శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
తిరుమల దేవస్థానం వారు ఆలయంలో జరిగే సేవలు, ఉత్సవాల వివరాల గురించిన ‘తిరుమలై ఒళుగు’ అను గ్రంథంలో, ఈ నియామకం గురించి [మణవాల మాముణుల ద్వారా నియమించబడిన శిరియ కేళ్వి జీయర్] వివరణ ఇవ్వబడింది. రామానుజుల కాలంలో, తిరువేంకటేశుని నిధి సంరక్షణ, నిర్వహణ కార్యానికై శ్రీ సేనాపతి జీయర్ అనే పిలువడే ఒక భక్తుడిని నియమించారు. దీనికి సంబంధించిన వివరాలు శ్రీ వెంకటాచల ఇతిహాసమాల అను గ్రంథంలో అనంతాచార్యులచే ప్రస్తావించబడింది. తరువాత, రామానుజులే ఆ భక్తుడికి సన్యాసాశ్రమ స్వీకారం చేయించి, వారికి అప్పన్ తిరువేంగడ శఠకోప జీయర్ అను దివ్యనామాన్ని ప్రసాదించి, ఆలయ కార్య భారాన్ని వారికి అప్పగించారు. వారు ఈ కైంకర్యంలో జీయర్ సహకారం కోసమై నలుగురు ఏకాంగిలను కూడా నియమించారు. ఈ వివరాలు ఇతిహాసమాలలో వివరించబడి ఉన్నాయి. ఈ జీయరుని కోయిల్ కేల్వి జీయర్ అని కూడా పిలుస్తారు. పెరియ కేల్వి జీయర్ (పెద్ద జీయర్), శిరియ కేల్వి జీయర్ (చిన్న జీయర్) అను ఇద్దరు జీయర్లు ఉన్నారని తెలుస్తోంది. రాజుకి యువరాజు వలె వ్యవహరిస్తారు. మణవాళ మాముణులు తిరుమలలో సుమారు 1 – 2 సంవత్సరాలు ఉన్నారని యతీంద్ర ప్రవణ ప్రభావం చెబుతుంది. పిళ్ళై లోకాచార్యుల కాలం తరువాత, తిరుమల, శ్రీరంగం మొదలైన ఆలయాల యందు రామానుజుల దివ్యాజ్ఞా మార్గదర్శకత్వంలో ఆలయాల నిర్వహణ క్రమబద్ధత కోల్పోయింది. తరువాత, మణవాళ మాముణుల కాలంలో, రామానుజార్య దివ్యాజ్ఞా వరవరముని దివ్యాజ్ఞాగా పునః స్థాపించబడింది. ఆలయం లోపల ఉన్న రాతి శాసనాలలో, 1445 CEలో “కోయిల్ కేట్కుం ఎంపెరుమానార్ జీయర్” (ఎంపెరుమానార్ జీయరుని అనుసరించి పాటించే ఆలయం) అను ప్రస్తావన ఉంది. ఇది 1371-1443 CE కాలానికి చెందిన మణవాళ మాముణులచే నియమించబడిన జీయర్ అని స్పష్టంగా తెలుస్తుంది. వీరు తిరుమంగై ఆళ్వార్ కోయిల్ ధర్మకర్త అయినందున, స్వయంగా వీరే చిన్న జీయరని శాసనాల ద్వారా అంచనా వేయవచ్చు. 1953లో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురించిన తిరుమల తిరుపతి ఐతిహ్యమాల అయిన తిరుమలై యోళుగులో కూడా “379 శతాబ్దంలో, వికారి సంవత్సరం, తై మాసంలో భగవద్ రామానుజులు స్వయంగా అప్పన్ శఠకోప జీయరుని కోయిల్ కేళ్వి జీయరుగా పట్టాభిషేకము చేసారు” అని చెప్పబడి ఉంది. వారు ఆలయంలో 45 సంవత్సరాలు కైంకర్యం చేశారు. అనంతరం, జయ సంవత్సరంలో, అళగియ మణవాళ జీయరుని సహాయకుడిగా (125వ పేజీలో) నియమించ బడ్డారు. ఇదే పుస్తకం 104వ పేజీలో ఇలా వ్రాయబడింది: “పూర్వం శ్రీ రామానుజ ధర్శన ప్రవర్తకులైన మణవాళ మాముణులు కృపతో తిరుపతికి వచ్చి, ఆ దేశ రాజుని కలుసుకుని ఆశీర్వదించారు. తిరుమల ఆలయానికి స్థానాధిపతిగా ఉత్తమ ఆశ్రమి (ఒక సన్యాసి) అవసరమని, శ్రీరంగంలో కార్యనిర్వహకునిగా కైంకర్యం చేస్తున్న తమ శిష్యుడు, శ్రీరంగనారాయణ జీయర్ వలే, ఇతర మతాల వారి బారి నుండి వచ్చే అడ్డంకులను తొలగించగలిగి, భక్తులకు అనుకూలంగా, ఇతర మతస్థులకు ప్రతికూలంగా ఉండే జీయర్ కావాలని భావించారు. వారు స్థానిక రాజు యొక్క సమ్మతిని తీసుకొని, కోయిల్ కేళ్వి తిరువేంగడ జీయర్‌ని నియమించి, అర్చకులు, ఆలయ ఉద్యోగులందరు, స్థల నిర్వాగి (స్థలం నియంత్రకులు), ఆళ్వార్ గోవింద జీయార్, ఏకాంగులు ఆ జీయర్ నియంత్రణలో ఉండేలా చేశారు. వారు తన నియంత్రణలో ఉన్న వారికి శిక్షకుడు, రక్షకుడు, తిరుమల నిధికి వర్థకుడు, స్థానిక రాజుకి ధర్మోపదేష్ట (ధర్మ మార్గంలో నడిపించేవాడు) గా ఉన్నారు. వారు ఉంగరం రూపంలో ఎమ్పెరుమానార్ దివ్య ప్రతిమను జీయర్ అధికారిక ముద్రగా ఇచ్చి దానిని ధరించేలా చేశారు. ఆలయం గంటను, గోవులను, ధ్వజాన్ని జీయర్ ఆధీనంలో ఉండేలా చేశారు. కైంకర్యం లేదా యాత్రలలో [ఇతర దివ్య దేశాలకు] వెళ్ళే సమయాలలో గంట, ధ్వజంతో పాటు వెళ్ళమని కూడా వారు జీయరుకి తెలిపారు. వారు జీయర్ కోసమై శ్రీరామానుజపురంలో మఠం కూడా నిర్మించారు. తరువాత మణవాళ మాముణులు శ్రీరంగానికి బయలుదేరారు.
మూలము: https://granthams.koyil.org/2021/09/25/yathindhra-pravana-prabhavam-69-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org