శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
నాయనార్లకు తీర్థ ప్రసాదం, శఠారి, పెరుమాళ్ళు ధరించిన దివ్య పూమాలలు సమర్పించబడ్డాయి. ఒక మహా రాజు కిరీటము దండలు అందుకున్నట్లుగా తాము సంతోషించి “శ్రీరంగనాథుని అనుగ్రహానికి పాతృలైనాము” అని తలచారు. “నంపెరుమాళ్ళు దేవరువారి కోసమని తనపైన కరుణను కురిపించాడు” అని తిరుక్కోట్టూరిల్ అణ్ణర్ వైపు చూస్తూ అన్నారు. తర్వాత వారు అణ్ణర్తో కలిసి వారి తిరుమాలిగకి వెళ్ళి, అక్కడ భట్టార్ వారు పంపిన పెరుమాళ్ళ ప్రసాదాలను స్వీకరించెను. తరువాత తిరుక్కోట్టూరిల్ అణ్ణర్ మన పూర్వాచార్యుల అనుష్ఠానములు మరియు సత్వచనముల గురించి వారికి ఉపన్యాసం ఇచ్చెను. ఆ తర్వాత, అణ్ణర్ తో కలిసి వెళ్లి గతంలో పూర్వాచార్యులు నివసించిన వివిధ దివ్య తిరుమాలిగలను సేవించుకొనెను. వారు పిళ్ళై లోకాచార్యుల తిరుమాలిగకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి వారి తనియనన్ను స్మరించుకున్నారు.
వాళి ఉలగాశిరియన్ వాళి అవన్ మన్ను కులం
వాళి ముడుంబై ఎన్నుం మానగరం వాళి
మనంజూళ్ంద పేరిన్బమల్గు మిగు నల్లార్
ఇనంజూళ్ందు ఇరుక్కుం ఇరుప్పు
(పిళ్లై లోకాచార్యులు చిరకాలం వర్ధిల్లాలి! వారి గొప్ప వంశం చిరకాలం వర్ధిల్లాలి! గొప్ప ముడుంబై దేశం చిరకాలం వర్ధిల్లాలి! గొప్ప మహా పురుషుల మనస్సులను ఆకట్టుకుని గొప్ప ఆనందాన్ని తెచ్చిపెట్టిన వారు చిరకాలం వర్ధిల్లాలి). వారి దివ్య మనస్సులో మరొక పాశురము చిగురించింది:
మణవాళన్ మాఱన్ మనమురైత్తాన్ వాళి
మణవాళన్ మన్నుకులం వాళి మణవాళన్
వాళి ముడుంబై వాళి వడవీధి తాన్
వాళియవన్ ఉరై శెయ్ద నూల్
(అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ (పిళ్ళై లోకాచార్యుల సోదరుడు) నమ్మాళ్వార్ల దివ్య సంకల్పాన్ని తెలియజేసారు. ఆ మణవాళన్ యొక్క దివ్య వంశం చిరకాలం వర్ధిల్లాలి. మణవాళన్ చిరకాలం వర్ధిల్లాలి! ముడుంబై చిరకాలం వర్ధిల్లాలి! వడవీధి (వారు నివసించిన వీధి) చిరకాలం వర్ధిల్లాలి! వారు రచించిన వచనాలు చిరకాలం వర్ధిల్లాలి!) తర్వాత ఈ ఇద్దరు ఆచార్యుల (పిళ్ళై లోకాచార్యులు మరియు అళగీయ మణవాళ ప్పెరుమాళ్ నాయనారు) అసమానమైన మహిమలపై సంకలనం చేయబడిన మూడు శ్లోకములు:
వాణీం పుణ్యసుధాపకాం శటజిత్స్వైరం విగాహ్యాదరాత్
ఆనీయామృత మత్రచక్రదుకుభౌ లోకోపకారాత్మకౌ
యౌ వాక్భూషణ దేశికేంద్రహృదయాపిక్యౌ ప్రబంధావిమౌ
తే వందే భువనార్యసుందరవరౌ కృష్ణాత్మజౌ దేశికౌ
(వడక్కు తిరువీధి పిళ్ళై కుమారులైన పిళ్ళై లోకాచార్యులు మరియు అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్, ఈ ఇద్దరు ఆచార్యులు సంసారులను ఉద్దరించాలనే ఉద్దెశ్యముతో శ్రీ వచన భూషణము, పూర్ణ అంకితభావంతో నమ్మాళ్వార్ల తిరువాయ్మొళి అమృతార్థాలలో లీనమై ఆచార్య హృదయము రచించారు.)
ఆర్యసౌమ్యవరశ్శటారికలిజిత్ బట్టేశ ముఖ్యాత్మనాం
భక్తానాం విమలోక్తిమౌక్తిక మణీనాతాయ చక్రే బృశం
కృత్వా సాధురహస్యత్రయార్థం అఖిలం కూటం విశ్పచిత్రియం
లోకార్యావరజస్సుశిక్షకవర శ్చూడామణిశ్శోభతే
(అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ పిళ్ళై లోకాచార్యుల దివ్య సోదరుడు; వీరు సత్సంప్రదాయ అర్థాలను అధ్యయనము చేసినవారు; వీరు అందరిచే ఆరాధింపబడ్డ గొప్ప ఆభూషణము వంటి వారు. నమ్మాళ్వార్, తిరుమంగై ఆళ్వార్, పెరియాళ్వార్ వంటి గొప్ప భక్తుల ముత్యాల వంటి స్వచ్ఛమైన పలుకుల అధారముగా వీరు రహస్యత్రయం (తిరుమంత్రం, ద్వయం మరియు చరమ శ్లోకం) యొక్క నిగూఢ అర్థాలను పూర్వాచార్యుల దివ్య మనస్సులకు అనుగుణంగా, స్పష్టంగా) వెల్లడి చేశారు.
యస్యహం కులదైవతం రఘునతేర్ ఆధనం శ్రీసఖం
కావేరీ సరితిందరీపనగరీ వాసస్థలే పుణ్యభూః
కృష్ణో మాన్యగురుర్ వరేణ్యమహిమా వేదాంత విధ్యానిధిః
భ్రాత సౌమ్యవర స్స్వయంతు భువనాచార్యోసి కస్తే సమః
( శ్రీ రాముని తిరువారాధన పెరుమాళ్ అయిన అళగియ మణవాళన్ [పెరియ పెరుమాళ్] ఎవరి కులదైవమో, రెండు దివ్య కావేరి ప్రవాహాల మధ్య ఉన్న శ్రీరంగం ఎవరి నివాస స్థలమో, అతి పూజ్యనీయులు మరియు అత్యంత గౌరవనీయులైన వడక్కు తిరువీధి పిళ్ళై ఎవరి తండ్రి మరియు ఆచార్యులో, ఉభయ వేదాంత సంపద కలిగి ఉన్న అళగియ మాణవాళ పెరుమాళ్ నాయనార్ ఎవరి తమ్ముడో, అటువంటి పిళ్ళై లోకాచార్యులు సమస్థ ప్రపంచానికే ఆచార్యుడు. అటువంటి దేవర్వారికి ఎవరు సమానులౌతారు?)
పిళ్లై లోకాచార్యుల దివ్య తిరుమాలిగని ఆశ్చర్యంగా చూస్తూ “రహస్యం విళనిద మణ్ణన్ఱో?” (ఈ చోటి నుంచే కదా రహస్యార్థాలు వచ్చాయి?) తిరుక్కోట్టూరిల్ అణ్ణర్ పిళ్లై లోకాచార్యుల మహిమను వివరిస్తుండగా కొంత సేపు అక్కడే ఉండి విన్నారు; కృతజ్ఞతతో, ”మనం ఎంత అదృష్టవంతులం!” అని ఆశ్చర్యపోయారు. తర్వాత వారు మన పూర్వాచార్యుల నివాసం వంటిదైన ఆలయంలోకి ప్రవేశించారు [మన పూర్వాచార్యుల వారి తిరుమాలిగలలో కంటే ఆలయంలో ఎక్కువ సమయం గడిపేవారు]. పెరుమాళ్ళు వారికి దివ్య మాల, పరియట్టం, తీర్థ, శఠారీలని ప్రసాదించెను. ఈ క్రింద శ్లోకములో చెప్పినట్లు….
తస్మిన్ సస్మిత నేత్రేణ శ్రీమతా శేషశాయినా
సత్కృతః కృతవాన్ వాసం కించిత్ తత్ర తదంతికే
(వికసించిన విశాల నేత్రాలతో దివ్య అనుగ్రహము కురిపించుచూ తన వైపు చూస్తున్న శ్రీమాన్ – పెరియ పెరుమాళ్ళ దివ్య పాదాల వద్ద వారు కొంతకాలం జీవనం సాగించెను. పెరియ పెరుమాళ్ వారితో “ఉడయవర్ల లాగా, నా ఈ నివాస వ్యవహారాలు చూసుకుంటూ, దర్శన రహస్యాలను విశ్లేషిస్తూ, నీ శరీరం వ్రాలిపోయే వరకు ఇక్కడే ఉండుము” అని ఆదేశించెను. నాయనార్ వెంటనే అంగీకరించి, “మహా ప్రసాదము” అని చెప్పి అక్కడ తమ నివాసమెర్పరచుకున్నారు.
ఆ సమయంలో, వారు రహస్య ప్రబంధాలపై మన పూర్వాచార్యుల రచించిన వ్రాత పత్రాలన్నింటినీ పరిశీలించి, చెదలతో శిథిలావస్థలో ఉన్న వాటిని మళ్లీ వ్రాసి వాటిని వెలుగులోకి తెచ్చారు. ఒక రోజు వానమామలై జీయర్ వారితో “పెరుమాళ్ళ తిరువారాధన నిర్వహణ చేపట్టిన ఉత్తమ నంబి తమ పనులు సరిగ్గా చేయడం లేదు; పెరుమాళ్లకు అర్పించే ప్రసాద పరిమాణాన్ని తగ్గిస్తున్నారు” అని ఫిర్యాదు చేశెను. అతి వినమ్ర స్వభావము కల నాయనార్లు ఉత్తమ నంబిపై ఎటువంటి కఠినమైన చర్య తీసుకోవడానికి ఇష్టపడలేదు. “తిరువారాధనము ఎటువంటి లోపం లేకుండా జరిగేలా దయచేసి వారిని సరిదిద్దమని పెరుమాళ్ళని అభ్యర్థించండి” అని వారు జీయర్ తో అన్నారు. స్వయంగా వారు కూడా అలా జరిగేలా పెరుమాళ్ళని వేడుకున్నారు.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/16/yathindhra-pravana-prabhavam-32-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org