్వారా ఆచార్యుని ముఖ్య లక్షణమైన తృప్తి అనే ప్రవృత్తి గోచరము అగుచున్నది.
  • సూత్రము 427 – భగవంతుని శరణు వేడుకొనుట అనగా ఆయన హస్తములను పట్టుకొని సహాయమునకు అభ్యర్దించుట. ఆచార్యుని శరణు వేడుట అనగా భగవానుని పవిత్ర చరణములను ఆశ్రయించి, సహాయమునకై అభ్యర్థించుట (తదుపరిది ఉత్తమము).
  • సూత్రము 430 – స్వయముగా భగవానుడే ఆచార్యునిగా ఉండవలెనని ఇష్టపడును.
  • సూత్రము 431 – అందువలననే అయన పరమాచార్యునిగా (ప్రధమ ఆచార్యులు) మన గురుపరంపరలో వున్నారు, భగవద్గీతను బోధించారు మరియు విభీషణుని శరణాగతిని అంగీకరించారు.
  • సూత్రము 432 – ఆచార్యుని ఋణమును తీర్చుటకై, మనకు భగవానుని అవసరము కలదు మరియు మరియొక ఆధ్యాత్మిక / ఆది భౌతిక ప్రపంచము కూడా అవసరము (ఎలనన భగవానుడు మరియు ఆతని సంపద (రెండు విషయములు) ఆచార్యుని అధీనములో ఉండును మరియు ఆ విధముగా ఆచార్యులు మనను ఋణవిముక్తులుగా దీవించెదరు. అనగా, ఆచార్యులు మనకు చేసిన ఉపకారమును మనము ఎన్నటికీ చెల్లించ లేము.
  • సూత్రము 433 – భగవానునితో మన బాంధవ్యమునకు బంధం (ఈ సంసారములో అనేక జన్మల పుట్టుక) మరియు మోక్షము (పరమపద ప్రాప్తి) అను రెండు విషయములు కారణములు. కాని ఆచార్యునితో బాంధవ్యము మోక్షహేతువే అగును.
  • సూత్రము 437 – ఆచార్యునితో శిష్యుని బాంధవ్యమునకు అవరోధము (విడిపోయినచో) కలిగినచో, శిష్యుడు సంపూర్ణ జ్ఞానుడైనను, నిర్లిప్తుడైనను అది నిరూపయోగమే.
  • సూత్రము 438 – ఏ విధముగా ఒక పుణ్యస్త్రీ ( భర్త జీవించి ఉండగా) వివిధ ఆభరణములు ధరించునో, తన మాంగాళ్యము కోల్పోయినచో (భర్త మరణించిన పిదప), అవే ఆభరణములు ఆమెకు ఆందోళన కారకములగును.
  • సూత్రము 439 – ఆచార్యుని సంభంధము లేనిచో, భగవత్ సంభంధము ఉండదు.
  • సూత్రము 443 – వడక్కు తిరువీధి పిళ్ళై ఈ విధంగా వక్కాణించారు, “యే జీవాత్మ అయితే అన్నింటిని నేనే ఎల్ల వేళలలో నియంత్రిస్తున్నాను అనే భావనలో ఉంటాడో, అతను భగవానుని కృపను కోల్పాతాడు. వారికి ఆచార్యుని దయా గుణమే మోక్ష మార్గము అగును.
  • సూత్రము 447 – ఆచార్యుని దయా గుణము మాత్రమే శిష్యుని ఉద్దరించగలదు.
  • సూత్రము 460 – ఆచార్యుని అభిమానము కొరకు మనము ఈ క్రింది ప్రమాణములపై, ధ్యాస ఉంచుదాము.
    • నాచియార్ తిరుమొళి 10.10 – నల్లవెన్ తొళి – ఇందులో ఆండాళ్ పెరియాళ్వార్ యొక్క భగవానుడు కృష్ణుడని ప్రకటించారు, కృష్ణుడిని తీసుకొని వస్తే, ఆతనిని స్వీకరిస్తాను అని ఆండాళ్ తెలుపుతుంది.
    • నాన్ముగన్ తిరువందాది 18 – మాఱాయ దానవనై – ఇందులో తిరుమళిసై ఆళ్వార్ కీర్తిస్తూ ఎవరైతే నారసింహునికి సంపూర్ణ శరణాగతి చేస్తారో, అట్టి భక్తులకు మనము శరణాగతి చేస్తూ వారి దయను ఆశ్రయించాలి.
    • స్తోత్ర రత్నము – అకృత్రిమ చరణారవిందము – ఇందులో ఆళవందార్లు ఈ విధంగా ప్రకటించారు – తనకున్న జ్ఞానము / భక్తిని పరిగణించకుండా, ఎంబెరుమాన్ కి  అత్యంత ప్రియులు / సంబంధము కల నాథమునులతో తనకున్న బాంధవ్యయము వలన ఎంబెరుమాన్ తనను స్వీకరించగలరు.
    • పురాణ శ్లోకము – పసుర్ మనుష్య పక్షివా – ఒక జంతువు, మనిషి లేక పక్షి – జన్మముతో సంబంధము లేకుండా (శాస్త్రము యొక్క జ్ఞానము పొందుటకు అర్హులైనచో), వారు ఒక వైష్ణవుని సంబంధం ద్వారా సులువుగా పరమపదము పొందగలరు.
  • సూత్రము 461 – ఆచార్యుని దయ ప్రపత్తితో సమానము – ఏలనన అది స్వయం ఉపాయముగాను మరియు ఇతర ఉపాయములకు సహాయకారి గాను అగును.
  • సూత్రము 462 – భక్తి చేయలేని వారికి ప్రపత్తి వున్నది: ప్రపత్తి చేయలేనివారికి, ఆచార్యుని దయ కలదు.
  • సూత్రము 463 – ఆచార్యుని దయకు పాత్రులైనచో అది వారి నిజమైన స్వయం స్వరూపమును నిరూపించును. (అనగా మనము భాగవతుల సేవకులము అని); తదుపరి అది మనము  భగవానుని / భాగవతులను మాత్రమే అంగీకరించి, ఆశ్రయించుట యందలి నిజమైన అవగాహనను పెంపొందించును; చివరిగా అది మనము భగవానుని / భాగవతులకు  నిజమైన కైంకర్యము, సేవా చేయుటపై నియుక్తులను చేయును.

అనువాదకుని సూచన: పైన తెలియజేసిన భాగము శ్రీవచన భూషణ దివ్య శాస్త్రములోని కొన్ని సూత్రముల యొక్క అనువాదము. వీటిని సరియైన ఆచార్యుని ద్వారా బోధన పొంది, అర్ధములను లోతుగా గ్రహించ గలరని నివేదిస్తున్నాము.

పెరియవాచ్చాన్ పిళ్ళై ఈ విధముగా తెలియజేస్తున్నారు: ఓర్పుతో వుంటూ, లౌకిక లాభాలను ఆశించేవారు ఆచార్యులు కాజాలరు. కానీ శిష్యుల ఉన్నతి కోసము ఆదేశాలను ఇస్తూ వారిని నియంత్రించ గలిగిన వారు నిజమైన ఆచార్యులు. దీనికి విరుద్ధముగా తప్పుగా ప్రవర్తించు ఆచార్యులను వదిలి వేయవలెను.

అట్టి ఆచార్యులు అవసరంలేని / ప్రాపంచిక విషయాలను చర్చిస్తూ వుంటారు.

జీవాత్మను ఉద్ధరించుటపై ఆచార్యుని దృష్టి ఉండవలెను.

ఆచార్యులు తామే సంసార సాగరములో మునగరాదు – కాని వారికి భగవద్విషయముపై గల సంపూర్ణ జ్ఞానముచే సురక్షితులై (సరైయిన అనుష్టానము – శిక్షణ వలన) ఇతరులను కూడా రక్షించవలెను.

శిష్యునకు, ఆచార్యుని దివ్య స్వరూపముపై ధ్యాస వుండినచో చాలు – ఆచార్యుని నుంచి జ్ఞానము / అనుజ్ఞలు కూడా పొందవలసిన అవసరము లేదు.

ఏ విధముగా గరుడ మంత్రము ధ్యానిస్తే పాము కాటు విషము నుంచి విముక్తి కలుగునో, అటులనే ఆచార్యుని స్వరూపమును ధ్యానించుట వల్ల శిష్యునికి సంసారమనే విషము నుంచి విముక్తి లభించును.

బౌతిక సంపద, కామ వాంఛలుపై అనురక్తి లేనందు వల్ల ఆచార్యులు గౌరవప్రదులుగా వుంటారు, శిష్యునికి నిజమైన జ్ఞానమును పెంపొందించుతారు.

తదుపరి భాగములో శిష్యుని నిజమైన ప్రవృత్తి గురించి చర్చించబడును.

సశేషం….

అడియేన్ గోపీ కృష్ణమాచార్యులు బొమ్మకంటి రామానుజ దాసన్.

మూలము : https://granthams.koyil.org/2013/06/anthimopaya-nishtai-2/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– https://pillai.koyil.org

Leave a Comment