శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
నంపెరుమాళ్ కోయిల్ ని విడిచి వెళ్ళుట
ఈ విధంగా పిళ్లై లోకాచార్యులు సమస్థ చేతనులు ఉద్దరింపబడాలని ప్రమాణం (వేదాలు), ప్రమేయం (ఎమ్పెరుమాన్), ప్రమాతృ (వివిధ గ్రంథాల రచయితలు) మహిమలను చాటుతున్న తరుణంలో శ్రీరంగం తుర్క ఆక్రమణదారుల వశమైనది. పెరియ పెరుమాళ్ మరియు నమ్పెరుమాళ్ళకు ఎలాంటి హాని జరగ కూడదని, పెరియ పెరుమాళ్ళు కనబడ కూడదని రాతి గోడ నిర్మించి ఆ గోడ ఎదుట పెరుమాళ్ళ విగ్రహ స్థాపన చేశారు. ఉభయ నాచ్చిమార్లతో పాటు నంపెరుమాళ్ళని పల్లకీలో ఆలయం నుండి బయటకి తరలించారు. పెరుమాళ్ తిరుమొళి 4 – 6 లో “సుఱ్ఱమెల్లాం పిన్ తొడరత్తొల్ కానం అడైందు” (శ్రీ రాముడు తమ ప్రియమైన వారితో అడవికి వెళ్ళాడు), పెరియ తిరుమొళి 5 -10లో “తంబియొడు తామ్ ఒరువర్ తం తుణైవి కాదల్ తుణైయాగ” (శ్రీరాముడు తన ప్రియమైన పత్ని, తమ్ముడితో కలిసి వెళ్ళాడు) అని చెప్పినట్లు, నంపెరుమాళ్ తమ రహస్య పరివారంతో ఆలయం నుండి వలస వెళ్ళాడు. తిరువాయ్మొళి 8 -3 -7 పాశురంలో చెప్పబడినట్లుగా, “ఉరువార్ చక్కరం శంగు సుమందు ఇంగు ఉమ్మోడు ఒరు పాడు ఉళల్వాన్ ఓరడియాన్…” (నీ దివ్య అందమైన శంఖు చక్రములను ఎత్తుకొని నీ దాసుడు నీతో నడుచుచున్నాడు) శ్రీరామునికి సేవ చేయుటకు లక్ష్మణుడు తన విల్లు మరియు ఖడ్గంతో తన అన్న వెంబడి వెళ్ళినట్లు, పిళ్ళై లోకాచార్యులు కూడా నంపెరుమాళ్ళ వెంబడి వెళ్ళారు. లోకాచార్యులు ఇతర సహచరులతో పాటు నంపెరుమాళ్ళను స్తుతిస్తూ, సంక్షేప రామాయణంలో “ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచనః” (కమల నేత్రాల శ్రీ రాముడు అరణ్యములోకి ప్రవేశించెను) అని చెప్పబడినట్లుగానే వీరు కూడ అడవిలోకి ప్రవేశించారు. శ్రీ రామాయణం అరణ్య కాండ 119-22 లో “వనం సభార్యః ప్రవివేశ రాఘవః సలక్ష్మణః సూర్య ఇవ అభ్ర మండలం” (సూర్యుడు మేఘాలలోకి ప్రవేశించినట్లు సీతా లక్ష్మణ సమేత శ్రీ రాముడు అరణ్యములోకి ప్రవేశించెను). గర్జించి భయపెట్టే సింహాలు, పులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు అనేక క్రూరమైన జంతువులుండే మహారణ్యం గుండా వాళ్ళు వెళుతున్నారు. చేతుల్లో బాణాలు పట్టుకొని ఆ ప్రాంతంలో వేటగాళ్ళు కూడా తిరుగుతున్నారు. దొంగలున్న ప్రాంతానికి చేరుకున్న నంపెరుమాళ్ళు దయతో తమ సంపదంతా (తిరు ఆభరణాలు) ఆ దొంగలకు ఇచ్చాడు. అది విన్న పిళ్ళై లోకాచార్యులు వెనక్కి తిరిగి వచ్చి అదే దొంగలపై తన పూర్తి కృపను కురిపించి ముందుకు సాగారు. అక్కడి కోయ్య వాళ్ళు కొంతమంది వచ్చి పిళ్లై లోకాచార్యులకి శరణాగతి చేసి కొన్ని సమర్పణలు అందించుకున్నారు.
లోకాచార్యులు తిరుమలైయాళ్వార్లని సంప్రదాయానికి తీసుకు వచ్చి శ్రీవైకుంఠానికి చేరుకొనెను
వాళ్ళు నంపెరుమాళ్ళతో కలిసి మధురై దగ్గరలో ఉన్న జ్యోతిష్కుడి (ప్రస్తుతం కొడిక్కుళం అని పిలువబడుతుంది) అనే గ్రామానికి చేరుకుని అక్కడ తమ బస ఏర్పాటు చేసుకున్నారు. పిళ్ళై లోకాచార్యులు అనారోగ్యం అలసట కారణంగా పరుండినారు. వారి స్థితిని చూసి శిష్యులు బాధతో తామెవరిని ఆశ్రయించాలని బాధచెందారు. పిళ్ళై లోకాచార్యుల దివ్య మనస్సు తిరుమలై ఆళ్వార్ గురించి ఆలోచించి, లౌకికము మరియు వైధికము రెండింటిలోనూ నిపుణుడైన తిరుమలై ఆళ్వార్ అని పెద్ద స్వరంతో వారికి చెప్పారు. వారు అప్పట్లో మధుర రాజ్య వ్యవహారాలను చూసుకుంటుండేవారు. రాజ్య వ్యవహారాల బాధ్యతలను వదిలి దర్శన బాధ్యతలు చేపట్టేలా చేయమని వారిని ఆదేశించెను. అతనికి అన్ని రహస్య గ్రంథాలు, వాటి అర్థాలను బోధించమని కూరకుళోత్తమ దాసి నాయనార్లను, తిరుక్కణ్ణంగుడి పిళ్ళై మరియు తిరుపుట్కుళి జీయర్ని వారికి తిరువాయ్మొళిని బోధించమని, నాలూర్ పిళ్ళైని మూవాయిరప్పడి (తిరుప్పావై)ని నేర్పించమని, విలాంజోలై పిళ్ళైని సప్తకాదైని బోధించమని పురమాయించెను. ఆని (మిథున) తమిళ మాసంలో అమావాస్య తరువాతి ద్వాదశి (12వ) రోజున వారు తిరునాడు (శ్రీవైకుంఠం) కి బయలుదేరాలని నిశ్చయించుకున్నారు. వారు విలాంజోలై పిళ్ళైని చివరి వరకు తిరువనంతపురంలోనే ఉండమని కోరారు. వారు తమ తండ్రి మరియు ఆచార్యులైన వడక్కు తిరువీధి పిళ్ళై దివ్య తిరువడిని స్మరించుకుంటూ తిరునాడుకి బయలుదేరారు. వారి శిష్యులందరూ దుఃఖంలో మునిగిపోయారు. వాళ్ళు తమను తాము ఓదార్చుకొని, పిళ్ళై లోకాచార్యుల దివ్య తిరుమేనిని దివ్య పరియట్టం (శిరస్సున ధరించే వస్త్రం), నంపెరుమాళ్ళ దివ్య పూలమాలలతో అలంకరించి చరమ కైంకర్యములను నిర్వహించిరి.
పిళ్ళై లోకాచార్యుల తిరునక్షత్రము శ్రవణము, ఐప్పశి (తులా) మాసము. వీరి తనియన్
లోకాచార్య గురవే కృష్ణ పాదస్య సూనవే
సంసారి భోగి సందష్ఠ జీవజీవాతవే నమః
(సంసారం అనే విష సర్ప కాటుకు విరుగుడు అయిన వడక్కు తిరువిధి పిళ్ళై వారి తిరు కుమారులైన పిళ్ళై లోకాచార్యుని నేను ఆశ్రయిస్తున్నాను.)
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/07/29/yathindhra-pravana-prabhavam-14-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org