యతీంద్ర ప్రవణ ప్రభావము – భాగము 29

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

పూర్తి శ్రేణి

<< భాగము 28

నాయనార్లను ఆశ్రయించిన అళగియ వరదర్

“శ్రీ సౌమ్య జామాతృ మునీశ్వరస్య ప్రసాదసంపత్ ప్రథమాస్యతాయ” (శ్రీ సౌమ్యజమాతృమునీశ్వరుల ప్రథమ దయాపాతృలు) [వీరు ఉత్తమైన సన్యాసాశ్రమ స్వీకారము చేసిన పిదప, నాయనార్లు సౌమ్య జామాతృముని/మణవాళ మాముని అని పిలవబడ్డారు]. అళగీయ వరదర్, సేనై ముదలియార్ మొదలైన పలు వైష్ణవులు నాయనార్ల మహిమలను విని వారి దివ్య తిరువడిని ఆశ్రయించారు. వీరిలో, అళగీయ వరదర్ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి రామానుజ జీయర్ అనే నామాన్ని పొందారు [తర్వాత రోజుల్లో, వీరు ఒన్నాన శ్రీ వానమామలై జీయర్, పొన్నడిక్కాల్ జీయర్ అని పిలువబడ్డారు]. పెరియ తిరువందాది పాశురము 31లో “నిళలుం అదితారుం ఆనోమ్” (అతని నీడగా, పాదరక్షలుగా మారాము) అని చెప్పినట్లు, అళగీయ వరదర్, నాయనార్లను సేవిస్తూ వారి నిరంతర పాదరేఖగా (పాదాలపై రేఖలు) మారారు.

నాయనార్లు శ్రీ రంగమునకు చేరుట

వీరు తమ విశ్వసనీయమైన శిష్యులతో ఉంటుండగా, “మన ప్రాణాధారమైన నంపెరుమాళ్ళను మనము నిత్యము సేవించాలి, స్తుతించాలి, ఈ శరీరం పడిపోయే వరకు శ్రీరంగంలో జీవించాలి; ఇదే మనకి సరికాదా?” అని నాయనార్లు ఆలోచించి వెంటనే వారు  ఆళ్వార్ సన్నిధికి చేరుకుని, ఆళ్వార్ ఎదుట సాష్టాంగము చేసి, “నణ్ణావశురర్ నలివెయ్ద నల్ల అమరర్ పొలివెయ్ద ఎణ్ణాదనగళెణ్ణుం నన్మునివర్ ఇన్బం తలై శిఱప్ప పణ్ణార్…. (దుష్టుల నాశనం, సాధు సంరక్షణ, సర్వేశ్వరునికి మరిన్ని శుభ గుణాలు కావాలని ప్రార్థించే మహర్షులకై, రాగంతో ఆలపిస్తూ…) అని నీవు [తిరువాయ్మొళి 10.7.5 వ పాశురములో] ఆతడిని స్తుతించినందున, నంపెరుమాళ్ళు తాను గతంలో (దాడులకు ముందు) అనుభవించిన వైభవాన్ని ఊహించుచుండెను. అడియేన్ పెరుమాళ్ళను సేవించాలనుకుంటున్నాను. దేవరీర్ వారి (ఓ మహానుభావా!) ఆమోదం కోరుతున్నాను” అని విన్నపించెను; నమ్మాళ్వార్ వీరు అభ్యర్థనను మన్నించి అనుమతిని ప్రసాదించెను.

తరువాత, ఈ శ్లోకములో చెప్పినట్టుగా….

తతః గతిపయైర్దివశై స్సగురుర్ దివ్యదర్శనః
ఆజగామ పరంధామ శ్రీరంగం మంగళం భువః

(కొన్ని రోజుల తర్వాత, దివ్య మంగళ స్వరూపులైన నాయనార్లు, భూమికి శుభప్రదమైన పరమ దివ్య ధామము శ్రీరంగానికి చేరుకున్నారు), నాయనార్లు తమ శిష్యులతో కలిసి శ్రీరంగానికి బయలుదేరారు. దారిలో, “విల్లిపుత్తూర్ ఉఱైవాన్ తన్ పొన్నడి కాణ్బదోర్ ఆశైయినాలే” (విల్లిపుత్తూర్లో కొలువైకున్న ఎంబెరుమానుని దివ్య స్వర్ణమయమైన తిరువడిని సేవించాలనే కోరికతో) అని చెప్పినట్లుగా శ్రీవిల్లిపుత్తూర్లో ఉన్న ఎంబెరుమానుని దివ్య తిరువడిని దర్శించాలనే కోరికతో  శ్రీవిల్లిపుత్తూరుకు చేరుకొని, ‘వడపెరుంగోయిలుడైయాన్’ (భవ్య ఆలయములో ఒక మర్రి ఆకుపై శయనించి ఉన్నవాడు) మరియు పెరియాళ్వారుని సేవించుకొనెను. తరువాత, వారు అన్నవాయల్పుదువై ఆండాళ్ (హంసలు విహరించే పంట పొలాలతో శ్రీవిల్లిపుత్తూర్లో నివసించే ఆండాళ్) అని ఆమె తనియన్లో చెప్పినట్లు “నీళాతుంగ స్థానగిరి… గోదాతస్యై నమ ఇదమిదం భూయః”  నప్పిన్నై పిరాట్టి (నీల దేవీ) వక్షస్థలంపైన పవ్వలించి ఉన్న కృష్ణుడిని వర్ణించుచూ పాడిన ఆండాళ్ ను సేవించెను. ఆ తరువాత, ఈ శ్లోకములో చెప్పినట్లు….

దేవస్యమహిశీం దివ్యాం ఆదౌ గోధాముపాసతత్
యన్మౌలిమాలికామేవ స్వీకరోతి స్వయం ప్రభౌః

(వారు మొదట అళగీయ మాణవాలన్ దివ్య పత్ని అయిన ఆండాళ్ ధరించిన మాలలను తాను అమితానందముతో ధరించిన అళగీయ మాణవాలన్  ను సేవించెను.)  తరువాత, “నేఱిపడవదువే నినైవదు నలమే” (తిరుమాలిరుంజోలై వెళ్లడం ఉత్తమం) అని అరులిచ్చేయల్లో తిరుమాలిరుంజోలైని వర్ణించినట్లుగా వారు తిరుమాలిరుంజోలైలో కొలువై ఉన్న ఆ దేవుడిని సేవించాలనుకున్నారు. వారు తిరుమాలిరుంజోలై కి వెళ్లి అళగర్ ఆలయంలోకి ప్రవేశించి, ఎంబెరుమానుని దివ్య తిరువడిని సేవించుకొని, పవిత్ర తీర్థాన్ని, దివ్య ప్రసాదాలను స్వీకరించి, కూరత్తాళ్వాన్ అనుగ్రహించిన సుందర బాహుస్తవంలోని శ్లోకాన్ని స్మరించుకున్నారు.

విజ్ఞాపనం వనగిరీశ్వర! సత్యరూపాం అంగీకురుశ్వ కరుణార్ణవ మామకీనాం
శ్రీరంగధామని యతాపురమేషసోహం రామానుజార్యవశకః పరివర్తిశీయ

(ఓ కృపా సముద్రము వంటి సుందరమైన తిరుమాలిరుంజోలై దేవుడా! నీ దివ్య మనస్సుతో నా ఒక విన్నపాన్ని ఆమోదించాలి. గతంలో శ్రీరంగము వైభవంగా ఉన్నట్టు, అడియేన్ ఎంపెరుమానార్ల దివ్య తిరువడి యందు జీవనము సాగించేలా నీవు నన్ను అనుగ్రహించాలి). శ్రీ రంగనాధుని దాసుడిగా సేవ చేసుకునేందుకు వారు ఉత్సాహంతో శ్రీరంగానికి వెళ్లారు.

అడియేన్ శ్రీదేవి రామానుజదాసి

మూలము: https://granthams.koyil.org/2021/08/13/yathindhra-pravana-prabhavam-29-english/

పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/

ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org

Leave a Comment