యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 23

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 22

ఈ క్రింద చెప్పినట్లుగా …

అతత్స్య గురుః శ్రీమాన్ మత్వాదం దివ్య తేజసం
అభిరామవరాధీశ ఇతి నామ సమాధిశత్

(దివ్య తేజస్సుతో ఉన్న ఆ బిడ్డను చూసి, అణ్నార్, (ఆ బిడ్డ తండ్రి) మరియు ఒక శ్రీమాన్ (ఎమ్పెరుమానునికి కైంకర్యం చేయువారు), ఆ బిడ్డకు అళగియ మణవాళ పెరుమాళ్ అని దివ్య నామకరణం చేశారు). విప్పిన పడగలతో అనాదిగా ఆదిశేష శయ్యపైన పవళించి ఉన్న ఆ పెరుమాళుని దివ్య నామాన్ని ఆ బిడ్డకి పెట్టారు. పెరియాళ్వార్ తిరుమొళి 1.1.7 లో కృష్ణుని గురించి పెరియాళ్వార్ చెప్పినట్లే “ఆయర్ పుత్తిరన్ అల్లన్ అరుం దెయ్వం” (ఆతడు గొల్ల బాలుడే కాదు, ఆతడు పరమాత్మ) మరియు పెరియాళ్వార్ తిరుమొళి 2.5.1 “ఎన్నైయుం ఎంగళ్ కుడి ముళుదాట్కొండ మన్నన్” (నన్ను నాతో పాటు నా వంశాన్నంతటినీ గెలిచినవాడు), ఆ బిడ్డను వారి తల్లిదండ్రులు అతని తాతగారి ఊరైన సిక్కిల్ కిడారం కు తీసుకొని వెళ్లి అక్కడ పెంచి పోషించారు. అతను కూడా, ఈ క్రింద చెప్పినట్లుగానే

పరభక్తి పరజ్ఞానం పరమాభక్తిద్యపి
వపుషావర్తమానేన తత్తస్య వవృతేత్రయం

(పెరిగి పెద్దగౌతున్న ఆ అళగియ మణవాళ పెరుమాళ్  తిరుమేనితో పాటు, వారిలో పరభక్తి, పరజ్ఞానం మరియు పరమ భక్తి అను మూడు గుణాలు కూడా పెరగసాగాయి) [పరభక్తి అనగా ఎమ్పెరుమాన్ గురించి తెలుసుకునే స్థితి, పరజ్ఞానం అంటే ఎమ్పెరుమానుని ప్రత్యక్షంగా ఊహించుకొని దర్శించే స్థితి. పరమ భక్తి అనేది భగవానుడు లేకుండా ఉండలేని స్థితి), వారి తిరుమేని స్వరూపంతో పాటు వారి దివ్య గుణాలు కూడా పెరిగేలా ఎదిగారు. వారు తండ్రిగారైన అణ్ణర్ కూడా బ్రాహ్మణ జన్మకి తగిన రీతిలో అన్ని కర్మలనాచరించారు. ఈ క్రింద శ్లోకములో చెప్పబడింది…

ప్రాప్తాన్ ప్రాతమివికేవర్ణే కల్పజ్ఞాః కల్పయంతి యాన్
కాలే కాలే చ సంస్కారాన్ తస్య చక్రే క్రమేణ సః

(మొదటి వర్ణంలో జన్మించి కల్పసూత్రాలనెరింగిన బ్రాహ్మణుడికి ఏ ఆచారాలు నిర్దేశించబడ్డాయో, వాటిని అణ్ణర్ తమ తిరుకుమారునికి నిర్వహించారు)

అణ్ణర్ వారి తిరుకుమారునికి తగిన వయస్సులో శాస్త్రానుసారంగా చౌలం (శిఖ), ఉపనయనం వంటి విధులను పూర్తిచేసెను. వారు తమ తిరుకుమారునికి వేదముల అర్థాలను కూడా బోధించారు. ఈ శ్లోకములో ఇలా చెప్పబడింది…..

ఆత్మాంపరపాదం ఆజాను భుజం అంబుజలోచనం
ఆకారమస్య సంపశ్య ముక్తోపి ముమునే జనః

(ఎర్రటి కమలాన్ని పోలిన ఎర్రటి వారి దివ్య పాదాలు, దివ్య మోకాళ్ళను తాకుతున్న వారి దివ్య హస్తాలు, ఎర్రటి కమలముల వంటి దివ్య నేత్రాలతో ఉన్న అతని దివ్య స్వరూపాన్ని చూసి జ్ఞానము లేని సామాన్యులు కూడా ఎంతో ఆనందించారు)

సౌశీల్యేన సుహృత్వేన గాంభీర్యేన గరీయసా
రజ్ఞనేనప్రజానాంచ రామోయమితి మేనిరే

(వారి ఒదిగి ఉండే స్వభావాన్ని, అణకువతో అందరితో మెదిలే స్వభావాన్ని, అందరి పట్ల ప్రేమ చూపించి సంతోషపెట్టుట, ఠీవీ తనాన్ని చూసి ప్రజలు ఆయన్ను శ్రీరామునిగా భావించేవారు), తమను చూసిన ప్రతి ఒక్కరినీ ఆకర్షించి సంతోషపరిచేవారు. చంద్రుడు ప్రతిరోజు కిరణాలను పెంచుకుంటూ పెరుగుతున్నట్లుగా, అళగియ మణవాళన్ కూడా పెరిగెను. ఈ శ్లోకములో చెప్పిబడింది….

కాలేన సకలానాంచ కలానామేగమాస్పతం
సుసుపే సత్తం పూర్ణః సుతాంశురీవ నిర్మలః

(అన్ని కళలకు నిధిగా అళగియ మణవాళన్ ఏ దోషం లేని చంద్రునిలా ప్రకాశించెను), సంపూర్ణ జ్ఞానం కారణంగా అంతులేని గొప్పతనమున్నవారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/07/yathindhra-pravana-prabhavam-23-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment