శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
ఎఱుంబి అప్పా అక్కడ ఉన్నంత కాలం, ఈ శ్లోకములో చెప్పిన విధంగా…
ఇత్తం ధినే ధినే కుర్వన్వృత్తిం పద్యుః ప్రసాధినీం
కృతీర్ కడాపదం చక్రే ప్రక్తనీం తత్ర వర్తనీం
ఇత్తం ధినే ధినే కుర్వన్ విరుత్తం భర్తుః ప్రసాధినీం
కృతి కణ్టా పదఞ్జచక్రే ప్రాక్తనీం తత్ర వర్తనీం
(ఈ విధంగా, సన్నిధిలో [తిరుమలైయాళ్వార్] కైంకర్యం చేస్తూ, తమ ఆచార్యులైన మణవాళ మాముణుల దివ్య మనస్సుని ప్రసన్న పరచే కైంకర్యములను నిత్యం నిర్వహిస్తూ, దినచర్యను (మణవాళ మాముణుల నిత్య దినచర్య వివరణ) కృపచేసి, అక్కడ నిత్యం అందరూ పఠించేలా చేశారు. మహా రాజు రహదారిలా ప్రసిద్ధికెక్కించారు.
వరవరమునిర్ పాదయుగ్మం వరదగురోః కరపల్లవ ద్వయనే
రహసి శీరసిమే నిధీయమానం మనసినిదమ్య నిధానవాన్ భవామి
(కందాడై అణ్ణన్ తమ లేత హస్థములతో మణవాళ మాముణుల పాదపద్మములను తమ శిరస్సుపై ఉంచుకునే ఆ దృష్యాన్ని స్మరణ చేస్తూ జీవించుటకు శక్తిని పొందుతున్నాను), తమ దివ్య చరణాలను అణ్ణన్ కు సమర్పించి “మీ స్వస్థలానికి వెళ్లండి” అని అన్నారు. అప్పా బాధతో ఎఱుంబికి బయలుదేరారు.
నాయనార్ ఏడు గొత్రాలను క్రమపచుట
అప్పా ఎఱుంబికి బయలుదేరే ముందు, శ్రీరంగంలో ఒక సంఘటన జరిగింది. అప్పాకి సంబంధించిన కందాడై ఆండాన్ సంబంధీకులు (అత్తవారి తరపున వారు) కొందరు, కందాడై నాయన్ ధర్మ పత్నిని ఆమె పుట్టింటి నుండి కందాడై ఆండాన్ తిరుమాలిగకి తీసుకువచ్చారు. వారు ఆమెను సరైన వాహనంలో తీసుకురాకపోవడం చూసి అప్పా బాధపడి, జీయరుతో తమ బాధను పంచుకున్నారు. జీయర్ కూడా దుఃఖపడ్డారు. వారు కందాడై అణ్ణన్ ను పిలిచి ఇది సరి కాదు, వారిని త్యజించడం మంచిదని అన్నారు. “వారి స్వరూపమును గురించి వారికి ఉపదేశించ గలమా?” అని కోరారు. “వారు ఎంబా దగ్గరి బంధువులు, అహంకారులు” అని అణ్ణన్ బదులిచ్చారు. “అలాగైతే, ఇక మనం ఆలోచించ వద్దు” అని పలికి, కందాడై ఆండానుతో పాటు వారి బంధువులను, ముదలియాండాన్ వంశస్థులను పిలిచి, వారికి శాస్త్ర సూచనలను ఉపదేశించి వారిపై తమ కరుణను కురిపించారు. తరువాత వారికి ఒక శాస్త్ర విధి గురించి వివరణ ఇచ్చారు. వాదూల గోత్రం (ముదలియాండాన్ వారి గోత్రం), హారీత గోత్రం (రామానుజుల వారి గోత్రం) వాళ్ళు, వారి వారసులు 7 గోత్రాల (వాదూల, శ్రీవత్స, కౌండిన్య, హారీత, ఆత్రేయ, కౌశిక, భారద్వాజ) వారిని మాత్రమే వివాహం చేసుకోవాలని వివరించారు. తమ ఈ నియమావళికి సంబంధించిన ఒక వ్రాత పత్రం తయారు చేసి, తిరుమంగై మన్నన్ తిరుమాలిగ (తిరుమంగై ఆళ్వార్ల దివ్య నివాసం) లో ఒక ఫలకాన్ని తయారు చేసి, ఈ గోత్రాలకు చెందిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నరో ఆయా ప్రాంతాలకు సందేశాన్ని పంపారు. ఈ చర్యతో ఎఱుంబి అప్పా సంతోషించేలా చేసారు. ఈ సమయంలో, వారి దివ్య తిరువడి పట్ల ప్రతికూలంగా ఉండేవారందరూ, వారి గురించి చెడుగా మాట్లాడేవారందరూ, పేదరికంతో బాధపడుతూ తమ జీవితాలను వృధా చేసుకున్నారు.
ఒక రోజు, జీయర్ తమ శిష్యులతో “ఆలిన్మేలాల్ అమర్ న్దాన్ అడియిణైగళే” అనే పాశురం గురించి చర్చిస్తున్నారు; ‘ఆల్’ అనే పదం రెండు చోట్ల వస్తుంది. ఆ పదం ఒక సారి మర్రి చెట్టును, మరొక సారి లేత మర్రి ఆకుని సూచిస్తుందని వారు చర్చించుకుంటున్నారు. కానీ జీయర్ దయతో, ‘ఆల్’ అనే పదం ఆకును సూచించదని అన్నారు. అదే సమయంలో, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లలా కనిపించే కందడై నాయన్, “ఓ జీయార్! ఆలంగట్టి (వడగళ్ల వాన) ని సూచిస్తుందా?” అని తమాషాగా అన్నాడు. వెంటనే, జీయర్ అతన్ని పిలిచి తన ఒడిలోకి తీసుకుని, “నీవు పూజ్యనీయమైన వంశానికి చెందినవాడవు కదా?” అని అడిగారు. అతనిని దర్శన ప్రవర్తకుడు (రామానుజ సిద్ధాంతానికి నాయకుడు) కామని ఆశీర్వదించారు.
మూలము: https://granthams.koyil.org/2021/09/10/yathindhra-pravana-prabhavam-55-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org