శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
తరువాత, కూరకులోత్తమ దాస నాయన్ తమ అంతిమ రోజుల్లో ఉన్నారని గ్రహించి, తిరుమలై ఆళ్వార్ ను పిలిచి, విళాంజోలై ప్పిళ్ళై వద్ద ముఖ్యమైన భావార్థాలను నేర్చుకోమని; తిరుక్కణ్ణంగుడి పిళ్ళై వద్ద తిరువాయ్మొళిని నేర్చుకోమని చెప్పి, తమ ఆచార్యులైన పిళ్ళై లోకాచార్యుల దివ్య చరణాలను స్మరిస్తూ తిరునాడు (శ్రీవైకుంఠం) కి చేరుకున్నారు. వారి చరమ సంస్కారాలు వారు తిరుకుమారులు సంపన్నము గావించెను. కూరకులోత్తమ దాసులు తిరునక్షత్రం తిరువాదిరై (ఆరుద్ర) ఐప్పశి (తులా) మాసం. వారి తనియన్
లోకాచార్య కృపా పాత్రం కౌండిన్య కులభూషణం
సమస్థాత్మ గుణావాసం వందే కూర కులోత్తమం
స్వయమాహూయ శైలేశ గురవేర్థప్రధానతః
లబ్దోధారపితం కూరకులోత్తమం అహం భజే
(పిళ్ళై లోకాచార్యుల దయకు పాత్రుడు, కౌండిన్య వంశానికి భూషణము వంటి వారు, సకల శుభ గుణాలకు నెలవైన కూరకులోత్తమ దాస నాయనార్ కు నా పాదాబి వందనాలు సమర్పిస్తున్నాను. తిరుమలై ఆళ్వార్ పై విషేశ [రహస్యార్థముల] కృప కురిపించి, అందువల్ల ఉదారుడని ప్రఖ్యాతి గాంచిన కూరకులోత్తమ దాస నాయనార్లను నేను ఆరాధించెదను.)
ఆ తరువాత, తిరుమలై ఆళ్వార్ తిరుక్కణ్ణంగుడి పిళ్ళై ని ఆశ్రయించి, వారికి సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకొని, “తిరువాయ్మొళి అర్థాలను ఈ అడియేన్ కి కృపచేయ మని ప్రార్థిస్తున్నను” అని కోరారు. పిళ్లై అంగీకరించి, పద పదార్థాల ఆధారంగా తిరువాయ్మొళి అర్థాలను బోధించడం ప్రారంభించెను. తిరుమలై ఆళ్వార్ తమిళ భాషా నిపుణులు కాబట్టి, వారు భావార్థాలను వివరణాత్మకంగా చెప్పమని పిళ్లైని అభ్యర్థించారు. అప్పడికి పిళ్లై వృద్దులైనందున, అలా చేయలేక వారు తిరుమలై ఆళ్వార్ ను తిరుప్పుట్కుళి జీయర్ వద్ద అభ్యసించమని చెప్పెను. తిరుమలై ఆళ్వార్ కాంచీపురం చేరుకున్నారు. కానీ వారు చేరుకున్న ఆ రోజు జీయర్ మోక్షాన్ని పొందిన పన్నెండవ రోజు అని తెలుసుకున్నారు. వారు చాలా బాధపడ్డారు. వారు మంగళాశాసనాలు సమర్పించుకునేందుకు దేవరాజ పెరుమాళ్ ఆలయంలోని ఆచార్యులందరూ అలాగే ఆలయ ఉద్యోగులు అందరూ వారిని పెరుందేవి తాయర్ మరియు పేరారుళాళ పెరుమాళ్ళ వద్దకి తీరుకువెళ్లి తీర్థ శఠారి, పెరుమాళ్ళ దండ, దివ్య తుళసి వగైర వారికి అందించి, దర్శన ప్రవర్తకులిగా వారిని కీర్తించారు.
మర్నాడు నాలూర్ పిళ్లై వారి కుమారులైన నాలూరాచ్చాన్ పిళ్లైతో కలిసి తిరునరాయణపురం నుండి తిరిగి వచ్చి, పేరరుళాళ పెరుమాళ్ళకి మంగళాశాసనాలు సమర్పించుకునేందుకు ఆలయానికి విచ్చేసారు. ఆ సమయంలో సన్నిధి లోపల తిరుమలై ఆళ్వార్ మంగళాశాసనము చేయుచుండెను. సన్నిధి లోపల తిరుమలై ఆళ్వార్ ఉన్నారని తెలియక, లోపల ఎవరు ఉన్నారని వారు బయట ఉన్న వారిని అడిగారు. కోయిల్ తిరుమలై ఆళ్వార్ అని బయట ఉన్నవారు చెప్పారు. వారు దయతో “ఇది కోయిల్ తిరుమలై పెరుమాళ్ కోయిల్ కాదా?” అని అన్నారు. (శ్రీరంగం, తిరుమల కాంచీపురంలోని దివ్య ఆలయాలను కోయిల్, తిరుమలై మరియు పెరుమాళ్ కోయిల్ అని సంబోధించుట ఆచారం). అర్చాకులు శ్రీ శఠారిని అందరికీ అందిస్తుండగా, వెనుక వరుసలో ఉన్న నాలూర్ పిళ్లై, శ్రీ శఠారిని స్వీకరించడానికి అర్చాకుల వైపు తల వంచారు. శ్రీ శఠారి అందిస్తుండగా వారు తమ దివ్య హస్తాలతో శఠారిని ముట్టుకున్నారు. అర్చాకారులు హడావిడిగా ఆ శ్రీ శఠారిని సన్నిధి లోపలికి తీసుకొచ్చి, తిరుమలై ఆళ్వార్ల దివ్య చేతులను పట్టుకుని, నలూర్ పిళ్ళై వద్దకు తీసుకొచ్చి వారిని అప్పగించి, “అతనికి మూవాయిరం (3000 పాశురాలు, తిరువాయ్మొళి తప్పించి) బోధించమని మేము జ్యోతిష్కుడిలో ఆదేశించాము; అతను వచ్చాడు; తిరుప్పుట్కుళి జీయర్కి జరిగిన నష్టాన్ని సరిచేసేందుకు, మీరు వీరికి అది కూడా బోధించండి” అని ఎమ్పెరుమాన్ అర్చక మూఖేన తెలియజేశారు. “మహా అనుగ్రము, కానీ తిరుక్కణ్ణంగుడి పిళ్ళై చేయలేనిది, బోధించే సామర్థ్యము ఈ అడియేన్ కు గలదా?” అని అన్నారు. ఎంబెరుమాన్ “నాలూరాచ్చాన్ పిళ్ళై వారికి బోధించినట్లైతే, ఆత్మావై పుత్రనామాసి (పుత్రుడిగా జన్మించిన ఆత్మ) అని చెప్పినట్లు, అది మీరు అతనికి బోధించిన దానికి సమానమౌతుంది” అని అర్చక ముఖేన పలికారు. అది విని, నాలూర్ పిళ్ళై చాలా సంతోషించి, తిరుమలై ఆళ్వార్తో “స్వాగతం, ఆళ్వార్! అడియేన్ వృద్ధుడైనాడు; నీవు అనేక రంగాలలో నిపుణుడవు; అతను మాత్రమే (తమ తిరుకుమారుడైన నాలూరాచ్చన్ పిళ్ళైని చూపిస్తూ) నీకు బోధించగలడు” అని తెలుపెను. తిరుమలై ఆళ్వార్ ను తమ తిరుకుమారుడైన నాలూరాచ్చన్ పిళ్ళైకి అప్పగించి, వారు తిరునారాయణపురానికి బయలుదేరారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/03/yathindhra-pravana-prabhavam-19-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org