శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ళ మహిమ
నంపిళ్ళై నుండి ఈడు ముప్పత్తారాయిరం (నంపిళ్ళై ఉపన్యాసాల ఆధారంగా వడక్కు త్తిరువీధి పిళ్ళై రాసిన వ్యాఖ్యానం) అందుకున్న తర్వాత, ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ తమ తిరుకుమారులైన ఈయుణ్ణి పద్మానాభ పెరుమాళ్ళకి ఆ వ్యాఖ్యానాన్ని బోధించారు. అతను శ్రీ వైష్ణవ దర్శనంతో ముడిపడి ఉండేలా అనేక శ్రీ సూక్తిల గోప్య అర్థాలను కూడా వారికి బోధించారు. శ్రీ పద్మానాభ పెరుమాళ్, దయతో ఆ పైన తమ శిష్యుడైన కోళ వరాహ నాయనార్లకి ఆ అర్థాలను బోధించి శ్రీ వైష్ణవ దర్శనంతో జతపడి ఉండేలా మలచుతారు. వీరిని నాలూర్ పిళ్ళై అని మరొక పేరుతో కూడా పిలుస్తారు. ఆ పైన వీరు తమ తిరుకుమారుడైన నాలురాచ్చాన్ పిళ్ళైకి ఆ జ్ఞానాన్ని అందించి అతనిపై తన కృపా వర్షాన్ని కురిపించెను. నాలురాచ్చాన్ పిళ్ళై ఈ వ్యాఖ్యానార్థాలను తమ శిష్యులలైన తిరువాయ్మొళి పిళ్ళై కి (మణవాళ మాముణుల ఆచార్యులు), తిరునారాయణపురత్తు ఆయికి, తిరువాయ్మొళి ఆచ్చాన్ పిళ్ళైకి బోధించెను. ఈ విషయమును గురించి మణవాళ మాముణుల ఉపదేశ రత్నమాల 49 వ శ్లోకము “ఆంగవర్ పాల్ పెత్త శిఱియాళ్వాన్ అప్పిళ్ళై। తామ్ కొడుత్తార్ తమ్ముగనార్ తం కైయిల్ పాజ్ఞ్గుడనే నాలూర్ పిళ్ళైక్కు అవర్ దామ్ నల్లమగనార్కు అవర్ దామ్ మేలోర్కు ఈన్దార్ అవరే మిక్కు॥” లో మనము గమనించ వచ్చు (ఈ శ్లోకము ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ నుండి తిరువాయ్మొళి పిళ్ళై వరకు ఈడు ముప్పత్తారాయిర అర్థాలు ఎలా పరంపర రూపముగా వచ్చిందో వివరిస్తుంది).
ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ళ దివ్య తిరు నక్షత్రం హస్తా. వారి తనియన్
వరదార్యకృపాపాత్రం శ్రీమాధవగురుం భజే
కురుకాధీశ వేదాంత సేవోన్మీలిత వేదనం
(నంపిళ్ళై, తమిళ ఉపనిషత్తుగా గౌరవించబడే తిరువాయ్మొళిపై కాలక్షేపాలు చేయడం వల్ల ఎంతో జ్ఞాన స్పష్టత సంపాదించారు. వరదార్యులు అని కూడా పిలువబడే నంపిళ్ళైల కృపకు పాత్రులైన ఈయుణ్ణి మాధవ ప్పెరుమాళ్ళని నేను స్తుతిస్తున్నాను.).
ఈయుణ్ణి పద్మనాభ ప్పెరుమాళ్ళ దివ్య తిరు నక్షత్రం స్వాతి. వారి తనియన్
ఏనావగాహ్య విమలోస్మి శటారిసూనోర్ – వాణీగణార్థ పరిబోధ సుధాపకాయాం
శ్రీమన్ ముకుంద చరణాబ్జమధువ్రతాయ శ్రీ పద్మనాభ గురవే నమ ఆచరామః
(నమ్మాళ్వార్ల దివ్య పాశురార్థాల నుండి వెలువడిన దివ్య తేనె సాగరములో మునిగి తేలే అవకాశము మనకందించిన, శ్రీయఃపతి ముకుందుని దివ్య పాదాల యందు భ్రమరములా ఉన్న ఆ పద్మాభ పెరుమాళ్ళని మనము ఆరాధిద్దాము)
నాలూర్ పిళ్ళైల దివ్య తిరునక్షత్రం పుష్యం. వారి తనియన్
శ్రీ పద్మనాభ కురుత శటజిన్మునీంద్ర శ్రీసూక్తిభాష్యమధిగమ్య సమృద్ధభోదః
తత్ దేవరాజగురవేః యతిశచతుశ్ పూర్వాసేత్త కోలవర దేశికమాశ్రయే తం
(నాలూర్ నివాసి అగుటచే దివ్య తేజముతో ప్రకాశిస్తున్న కోలవరాహరుల [నాలూర్ పిళ్లై] దివ్య పాదాలను నేను ఆశ్రయించాను. శ్రీ పద్మాభ పెరుమాళ్ళ నుండి పొందిన నమ్మాళ్వార్ల దివ్య ప్రబంధ [తిరువాయ్మొళి] వ్యాఖ్యానమైన ఈడు గురించి వీరు పూర్ణ జ్ఞానం ఉన్నవారు. కోలవరాహరుల ఈడు దివ్య పరిజ్ఞానాన్ని కృపతో నాలూరాచ్చాన్ పిళ్లైకి బోధించారు).
నాలూరాచ్చాన్ పిళ్ళై వారి తనియన్:
నమోస్తు దేవరాజాయ చతుర్ గ్రామనివాసినే
రామానుజార్యదాసస్య సుతాయ గుణశాలినే
(నాలూర్ నివాసి, నాలూర్ పిళ్ళైవారి తిరు కుమారులు, అన్ని శుభ గుణాలలో సంపూర్ణుడు, దేవరాజర్ మరియు శ్రీ రామానుజ దాసర్ అని కూడా పిలవబడే నాలూరాచ్చాన్ పిళ్లైకి నా వందనాలు అందజేస్తున్నాను. ).
కోలాదిపాద్విదువారబ్య సహస్రగీతేర్భాశ్యం హి పూర్వతన దేశికవర్యగుప్తం
త్రేతా ప్రవర్త్య భువియః ప్రతయాంచకార శ్రీ దేవరాజ గురువర్యమహం భజేతం
(పూర్వాచార్యులచే భద్రంగా రక్షించబడిన ఈడు వ్యాఖ్యానాన్ని తమ తండ్రి కోలాధిపర్ల నుండి పొందిన మహానుభావుడు ఆచార్య దేవరజులు (నాలూరాచ్చాన్ పిళ్లై). వీరికి నేను నమస్కరిస్తూ స్తుతిస్తున్నాను. వీరు ముగ్గురు అచార్యులైన (తిరువాయ్మొళి పిళ్ళై, ఆయి జనన్యాచారియర్, తిరువాయ్మొళియాచ్చాన్ పిళ్ళై) ల ద్వారా ఈ వ్యాఖ్యానాన్ని అంతటా వ్యాప్తింపజేశారు.)
శ్రీ శైలనాథగురు మాతృగురుత్తమాభ్యాం శ్రీసూక్తి దేశికవరేణ చ యస్త్రిదైవం
వ్యక్తశ్శటారికృతి భాష్య సుసంప్రదాయో విస్తారమేతి సహి వైష్ణవపుంగవేషు
(తిరువాయ్మొళికి భాష్యము అయిన ఆ ఈడు, ఈ ముగ్గురు ఆచార్యుల (తిరువాయ్మొళి పిళ్ళై, ఆయి జనన్యాచారియర్యులు, తిరువాయ్మొళియాచ్చాన్ పిళ్ళై) ద్వారా శోభను పొందింది, ఆపై శ్రీవైష్ణవ పెద్దలచే ప్రాబల్యము గణించింది.)
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/07/25/yathindhra-pravana-prabhavam-10-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org