శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఆచ్చి తన తండ్రి ఇంట్లో ఉన్న సమయంలో, కందాడై అన్నన్ తండ్రి [దేవరాజ తోళప్పర్] వారి తీర్థం (శ్రాద్ధం) ఆచరించాల్సి వచ్చింది. శ్రాద్ధం కోసం వంట వండడానికి రమ్మని శిఱ్ఱణ్ణర్ భార్య అయిన ఆచ్చిని రమ్మని పిలిచారు. ఆచ్చి వెళ్లి పూర్ణ స్వచ్ఛతతో అందరూ ఆనందించే విధంగా ఆహారాన్ని తయారు చేసింది. ఎమ్పెరుమానుకి ఆహారాన్ని సమర్పించిన తర్వాత, ఆ ప్రసాదన్ని శ్రీవైష్ణవులకు వడ్డించారు. భోజనం అయిన తర్వాత, కందాడై అన్నన్ తమ ఇంటి అరుగుపైన కూర్చొని ఉన్నారు.
శింగరైయర్ కథనం
జీయర్ తిరుమాలిగ నుండి ఒక శ్రీవైష్ణవుడు బయటకు వచ్చారు. కందాడై అణ్ణాన్ ఆ శ్రీవైష్ణవుడిని చూసి ఇలా అడిగారు….
“మీ స్వస్థలం ఏది?”
“వళ్ళువ రాజేందిరం”
“నీవు ఇక్కడికి ఏ పనిమీద వచ్చావు”
“జీయర్ తిరువడి యందు ఆశ్రయం పొందేందుకు అడియేన్ ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు కూడా అనుమతిని దొరకలేదు. ఆ రోజు త్వరలో వస్తుందనే ఆశతో అడియేన్ ఎదురు చూస్తున్నాడు”
“ఈ దివ్య స్థలములో ఎంతో మంది ఆచార్యులు ఉన్నారు. మీరు వారిలో ఒకరి యందు ఆశ్రయం పొంద వచ్చు కదా?
“పెరియ జీయర్ (మణవాళ మాముణులు) తిరువడి వద్ద ఆశ్రయం పొందమని ఎమ్పెరుమానుని నిర్దేశం”
“ఎమ్పెరుమాన్ నుండి మీకు ఆదేశం ఎలా వచ్చింది?”
“అది ఒక దేవ రహస్యం”
“మీ పేరేమిటి?”
“శింగరైయర్”
ఎమ్పెరుమానుని కటాక్షానికి శింగరైయర్ సముచితమైన వారు అని తమ దివ్య మనస్సులో కందాడై అణ్ణన్ భావించారు. శింగరైయర్ ను తమ ఇంటి లోపలికి తీసుకువెళ్లి వారికి తీర్థం, చందనం సమర్పించి, “దయచేసి ఈ రాత్రికి ఇక్కడే మా ఇంట్లోనే ఉండండి” అని ఆప్యాయంగా ప్రార్థించారు. కందాడై అణ్ణన్ తమ ఇంటి బయట ఉన్న అరుగుపైన తమ సోదరులు, కందాడై అప్పన్ మరియు తిరుక్కోపురత్తు నాయనార్ భట్టార్లతో కలిసి ఉన్నారు. ఆ సమయంలో ఆచ్చి, తిరుఅధ్యయనం (శ్రాద్ధం) కి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకొని, అలసిపోయి “జీయర్ తిరువడిగలే శరణం, పిళ్ళై తిరువడిగలే శరణం, వాళి ఉలగాశిరియన్” అని చెప్పి క్రింద వాలి నిద్రపోడానికి సిద్ధమవుతుంది. ఈ మాటలు అరుగుపై కూర్చున్న ముగ్గురు అన్నదమ్ముల చెవిన పడింది. ఈ మాటలు విని ఆశ్చర్యాపోయారు. భట్టర్ (ముగ్గురిలో చిన్నవాడు) “అడియేన్ లోపలికి వెళ్లి కనుక్కుంటాను” అని చెప్పి, “మదినియారే” (వదిన!) అని పిలిచి లోపలికి వెళ్ళాడు. తాను పడుకునే ముందు పలికిన మాటలను వారు విన్నారేమోనని ఆచ్చి భయపడింది. కందాడై అన్నన్ మరియు అప్పన్ భట్టర్ని పిలిచి, “ఇప్పుడు ఆచ్చిని నిద్ర లేపవద్దు. తెల్లవారగానే కనుక్కుందాం” అని చెప్పి నిద్రలోకి జారుకున్నారు. కందాడై అన్నన్ భక్తి భావములో వ్యాకులతతో నిద్రిపోలేకపోయారు; తమ సోదరులకు తెలియకుండా వారు శింగరైయర్ నిద్రిస్తున్న చోటికి వెళ్లి, వారిని మేల్కొలిపి, ఆధ్యాత్మిక ధర్మం గురించి కొన్ని మంచి మాటలు చెప్పారు. ఆ మాటలు విన్న శింగరైయర్ ప్రసన్నులైనారు. అణ్ణాన్ వారితో “జీయర్ దివ్య పాదాల యందు ఆశ్రయం పొందమని ఎమ్పెరుమాన్ నుండి దేవర్వారు ఆజ్ఞను ఎలా పొందారనే విషయం తెలుసుకోవాలని అడియేన్ కు చాలా కోరికగా ఉంది” అని ప్రార్థించెను. శింగరైయర్ ఈ కథనం వారికి వివరించారు:
“మా ఊరిలో పండే కాయకూరలను ఈ ప్రదేశంలోని ప్రముఖుల తిరుమాలిగలకు సమర్పించడం అడియేన్ ఆచారం. ఒక శ్రీవైష్ణవుడు కాయ కూరలను జీయర్ తిరుమాలిగలకు సమర్పించమని అడియేన్ తో అన్నారు. దానిని మహాభాగ్యంగా అడియేన్ భావించి వాటిని మఠానికి పంపించారు. అది చూసిన జీయర్ అడియేన్ ని ‘వీటిని ఎక్కడ పండించారు? ఎక్కడి జలం వాడారు? ఆ మొక్కలకు నీరు ఎవరు పోసారు? వీటిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?’ అని ప్రశ్నించారు. అడిగిన ప్రశ్నలకు వినయంగా స్పందిస్తూ ‘వీటిని స్వచ్ఛమైన భూమిలో సాగు చేశాము. అడిచేరి [ఒక ప్రదేశం] లోని దేవార్వారి అనుచరులు వాటికి నీళ్ళు పోశారు. ఇది భాగవతుల సంపద. ఈ సమాధానము విన్న జీయర్ సంతోషించి అతనికి ఆమోదం తెలిపి సన్నిధికి వెళ్లి పెరుమాళ్ళని సేవించమన్నారు. అడియేన్, సన్నిధికి చేరుకున్న తర్వాత, అర్చకుడు ‘కూరగాయలను ఈ రోజు ఎవరికి సమర్పించారు?’ అని అడిగారు. అడియేన్ స్పందిస్తూ ‘జీయర్ మఠం’ అని బదులు చెప్పాను. అర్చకుడు సంతోషించి ఆప్యాయంగా భుజము తట్టి, ‘నువ్వు అదృష్టవంతుడివి. నీవు విశిష్ట సంబంధాన్ని పొందబోతున్నావు’ అని తెలియజేశారు. అడియేనుకి తీర్థం, చందనము, దివ్య మాల, తమలపాకులు, అభయ హస్తం (రక్షణ అందించే నమ్పెరుమాళ్ళ దివ్య హస్తం యొక్క చందనపు అచ్చు), శ్రీ శఠగోపురాన్ని సమర్పించారు. ‘ఈ రోజు అడియేన్ పైన అనంతమైన కృపా వర్షం కురుచుచున్నది! అని అవాక్కైపోయాను. ‘అతన్ని దృఢంగా పట్టుకో’ అనే మాటలు వినిపించాయి. ఆ మాటల్లో ఏదో అర్థం ఉందని అనిపించింది. మఠానికి తిరిగి వచ్చి, సాష్టాంగం చేసి, దేవర్వారి కారణంగా, పెరుమాళ్ళు కురిపించిన దయ, సన్నిధిలో జరిగిన సంఘటనలను వివరించి, మఠం నుండి అనుమతి కోరాను. మఠంలోని అనుచరులు అడియేన్ పట్ల ఆప్యాయతతో దారిలో తినడానికి ప్రసాదం కట్టి ఇచ్చారు. దారిలో ఆ ప్రసాదాన్ని తిన్న వెంటనే మనస్సులో పవిత్రతను అనుభవించి జీయర్ ఆశ్రయం పొందాలనే ఆసక్తిని పెరిగింది. ఆ రాత్రి స్వప్నంలో, తిరుమణత్తూణ్ (గర్భగుడి వెలుపల ఉన్న రెండు స్తంభాలు) దగ్గర నిలబడి అడియేన్ పెరియ పెరుమాళ్ళను సేవిస్తున్నట్లుగా, పెరియ పెరుమాళ్ళు తమ దివ్య హస్తాన్ని ఆదిశేషని వైపుకు ఎత్తి చూపి, ‘అతనే అళగియ మణవాళ చీయర్ (జీయర్). అతనితో సంబంధాన్ని ఏర్పరచుకో’ అని స్వప్నంలో చూశాను. సంతృప్తి చెంది, జీయర్ తిరువడి యందు ఆశ్రయం పొందాలని వేచి ఉన్నాను”. ఇది విన్న కందాడై అణ్ణన్ కు వారి పట్ల గౌరవం మరింత పెరిగి, అలా చాలా సేపు తమలో తాము ఆలోచిస్తూ నిద్రలోని జారుకున్నారు. నిద్రలో వారు ఒక కల కన్నారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/26/yathindhra-pravana-prabhavam-42-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org