శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
నాయనారు అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుని, పైకి ఎక్కడం మొదలు పెట్టారు. ఇది విన్న పెరియ కెల్వి జీయర్ (పెద్ద జీయర్ స్వామి) ఇతర శ్రీవైష్ణవులు, ఆలయ ఉద్యోగులందరితో కలసి నాదస్వరంతో, తిరువేంకటేశ్వరుడి దివ్య తిరువడి (శ్రీ శఠారి), పెరియ పరివట్టం, శ్రీవారి అభయ హస్తం, శ్రీపాదరేణువు మొదలైన వాటితో నాయనారు మరియు వారి శిష్యులను స్వాగతించెను. దివ్య విమానం, తిరునారాయణగిరి, ధ్వజ స్తంభాన్ని దర్శించుకున్న వారికి ఆలయ మర్యాదలు ప్రసాదిస్తారు.
వారు అవావరచ్చూళందాన్ ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి, ఆలయ ప్రదక్షిణగా వెళుతూ దివ్య తిరుమాడ వీధులను, దివ్య భవనాలను ఆనందంగా చూస్తూ స్వామి పుష్కరిణికి చేరుకొని పవిత్ర స్నానమాచరించి, ఊర్ధ్వ పుండ్రములను ధరించి, వరాహ స్వామిని సేవించి అక్కడ శ్రీ శఠారి, చందనము స్వీకరించి అక్కడి నుండి ముందుకు సాగారు; దివ్య రథాలను దర్శించుకుంటూ వారు రంగనాథ మండపానికి (అళగియ మణవాళ దివ్య మండపము – తుర్కుల దండయాత్ర కాలంలో కొంత కాలంగా నంపెరుమాళ్ళు ఇక్కడ ఉన్న మండపము) వెళ్లి అక్కడ సాష్టాంగ నమస్కారం చేశారు. వారు బలిపీఠం వద్ద, దివ్య చెంబగ ద్వారము వద్ద మరియు అత్తాణిప్పుళి వద్ద తమ సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకున్నారు. శెణ్బగచ్చుఱ్ఱు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ, నెయ్ కిణఱుని చూస్తూ, తిరుమడప్పల్లిని (నైవేద్యాలను సిద్ధం చేసే దివ్య వంటశాల) సేవించి, యమునైత్తుఱైవన్ ని సేవించి, దివ్య బావిలో నుండి జలాన్ని తీసుకుని, బంగారు మంటపముపైకి వెళ్లి నారాయణగిరిని సేవించి, శెన్బగ ద్వరములోకి ప్రవేశించి, దేవ పెరుమాళ్ళు వెలసి ఉన్న పొన్ వింజు పెరుమాళ్ సన్నిధికి వెళ్లి అళగప్పిరానార్ ను వారి ఆయుధాలను సేవించుకొనెను. ఆ తర్వాత వారు తిరుమడైప్పళ్ళి నాచ్చియార్ (దైవ వంటశాలలో కొలువై ఉన్న శ్రీ మహాలక్ష్మీ) ని, దశావతారములను సేవించెను. యాగ మంటపం వద్ద ఉభయ నాయచ్చిమార్చులతో ఉన్న పెరుమాళ్ విగ్రహాన్ని సేవించి, తీర్థ జలాన్ని స్వీకరించెను. విశ్వక్సేనులను సేవించి “రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే” అని జపము చేస్తూ రామానుజుల ఎదుట సాష్టాంగము చేసి వారి తీర్థ జలాన్ని, అనంతాళ్వాన్ [తిరుమలలో ఎమ్పెరుమానార్ల తిరువడిని అనంతాళ్వాన్ అని పిలుస్తారు; మిగితా అన్ని చోట్లా వారి తిరువడిని ముదలియాండాన్ అని వ్యవహరిస్తారు], చందనం స్వీకరించెను. ఆ తర్వాత వారు శ్రీ నరహింహ పెరుమాళ్ళను, ఆపై పెరుమాళ్ళకు అద్దంలా ఉండే పెరియ తిరువాడి నాయనారు (గరుడ) ను సేవించుకొని, హుండీలో తన నివేదనలు సమర్పించి, ద్వారపాలకుల అనుమతి తీసుకుని గర్భ గుడిలోకి ప్రవేశించారు. వారు చక్రవర్తి తిరుమగన్ (శ్రీ రాముడు) ని సేవించుకొని, కులశేఖర పడి దగ్గరకు వెళ్లి, “శిషేవే దేవదేవేశం శేషశైల నివాసినం” (నిత్యసూరులకు స్వామి తిరుమలలో కొలువై ఉన్న తిరువేంగడముడయాన్ ను సేవించెను) అని చెప్పినట్లు వారు తిరువేంగటేశ్వరుడిని సేవించెను. వారు తిరువేంగటేశ్వరుడిని తదేకంగా దర్శిస్తూనే తీర్థ శఠారీలు స్వీకరించి కృతజ్ఞతతో సంతృప్తిని అనుభవించెను.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/19/yathindhra-pravana-prabhavam-35-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org