శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
జీయర్ తిరువడిని ఆశ్రయించిన అప్పిళ్ళై, అప్పిళ్ళార్
ఏడు గోత్రాలను క్రమబద్దీకరణ చేసిన పిమ్మట, ఎఱుంబి అప్పా తమ స్వస్థలం ఎఱుంబికి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. కానీ అపశకునాలు ఎదురైయ్యాయి. అప్పా జీయర్ వాద్దకు వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసారు. వారు ఆనందంతో, “ఇక్కడ ఒక అద్భుతమైన సంఘటన జరగాలి. నీవు మరో మంచి రోజు చూసి వెళ్ళుము” అని అన్నారు. అక్కడున్న కొందరు ప్రముఖులు ఇది విని “మహాద్భుత సంఘటన సంభవించబోతున్నదట” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అయితే అది ఏమిటో ఎవరికీ తెలియదు.
కొద్ది రోజులు గడిచాక, పెరుమాళ్ళను సేవించుకొనుటకు అప్పిళ్ళై, అప్పిళ్ళార్ ఇరువురు వారి వారి సపరివార సమేతంగా విచ్చేసారు. జీయర్ తిరువడి పట్ల అంతగా వారిని భక్తి లేదు. రెండు రోజుల పాటు వారు కావేరి ఒడ్డున ఉండి, జీయర్ అనుష్టానాలు, వాక్ నైపుణ్యాన్ని విశ్లేషిస్తున్నారు. కందాడై అణ్ణన్, వారి వంశస్తులందరూ జీయర్ తిరువడి సంబంధం ఎలా పొందారని, ఇది ఎలా సంభవించిందని ఆశ్చర్యపోయారు. అప్పిళ్ళారుని అప్పిళ్ళై పిలిచి “ఇది జరిగిందంటారా?” అని అవాక్కైపోయారు. అప్పిళ్ళార్ అతనితో “ఎఱుంబి అప్పా సర్వ శాస్త్ర నిపుణులు. మహా అసాధారణమైన ఆచార్యశీలుడు (నిర్దేశిత కర్మలని నిష్టగా ఆచరించువాడు). అతను ఇలా చేసి ఉండడు. వెళ్లి విచారిద్దాము.” అని నిశ్చయించుకున్నారు. అప్పిళ్ళార్ జీయర్ మఠం దగ్గరికి వెళ్లి, తమకు అత్యంత సన్నిహితుడు, సమర్థుడైన ఒక వ్యక్తితో ఇలా అన్నారు: “వెళ్లి అప్పిళ్ళార్ వచ్చారని చెప్పండి. ఒక వేళ ఎఱుంబి అప్పా అక్కడ ఉంటే, వెంటనే వస్తాడు. అక్కడ ఇంకెవరైనా ఉంటే, ‘అప్పిళ్ళార్ ఎవరు?’ అని అడుగుతారు.” అని చెప్పి లోనికి పంపారు. ఆ వ్యక్తి ఎఱుంబి అప్పా ఎవరో కనుక్కుని అతని ఎదుట సాష్టాంగము చేసి అప్పిళ్ళార్ వీధిలో ఎదురుచూస్తున్నారని, తమ రాక కబురు దేవరి వారికి తెలియజేయమని అడియేనుని వారు పంపారని సందేశాన్ని అందించారు. అది విన్న ఎఱుంబి అప్పా ఎంతో సంతోషించి, “ఇది మంచి సమయం” అని చెప్పి అప్పిళ్ళార్ ను వెంటనే కలుసుకోడానికి వెళ్ళారు. ఎఱుంబి అప్పా భుజాలపై శంఖ చక్ర లాంఛన ముద్రలను అప్పిళ్ళార్ గమనించారు. అర్థం చేసుకుని ఎఱుంబి అప్పా ఎదుట సాష్టాంగం చేసారు. ఎఱుంబి అప్పా అతని యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, ఒక ఇంటి అరుగుపైన అప్పిళ్ళార్ తో కలిసి కూర్చొని, పెరుమాళ్ తనిని ఉద్ధరించడానికి, జీయర్ తిరువడి సంబంధం పొందేల ఎలా నడిపించాడో అప్పిళ్ళార్ కు వివరించారు. ఇది విన్న తర్వాత అప్పిళ్ళార్ కు విషయం ఏమిటో స్పష్టమైంది. తాము ఉద్ధరింప బడాలన్న కోరికతో, అప్పిళ్ళైతో పాటు మరికొందరు దివ్య కావేరి ఒడ్డున విడిది చేస్తున్నారని ఎఱుంబి అప్పాకి చెప్పి, దయతో అక్కడికి రావాలని ఎఱుంబి అప్పాని అభ్యర్థించారు. ఎఱుంబి అప్పా మఠానికి తిరిగి వచ్చి, జరిగిన సంఘటన గురించి వానమామలై జీయరుకి వివరించి, “వాళ్ళని సరిదిద్ది తీసుకురావడానికి అడియేనుపై దేవారి వారు కరుణ కురిపించారలి” అని విన్నపించారు. ఆ తరువాత వారు అప్పిళ్ళార్ తో కలిసి కావేరి ఒడ్డుకి వెళ్ళారు. అప్పిళ్ళైని కలుసుకుని ఆప్యాయంగా మాట్లాడి, సత్ సూచనలను వారితో పంచుకొని, అతనిలో భక్తి ఉత్సాహం పెంపొందేలా చేసారు. ఇంతలో, వానమామలై జీయర్ పెరియ జీయర్ (మణవాళ మాముణులు) ఉన్న చోటికి వెళ్లి “అప్పిళ్ళై, అప్పిళ్ళార్, కొందరు ప్రముఖులు కావేరి ఒడ్డున బస చేసి ఉన్నారు. సాత్విక సంభాషణంపై వివరణలు కొంత ఇప్పడికే అందుకున్నారు. ఎఱుంబి అప్పా ఇప్పుడే అక్కడికి వెళ్ళారు. ఆచార్య సత్ సంబంధం పొందడానికి జరగాల్సినవన్నీ జరిగాయి. వాళ్ళు దేవరి వారి తిరువడి సంబంధం పొందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు. దేవరి వారి మనస్సు ఎప్పుడూ ‘ఆత్మలాభాత్ పరం కించిధన్యత్ నస్తి’ (ఆత్మను ధర్మ మార్గంలో నడిపింపజేయడమే మహోపకారం, మరేవీకావు) అని భావించును కదా? పెరుమాళ్ళకు శిష్యుడి మధ్య ఉపకారకుడు ఆచార్యుడు అని కూడా చెప్పబడింది. ఎఱుంబి అప్పా మరియు అడియేన్ కోరిక నెరవేరాలని దేవరి వారు ఆశీర్వదించాలి” అని అన్నారు. జీయర్ దయతో ఇలా అన్నారు “ఎమ్పెరుమానార్ (రామానుజులు) దివ్య సంకల్పం ఇదే; వాళ్ళల్లో ఒకరికి ఎమ్పెరుమానార్ దివ్య నామం ఉంది” అని అన్నారు. వానమామలై జీయర్ ఈ విషయం విని ఎంతో సంతోషించి,“ ఆడియేన్ ఎదురెళ్లి వారికి స్వాగతించుటకు దేవరి వారు అనుమతించాలి” అని జీయరుని ప్రార్థించారు.
మూలము: https://granthams.koyil.org/2021/09/11/yathindhra-pravana-prabhavam-56-english/
పొందుపరిచిన స్థానము – https://divyaprabandham.koyil.org/
ప్రమేయము (గమ్యము) – https://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – https://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – https://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం – https://pillai.koyil.org