యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 26

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 25

తిరువాయ్మొళి పిళ్ళై నాయనార్ ను ఉడయవర్ల (రామానుజుల) దివ్య తిరువడితో ముడిపెట్టి ఉంచుట.

(ఇకపై, పిళ్లై అనే పదం తిరువాయ్మొళి పిళ్లైని సూచిస్తుంది, నాయనార్ అనే పదం అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ ను సూచిస్తుంది, ఇది మామునిగళ్ (మాముణులు) ల పూర్వాశ్రమ నామము). పిళ్లై సంతోషంతో ఉడయవర్ల దివ్య తిరువడిని నాయనార్ కు చూపించెను. ఇరామానుశ నూఱ్ఱందాది పాశురము “అన్పదయుగమే కొండ వీట్టై ఎళిదినిల్ ఎయ్దువన్” (మీ దివ్య పాదాల దివ్య నివాసాన్ని సులభంగా పొందుతాను) లో పేర్కొన్నట్లుగా, పరమ పురుషార్థాన్ని పొంది ఆనందించెను. నమ్మాళ్వార్ల దివ్య తిరువడి యందు ప్రగాఢమైన భక్తి ప్రపత్తులతో ఉన్న పిళ్ళై కూడా, రామానుజుల కమలముల వంటి దివ్య పాదాలకు కైంకర్యం చేయాలనుకున్నారు. వారు దానిని తమ ధారక (జీవనము, పోషణకు మూలం) గా భావించి కైంకర్యం కొనసాగించెను. వీరు ఉడయవర్లకై  ఒక ప్రత్యేక ఆలయాన్ని నిర్మించి, చుట్టూ నాలుగు వీధులను నిర్మింపజేసి, ఆ వీధుల్లో పండితులు నివసించేలా చేసి, తద్వారా వారు నిరాటంకంగా రామానుజులకు సేవలు అందించేలా చేసి ఆ ప్రదేశాన్ని రామానుజ చతుర్వేది మంగళం అని నామకరణము చేసి పిలిచేవారు. ఇవన్నీ సుసంపన్నము చెసిన తర్వాత తృప్తిగా జీవించసాగారు.

నాయనార్లచే యతిరాజ వింశతి రచించన

దయతో పిళ్లై ద్వారా చూపిన ఉడయవర్ల దారిలో ముందుకు వెళుతూ నాయనార్, యతీంద్ర ప్రవణర్ (రామానుజరుల పట్ల ప్రగాఢమైన భక్తి ప్రపత్తులు గలవాడు) అని పిలవబడేంత మేరకు రామానుజుల తిరువడికి అంకితమైయ్యెను. వారి ప్రీతి ఫలితంగా, రామానుజులను వర్ణిస్తూ వారు యతిరాజ వింశతి రంచించెను. ఈ క్రింద పాశురంలో చెప్పినట్లు, రాబోయే తరాలవారికి కూడా ప్రయోజనం చేకూర్చే ఈ పరోపకార కార్యానికి వారు ఎంతో ప్రశంసలు అందుకున్నారు.

వల్లార్గళ్ వాళ్ త్తుం కురుకేశర్ తమ్మై మనత్తు వైత్తు
చొల్లార వాళ్ త్తుం మణవాళ మాముని తొండర్ కుళాం
ఎల్లాం తళైక్క ఎదిరాజవింజది ఇన్ఱళిత్తోన్
పుల్లారవింద త్తిరుత్తాళ్ ఇరండైయుం పోఱ్ఱు నెంజే

(మహా పండితులచే స్తుతింపబడే నమ్మాళ్వార్ని తమ మనస్సులో ఉంచుకొని మణవాళ మాముణులు తమ శబ్దాల ద్వారా స్తుతించారు. అటువంటి మణవాళ మాముణులు భక్త గణ శ్రేయస్సు కొరకు ఇరవై శ్లోకములతో కూడిన యతిరాజ వింశతిని రచించారు. ఓ నా హృదయమా! అటువంటి మణవాళ మాముణుల దివ్య పాద పద్మాలను స్తుతించుము).

యతిరాజ వింశతి విన్న పిళ్లై ఎంతో సంతోషించి, తిరుప్పుళియాళ్వార్ (నమ్మాళ్వార్లు నివాసమున్న దివ్య చింత చెట్టు) వద్ద తమకు లభించిన ఉడవర్ల దివ్య మూర్తి (విగ్రహాన్ని) వారికి ప్రసాదించెను. చతుర్వేది మంగళంలోని భవిష్యదాచార్య సన్నిధిలో ప్రతిష్టించబడిన ఉడయవర్ల ఉత్సవ మూర్తి గురించి తరతరాలుగా పెద్దల నుండి విన్న ఒక కథనం ఉంది. ఇది మధురకవి ఆళ్వార్ (నమ్మాళ్వార్ల విగ్రహాన్ని పొందాలనే కోరికతో) తమ స్వప్నములో నమ్మాళ్వార్ల నిర్దేశానుసారంగా, తామ్రపర్ణి నది జలాన్ని కాచారు. మొట్ట మొదట, ఉడయవర్ల విగ్రహం వ్యక్తమైంది. మధురకవి ఆళ్వారు తమ దివ్య మనస్సులో నమ్మాళ్వారుకి “ఈ విగ్రహం మీ దివ్య స్వరూపం కాదు” అని అనుకున్నారు. మధురకవి ఆళ్వార్తో నమ్మాళ్వార్ “ఇది తిరువాయ్మొళి 4.3.1 పొలిగ పొలిగ పాశురానికి సంబంధించిన భవిష్యధాచార్య విగ్రహం. పాశురం ‘కలియుం కెడుం కండుకొన్మిన్” లో పేర్కొన్న విధంగా కలి పురుషుడు కూడా భయపడి పారిపోయేలా వీరు అవతారం ఎత్తబోతున్నాడు. ఆయనను సేవించుము, తామ్రపర్ణి నది జలాన్ని మళ్లీ కాచుము, నా అర్చా విగ్రహము మీకు లభించును” అని ఆళ్వారు తెలిపెను.  నమ్మాళ్వార్ చెప్పినట్లే మధురకవి ఆళ్వార్ తామ్రపర్ణి నది జలాన్ని మళ్లీ కాచారు. ఆళ్వార్ తిరునగరి ఆలయంలో ఉపదేశ ముద్రతో దర్శనమిచ్చే నమ్మాళ్వార్ల దివ్య మూర్తి తమకు తాముగా వ్యక్తమైందని పెద్దలు చెబుతారు. ఆక్రమణదారులు దాడిచేయుటకు వచ్చినప్పుడు ఆళ్వార్ తిరునగరి ఆలయంలోని చింత చెట్టు దగ్గరే ఉడయవర్ల విగ్రహాన్ని తవ్వి పాతి దాచి ఉందబడిందని, నమ్మాళ్వార్లు ఆలయం విడిచి వలస వెళ్ళవలసి వచ్చిందని స్థల చరిత్ర చెబుతుంది. తరువాత తిరువాయ్మొళి పిళ్ళై ఆ ఆలయాన్ని శుభ్రం చేస్తుండగా వెలికి వచ్చిన ఉడయవర్ల ఈ దివ్య మూర్తిని ఆళ్వార్ సన్నిధిలో నమ్మాళ్వార్లతో పాటు సేవించాలని పెద్దలు నిర్దేశించారు. .

అటువంటి విగ్రహాన్ని పొందినందుకు నాయనార్లు కూడా పారవశ్యంతో పొంగిపోయెను. యతిరాజ వింశతి 19 లో చెప్పినట్లుగా “శ్రీమాన్ యతీంద్ర! తవదివ్య పాదాబ్జ సేవాం శ్రీ శైలనాథ కరుణాపరిణామదత్తాం” (ఓ ప్రముఖ రామానుజా! మీ దివ్య పాద పద్మాలకు చేసే సేవ శ్రీ శైలనాథ (తిరువాయ్మొళి పిళ్ళై) వారి దివ్య కృప వల్లనే సాధ్యమైనది). “యతీంద్రమేవ నీరంత్రం నిషేవే దైవతం పరం” అన్న శ్లోకములో పేర్కొన్నట్లుగా, ఎంబెరుమానార్ల (రామానుజుల) ని అత్యున్నతమైన వ్యక్తిగా భావించి వీరు సేవలు అందించెను. నమ్మాళ్వార్ మరియు ఎంబెరుమానార్లకు సేవ చేయడమే అత్యున్నత ఫలముగా భావించిన పిళ్ళై, నాయనార్ల జ్ఞానభక్త్యాధిని (జ్ఞానం, భక్తి మొదలైనవి) చూసి ఆలకిస్తూనే ఉండి, వారికి సహకారం అందిస్తూ ఉండేవారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/10/yathindhra-pravana-prabhavam-26-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment