శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
శ్రీ భాష్యం వ్యాఖ్యానాన్ని కిడాంబి నాయనారు వద్ద నాయనార్లు శ్రవణం చేయుట
అక్కడ [కాంచీపురంలో] కిడాంబి ఆచ్చాన్ [ఉడయవర్ల కోసమై మడప్పళ్ళి కైంకర్యం చేయమని తిరుక్కొట్టియూర్ నంబి చేత నియమించబడిన వారు] వంశస్థులైన కిడాంబి నాయనార్ల దివ్య పాదాలకు వారు సాష్టాంగ నమస్కారం చేసి, తమకు శ్రీ భాష్యము ఉపదేశించమని అభ్యర్థించెను. వారితో పాటు, వారి శిష్యులు మరో ఇద్దరు ఐయైగళ్ అప్పా మరియు శెల్వనాయనార్ కూడా శ్రద్దా భక్తులతో కిడాంబి నాయనార్ల వద్ద శ్రీ భాష్య వ్యాఖ్యానాన్ని విన్నారు. నాయనార్ల వాక్పటుత్వ శక్తిని ఐయైగళ్ అప్పా చూసి ఆశ్చర్యపోయారు. ఒకరోజు కిడాంబి నాయనార్లతో “దేవర్వారు తమ సామర్థ్యాలకు సరితూగే భావార్థాలను తమకి బోధిస్తున్నట్లు గోచరించడం లేదు” అని తమ మనస్సులో ఉన్న మాట వారికి తెలిపారు.
కిడాంబి నాయనార్ “మీరు రేపు వారిని పరీక్షించండి” అని ఐయైగళ్ అప్పాకు చెప్పి వారికి కొన్ని సూచనలు ఇచ్చారు. నైపుణ్యులైన ఐయైగళ్ అప్పా మరునాడు నాయనారుని పరీక్షించడానికి సిద్ధమయ్యారు. ఉపన్యాసంలో నాయనారు మొదటి పాఠము యొక్క భావార్థాలను వెయ్యి రెట్లు ఎక్కువగా వివరించారు. ఇది విన్న ఐయైగళ్ అప్పా “కిడాంబి నాయనారు మాకు చెప్పిన అన్ని వివరణలు దేవర్వారు మాకు వివరించారు, పైగా ప్రత్యేక అర్ధాలను జోడించి అంతకంటే ఎక్కువగా, దేవర్వారు అనుగ్రహించారు” అని ఆశ్చర్యపోయారు. అది విన్న కిడాంబి నాయనారు అక్కడికి వచ్చారు. వారి శిష్యగోష్ఠిలో కొందరు విద్వానులు నాయనారుతో చర్చలో పాల్గొనాలని తమ కోరికను వ్యక్తం చేశారు. ఆళ్వార్ తిరునగరిలో తిరువాయ్మొళి పిళ్ళై చెప్పిన మాటలను నాయనార్లు గుర్తు చేసుకుంటూ “ఇతర తత్వాలకు సంబంధించిన వ్యక్తులతో వ్యవహరించవద్దని మా ఆచార్యులు నిషేధం విధించారు” అని నాయనారు ఐయైగళ్ అప్పాకి వినయంతో చెప్పారు. ఐయైగళ్ అప్పా నాయనార్లతో “వీరు శ్రీవైష్ణవులే కాదా! వీరితో చర్చించడం ద్వారా మీ స్వరూపానికి ఎటువంటి హానీ కలుగదు. దయచేసి వారి కోరికను మన్నించండి” అని ప్రార్థించారు. నాయనారు వారికి తర్కం, అర్థాలు, తత్వశాస్త్రంపై ఒక ఉపన్యాసము ఇచ్చారు. నాయనార్ల పలుకులు విన్న తర్వాత వాళ్ళందరూ నాయనార్లను స్తుతిస్తూ వారి దివ్య తిరువడికి ఎదుట సాష్టాంగము చేశారు. వాళ్ళు “వీరెవరో ఇతరులలాగే సాధారణ శిష్యుడు అని భావించాము. కానీ శాస్త్రాలన్ని వారిలో ఇమిడి ఉంచుకున్నారు వీరు” అని కిడాంబి నాయనారుతో అన్నారు. కిడాంబి నాయనారు వారికి “అతన్ని ఒక అవతారంగా భావించండి” అని తెలిపారు. తరువాతి కాలములో నాయనార్ల ద్వారా ఆరుళిచ్చెయల్ అర్థాల ప్రచారము చేయాలనే ఉద్దేశ్యంతో, కిడాంబి నాయనారు ఎంతో ఆసక్తితో నాయనార్లతోకి శ్రీ భాష్యం బోధించుట ప్రారంభించారు. నాయనారు ఈడు వ్యాఖ్యానం కంఠస్థం చేస్తూ ఉండేవారు. ఇది విన్న కిడాంబి నాయనారు ఒకరోజు నాయనారు ఒంటరిగా ఉన్నప్పుడు వారిని కలుసుకుని, “దేవర్వారికి ముప్పత్తాఱాయిర ప్పెరుక్కర్ అనే దివ్య నామం ఊరికే రాలేదు. ఇంతటి తెలివితేటలు మెధస్సు మేము మరెక్కడా చూడలేదు. నా మనస్సులో ఒక కోరిక ఉంది, మీరు తప్పక నెరవేర్చాలి.” అని ప్రార్థించారు. నాయనారు వారి కోరిక ఏమిటో అడిగారు. కిడాంబి నాయనార్ వారితో, “దేవర్వారు ఒక ముఖ్యమైన అవతారమని మేము విన్నాము. దయచేసి మా వద్ద దాచవద్దు. అదేమిటో మాకు వెల్లడి చేయండి” అని పార్థించారు. నాయనారు వారితో “మీరు అడియేన్ ఆచార్యులు, మీతో నేను ఏ విషయము దాచలేను. దయచేసి పెరియ పెరుమాళ్ళ ఈ ఆజ్ఞను ఎవరికీ తెలియకుండా దాచండి” అని చెప్పి దగ్గరలో ఉన్న దీపపు కాంతిని పెంచి, భయపడ వద్దని కిడాంబి నాయనారుని సావధానపరచి, తమ నిజ స్వరూపమైన ఆదిశేషుని దివ్య రూపాన్ని వారికి దర్శింపజేసెను. కిడాంబి నాయనారు భయంతో వణికిపోయి, దయచేసి ఈ రూపాన్ని దాచిపెట్టండి అని ప్రార్థించగా నాయనారు తమ యధా రూపాన్ని తిరిగి ధరించారు. అనంతరం, దీనిని దేవ రహస్యంగా భావించి కిడాంబి నాయనారు నాయనార్లకి వాత్సల్యంతో వారి దివ్య స్వరూపానికి తగిన ప్రసాదాలను అందించేవారు. శ్రీ భాష్యం కలక్షేపం పూర్తయ్యే వరకు, తమ తిరుమాలిగలో ఉన్న ఆవుల నుండి పిండిన పాలను నాయనార్లకు పంపేవారు. కొద్ది రోజుల్లోనే శ్రీ భాష్యం పూర్తయింది. పెరియాళ్వార్ తమ పెరియాళ్వార్ తిరుమొళిలో “వేదంత విళుప్పొరుళిన్ మేలిరున్ద విళక్కై విట్టుశిత్తన్ విరిత్తనన్” – ఎలాగైతే విష్ణుచిత్తులు {పెరియాళ్వార్} ఉపనిషత్తుల అంతరంగ అంతరార్థమైన ఎమ్పెరుమానుని వెల్లడి చేశారో), సంస్కృత వేదంతం మరియు ద్రావిడ వేదాంతం రెండింటిలో నిపుణుడైన నాయనార్ దేవ పెరుమాళ్ళ మహిమలను వెల్లడిచేస్తూ కాంచిపురములోనే కొంతకాలము ఉన్నారు. వారు దయతో ఒక సంవత్సరం పాటు శ్రీ భాష్యం మరియు భగవత్ విషయములపై యతోక్తకారి సన్నిధిలో ఉపన్యసించారని పెద్దలు చెబుతారు. ఈ కారణంగానే ఈ క్షేత్రములో వీరి అర్చా స్వరూపం ఉపదేశ ముద్రతో దర్శనమిస్తారు. కాంచీపురంలో ఉన్న కాలములో, భగవత్ విషయానికి (తిరువాయ్మొళి) సంబంధించిన వివిధ తాళపత్రాలను, ఆ ప్రాంతంలో వెతికి వెలికి తీసి, వాటిని తీసుకొని శ్రీరంగానికి బయలుదేరారు. ఈ క్రింద శ్లోకంలో చెప్పినట్లు.
తతః ప్రతినివృత్తంతం పురుషో భుజకేశయః
ప్రత్యుత్కమ్య ప్రభుః స్వైరం పునః ప్రవేశయ్ త్ పురం
(అనంతరం, సర్పశయ్యపైన శయనించి ఉన్న శ్రీ రంగనాధుడు తమ సంకల్పానుసారం, శ్రీ రంగానికి తిరిగి వస్తున్న ఆ అళగియ మణవాళ పెరుమాళ్ ను స్వాగతించుటకు వెళ్ళెను). పెరుమాళ్ళచే స్వాగతిపబడిన అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్ శ్రీ రంగములోకి ప్రవేశించి పెరుమాళ్ళను సేవించెను. పెరుమాళ్ళు తమ తీర్థ ప్రసాదాన్ని వారికి ఎంతో సంతోషంగా ఇవ్వాలని ఆశించెను. పెరుమాళ్ళు వారితో ఇలా అన్నారు…
నిత్యం రంగే నివాసాయ ప్రార్తితః పణిశాయినా
పశ్యన్ పదాంబుజం తస్య పాలయామాస శాసనం
(“ఇకపై ఈ శ్రీరంగంలో ఉండండి” అన్న పెరుమాళ్ళ అభ్యర్థనకు అనుగుణంగా, అళగియ మాణవాళ పెరుమాళ్ ఆ ఆజ్ఞను పాటించెను), “శాశ్వతంగా ఇక్కడే ఉండుము” అన్న పెరుమాళ్ ఆజ్ఞను నాయనార్ స్వీకరించి శిరసా వహించారు. అక్కడ ఉన్న ప్రముఖులందరూ “పెరుమాళ్ళను నిత్యం స్తుతిస్తూ దేవర్వారు ఇక్కడే ఉండాలి” అని అభ్యర్థించారు. వారు ఆమోదము పలికారు. పూర్వాదినచర్య 19వ శ్లోకం ప్రకారం
శ్రీమద్ రంగం జయతు పరమం ధామ తేజో నిదానం
భూమా తస్మిన్ భవతు కుశలే కోపీ భూమాసహాయః
దివ్యం తస్మై దిశతు విభవం దేశికో దేశికానాం
కాలే కాలే వరవరమునిః కల్పయన్ మంగళాని
(ఇతరులపై గెలుపు పొందే సామర్థ్యం ఉన్న మహోన్నత శ్రీరంగం బాగా వర్ధిల్లాలి. శ్రీదేవి భూదేవిలతో పెరియ పెరుమాళ్ళు తగిన రీతిలో అక్కడ నివాసముండాలి. ఆచార్యులలో ప్రథములైన వరవరముని (అళగియ మణవాళన్) ఆ పెరుమాళ్ళకి మంగళాశాసనాన్ని చేసి ఆ పెరుమాళ్ళకి మహా కీర్తిని తెచ్చిపెట్టాలి), వారు తగిన సమయాల్లో పెరుమాళ్ళకు మంగళాశాసనాలు చేస్తుండేవారు. “అరంగర్ తం శీర్ తళైప్ప” (శ్రీరంగనాధుని దివ్య మంగళ గుణాలు పోషింపబడ్డాయి) అని చెప్పినట్లు, పెరుమాళ్ళ దివ్య సంపద సమృద్ధి చెంది అన్ని చోట్లా వ్యాపించింది.
అడియేన్ శ్రీదేవి రామానుజదాసి
మూలము: https://granthams.koyil.org/2021/08/22/yathindhra-pravana-prabhavam-38-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org