యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 24

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 23

ఇప్పుడు శ్రీరంగం కథనం

ఆ రోజుల్లో, శ్రీరంగంలో ఉండే మహాత్ములు ప్రతిరోజూ “శ్రీమన్ శ్రీరంగ శ్రీయం అనుపద్రవాం అనుదినం సంవర్ధయ” (ఏ ఆటంకం లేకుండా ప్రతి దినము శ్రీరంగ సంపద (దాస్యం) పెరగాలి) అనే శ్లోకాన్ని పఠించేవారు.” దానితో పాటు పెరియాళ్వార్ల “తిరుప్పల్లాండు” (పెరియ పెరుమాళ్ చిరకాలము వర్ధిల్లాలి), తిరుమంగై ఆళ్వార్ల శ్రీరంగ పాశురమైన “ఏళై ఏదలన్” (ఈ అల్పమైన వ్యక్తి…), నమ్మాళ్వార్ల 7.4.1 పాశురం “ఆళి ఎళచ్చంగుం” (ఆ దివ్య శంఖ చక్రములు వర్ధిల్లాలి) అని పెరుమాళ్ళకు శరణాగతి చేస్తూ మంగళాశాసనాలు చేసేవారు. వారి మంగళాశాసనాలు సెంజి (తిరువణ్ణామలై) కి రాజైన గోపణార్యన్ గా ఫలించింది. వారు తిరుపతికి వెళ్లి, అక్కడ నంపెరుమాళ్ళను సేవించి, తిరుగు ప్రయాణంలో, దయతో నంపెరుమాళ్ళను సెంజికి సమీపంలోని సింగరాయపురం పట్టణానికి తీసుకువచ్చారు. వారు శ్రీరంగంలో పాతుకొని ఉన్న దుష్ఠ శక్తులపై దాడి చేసేందుకు అనువైన సమయం కోసం ఎదురుచూస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో నంపెరుమాళ్ళను ఆరాధించుచుండెను. దాడి చేయడానికి సరైన సమయము చుసి  తిరుమణత్తూన్ నంబికి సైగనిచ్చారు. గోపణార్యన్, అపార సైన్య బలంతో వెళ్లి పోరాడి, ఆక్రమణదారుల బారి నుండి శ్రీరంగాన్ని విడిపించి, ఈ శ్లోకంలో చెప్పబడినట్లుగా, పెరియ పెరుమాళ్ళ సన్నిధిలో శ్రీదేవి మరియు భూదేవులతో కూడి నంపెరుమాళ్ళను ప్రతిష్టించారు.

ఆనీయానీలశృంగత్యుదిరచిత జగద్రంజనాతంచనాత్రేశ్ సెంజ్యాం
ఆరాద్య కంచిత్ సమయమత నిహద్దయోత్తనుష్టాన్ తురుష్కాన్
లక్ష్మీ క్షమాప్యాముపాప్యాం సహ నిజనిలయే’స్థాపయత్ రంగనాథం
సమ్యక్చర్యాం సపర్యామకృత నిజయశో దర్పనో గోపణార్యః

(అద్దంలా ప్రకాశించే కీర్తి కలిగిన గోపణార్యన్, అంజనాచలం అని కూడా పిలువబడే తిరువేంగడం నుండి నంపెరుమాళ్ళను దయతో వారి స్వస్థలమైన సెంజికి తీసుకువచ్చారు. కొంత కాలము అక్కడ వారు పెరుమాళ్ళని సేవిస్తూ, తమ విల్లు బాణాలతో తుర్కులపై దాడిచేసి చంపి, ఉభయ దేవేరులతో శ్రీరంగనాథుని వారి నివాసమైన శ్రీరంగంలో ప్రతిష్టించి, సముచితమైన సేవలు నిర్వహించెను).

“కొంగుం కుడందైయుమ్ కోట్టియూరుం పేరుం ఎంగుం తిరిందు విళైయాడుం…” (కొంగు నాడు [తమిళనాడు పశ్చిమ ప్రాంతం], తిరుక్కోట్టియూర్, తిరుప్పేర్  మొదలైన) అనే పాశురంలో చెప్పినట్లుగా, “మయల్మిగు పొళిళ్ శూళ్ మాలింజోలై” (మంత్ర ముగ్ధులను చేసే పండ్ల తోటలతో చుట్టుముట్టబడి ఉన్న), “వీరైయార్ పొళిళ్ వేంగం” (పరిమళంతో కూడిన తోటలతో నిండిన తిరుమల), ఈ చోట్లంన్నింటికీ వెళ్లి శత్రువులు సంహరించబడిన తరువాత, సకాప్తం 1293, పరితాపి సంవత్సరం, వైకాసి మాసం (ఋషభ మాసం) 17వ రోజున “కోయిఱ్పిళ్ళాయ్ ఇంగే పోదరాయే” (ఓ! కోయిల్ నివాసి, ఇక్కడికి రా!) పాశురములో చెప్పబడినట్లు శ్రీరంగానికి  తిరిగివచ్చెను. “రామస్సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్” (శ్రీరాముడు సీతను గెలిచి రాజ్యాన్ని పొందాడు) అని అయోధ్య వలె శ్రీరంగము కూడా ఉత్సవాలు మరియు సంబరాలు చేసుకుంది. “తిరుమగళోడు ఇనిదు అమర్ంద సెల్వన్” (ఎమ్పెరుమాన్, శ్రీమహాలక్ష్మితో ఆసీనులై ఉన్నారు), “వీఱ్ఱిర్ఉంద మణవాళర్ మన్ను కోయిల్” (అళగియ మణవాళన్ (నంపెరుమాళ్) కొలువై ఉన్న ఆలయము) అని చెప్పినట్లు), అళగియ మణవాళన్ తమ ఉభయ నాయ్చిమారులతో సేరపాణ్డియన్ పైన ఆసీనులై తమ వైభవముతో శ్రీరంగంపై తన దొరతనాన్ని తెలియజేసే ఆ దృశ్యం చూడదగ్గది.

సుదూర ప్రాంతాలలో నివసించే శ్రీవైష్ణవులు కూడా ఈ సంఘటన గురించి విని, ఈ శ్లోకములో  చెప్పినట్లే పరమానందభరితులైనారు.

బహూనినామ వర్షాణి గతస్య సుమత్వనం
శృనోమ్యహం ప్రీతికారం మమనాథస్య కీర్తనం

(ఎంతో కాలం పాటు అడవులలో బస చేసిన నంపెరుమాళ్ తిరిగివచ్చారన్న గొప్ప వార్త విన్నాను), చాలా కాలం తర్వాత నంపెరుమాళ్ తిరిగి రావడం తమ అదృష్టమని భావించారు. వెంటనే, అందరూ అక్కడికి వచ్చి, నంపెరుమాళ్ళ దివ్య పాదాలను సేవించి, “ప్రహృష్టం ఉత్తీర్ణలోకం” (ప్రజలు ఎంతో ఆనందించారు) లో చెప్పినట్లు ఎంతో సంతోషించారు. పెరుమాళ్ (ఎమ్పెరుమాన్) కూడా, శ్రీ రామాయణ శ్లోకంలో “విజ్వరః ప్రముమోతః” (భయ జ్వరాలు తొలగిన తర్వాత సంతోషంగా ఉన్నట్లు) చెప్పినట్లు ప్రతి ఒక్కరినీ చల్లగా చూస్తూ వారిపై తన కరుణను కురిపించారు. దక్షిణం వైపు చూస్తూ అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్లపై తమ కరుణను కురిపించారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/08/yathindhra-pravana-prabhavam-24-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment