యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 100

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 99

జీయర్ నుండి విడిన శిష్యుల బాధ

తరువాత, “కదిరవన్ పోయ్ గుణపాల్ శేర్ంద మహిమై పోల్” ,(సూర్యుడు) యొక్క గొప్పతనం తూర్పు దిశకు చేరుకోవడం వంటిది) లో చెప్పబడినట్లుగా, ఒక సూర్యుడు తూర్పు దిశలో అమర్చబడ్డారు. జీయర్ నాయన్‌ఆర్, కందడై అన్నన్ మరియు శిష్యులు అందరూ  చాలా బాధపడ్డారు.

శీయర్ ఎళుందరుళివిట్టార్ సెగముళుదుం
పోయిరుళ్ మీళ ప్పిగుందదే తీయ
వినై నైయ వెంబులనాల్ ఈడళిందు మాయ్వోర్
అనైవార్ క్కుం ఏదో అరణ్

(జీయర్ శ్రీవైకుంఠముకి అధిరోహించారు. ప్రపంచమంతటా చీకటి అలుముకుంది. తమ పాప కర్మలతో బాధపడి, ఇంద్రియాలకు దాసులైన వారికి ఇప్పుడు రక్షణ ఏది?) శిష్య లక్షణానికి అనుగుణంగా అందరు, తమ శిరో క్షావరం చేసుకొని, స్నానమాచరించి, మఠంలోకి తిరిగి ప్రవేశించారు. జీయర్ మఠంలో లేని శూన్యతను చూసి బాధపడ్డారు. కళ్ళ నిండా కన్నీళ్లతో, గద గద స్వరంతో పాసురాలు పాడి ఒకరినొకరు ఓదార్చుకున్నారు. జీయర్ గొప్పతనానికి అనుగుణంగా, తిరువధ్యయనం (శ్రీవైకుంఠానికి అధిరోహించిన రోజుతో మొదలుకొని పదమూడు రోజుల పాటు ఆచరించవలసిన కర్మలు), తీర్థ ప్రసాద సేవలు జరిపారు. తరువాత, జీయర్ వారిని నియమించిన కైంకర్యములను నిష్ఠతో నిర్వహించారు.

అనంతరం, ఇక్ష్వాకు కుల దీపంగా స్తుతింపబడే పెరియ పెరుమాళ్ళు, జీయర్ తమ చరమ సమయంలో తిరిగి ఇచ్చిన శ్రీ రంగరాజులను, మఠాన్ని, జీయర్ నాయనార్కు (మాముణుల మనుమలు) ప్రసాదించాడు. వీటితో పాటు, పెరుమాళ్ళు వారికి తీర్థం, దివ్య హారము, దివ్య వస్త్రం, శ్రీ శఠకోపురం మొదలైన గౌరవాలతో వారిని సత్కరించి ఆశీర్వదించారు. ఇది చూసి, జీయర్ అభిమానులందరూ సంతోషించి, జీయర్ నాయనార్ను స్వయంగా జీయరుగా భావించి, నిత్యం సేవించారు.

శ్రీ భాష్యం, తిరువాయ్మొళి ఈడుల అధ్యయనం చేసిన జీయర్ నాయనార్

జీయర్ ఆదేశానుసారం తన మనవడు, జీయర్ నాయనార్ కు కందాడై అణ్ణన్, తిరువాయ్మొళి ఈడు (తిరువాయ్మొళికి వ్యాఖ్యానం) బోధించారు. ఆ పైన జీయర్ ఆదేశానుసారం, జీయర్ నాయనార్, కందాడై నాయన్లకు ప్రతివాది భయంకరం అణ్ణా శ్రీభాష్యం (వేదవ్యాసుల బ్రహ్మ సూత్రాలకు రామానుజులు వ్రాసిన) ఉపదేశించారు. ప్రతివాది భయంకరం అణ్ణా, ఉపదేశం సంపూర్ణం చేసి తమ కర్తవ్యాన్ని నిర్వహించినట్లు ఈ శ్లోకంలో వివరించబడింది.

శ్రీమాన్ సుందరజామాతృ మునిః పర్యాయ భాష్యకృత్
భాష్యం వ్యాకురు తే తస్య శ్రోతృకోడౌ మమాన్వయః

(భాష్యకారుల (రామానుజుల) పునరవతారము, కైంకర్య శ్రీమాన్ (కైంకర్య సంపద కలిగినవాడు) అయిన మాముణులు, శ్రీ భాష్యం అర్థాలను స్వయంగా వివరిస్తున్నారు. ఆ శ్రీభాష్య అధ్యయన గోష్ఠితో నాకు సంబంధం ఉంది). తమ ఏకైక నివాస స్థలంగా తిరుపతిలో నివసిస్తున్న పొళిప్పాక్కం పోరేఱ్ఱు నాయనార్ వంటి వారికి శ్రీభాష్యమును బోధించారు. తరువాత భట్టర్‌ పిరాన్ జీయర్ వంశస్థులైన పరవస్తు శ్రీనివాసాచార్యుడికి, అలాగే వారి సబ్రహ్మచారి (సహావిద్యార్థి) పరవస్తు అళగియ మణవాళ జీయర్‌ కు కూడా అతను తిరువాయ్మొళి ఈడును బోధించి, నిజంగానే వీరు తిరువాయ్మొళి నాయనార్ అను నిరూపించుకున్నారు. ప్రతివాధి భయంకరం అణ్ణా [సిద్ధాంతాన్ని అంగీకరించని వారు భయపడేలా ఉండేవారు) గొప్పతనాన్ని ప్రదర్శించి రామానుజ సిద్ధాంతాన్ని రక్షించారు.

మూలము: https://granthams.koyil.org/2021/10/26/yathindhra-pravana-prabhavam-100-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment