శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఈ ఇద్దరు సహోదరులు తత్వ రహస్యం (నిజమైన అస్తిత్వానికి సంబంధించిన రహస్యాలు) తో ప్రారంభించి అనేక ప్రబంధాలను రచించారు, వందేళ్లకుపైగా జీవించారు, ఎందరో మహానుభావులు పిళ్లై లోకాచార్యుల దివ్య పాదాలను ఆశ్రయించి, తమ జీవితాన్ని వారికి అర్పించి, పరమానందంతో వారి జీవితాన్ని గడిపారు.
వారిలో కూరకులోత్తమ దాసర్, మణప్పాక్కత్తు నంబి, కొల్లి కావల దాసర్ అని పిలువబడే అళగియ మణవాళ ప్పెరుమాళ్ పిళ్ళై, కోట్టూరిల్ అణ్ణర్, విలాంజోలై పిళ్ళై వంటి శిష్యులు ఉన్నారు, వీరితో పాటు తిరుమలై ఆళ్వార్ (తిరువాయ్మొళి పిళ్ళై) వారి తల్లిగారు మరియు ఇతర అనేక అమ్మంగార్లు ఉన్నారు. వీరందరూ విడవ కుండా వారి దివ్య పాదాలకు నిరంతర సేవ చేశారు. పిళ్ళై లోకాచార్యులు తమ దయ తో అరాయిరప్పడి, ఒన్బదినాయిరప్పడి, ఇరుబత్తు నాలాయిరప్పడి, ముప్పత్తారాయిరప్పడి వంటి వ్యాఖ్యానాలను (తిరువాయ్మొళి దివ్య ప్రబంధానికి) రచించడానికి గల కారణాలను తెలియజేసేవారు.
తమిళ వేద మహా సాగరమైన తిరువాయ్మొళిలో నిపుణులైనందున, మన పూర్వాచార్యులు ఎందరో తమ తమ మేధస్సుకి తగినట్లు విస్తృతమైన వ్యాఖ్యానాలు (తమ అత్యున్నత లక్ష్యం గా భావించి) వ్రాసారు. వెయ్యి శాఖలు ఉన్న ఉపనిషత్తుకు సమానమైనదిగా తిరువాయ్మొళి పరిగణించబడుతుంది. అటువంటి తిరువాయ్మొళిపై ఎంబెరుమానార్లు (భగవద్ శ్రీ రామానుజులు) వ్యాఖ్యానం వ్రాయమని తిరుక్కురుగైపిరాన్ పిళ్ళాన్ పై కృపను కురిపించారు. పిళ్ళాన్ , దివ్య అవతార మూర్తిగా భావింపబడే నమ్మాళ్వార్ల దివ్య మనస్సును అనుసరించి, ఆరాయిరప్పడి (ఆరు వేల పడి; ఒక పడి అనేది 32 అక్షరాలతో కూడిన గద్యము) అనే వ్యాఖ్యానాన్ని రచించారు.
తరువాత, రామానుజులు మరియు ఇతర పూర్వాచార్యులు, అదనంగా ముఖ్యార్థాలతో, అందరికీ అర్థమయ్యేలా భట్టర్ ను (కురత్తాళ్వాన్ తిరుకుమారులు) తిరువాయ్మొళికి ఒన్బదినాయిరప్పడి (తొమ్మిది వేల పడి) తో కూడిన మరో వ్యాఖ్యానాన్ని వ్రాయమని నియమించారు. భట్టర్ ఒక చర్చలో మాధవుడనే ఒక అధ్వైతిని గెలిచారు. తరువాత వారు సన్యాసం స్వీకరించి భట్టర్ వారి దివ్య చరణాల యందు ఆశ్రయం పొందారు. భట్టార్ వారికి నంజీయర్ అనే బిరుదునిచ్చి, నంపెరుమాళ్ళని సేవించేందుకు శ్రీ రంగం కోవెలకి తీసుకెళ్లారు. భట్టర్, నంజీయర్ మరియు అనేక ఇతర జీయర్ల సమక్షములో నంపెరుమాళ్ళు అర్చక ముఖేన నంజీయర్ తో “స్వాగతం, నంజీయర్! భట్టర్ దివ్య మనస్సులో ఉన్న ఒన్బదినాయిరప్పడి వ్యాఖ్యానాన్ని సుసంపన్నము చేయండి” అని పలికారు. ఆ విధంగా, నంజీయర్ ఒన్బదినాయిరప్పడిని స్వరపరిచారు, ఇది ఆరాయిరప్పడికి స్వర్ణ మకుటము లాంటిది.
నంపెరుమాళ్ భట్టార్‌కు మోక్షం (శ్రీవైకుంఠం) మంజూరు చేసిన తర్వాత, నంజీయార్ చింతించ సాగారు. “నేను వృద్దుడిని అయ్యాను; భట్టర్ స్వామి వయస్సులో చిన్నవారు కాబట్టి, దర్శనాన్ని (దర్శనం అనే పదం విశిష్టాధ్వైత తత్వాన్ని సూచిస్తుంది) ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకి నడిపించి నిరంతర పోషణ పొందుతుందని నేను భావించాను. ఇప్పుడు పరిస్థితి ఇలా మారింది” అని మనస్సులో చింతన చేయసాగారు. వారు భట్టర్ తిరుమాలిగకి వెళ్లి, వారి దివ్య పాదాలపై పడి క్షోబించారు. భట్టర్ వారిని తన దగ్గరికి రమ్మని పిలిచి, “నీవు నిరాశ పడే అవసరం లేదు; దర్శనాన్ని ముందుకి నడిపించడానికి తగిన వ్యక్తిని అన్వేషించుము” అని చెబుతారు. ఈ మాటలు విన్న జీయర్ శాంతించి, వారి మాటలు గుర్తుండేలా తన ఉత్తరీయం ముడి వేసుకున్నారు. భట్టర్ చరమ కైంకర్యములు ఘనంగా నిర్వహించారు. వారు తమ ఇరుబత్తు నాలాయిరప్పడిని మరియు ముప్పత్తారాయిరప్పడిని మరింత మెరుగుపరచడానికి అవతారికగా ఒన్బదినాయిరప్పడికి పట్టోలై (ఏదైనా గ్రంథానికి మొదటి అచ్చు కాపి) ని రూపొందించి, ఆ లిఖిత ప్రతిని అనేక కాపీలు చేయగల వ్యక్తిని గాలించసాగారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/07/18/yathindhra-pravana-prabhavam-3-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org