యతీంద్ర ప్రవణ ప్రభావము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

srisailesa-thanianపెరియ పెరుమాళ్ళతో ప్రారంభమైన మన ఆచార్య పరంపరలో ‘మణవాళ మాముణులు’ చివరి ఆచార్యులుగా పరిగణించబడతారు. తమ ఆచార్యులు తిరువాయ్మొళి పిళ్ళైల కోరిక మేరకు శ్రీరంగంలో ఉండి, వారి నుండి శాస్త్రాలు మరియు ప్రబంధములను నేర్చుకున్నారు.పెరియ పెరుమాళ్ళు ఈడు కాలక్షేపము (నంపిళ్లై ఉపన్యాసాల ఆధారంగా వడక్కు తిరువీధి పిళ్ళైచే సంకలనం చేయబడిన తిరువాయ్మొళి కాలక్షేపములు) వారి నుండి వినాలని ఆశించి, ఒక సంవత్సరం పాటు శ్రీరంగంలో అన్ని ఉత్సవాలను రద్దు చేయించి మాముణుల నుండి కాలక్షేపము విని తమ కోరిక నెరవేర్చుకున్నారు. కాలక్షేపము చివరలో, పెరుమాళ్ళు ఆలయ భట్టర్ కుమారుని రూపంలో వచ్చి, మణవాళ మాముణులను తమ ఆచార్యుడిగా గుర్తిస్తూ వారి గౌరవార్థం వారిని కీర్తించి తనియన్ని పఠించిరి. మణవాళ మాముణుల మహిమను పిళ్లై లోకం జీయర్ వారు 16వ శతాబ్దపు CE చివరి భాగంలో యతీంద్ర ప్రవణ ప్రభావం అనే శీర్షికతో రాశారు. యతీంద్ర అనే పదం యతులకు (సన్యాసులు) నాయకుడిగా పరిగణించబడే భగవత్ రామానుజులను సూచిస్తుంది. భగవద్ రామానుజుల పునరవతారముగా పరిగణించబడే మణవాళ మాముణులు, రామానుజుల పట్ల గాఢమైన భక్తి ప్రపత్తులతో ఉండేవారు. అటువంటి మణవాళ మాముణుల గురించి పిళ్లై లోకం జీయర్ వారు తన రచనలలో రాశారు. రాబోయే శీర్శికలలో, వారి రచనలోని అమృత తత్వాన్ని మరియు దాని ద్వారా, పొయ్యిలాద (తప్పు చెప్పని వ్యక్తి) మణవాళ మాముణుల వైభవాన్ని మనం అనుభవిస్తాము.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/yathindhra-pravana-prabhavam-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org