శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
నంపిళ్ళై వారికి ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఒకరోజు వంట చేస్తే, మరుసటి రోజు చిన్న భార్య వంట చేసేది. ఇది ఇలా సాగుతుండగా, నంపిళ్ళై తమ మొదటి భార్యను పిలిచి, “నా గురించి నీ అభిప్రాయమేమిటి? నీ మనస్సులో ఏమనుకుంటున్నావు?” అని అడిగారు. ఆమె వారికి నమస్కారాలు చేసి, కొంత సిగ్గుతో కొంత భయంతో, “మీరు నంపెరుమాళ్ళ అవతారము, నాకు ఆచార్యులు. నేను మీకు కట్టుబడి ఉండి మీ దివ్య పాదాలకు నిర్వహించే కైంకర్యాలు నాకు జీవనాధారం వంటివి” అని బదులిచ్చెను. ఆ తర్వాత వారు రెండో భార్యను అదే ప్రశ్న అడిగాడు. ఆమె కొంత సిగ్గుతో కొంత భయంతో “మీరు నాకు భర్త, నేను మీకు భార్యను” అని సమాధానం ఇచ్చింది. వారి సమాధానాలు విని నంపిళ్ళై తన మొదటి భార్యను ప్రతి రోజూ తలిగ (వంట) చేయమని, రెండవ భార్యను ఆమెకు సహాయము చేయమని ఆదేశించారు. మొదటి భార్య వంట చేయలేని నెల సరి రోజుల్లో రెండో భార్య వంట చేసేది. ఆ మూడు రోజులు వారు ఎంబెరుమాన్ కి నైవెధ్యము సమర్పించి, ఆ ప్రసాదాన్ని 4 వ వర్ణంలో జన్మించిన ఉన్నత శ్రీ వైష్ణవునెచే తాకించి ఆ తరువాత వారు స్వీకరించేవారు. దీనితో, వారి రెండవ భార్యలో పవిత్రత లోపము ఉన్నందున, భగవానునికి సమర్పించిన తరువాత కూడా, ఆ ప్రసాదానికి శుద్ధ శ్రీ వైష్ణవ స్పర్శ అవసరమని అర్థమవుతుంది.
నంపిళ్ళై వారికి తమ రెండవ భార్య ద్వారా ఒక కుమారుడు జన్మించాడు. శ్రీ వైష్ణవులు ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే, తిరుప్పేరాచ్చాన్ అనే ఒక వ్యక్తి “నాకు ఒక అన్నయ్య అవతరించాడు” అని అంటారు. దీని అర్థం ఏమిటంటే, ఆచార్య తిరుకుమారుడు చిన్నవాడైనప్పటికీ, తమకు పెద్దవాడిగా పరిగణించబడతాడు.
ఒకరోజు నంపిళ్ళై వారు పిన్బళగియ పెరుమాళ్ జీయార్ (వారి శిష్యులు) వారి మఠంలో ఉన్నారు. వారి శిష్యులు “మనం లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆళ్వార్ల లాగా ఉండాలి, కాని మనము స్త్రీలు, ఆహార పానీయాదులు మొదలైన వాటితో బంధింపబడి ఉన్నాము. మనం ఏమి చేయాలి?” అనే ప్రశ్నని అడిగారు. నంపిళ్ళై వారు దయతో “మనం ఇంకా ప్రాపంచిక విషయాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, శరీరాన్ని విడిచిపెట్టి కైంకర్యమనే అత్యున్నత లక్ష్యాన్ని పొందే ముందు, ఎంబెరుమాన్ మనకి ఆళ్వార్ల స్థితిని అనుగ్రహించి అది జరిగేలా చేస్తారు” అని అన్నారు. దీనికి ప్రమాణం “నకలు భాగవతా యమ విషయం గచ్ఛంత” (భగవానునికి శరణాగతులైన శ్రీ వైష్ణవులు యమ లోకానికి చేరుకోరు) మరియు ముదల్ తిరువందాది పాశురము 55 లో “అవన్ తమర్ ఎవ్వినైయారాగిలుం ఎంగోన్ అవన్ తమరే ఎన్ఱు ఒళివదల్లాల్ నమన్ తమరాల్ ఆరాయపట్టఱియార్ కండీర్” (యమ దూతలు శ్రీ వైష్ణవులను చూసి ప్రశ్నించరు. “వీరు మన భగవానుని భక్తులు కదా!” అని ప్రశంసించడం తప్ప). ఆ విధంగా ఈ ఆత్మలు తమ ఉజ్జీవనములో నిరంతరం మునిగి ఉంటారు. ఆత్మ ఆ శరీరాన్ని విడిచి వెళ్ళే సమయంలో, శరీరంలో ఆ ఆత్మకి ఎంబెరుమాన్ అసహ్యము సృష్టిస్తాడు, అర్చిరాధి మార్గంలో (శ్రీ వైకుంఠానికి వెళ్ళే ప్రకాశ మార్గం) తన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, శ్రీ మాలాకారునికి (కృష్ణావతారంలో పూల దండలు అమ్మినవాడు) ప్రత్యక్షమైనట్లు, తన దివ్య స్వరూపాన్ని ఆ ఆత్మకి వ్యక్తపరుస్తాడు. ఆ ఆత్మలో పర భక్తి, పర జ్ఞానము మరియు పరమ భక్తి గుణాలను (ఎంబెరుమానుని యొక్క జ్ఞానం, భగవానుడు లేకుండా ఉండలేని స్థితి, ఎంబెరుమానుని చేరుకోవడం) సృష్టిస్తాడు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/07/21/yathindhra-pravana-prabhavam-6-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org